Jump to content

కాళిదాస చరిత్ర

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము

గద్యచక్రవర్తులను బిరుదమునకు తమ గ్రంథరాజములచే నెంతయుఁ బాత్రులయిన బ్రహ్మశ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహము పంతులుగారి యీకృతికుపోద్ఘాతము వ్రాయఁబూనుట సూర్యునిచూపించుటకై దివీటీని వెలిగించునట్టిపనియని వేరుగఁ జెప్ప నక్కఱలేదు. కాని, ఈ పుస్తకప్రకాశకులు నన్ను కోరియుండుటచేతను, కాళిదాస మహాకవి సార్వభౌముని వృత్తాంతమును దెలుపు గ్రంథ మగుటచేతను, శ్రీ లక్ష్మీనరసింహముగారి కృతికి పీఠిక వ్రాయుటయే గౌరవదాయకమగుటచేతను నేనీపనికిఁ బూనికొంటిని.

మన పూర్వకవీశ్వరులనుగూర్చిన చరిత్రవిషయములు మన కంతగా కానరాకుండుట చాలవిచారకరము. అందును లోకమునంతటినీ దమ కవితామృతమున చొక్కింపఁజేసిన కాళిదాసాది మహాకవుల వృత్తాంతము నిశ్చయముగా తెలిసికొనఁగలుగుటకు వలయు సాధనములు లేకుండుట కడుంగడు శోచనీయముగదా.

కాళిదాసేకాలమువాఁడు ? అను విషయముగూర్చి పండితులును చరిత్రప్రియులును తర్కవితర్కములను చేయుచున్నారు. రఘువంశ కావ్యము చివర -

"తం భావాయ , ప్రసవసమయాకాక్షిణీనాం ! ప్రజానా
 మంతర్గూఢం క్షితిరివ నభో భీజముష్టిం దధానా
మౌలై స్సార్థం స్థవిరసచివై ర్హేమసింహాసనస్థా
రాజ్ఞీ రాజ్యం విధిప దశిష ద్భర్తురవ్యాహతాఙ్ఞా

అనివ్రాయుచు కాళిదాసు అగ్నివర్ణుని భార్య గర్భమందుండిన శిశువుతో రఘుకులమునఁ దాను జెప్పఁదలచిన రాజులపేళ్లను పరిసమా మొదించినందున నీ మహాకవి యగ్నివర్ణునికి సమకాలికుఁడై యుండవచ్చుననియు, నగ్నివర్ణుఁడు క్రీస్తుపూర్వ యెనిమిదవ శతాబ్దమువాఁడు గావున కాళిదాసుకూడ క్రీII పూII ఎనిమిదవ శతాబ్దమువాఁడై యుండుననియు నొకరనిరి. కాళిదాసు మాళవశకము నారంభించిన విక్రమార్కుని యాస్థానమువాఁడని నవరత్నములను వివరించు శ్లోకమువలన దెలియవచ్చుచున్నది. కావునను, మాళవశకము క్రీII పూ 56 సంll ప్రారంభమగుటను కాళిదాసు క్రీII పూ॥ 56 సంవత్సరముల ప్రాంతములవాఁడని యింకొక రనిరి. 56 వ సం॥రమున విక్రమార్కుఁడను రాజే లేఁడనియు, శాకులను కోరూరుయుద్ధములో జయించిన విక్రమాదిత్యుఁడే కాళిదాసు ప్రభువగు విక్రమార్కుఁడనియు, ఈ యుద్ధము క్రీ|| శ 544 సం||రములో జరిగియుండుటచేత కాళిదాసు క్రీ॥ శ॥ ఆఱవశతాబ్దమువాఁ డనియు మఱియొకరనిరి. కాళిదాసు భోజమహారాజు నాస్థానములోనివాఁడను ప్రతీతి ననుసరించి కొందఱాతఁడు క్రీ|| శ ॥ పదునొకండవ శతాబ్దమువాఁడని వ్రాసిరి ఇంకను నిట్లే యితరు లితరోపపత్తులఁ దెలిపి యితర కాలములను నిరూపించియున్నారు. ఈ రీతిగా గాళిదాసు క్రీస్తుపూర్వము ఎనిమిదవశతాబ్దమునుండి క్రీస్తుతరువాత పదునొకండవ శతాబ్దమువఱకును గల పదునెనిమిదిశతాబ్దముల మధ్యకాలములో నుండినట్లుమాత్రము గుడికిబారెడు దూరముగా నొక నిర్ధారణ చేయవలసియేయున్నదిగాని మఱియొకదారి కానరానట్లుతోచుచున్నది. కాని, యీ మహాకవి యొక కాలమువాఁడు కాడనియే చెప్పవలెను. కాళిదాసెప్పుడు జన్మించినను ఆతనియం దార్యసాంప్రదాయములును, ఆర్యుల మానససౌందర్యమును మూర్తీభవించియుండుటచే నార్యజూతియెన్నడు ప్రభవించినదో యప్పుడే యీ కవి జననమొందెననియు, ఆతఁడు ఏ పదు నొకండవశతాబ్దముననో యంతరించలేదనియు, ఆర్యజాతి భూమిపై నిలిచి యున్నన్నాళ్లు, ఆతని శాకుంతలాదిమహాగ్రంధములఁజదివి యానందింపఁ ________________


