అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెలుగు సాహితీ తపస్వి డా॥ అక్కిరాజు రమాపతిరావుగారికి “సాహితీ జీవన సాఫల్య పురస్కారం”

డా॥ అక్కిరాజు రమాపతిరావుగారంటే తెలియనివారు తెలుగు భాషా సాహిత్యరంగాలలో ఎవ్వరూ లేరు. అన్ని సాహితీ ప్రక్రియల్లో విశిష్ట రచనలను వెలయించిన ప్రఖ్యాత రచయిత. ఉత్తమ స్థాయిలోని విమర్శకుడు, జర్నలిస్టు కూడా.

కందుకూరి వీరేశలింగంగారి గురించి రమాపతిరావుగారు పరిశోధించినంత, వ్రాసినంత - మరెవ్వరూ చేసి వుండరు. వీరేశలింగం పంతులు డైరీలు, లేఖలు 1964 నాటికే సేకరించడమేగాక 1972లో వాటిని పుస్తకంగా తెచ్చారు. వీరేశలింగంగారి రచనల్ని 10 సంపుటాలుగా వ్యాఖ్యాన సహితంగా తెచ్చారు. వీరేశలింగవాణి పేరిట, ఆ మహానుభావుడి, సూక్తులు, హితోక్తులు 1972 నాటికే అంతర్జాతీయ తెలుగు సంస్థ ప్రచురించింది. 200 ప్రసంగాలు చేశారు. వీరి కొన్ని నవలలు ఆకాశవాణి వివిధ కేంద్రాల నుండి ప్రసారమైనాయి. కొన్ని కథలు ఇంగ్రీషులోకీ తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, హిందీలలోకి అనువాదం పొందాయి. వీరేశలింగంగారి ద్వారా తెలుగువారికి తాను అభిమాన పాత్రుణ్ణయ్యాసని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడతారు. ఇటీపలే ధమ్మపదం గాధలు 222 నీతి కథలు - పుస్తకంగా తెచ్చారు. రామాయణం, హరివంశం వచనంగా తెచ్చారు. పాల్కురికి సోమనాధుని బసవపురాణం, పండితారాధ్య చరిత్ర వచనంగా తెచ్చిన ఘనత వీరిది. భోగరాజు పట్టాథి “సీతారామయ్యగారి సమకాలీన భారతదేశ చరిత్ర 1000 ప్రశ్నలు - సమాధానాలు తెలుగులో


బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫొందేషన్‌ (గుంటూరు) వారు జూలై 25న నాలుగవ “సాహితీ జీవన సాఫల్య పురస్కారాన్ని

డా॥ అక్కిరాజు రమాపతిరావగారికి ప్రచురించారు. మొత్తంపైన 4 వేలకు పైగా వీరి రచనలు తెలుగులో వచ్చాయి. అందించబోతున్నారు - ఈ పురస్కారాన్ని ఇంతవరకు... వర్తమాన తెలుగు రచయితల్లో వాషింగ్టన్‌ డి.సి.లో లైబ్రరీ కాంగ్రెస్‌ దర్శించడంతో - 'ధ్వన్యనుకరణ సామ్రాట్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ పాటు, ఐర్లాండులో డబ్లిన్‌ నుండి వరల్డ్‌ కేట్‌ అనే పుస్తక సూచికలో వీరి

- “తొలితరం ఆధునిక వాగ్గేయకారుడు' పుస్తకాలు 50 వరకూ ప్రస్తావితమైనాయి. 65 ఏళ్ల సాహితీ వ్యవసాయం వీరిది. బాలాంత్రపు రజనీకాంతరావు సహస్ర చంద్రదర్భన భాగ్యాన్ని పొందుతున్న వేళ... 'సాహితీ జీవన సాఫల్య

- “గాన సరస్వతి" లావు బాలసరస్వతి అందుకున్నారు. పురస్కారాన్ని అందుకొంటున్న సందర్భంగా వీరికి మా శుభాభినందనలు.

దాక్టర్‌ అక్కిరాజు రమాపతిరావుగారికి సాహితీ జీవన సాఫల్య పురస్కార సభ వేదిక : బాలాజీ మండపం, వేంకటేశ్వర స్వామి దేవస్థానం - బృందావన్‌ గార్డెన్స్‌, గుంటూరు తేదీ : జూలై 15 ఆదివారం ఉదయం: 10 గం. నుండి 1గం. వరకు : సాహితీకృషి సమాలోచన సదస్సు సాయంత్రం: 6.80 గం.లకు: సత్మార సభ రెండు పుస్తకాల ఆవిష్కరణలు : 1.'డా॥ అక్కిరాజు రమాపతిరావు సంకలనం తొలి, మలితరం కథలు 2. స్వాత్మ కథ (అభినందన సంపుటి) అందరూ ఆహ్వానితులే
బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌందేషన్‌

గుంటూరు.

లోపలి పుటలలో....సంపాదకహృదయం: జనాభా లెక్కల్లో తెలుగువారికి అన్యాయం... 7

2011 మాతృభాషల జనాభాలెక్కలు: తెలుగు నిలదొక్కుకునేదెలా... ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు... 8

పొరుగు రాష్ట్రాలలోని తెలుగువారు స.వెం. రమేశ్ 10

కంప్యూటర్లు - తెలుగు: తెలుగు భాషకు ఆధునిక హోదా-6 వీవెన్ 12

శ్రద్ధాంజలి: నేరెళ్ళ వేణుమాధవ్ అంపశయ్య నవీన్ 14

వారసత్వ సంపద పెద్ద బొంకూర్ శాతవాహన స్థావరం... సంకేపల్లి నాగేంద్రశర్మ 16

మరణ వాంగ్మూలం: గురువుకు తగిన శిష్యుడు… డా॥వేదగిరి రాంబాబు 19

సాహిత్యరంగం : పుస్తకము చేతన్ బూనితిన్.... ఆచార్య మధురాంతకం నరేంద్ర 24

సాహితీ మూర్తి - విజ్ఞాన సర్వస్వం...ఆచార్య వెలమల సిమ్మన్న 32

స్పందన: 34, 41

పెద్దారి తీపి గురుతులు : దీక్షా దక్షతలు గల పనిరాక్షసుడు... సన్నిధానం నరసింహశర్మ 35

వివాహిత స్త్రీల ఇంటిపేర్లు... కీ.శే. యార్లగడ్డ బాలగంగాధరరావు 38

పిట్ట చూపు: రాజకీయాధికారంతోనే...చలసాని నరేంద్ర 47

పుస్తక సమీక్షలు: డా॥ ఎం.వి.శాస్త్రి 49

గ్రంథాలయం : 50

భాషోద్యమ కథానికలు :

1. సింధువులో బిందువులు .....విహారి 21
 
2 అమ్మమాట డా॥ వేదగిరి రాంబాబు 36

ధారావాహికలు:

1. మౌనంలోని మాటలు-9 సురారి రాదోళ్ళు నాగప్ప ఆత్మకథ - ఆర్.బి.కుమార్‌ రం రామచంద్రరావు 27

2. బౌద్ధం-వైజ్ఞానిక మార్గం-15 ...... బొర్రా గోవర్ధన్ 42

కవితలు:

1. పూలు సుగంధాలనే విరజిమ్మాలి డా॥ కత్తి పద్మారావు 26

పుట:Ammanudi july 2018.pdf/4 పుట:Ammanudi july 2018.pdf/5