కాళిదాస చరిత్ర/కాళిదాసుని యితర గ్రంథములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యార్యులు వక్కాణింతురు. "అస్తి ' యనుమాట కుమారసంభవములో మొదటిశ్లొకములో గలదు. "అస్త్యుత్తరస్యాందిశి దేవతాత్మా" యని కుమారసంభవములోని మొదటిశ్లోకములో మొదటి పాదము 'కశ్చిత్ 'అనునది మేఘసందేశకావ్యములో మొట్టమొదటి మాట. "కశ్చిత్కాంతావిరిహగురురా స్వాధికారత్ర్మ,మత్త:"అనునది యాకావ్యములొని మొదటిశ్లొకములోని మొదటిపాదము. 'నాక్ ' అనునది రఘువంశములొ మొట్టమొదటనున్నది. "వాగర్ధా వివ సంపృక్తౌ" అనునది యాకవ్యములోని మొదటిశ్లోకములో మొదటిపాదము, 'విశేష ' యను పద మేకావ్యమునందు మొదట బ్రయోగించెనో తెలియదు.

కాళిదాసుని యితరగ్రంధములు

ఇదివఱ కుదాహరించిన మూడు నాటకములు, మూడు కావ్యములు గాక

కాళిదాసుదు ఋతుసంహార మను నొక కావ్యమును రచియించెను. ఒక సంవత్సరమునందలి యాఱుఋతువులు మిక్కిలి రసవంతముగా నీ కావ్యమున వర్ణింపబడినవి. అతని కల్పనాచమత్కృతి యంతయు దీనిలో గనబడుచున్నది. ఇవిగాక రోలంబరాజకీయ మను వైద్యశాస్త్రమును, చంద్రలొకమను నలంకారశాస్త్రమును, వృత్తర్దరత్నావళి యను చందశ్శాస్త్రమును, తారావళి యను జ్యోతిశ్శాస్త్రమును, ప్రాభాకర వ్యాకరణంబున దనపేర నొకఘట్టమును రచియించినట్లు లోకమున వాడుక గలదు. కాని, మూడునాటకములు, ఋతు సంహారముతోగూడ నాలుగుకావ్యములు నీతడు వ్రాసెనని పండితు అందఱు నైకంకర్యముగ నొప్పుకొనుచున్నారు. శా. రోలంబు రాజీయము మొదలగు నితర గ్రంధములు మఱియొక కాళిదాసుడు రచించియుండెనుగాని యీ కాళిదాసుడుగాదని వారి యభిప్రాయము నలోదయముగూడ కాళిదాస మహాకవిరచించిందేయని యొక ప్రతీతికలదు. రచిమలేదని స్పష్టపడుచున్నది. కధ చమత్కారముగా నుండుటచేనిందుదుహారింప బడుచున్నది.

కాళిదాసుకవిత్వము మిక్కిలి సరసమై, సులభమై, ద్రాక్షపండ్లవలె నుండుటంజేసి యీర్ష్య్తాగ్రహస్తులైన కొందఱు పండితులు వాని కవిత్వము యమకములు, శ్లేషలు మొదలగునవి లేక పేలవముగా నుండునని దొషారోపణసేయజొచ్చిరి. అటువంటికవిత్వము సహజముగా నతని కిష్టములేకపోయినను మూర్ఖులు తనయందారోపించిన దొషమును బావుకొనుటకును, యమకశ్లేషలతో గూడిన చిత్రకచిత్వముగూడ జెప్పగల సామర్ధ్యము తనకుగలదని లోకమునకు తెలియజేయుటకును నతడట్టికావ్యము జేయు బ్రయత్నము సేయుచుండ నంతలో వేశ్య హస్తమున నతనికి బలవర్మణము గలిగెను.

మరణానంతరమున నతడు పాంచాలదేశమున నొక బ్రాహ్మణునకు గుమారుడై పుట్టి చిన్ననాటనే విద్యాభ్య్తాసము చేయదొడగెను. పూర్వజన్మ సంస్కార విశేషమున విద్యలు తనకు సునాయాసముగా బట్టువడెను. అతని తండ్రియు విద్వాంసుడే. అతడాదేశపు రాజునింట ననుదినము బురాణము చెప్పుచుండెను. ఒకనాడాబ్రాహ్మణుడు కార్యాంతర ప్రసక్తిచేత రాజుగారితో మనవిసేయకయే గ్రామాంతరమునకు బోయెను. పురాణము జెప్పునట్టి వేళకు మరలరావచ్చునని యతని సంకల్పము. అనుకొన్నప్రకారము జరుగలేదు. ఆనాడు భయంకరమైన జంఘామారుతము వీనందొడగెనుయ్. గొప్ప గాలివాన వచ్చెను. పిడుగులు పడజొచ్చెను. అందుచేత నామహీసురుడు స్వగ్రామమునకు రాలేకపోయెను. పురాణము చెప్పుటకు వేళయగుటచే రాజు బ్రాహ్మణు నింటికి వర్తమానమంపెను. ఏమిప్రమాదమొచ్చెనో బ్రాహ్మణునిభార్య భయపడజొచ్చెను. అప్పుడు బాలుడు "అయ్యా! నేనుపోయి రాజగృహమున బురాణము చెప్పివచ్చెద"పలుక "వెఱ్ఱివాడా! అదినీకెట్లు సాధ్యమగు" నని తల్లిమందలించెను. ఆమె మాట వినక రాజసేవకునివెంట నాబిడ్డడు పోయి రాజదర్శనముచేసి "మానాయనగారు గ్రామాంతరము వెళ్లి రాలేకపోయిరి. పురాణము నేజెప్పదను. ఏగ్రంధము జెప్పవలయునో సెలవిండు" అనియడిగెను. రాజువానిమాటలు విని నవ్విమహాసార్ధకముగా "మహాభారతములోని నలచరిత్రము నేడు పురాణము చెప్పవలయును. చెప్పగలవేనిజెప్పుము" అనిపలికెను. అప్పుడాబాలకుడు వల్లెయని "దేవా! ఒకరుచెప్పిన గ్రంధము చదివి నేనుపురాణముచెప్పను. గ్రంధముగూడ నేనేరచించి పురాణము జెప్పెద చిత్తగింపుడు" అని యశుధారగా నలోదయ మని పేరుపెట్టి నలచరిత్రము నవరసములతొడను, బహు యమకములతోడను, జెప్పెను. రాజతని కవిత్వము విని యట్టి పసిబాలు డట్టి మహాకవిత్వము జెప్పినందుకు మిక్కిలి యాశ్చర్యమునొంది గొప్ప బహుమానము జేసెను. ఇవన్నియు గల్పితకధలని తెలియుచునేయున్నది. మొత్తముమీద గాళిదాసుపేర మూడునాటకములు నాలుగు కావ్యములు మాత్రమే ప్రచారముగలిగియున్నవి.