కాళిదాస చరిత్ర/కాళిదాసుని జన్మవృత్తాంతమును గుఱించిన రెండవకథ

వికీసోర్స్ నుండి

కాళిదాసుని వృత్తాంతమును గుఱించిన రెండవకధ

మాళవదేశమున వైజయంతమను పట్టణము కలదు. ఆ నగరసమీపమున నొక్క మహారణ్యము గలదు. ఆవనమధ్యంబున నొక పుణ్యాశ్రమంబుగలదు. ఆయాశ్రమమున మహానుభావుడగు త్రికాలవేది యను ముని ఘోరతపంబు జేయుచుండెను. అతని తపం బసాధారణంబు అతని నియమం బలోకసామాన్యంబు. అతనిప్రభావమమేయము అతడు భూతభవిష్యద్వర్తమానముల నిజతిసోమహత్వమున నెఱుగుటచేత నతనికి ద్రికాలవేదియను సార్దకనామము గలిగెను. అతని యుగ్రతపమునకు భయపడి మహేంద్రుడు మేనా మొదలగు నప్సరసలను రావించి భూలోకంబునకరిగి వానితపోవిఘ్మంబు గావింపుమని యానతిచ్చెను. ముని తపోవిఘ్నమునందు దేవకన్యలు మిక్కిలి యారితేరినవారయ్యు, నామహాముని ప్రభావంబును, స్వభావంబును, దఱచుగా వినియుండుటంజేసి వానిని సమీపింప వెఱచిరి. వారిలో జక్కదనంపుటిక్కయు, నెఱజాణయు, నిండుజవ్వనియు నైన మనోరమయను నచ్చరవెలంది తన చెలికత్తెలగు రంభా మేనకాదులు గనుంగొని వారి పిఱికిదనంబు నదిక్షేపించి "మీరామునిచంద్రునకు భయపడితిరేని నిలువుడు. నేను మీసహాయములేకయే మహామండలమున కరగి యామునిసత్తము చిత్తము గరగించి తపోభ్రష్టుని గావించెద. ఇట్లు చేయనైతినేని ననీపేరం బిలువబొకుండు" అని దేవతాసన్నిధానమున గాఢ ప్రరిజ్ఞచేసి, యిందునిమెప్పువడసి, యతనిచేత ననేకాభరణంబులు బహుమానముగా బడసి, వానికడ సెలవుగైకొని, భూలోకంబున కరిగి, యయ్యాశ్రమంబుజొచ్చి , మండుచున్న యగ్నివలె మహాతేజశ్శాలియైన త్రికాలవేదిని గనుంగొని, మెల్ల మెల్లగ నాతని యనుగ్రహంబు వడసి, నాతనికి జలంబులు ఫలంబులు దెచ్చియిచ్చుచు దన నవ్వులవంటి పువ్వులు పూజార్ద మర్పించుచు గ్రమక్రమంబున నతనిమనస్సు గరిగించి కామాయత్తునిం జేసి తనవలలో వైచికొనియె. మనోరమ యను సార్దక నామధేయముదాల్చిన మనోరమను గూడి యమ్మహాముని సర్వనియమంబులత్యజించి భోగియై యాకాంతవలన నొక కుమారునింగనియను. కుమారుడు కలిగినపిదప నతని కెక్కడలేని పశ్చాత్తాపము కలిగెను. దేవవేశ్య వాని వ్రతభంగముజేసి కృతకృత్యురాలై భూలోకంబు విడిచి నాకంబునకరిగెను.