గల యొక డై నను ! ప్రపంచమున మిగిలియున్నంగవజుకును నాతఁడు తన యశఃకాయముతో జీవించియే యుండుననీయు మన మనుకొనక తప్పదు.

ఇంక కాళిదా సే ప్రాంతము వాఁడను విడ. యమున మన మొక నిర్ధారణము చేసితిమేని, దేశములోని వివిధ రాష్ట్రములవారికీ, జాతుల వారికీని ఎడతెగని వేగముఁ గల్పించినవారమగుదుము. గౌ దేశీయులు గడుసువారగుటచే 'తొలుత నే కాళిదాసు తమపోరని నిశ్చయించిరి. మహాషురాలురరావరీమనుష్యులగుటచే మహాకవి తమసోఁడేయనీ నిశ్చయించిరి. కాశ్మీర దేశస్థులు జబగ స్త్రీ పురుషులగుటచే కాళిదాసును తాము లాగికొనఁ బ్రయత్నించిరి. అరవ పోరును కేరళుున చాప కింది నీటివలె చల్ల చల్లగా కాళిదాసు మావాఁడే యన మొదలిడుచున్నాను ఆం! ధులుమా తము వెనుక (బ కుదు రా ? రాళీ దాసు దిజ్నాగునికి ప్రతిస్పర్ధియైనయెడల, దిజ్నాగుడు వేర్ విశ్వవిద్యాలయమున కధ్యక్షుఁ డుగా నుండినవాఁడను దారి తకవిషయము చీకా దేశపు బౌద్ద, గంధముల వలనఁ దేటపడుచుండుట చేఁ గౌళీదాసు ఆంధ్రుల చెక్ యైయుండవలెను. ఆంధ్రులివిషయమై తగినకృషి చేయక పోరని నా సమకము. కాళిదాసు భారతవరీ యుఁ డని మా తము చెప్పినంపజరును మన మేమియు ననరాదు. కాని, భారతవర్షమున నే పొంతముతోఁడను ! పశ్న వచ్చి నప్పుడుమాత్రము ఆంధ్రులు తమ సహజో లోహమునుజూపి వారికి నా జమగు కేవలోత్సాహముతోఁ దృ పిజెందక, ఆ నుహాకవికృతకావ్య నాటకములఁ జదివి యందలి యానందమును గ్రహించి వానిరసముగాని, "కాళిదాసు కేవలాంధ్రుఁడగుట యటుండ, ఆతఁడు మా జిల్లా వాఁడు, మా తాలూకావాఁడు, మా గ్రామమువాఁ డు, అనుస్పర్థనహింతురుగాక యని కోరుచున్నాను.

