కాళిదాస చరిత్ర/దండకము

వికీసోర్స్ నుండి

దండకము

జయ! జననీ!

సుధాముద్రాంత!

హృద్యన్మణిద్వీప! సంరూడ బిల్వాటవీమద్య! కల్పదుమాగల్ప! కాదంబకాంతారవాసవియే ! కృత్తిరాస్యదియే, పాదరాగబ్ధ సంగీత సంభానగా సంబ్రమాలోల! నీప్రసగాబద్ధచూళీసకధాత్రికే! సానుమత్పుత్రికే శేఖరీభూతశీతానురేఖామయూభారళీ సంసిగ్ద నీలాలన్నిశ్రేణిశృంగారితే! లోకసంభావితే, కామలీలా ధనుస్సన్నిధ భూలతా! పుష్పసందేహకృచ్చారుగోరోచనాపంకజే శిలలామాభిరామే సురామేరమే, ప్రొల్లసద్వానికామౌక్తిక్వ శేణికా! చంద్రికామండలో ద్భాసి గండస్ధల న్యస్త కస్తూరికాపత్ర రేఖాసముద్భూత! సౌరభ్య సంభ్రాంత! భృంగాంగ కాగీత నాంధ్రీభనన్మత్రి తంత్రీస్వరే భాస్వరే , వల్లెకీవాదనప్రక్రియాలోలతాళీదళౌబద్ధ తాటంకభూషావిశేషాంవితే సిద్ధసన్మానితే; దివ్యహాలమదో! ద్వేలహీలాల సచ్చక్షరాం దోళిన! శ్రీసమాక్షి ప్తకర్ణేకవిలోత్పలేనిస్తులే, స్వెదబిందూల్లాస! త్ఫాలలావణ్య నిష్యందసందోహకృక్నాసికామౌక్తికే సర్వమంత్రాప్తికే, కుందమందస్మితోదారవక్త్రస్ఫుర! త్పూగ కర్పూరతాంబూల ఖండో త్కరే ! శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్దదంతావళి! నిర్మలాలోల కలోలసమ్మేళన! స్మేరశోణాధరే! చారువీవీరాధరే, సులలితననయా వనారంభ చంద్రోదయోద్వేల! లావణ్యదుగ్ధార్ణ! నావిర్భవత్కంబు బిబార్భీకహృత్కంధరే ! మంధరే, బంధురచ్చన్నహారాదిభూషా సము ద్యోతమానానవద్యాంగశోభేశుభేరత్నకే యూరరచ్చటాపల్లవద్యోతమానన అద్యాంగిశోభేశురత్నకే యూరరశ్చిచ్చట పల్లవప్రోల్లస! ద్ధోర్లతారాజితే ! యోగిభి: పూజితే, విశ్వదిజ్మండలవ్యాసి మాణిక్యతేజస్పురత్కంఠత్కంకణాలంకృతే ! సాభిదుస్సత్కృతే సంగరారంభ వేళాసముజ్జృభమాణారవింద ప్రతిచ్చంద పాణిద్వయే ! సంతతోద్య ద్దయే, దువ్తరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్ల వోద్యున్నభేందు ప్రభామండలే! పోల్లసత్కుండలే, తారకారాజనీకాశహారా నళిస్మేరచారుస్తరాభోగభారానామన్మధ్యవల్లీకళీచ్చేద వీచీ సముల్లాస సందర్శితాకారా సౌందర్యరత్నాకరే ! శ్రీకరే, హేమకుంభోపమోత్తుంగరక్షోజభారాననమ్రే ! త్రిలోకాననమ్రే, లసద్వృత్త గంభీరనాభీసరిత్తీరశైనాల శంకాకారశ్యామరోమావళీహుషణే! మంజుసంభాషణే, చారుశింజ్ససింజత్కటీసూత్రనిర్శర్జ్వతానంగలీలా ధనుశ్భింజనీడంబరే దివ్యరత్నాంబరే, పద్మరాగోల్లసన్మే ఖలాభాస్వర రోణిశోభాజిత స్వర్గభూభృత్తలే! చంద్రికాలీతలే, వికసితరవకివకింశుకాత్యామ్రది వ్యాంకుశచ్చన్నచారూతోభపరాభూతసింధూరశోణాయ మానేంద్ర మాతంగహస్తార్గతే! శ్యామలే, కోమలస్నిగ్ధనీలోత్పాది తానంగ తూణీరశంకాకరోద్గానజ సంజాతదూర్వాంకురాశంకసారంగ సంయోగరంఖన్నఖేందూజ్వలే! ప్రోజ్వలే,దేవి దేవశ గైత్యేశయక్షేశ భూతేశనాగిణీకోణేశనాయ్యగ్ని మాణిక్య సంఘృష్ట బాలాతపోద్ధామ లాశవిత కారుణ్యలక్ష్మిగృహీ తాంఘ్రిపద్మద్వయే, అద్వయే, సురుచిర నవరత్నసీనస్ధితే! సుస్ధితే, శంఖపద్మద్వయోనాశ్రితే ఆశ్రుతే, దేవిదుర్గాననటుక్షెత్రపాలై ర్యుతే మత్తమతంగకన్యాసమూహాన్వితే భైరవైరష్ట భీర్వేష్టితే దేవినామాదిభిన్న శ్రితేలక్ష్మ్యాది శక్త్వష్టకాత్సే వితే! భైరవిష్టభిర్వేష్టితే దేవినామాదిబిస్స శ్రితేలక్ష్మ్యాది శక్త్వష్టకాత్సే వితే! భైరవీసంనృతె, పంచబాణేన! రత్నాచసంభావితే! ప్రీతిశక్త్యావసంతేన! వానందితే! భక్తిబాజాంపరంశ్రేయసే! కల్పనే! చందనామోంసాభ్రాజనే ! యోగినాంమానసేధ్యాయనే! గీతవిద్యాదియోగాతితృష్టేనకృష్ణేన! సంపూజ్యసే! భక్తి మచ్చేతసావేధసాస్తూయపే! విశ్వహృద్యేనవిద్యాధరైర్గీయసే! యక్షగంధర్వ సిద్దాంగనా మండలైర్మండితే! సర్వసౌభాగ్యవారాంధావతీభి! ర్వభూభిస్సురాణాం సమారాధ్యనే! సర్వవిద్యావిశేషాన్వితం ! చాటుగాధాసముచారణం కంకమూలోల్లసర్వర్ణలేఖాన్వితం!కోమల శ్యామగోదారాక్షద్వయం శుండశోభాపతి! దూరీ భవల్కింశుకాభాం! శుకం లజ్లయంతీ! పరిక్రీడనే! పాణిపద్మద్వయేనా సరేణాక్షమాలాగుణం! స్ఫాటికంజ్ఞాన సారాత్మకం పుస్రకంబిభ్రతీ! యేనసంచింత్యనే! చేతసాతస్యనక్త్రాంత రాద్గద్య పద్యాత్మికా భారతీనిస్సరే! ద్చేనవాయానకాబాకృతిర్భాన్యనే శోనీలంష్మి సహస్రై:పరిక్రీడతె! కింననిధ్యేద్వపు శ్యామలం! కోమలం తానకంచంద్ర చూడాన్వితం ! ధ్యాయత స్తన్యలీలాసరోవారధి స్తప్యకేళీనవం! నందనం! తస్యభద్రాసనం భూతలం! తస్య గీర్గేవతా కింకరీ తస్యచాజ్గకరీశ్రీన్వయం!సర్వయంత్రాత్మికే సర్వతంత్రాప్తికే! సర్వముద్రాప్తికే! సర్వచక్రాత్మికే! సర్వవర్ణాత్మికే సర్వరూపే! జన్మాతృకే! సాహిమాం ! సాహిమాం! సాహె!