'లంజకు పిల్లతెగులన్న ' సామెత నిజమయ్యెగదా! కన్నకొడుకను ప్రేమగాని, కనులు తెఱువని గ్రుడ్డుగదా యను జాలిగాని, లోకులేమనుకొందురో యను శంకగాని, పాపభీతిగాని లేక యా వేశ్య యెంతపని చేసెనో చూచితిరా? సకలవిద్యాపారంగతుడై, భూతదయాపరుడైన ముని మాత్ర మేమిచేసెను. స్త్రీదక్షతలేని బిడ్డను పెంచుట దుస్సాహసమని యావిడదారి బిడ్డనొక పొదరింట బువ్వుల పానుపుమీద బండుకొనబెట్టి తనదారింబోయెను. పసిపాపడు కావుకావుమని యేడ్చుచుండ జూచువారుగాని, యగ్గునెట్టువారుగాని, చన్నిచ్చి పాలుగుడుపువారుగాని లేరైరి. 'ఎవరికి బుట్టిన బిడ్డగా వెక్కి వెక్కి యేడ్చుచున్నా ' డన్నసామెత నిజమయ్యెను. అక్కడికి దగ్గఱగా నొక కొండక్రింది నొకపల్లె యుండెను. ఆపల్లియలో దొమ్మరి వాండ్రు కాపురముండిరి. ఎక్కడో యాటలాడి దొమ్మరి వాండ్రు కొందఱు తమ సానులతొగూడ మరల దమ యూరికి బోవుచు, మార్గమధ్యమున దట్టమగు పొదలంట కావుకావుమని యేడ్పు వినబడ జెచ్చర నచ్చోటికిబోయి లావణ్యపుంజమగు నాశిశువుంగనుం గొని యెత్తుకొని ముద్దాడి వానిం బెంచుకొనదలచి తోడ్కొనిపోయిరి. నాటనుండి యబ్బాలుడు తలిదండ్రుల లోపంబున దొమ్మరివారిబిడ్డయై విద్యా విహీనుడై క్రమక్రమంబునం చెరిగి బూడిదలో బొరలుచు గాడిదల గాయుచు పందులమందలం దొలుచు పెంపుడు తల్లి దండ్రుల విద్యయగు దొమ్మరవిద్య నేర్చుకొని గడలెక్కి యాడుచు గాలక్షేపము సేయుచుండెను.

ఆ కాలంబున బాంచాలదేశంబును ధర్మవర్దనుడను మహారాజు పాలించుచుండెను. అతినికి శారదయను నొక పుత్రిక కలదు. ఆబాలికమేధాశాలిని యగుటచే జనకుడు శాస్త్రవిద్యాపారంగతురాలిం జేయదలచి సార్దకనామధేయుడగు మేధానిధి యను బ్ర్రాహ్మనుని బిలిపించి యామెకు విద్య సెప్ప మని నియోగించెను. ఆ వి ధ్యా ని ధి చెప్పినదంతయు నందిపుచ్చుకొనినట్లు రాజపుత్రిక క్షణమాత్రములొ నేర్చి, సహజపాండిత్య మామెకు భగవంతుడు ప్రసాదించెనో యనునట్లు స్వల్పకాలములోనే పాండిత్యము సంపాదించెను. పదమూడేండ్లు వచ్చునప్పటికి శారద విద్యావిశారదయై, సంగీతసాహిత్యములయందు నిరుపమాన ప్రజ్ఞ కలదియై , రూపముచేత నేత్రములకు, ఘనపాండిత్యముచేత మనస్సుకు, గానవిద్యాప్రౌఢిమ చేత శ్రవణంబులకు బండువుచేయుచు బందుమిత్రుల కానందము కలిగించుచుండెను. నవయౌవనంబు ప్రాసించుచున్న కూతుంజూచి రాజు విద్యాభ్యాసము మానిపింప దగిన సమయము వచ్చినదని, గురువునకు దక్సిణనొసంగి సెలవుగైకొనిరమ్మని ధన కనక వస్తువాహనంబులిచ్చి కూతును మేధానిదికడకు బంపెను. రాజపుత్రికయు దానుదెచ్చిన సమస్తవస్తువుల నర్పించి, నమస్కరించిపోవుటకు సెలవిమ్మని యడుగ నాతడు నెఱజవ్వని యగు నమ్మద్దియని జూచి మోహ పరవశుడై, కామబాణపీడితుడై, మనంబు బట్టజాలక, మహారాజపుత్రికయని సందేహింపక, "నాకునగ లెందుకు?నీయౌవనంబె నాకు గురుదక్షిణగ నిమ్ము, నిన్ను గౌగిలించుటయె నాకుద్రైలోక్యసామ్రాజ్యము, నిన్ను ముద్దాడుటయే నాకు మోక్షము, నీసాన్నిధ్యమే స్వర్గము నాయందు భక్తగలదేని యయ్యది నాకు లభింపజేయుము అని యడిగెను. రాపుత్రిక సువర్ణ చ్చాయగల తనమొగము జేవురింప నేత్రము లెఱ్ఱజేసి "ఛీఛీ! నీవు బ్రాహ్మణుడవుకావు, ఛండాలుడవు నీమొగము చూడరాదు" అని కోపించిన యాడుయేనుగువలె నత్వరితగమనంబున నంత:పురంబు బ్రవేశించెను. మేదానిధి భగ్న మనోరధుడై, రాజపుత్రికకు సమయమువచ్చినప్పు డపకారము చేయవలెనని పగబట్టియుండెను. 'కానిమాట కప్పిపుచ్చవలె ' నని లోకోక్తిప్రకరము శారద యా బ్రాహ్మణాధము డాడిన మాటలు తలిదండ్రుల కెఱింగింపకపోయెను. అత గొన్ని నాళ్లకు శారద సంప్రాప్త మౌనసమయ్యెను. వివాహము నిమిత్తము తండ్రి కొన్ని సంబంధములు వెదకి తన కుమార్తెకు మంచిపండితుని, రూపవంతుని దెచ్చి పెండ్లి చేయవలెనని నిశ్చయించి తనకాప్తుడైన మేధానిధిని బిలిచి చక్కదనము గలిగి, సౌర్యమార్య్లముగలిగి, నవయౌవనంగలిగి, విశేషించి పాండిత్యముగల యొక పెండ్లికొమారుని దెమ్మని చెప్పెను. తన పగదీర్చుకొనుజ్టకవకాశము గలిగినది గదాయని మేధానిది మిగుల సంతసించి ప్రయాణ వ్యయములకుగాను కొంత ద్రవ్యము సేకరించి, నానా దేశములు సంచరించి, బహు పట్టణంబులు,పలు పల్లియలు జూచి యందు దనకు నచ్చిన మూడాగ్రేసరుడు లభింపమి నిరంతర ప్రయాణంబులు జేసి దైవవశమున దొమ్మరి పల్లియకు బోయి త్రికాలవేది పుత్రుడైన యాబాలునిజూచి వీడే తగినవాడని నిశ్చయించి యాదొమ్మరులకు గొంతద్రవ్యమిచ్చి వానిని దనవశము జేసికొని ,మోట పశువును మెల్లగాదువ్వి సాధువుజేసికొనునట్లు వానిని మంచిమాటల చేత మెత్తపఱచి వానిమెడలో జందెములువైచి యిట్లనియె "ఓరీ! నీ పున్యము పుచ్చినది. నీ రొట్టే నేతిలో బడినది. నీభాగ్యము పండినది. నీకొక మహారాజుకుమార్తెను వివాహము చేయిచెదను. నీవెవడవన్న రాచకొడుకునని చెప్పుము. రాజపుత్రికను నీవు చూచి నప్పుడు 'త్రిపీడా పరిహరోస్తు ' అని దీవింపుము" అని యుపదేశించి యా మాటల నాఱుమారులు వల్లింపజేసి వానిని దనవెంట బెట్టుకొని ధర్మవర్దనికడ కరిగి యాతనింజూపెను. దొమ్మరి కుఱ్ఱవాడు లేబ్రాయమం దుండుటచేతను,యాజ్ఞపవీతములు ధరించుటచేతను మేధానిధియిచ్చిన మంచివస్త్రములుఇ గట్టుకొనుటచేతను, నప్సరస కడుపున బుట్టినందున, సహజముగ స్ఫురద్రూపి యగుటచేతను, రాజు వానింజూచి సంతసించి యేయేశాస్త్రముల నితడంభ్యసించెనని మేధానిధి నడిగెను. అడుగుటయు మేధానిధి "రాజా! ఇతని వృత్తాంతమంత నెఱిగించెద వినుడు. ఇతడు సుక్షత్రియుడు తల్లిదండ్రులు చిన్న నాటనే మృతినొందిరి. ఈతడు కొందఱు బ్రాహ్మణోత్తము లకు శుశ్రూషజేసి చతుశ్శాస్త్రములయందు మేరలేని పాండిత్యము సంపాదించెను. సకల పుణ్యక్షేత్రముల సేవించి, స్నాతకవ్రతముచేసికొని, వివాహమాడుటకు సిద్ధముగా నున్నాడు. కాని, వివాహమగువఱకు నెవ్వరితొడను మాటలాడనని మౌనవ్రతదీక్ష బూని యున్నవాడు తనకు తోచినప్పుడెప్పుడైన నొక్కొక మాటాడుచుండును" అని విన్నవించెను. రాజు వాని పాండిత్యమెట్టిదో తెలిసికొనవలెనని కోరెనుగాని మౌన వ్రతమతని కడ్డువచ్చెను. అంతలో నా పెండ్లి కొమారుడు సబాభవనమున గట్టబడిన యొక బొమ్మలోనున్న రా వ ణ విగ్రహమునుజూచి "రాభణుడా" యనెను. ఆపలుకులువిని సభాసదులు రాజును మిక్కిలి యాశ్చర్యమొంది "చతుశ్శాస్త్ర పండితుడేమి యిట్లుపలుకుటేమి" యని తమలో దాము వితర్కించుకొనిరి. అది గ్రహించి మేధానిధి "ప్రమాదము సంభవించినదిగదా! ఈమోటముండా కొడుకు నోరుమూసికొని యూరకుండడు. కుక్కతోక వలె వీనిమనస్సెంత సరిచేసినను సరిగా నుండదు. అయినను నేను దీనిని సమర్దింపజాలనా!" యని సభాసదులంజూచి “మీరీ మహాపండితుని మాటల కర్దము తెలియక తెల్లబోవుచున్నారు. ‘విద్యాసేవ నిజానాతి విద్వఝనపరిశ్రమం ‘ అన్నారు గదా! విద్వాంసునిభావము విద్వాంసుడే యెఱుగును. నేజెప్పెద వినుండు.

శ్లో॥కుంభకర్ణే భకారోస్తి భకారోస్తి విభీషణే,
   రాక్షసానాం కుల శ్రేష్టో రాభణో నతు రావణ

తా॥ కుంభకర్ణుని పేగులో భకారముగలదు. విభీషణునిపేరు లోను భకారముకలదు. అతనితమ్ములైన కుఱ్ఱగుంటలకే భకారముండగా రాక్షసకులశ్రేష్టుడైన రావణునకు భకారముండకూడదాయని చమత్కారము కొఱకై యీవిద్వంసుడు రాభణుడని ప్లికెను. గాని మాటలు రాకను, పాండిత్యములేకను గాదుసుమండీ!” యని సమర్దించెను. సభవాఅందఱు వానిసమాధనము విని పెండ్లికొడుకు యొక్క పాండిత్యమునకు, రసికతకు మిక్కిలి సంతసించిరి.

అనంతరము రాజు శారదను రావించి పెండ్లికొమారునిజూపి యతనికి నమస్కరింపుమని యానతిచ్చెను. ఆమె సిగ్గునం దలవంచుకొని హస్తపద్మములు మొగిడ్చి వానికభివాదముసేయ నామోట పెండ్లికొడుకు “త్రిపీడా పరిహారోస్తు“ అని మేధానిధి నూఱసార్లు వల్లింపజేసినమాటలు మఱచిపోయి “త్రిపీడాస్తు” అనిదీవించెను. మూడుపీడలు పరిహరమగుగాక యని దీవించుటకుమాఱు పీడలుకలుగుహక యని యశీర్వాదముచేయుటచేత స్భాసదులు మరల విస్మితులై యెండొరుల మొగములు చూచుకొనిరి. అప్పుడు మేధానిధి యయ్యవారు చేసిన ముబద్ధములన్నియు దిద్దుకొనవలసినవ్రాత తనకుబట్టినది గావున లేచి సభవారికిట్లనియెయె. “ఈమహానుభావుని గంభీరభావములు సానాన్యులకు దెలియవు. యోగిమహిమ పరమయోగి యెఱ్గునన్నట్లేయన భావము నేనెఱుగుదును. “త్రిపీడాస్తు” అన్న యాశీర్వచనము సరిగా నున్నది. ఎట్లన్న వినుడు.

