కాళిదాస చరిత్ర/గ్రంథరచనలో నొక చమత్కారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్లో॥ఏకైశ్వర్వేస్దితోసిప్రనతబహుఫలే య:స్వయంకృత్తి
     నాసా।కాంతావిజ్మశ్రదేహోస్యవిషయమనసాం య:
     సరిస్తాద్యతీనాం అష్టాభిర్య కృత్స్నం జగపి తనుభి:
     చిత్రతో నాభిమాను సన్మార్గాలోకనాయ వ్యపన
     యతు నవస్తామసీంవృత్తి మీశ:

తా॥ ఎవ్వడు మహైశ్వర్యము గలిగియు దాను తోలు దాల్చి భయభక్తులకు బహుఫలము లిచ్చుచుండునో, యద్దకాదీశ్వరుడయ్య జతేంద్రియులైన యతులకు గూడ నతీతుడయ్యెనో, తనయష్టమూర్తులచేత జగత్తును భరించుచున్నవాడయ్యు నభిమానము లేకయున్నవాడో, యట్టి యీశుడు సన్మార్గదర్శనము కొఱకై మీతామవృత్తి నడుచుగాక్.

గ్రంథరచనలో నొక చమత్కారము

కాళిదాసుదుతనకావ్యరచనలో నొక చిత్త్రమైనఫక్కి నవలంబించెనని చెప్పుదురు

వివాహమైనతరువాత నతడుగదిలో బండుకొనియున్నప్పుడు భార్య యతని యరసికతజూచి "అస్తికశ్చిద్వాగ్విశేష:" యని ప్రశ్న మడిగెననియు, దానియర్దము దెలియకతడు బార్య సనాదరణము జేసెననియు. దానియర్దము, అనగ నేమైన పాండిత్యము మీకు గలదా యని దానిబావము. తరువాత నతడు కాళికావరప్రసాదము బడసి భార్యను వీడుకొని దేశాంతరములకు బోయి భార్యవలననే తనకట్టి విద్యావిశేషము గలిగినదని యామెయెడల విశ్వాసముగలిగి మొట్టమొదట దన్నామె యడిగిన యాప్రశ్నములో నున్న 'అస్తి, కశ్చత్, నాక్, విశేష: ' యను నాలుగు మాటలను నాలుగుకావ్యమ్యులలో మొదటిమాటలుగా జేసి గ్రంధ రచనను చేసెనని యార్యులు వక్కాణింతురు. "అస్తి ' యనుమాట కుమారసంభవములో మొదటిశ్లొకములో గలదు. "అస్త్యుత్తరస్యాందిశి దేవతాత్మా" యని కుమారసంభవములోని మొదటిశ్లోకములో మొదటి పాదము 'కశ్చిత్ 'అనునది మేఘసందేశకావ్యములో మొట్టమొదటి మాట. "కశ్చిత్కాంతావిరిహగురురా స్వాధికారత్ర్మ,మత్త:"అనునది యాకావ్యములొని మొదటిశ్లొకములోని మొదటిపాదము. 'నాక్ ' అనునది రఘువంశములొ మొట్టమొదటనున్నది. "వాగర్ధా వివ సంపృక్తౌ" అనునది యాకవ్యములోని మొదటిశ్లోకములో మొదటిపాదము, 'విశేష ' యను పద మేకావ్యమునందు మొదట బ్రయోగించెనో తెలియదు.

కాళిదాసుని యితరగ్రంధములు

ఇదివఱ కుదాహరించిన మూడు నాటకములు, మూడు కావ్యములు గాక

కాళిదాసుదు ఋతుసంహార మను నొక కావ్యమును రచియించెను. ఒక సంవత్సరమునందలి యాఱుఋతువులు మిక్కిలి రసవంతముగా నీ కావ్యమున వర్ణింపబడినవి. అతని కల్పనాచమత్కృతి యంతయు దీనిలో గనబడుచున్నది. ఇవిగాక రోలంబరాజకీయ మను వైద్యశాస్త్రమును, చంద్రలొకమను నలంకారశాస్త్రమును, వృత్తర్దరత్నావళి యను చందశ్శాస్త్రమును, తారావళి యను జ్యోతిశ్శాస్త్రమును, ప్రాభాకర వ్యాకరణంబున దనపేర నొకఘట్టమును రచియించినట్లు లోకమున వాడుక గలదు. కాని, మూడునాటకములు, ఋతు సంహారముతోగూడ నాలుగుకావ్యములు నీతడు వ్రాసెనని పండితు