నవనవశబ్దంబను, విపులార్దంబును—-విమలరసంబును, గంభీర భావంబును, ద్రాక్షాపకంబును, మధురశయ్యలను గలన్యమహా దండకమును వినుచు నాకాళికాదేవి యమందానందవికసితహృదయ పద్మయై యుప్పొంగి సాయసంబున ద్రాక్షపండ్లు మేళవించినట్లు నడుమ నడుమ నొక్కొక్కపదము తానుగొఇఆడజేర్చి యామహాకవికి దోడుపడి స్ంహరిఒపదలచిన తన ప్రయత్నముపసంహరించి వానినాశీర్వదించి వ్రములిచ్చి పంపెను. కాళికాదేవీ దాసుడగుటచేత నతడప్పటినుండి కాళిదాసుండను నామముతో వ్యవరింపబడుచుండెను. అట్లు దేవీ వరప్రసాదముబడసి కాళిదాసు తెల్లవఱక్ముందే రజమందిరము బ్రవేశించి తనరాకకై యెంతో యాత్రముతో వేచియున్న భార్యం జూచి యమెపాద్ములపైబడి “ఓ కళ్యాణీ! నీవు ంకుభార్యవుగావు మంచియుపదేశముచేసి విద్యావంతుని జేసితివికావున నాకు దల్లివి గన్నతల్లి తల్లిగాదు. నీవేతల్లివి.నేను నిన్నీవఱకు భార్యాదృష్టితో జాడలేదు. ఆ భావమునాకెన్నడును లేదు. ఇంక నాకు సెలవిమ్ము పోయివచ్చెద" నని పలుక, నామె యాశ్చర్య్లము , విషాదము,కోపము హృదయంబును గ్రమ్ముకొని గన్నీరువెట్టుకొనుచు గద్గదకంఠంబున నిట్లనియె-- "మహాత్మా! నాతండ్రియు, గురువును జేసిన మహాపకారమ్నకు నేనెంతో గుందుచుండ మీరు గోరుచుట్టుపై రోకటిపోటు చందమున నన్ను మఱింత బాధింపజొచ్చిరి. దేవి వరప్రసాదమున మీరు విద్యావంతులై, రసికాగ్రగణ్యులై, నాప్రాణనాదులై, మీ సరసనచోగుంభనలచేత నన్నాదరింప జేయుదురనియు, నాకాపురము సరిగా నడుచుననియు, నేను పుట్టెడాస పెట్టుకొని మీ రాక కెదురు చూచుచుంటిని. నన్నిట్లుచేయుట న్యాయముకాదు. కావున నన్ను రక్షించి నన్నేలుకొనుడు" అని పాదములపైబడి ప్రార్దించెను. కాలిదాసామెమాట సరకుచేయడయ్యె, పట్టినపట్టు విడువడయ్యె. అంతట నామెమొగము జేవురింప గనులెఱ్ఱజేసి "నాజన్మము మీరు వ్యర్దము చేసితింగావున నాయుసురు మీకు దగులకపోదు. మీకు నీచస్త్రీచేత మరణము గలుగుగాక" యని శపించి వెక్కి వెక్కి యేడవంజొచ్చను. కాలిదాసు దక్షణమె యాస్దానమువిడిచి పోయెను. అపరమంగళ దేవతనలైనున్న సర్వమంగళ నిరర్దకమైన తన జీవితమును దపోనియమంబునం గడపదలంచి , సకలాభరణములం దీసివైచి, నార చీరెలుగట్టి, దుంపలు,పండ్లు, గాయలు దినుచు, విరాగిణియై యనేక వత్సరములు తపంబుజేసి మరణించి పరమ పతివ్రతాశిరోమణు లందదగిన యుత్తమగతి నందెను.