శ్లో॥అననే పుత్రపీడా చ బంధుపీడా చ భోజనే,
   శయనే భర్తృపీడాచ త్రిపీడాస్తు సదా తన

తా॥ కూర్చున్నప్పుడు తోచకుండ బిడ్డలుపీడ, భోజన సమయమందు బంధుపీడ, పానుపుమీద భర్తృఈడయును, నీమూడు పేదలును నీమె కుండవలెనని యీమహస్త్మునియాశయము. అనగానామె యిల్లు బిడ్డలతోడను, నిండియుండవలెననియు దీని తాత్పర్యము. ఇందేమితప్పున్నదో చూడుడు“అప్పలుకులు విని ధర్మవర్ధనుడును సభాసదులును పెండ్లికుమారుని బుద్ధికుశలతకు మెచ్చి మహానందభరితు లైరి.

అనంతరము రాజు మంచిముహూర్తముబెట్టించి మహావైభవముతో వివాహముచేసెను. యధావిధిగ వివాహమైనపిదప పునస్సంధాన ముహుర్తము నిశ్చయుంపబడెను. పెండ్లికుమారుడు పడకగదిలోనిలిబోయి యొడలెఱుంగక నిచురబోయెను. శారద వాని యరసికభావమునకు రోసి ప్రాణముననికి చేతితోతట్టి లేపి “అస్తి కశ్చిత్ వగ్విశేష:” అనగా నేమైంస కొంచెము పాండిత్యమున్నదాయని యడిగెను. “అస్తి లేదు గస్తీలేదు నోరుమూసికొని తొంగోసీ“ యను యతడు మోటగాజెప్పి మరల కన్నులమూసి నిద్రపోయెను. అంతట నామె కత్తిచేతబట్టుకొని భర్తను గాఢనిద్రనిండిలేపి యాఖడ్గము ఝుళిపించి “నీవెవ్వడవు? నిన్నిక్కడకు దొడ్కొనివచినవారెవ్వరు? నీవృత్తాంతయుజెప్పు“మని రాజపుత్రిక నసాధారణ సాహసముచేసి యడిగెను. అతడు గడగడ వడకుచు దాను దొమ్మరివాడై దిమ్మరీడగుటయు, మేధానిధొ తనవారికి ద్రవ్యమిచ్చి దన్నుగొనుటయు, దనకు గొన్ని ఉద్ధు లుపదేశించుటయు నాదిగాగల వృత్తాంతము పూసగుచ్చినట్లుజెప్పెను. అదివిని రాజపుత్రిక వానివలన దోష ఏమియు లేదని ఖడ్గమావలబడవైచి యదియంతయు మేధానిధి చేసిన వంచన ముగా గ్రహించి తనపురాకృతకర్మఫలమేయని భర్తకు విద్యోపదేశము చేయింపవలెనని తలపోసి యాతని కెన్నోబుద్ధులుచెప్పి కాళికాలయమునకు బోవ నొడంబఱచి పంపెను.

కాళి కా దే వి వ ర ము లి చ్చు ట

ఆమె చెప్పినచొప్పున నతడు దేవీ

పద్మమునకరిగి తలుపులు మూసికొని

కూర్చుండి యామె వచ్చినప్పుడు “కళ్లీఓద్దెకల్లీబిద్దె“ యని యడగి యామె యనుగ్రహమునకు బాత్రుడై తక్షణమే సకలవిధ్యలు కవిత్వము నేర్చినవాడై యఖండపాండిత్యము మెఱయు నామెను శ్లోకములచేతను, దండకముచేతను, స్తనము చేసెను. ఆస్తనమున కానందమొంది యా దేవి పండితవాదములలో నతడే గెలుచునట్లును, రాజసభంతరముల గౌరవము గలుగునట్లును, సమస్యాపూరణములయందప్రతిమానప్రజ్ఞ గలుగునట్లును, నంత:పురరహస్యములనైన నవలీలగా దెలిసికొనినట్లు, నిఖిలశాస్త్రములలో నిరుపమాఅండిత్యము గలుగు నట్లును, గవిత్వమునం దద్వితీయుడగునట్లును, వరములిచ్చి పంపెను. తరువాత నతడు భార్యాంత:పురమునకరిగి భార్యను మాతృదేవతగా భావించి నామెచేత శాపగ్రస్తుడయ్యెను. రాజపుత్రిక యోగినియై యోహమిచే బ్రాణత్యాగము చేసెను. అతడు కాళిదాసనుపేరుగలిగి కొంతకాల మాపురమునందే యుండి యేమియునేఱనివానివలె దిరుగుచుండెను.