కాళిదాసోక్క-cకు కాఁడు. ఆ పేరుగలవారు పెక్కుర్ను ని కొందఱు పండితులు బుజువుచేయుచున్నారు. ఎకరెంతమంది యున్న ను," ప్రజలహృదయపరివర్తియగు కాళిదాస్యో : డే. అతనివిషయమైనగాథ లే ________________

గ్రంథమునందు జోడీకరింపఁబడియున్న పే. కాళిదాసుని కవిత్వ సంపదను పండీ.ు సూ వికొను చుండు ఆ మహామహునీకథలను చెప్పికొనుచు. వెండిత పామరులందఱును నానందించుచుందురు. ఈ కథలు జేశ దేశ ములందును 'లవు. భిన్న భిన్న ములుగాఁగలవు. ఆంధ్ర దేశ ముల నాగనిఁగూ పండితసం పదాయములో వచ్చుచున్న కథలనన్నిటి నొకచోఁ జేర్చి : శ్రీ లక్ష్మీనరసింహము పంతులుగారు మహోపకారి మొనర్చి, ఈ కథలు సోనాటికి దేశమున విస్మరింపఁబడుచున్నవి. "నిని గ్రంథరూపముఁ జేర్పకుండిన నవియన్నియు సంతరింపఁగలవు. నాని స్థానమున పాశ్చాత్యులకథ అల్లుకొనఁగలవు. కావున, జంధుతీ గ్రంథమండలీ కథలనుజదివి, యింటింటను వీనిని స్త్రీలకును బాల బాలికలకును వినుపింపవలయును. ఇంగ్లీషువారీ పూర్వక వులఁ గూర్చి కూడ వింతకంటె జులైఫొర ములుగల కథలు లేవు. అయినను వారు తమ పూర్వుల కథల నత్యుశ్సాహముళోఁ జదివి, పిల్లలకు చిన్న తనము నుండియు నేర్పుచుందురు. ఇందుచే దేశాభిమానము నేలయును. తమ పూర్వుల పన్ను శ్యముంగూర్చి గొప్ప యభి ప్రాయములు కుదురు కొనును. జాతీయత యనునదిట్టి కధాసం! పదాయములవలననే యల కొనును. కావున ఆంధ్రులుకూడ భారతజాతీయతాస్థిరత్వమునకు తోడ్పడ నెంచినచో విద్యావిధానమున నిట్టి కథలను పఠించుటగూడ కొక యంగముగా గ్రహింపవలయును.

చకని శైలితో, సులభవచనముగ,రసవత్తరముగ నీగ్రంథమును రచించిన శ్రీ లక్ష్మీనరసింహముగారియెడల నాం: ధులు కృతజ్ఞులై యుందునుగాక !

చిలుకూరి సొరాయణగోవు, M. A. L, T..

Lecturer in Telugu and Sanskrit, and Superintendent of Vernaculars, Govč. Arts College, Rajahmundry.

విషయ సూచిక

________________


22 త్వమేవాహాతమ్

23 కాళిదాసుని బుద్ధికుశలత

24 కాళిదాసుని శాస్త్రజ్ఞానము

25 నవనవ

26 చకొరకు

27 సమస్యా పూరణము

28 కందుకవర్ల నము

29 నేరేడు పండ్లు

30 రేపో పెరుగు శ్లోకము

31 జవుల కానుక

32 అమావొస్య పూర్ణిమ యగుట

33 వేద వేదోంగసారము

34 జూదముమీఁదీ యాస క్రిఁ బోగొట్టుట

35 రావే రావే

36 ఓం టం టం టం

37 యజ్ఞోపవీతం పరమం పవిత్రమ్

38 అశ్వినీ దేవతల వైద్యము

39 చంద్రబింబనర్ల సము

40 జాతిపలక

41 బ్రహ్మ రాక్షసుఁడు

42 కుంపటి

43 అల్లాళ రాజు

44 మరణ వర్ల నము

45 కికూతకు భయపడిన స్త్రీ 46 బాలవితంతువు 17 ఢక్కా కవి విజయము 48 బాధతి 44 పర్వము 51 చందమామ 52 పండిత ప్రయోగము 3 పలాయనము 51 సన్యాసము 55 నక్షత్రముల శ్లోకము 56 రోకలి 57 కత్తెరబోను 58 తేనెటీగ 59 మత్స్యములు 60 అప్రశిఖః 61. విచిత్రి శ్రాద్ధము 62 పుట్టుమచ్చ 6ణి కాళిదాసుని మరణము 64 భోజుని మరణము

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse