కాళిదాస చరిత్ర/కాళికా ప్రత్యక్షము

వికీసోర్స్ నుండి

బ్రవేశించుటకై వచ్చును. అప్పుడు తలుపులు తీయుమని యడుగును అప్పుడు మీరు భయపడక కొండవలె నిశ్చయుడై 'నాకు విద్యా దానము ఛేసిన గుడి తలుపులు తీసెద, లేనిచొ దీయ ' నని కంథమెత్తి పలుకుడు. అంతట దెల్లవాఱుచున్నదను భయముచే దేవితత్తఱపడి గుడిలో బ్రవేశింపవలెనను కోరికతొ మీరు కోరిన వరములిచ్చి లోపలబ్రవేశించును. అప్పుడు మీరు విద్యవంతులగుదురు. ఆవిధముచే మీరు విద్యా వంతులు కావలెనుగాని ఇప్పుడక్షరములు నేర్చికొని పుస్తకముబట్టి పండితులగుట యసంభవము. విద్యావంతులైతిరా సమస్తవైభవములు గలుగును. విద్య వినయమొసగును. -భాగ్యమొసగును. ఇహపరసౌఖ్య మొసగును- గౌరవ మొసగును. వేయేల! విద్యకల్పవృక్షము. కాబట్టి నామనవిం జేకొని, పరమేశ్వరియైన కాళిం నాశ్రయింపుడు" అని భార్య హితొపదేశము జేయు భర్త మంచిదని నామెచెప్పిన చొప్పున జేయదలంచి పడటిల్లు విడచి పెరటిదారిన వీధిలొ బ్రవేశించి నాయర్ధరాత్రమున నిర్భయముగా నామె చెప్పిన యానవాళ్లనుబట్టి కాళికాలయమున కరిగి గుడిజొచ్చి తలుపులుమూసి గడియవైచుకొని లోపల గూర్చుండెను.

కాళికా ప్రత్యక్షము

కాళికయు యధేచ్చముగా

లోకసంచారముజేసి కడపటి జామున దన యాలయముకడకు వచ్చి తలుపులు మూయబడి యుండుటకు మిక్కిలి యక్కజమంది భయంకరముగా నిట్లనియె, "ఓరీ! యెవడురా! నయాలయము గవాటముబంధించి కూర్చున్నవాడు! నీకు మృత్యువాసన్నమైదా యేమి? కండకావరమున నొడలెఱుగక ముప్పదిమూడుకొట్ల దేవతలను బలుబాములు బెట్టిన మహిషాసురుని మర్దించిన మహాకాళిని నన్నెఱుగవుకాబోలు! దేవాంతక నరాంతకులైన దైత్యదానవయక్షరాక్షస ప్రముఖులే నాయెడల నిలువలేరు. నీవెంత? బ్రదుకదలంచితివేని తక్షణము తలుపుదీయుము" అని జంకించుటయు, నాబ్రాహ్మణకిరాతకుడు నదరుబెదురులేక "తల్లీ ! నాకు బిద్దెనిమ్ము, తలుపుతెరిచెదను" అని బదులుచెప్పెను. "బిద్దెలేదు, నీమొగములేదు తలుపుదీయు" మని యాదేవి మరల గంభీరముగ బలికెను., "బిద్దె యిచ్చినగాని తలుపుదీయ" నని యతడు ప్రత్త్యుత్తరమిచ్చెను. అంతలో జాముకొడి కూసెను. తెల్లవాఱునట్లు చెన్నెలగుపడుచుండెను. ప్రయాణము చేయదలచువారు, పొలములకు బోదల చువారును. నిద్రమేలుకాంచి బైలుదేఱుచుండిరి. నిజమూర్తి జనులకు గనబడకుండ బెందలకడ నాలయము బ్రవేశింపవలెనని తలంచి కాళి "ఓరీ! బెద్దె యిచ్చెద తలుపుసందునుండి నీనాలుక చాపుము" అని కంచెకోలతో వాని నాలుకపై సకల విద్యాబీజములగు నక్షరంబుల వ్రాసెను. అంతట నతడు తలుపులు దీసెను. మహాకాళియు నిద్రమందిరము బ్రవేశించి కోపాగ్నిచేరవులుచున్న కొలుములో యనునట్లు నెఱ్ఱగానున్న కన్నులతొ వానింజూచి "పాపాత్మా ! పలుగాకి ! యెవడవురా నీవు! నామందిరద్వారముమూసి బలవంతముగా నాచేత వరములు బడయదలచితివా? ఇదిగొచూడు! నీమేషకాలమాత్రమున మహిషాసుర ప్రముఖులు పోయిన మార్గమున నిన్ను బంపెద" నని వాని నెత్తి వణచుటకు దనహస్త మెత్తెను. దేవీ బీజాక్షరములు జిహ్వగ్రమున వ్రాసినతొడనే యాతని మౌడ్యమంతయు నాశనమయ్యెను. కుబుసము విడిచిన పామువలె నాతనిమనస్సు నవసన వికాసము బొందెను. సకలశాస్త్రములు వానికి గరతలామలకమయ్యెను., చతుర్దశవిద్యలు వానికి విధేయములయ్యను. శారదాదేవి కాతడు ప్రియపుత్రుడయ్యెను. హిమత్పర్వతమునుండి భూమిమీదికి బ్రవహించు గంగానదివలె గవితారవ మాతని నోటనుండి వెల్లి విరియజొచ్చెను. అట్లగుటచేత నాతడు నిర్భయముగా దననెత్తియడ జూచుచున్న దేవికి బ్రదక్షిణముజేసి సాష్టాంగ నమస్కారపురస్కారముగ నామె చరణములు బట్టుకొని యిట్లు స్తుతించెను.

స్తవము

శ్లో॥మాణిక్యవీణ ముపలాల యంతిం
   మదాలసాం మంజులవాగ్వేలాసారి
   మహేంద్రనీలద్యుతికోమలాంగీం
   మాతంగ కన్యాం మనసా స్మారామి
శ్లో॥ చరుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే
      కుంకుంరాగశోణే
      పుండ్రేఱనాశాంకుశపుష్ప బాణహస్తే నమస్తే
      జగదేశమాత
శ్లో॥ మాతామరకతాశ్యామా మాతంగీ మధుశాలినీ
     కుర్యసత్కటాక్షిం కల్యాణీ కదంబ వనవాసిని
శ్లో॥ జయ మాతంగతనయే జయనీలోత్పంద్యుతే
     జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే

అని శ్లోక చతుష్టయముతో సుతియించి కవిత్వ మప్రయత్న పూర్వముగా వెడలుచుండుటం జేసిల్య్లు నంత నిలువక దేవీ మనోమండలము వికాసము జెందునట్లు దండక మొక్కదాని నాశుధారగా రచియించి యట్లు సుతించె.