అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/నగరాలు పలు భాషల నగారాలు కావాలి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెలుగు భాషకు ఆధునిక హోదా - 6

నగరాలు పలు భాషల నగారాలు కావాలి

ప్రపంచ జనాభాలో సగం నగరాలలోని ఉన్నదని ఐక్యరాజ్యసమితి 2008లో ప్రకటించింది తాజా అంచనాల ప్రకారం 2030 సంవత్సరానికల్లా ప్రపంచ జనాభాలో 60% నగరాలలోనే నివసిస్తారనీ, 2050 సంవత్సరానికి ఇది 70 శాతానికి చేరుకోవచ్చనీ చెబుతున్నారు అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే 80 శాతం పైబడి నగరాలలో నివసిస్తున్నారు ఈ వృద్ధికి మామూలుగా జనాభా పెరుగుదలతోపాటు నగరాలకు వలసలు నగరీకరణలు దోహదం చేస్తున్నాయి

కోటిమంది కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాలను మహా నగరాలు అని వ్యవహరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా 46 మహానగరాలు ఉంటే కేవలం భారతదేశంలోనే 6 ఉన్నాయి భవిష్యత్తు అంతా నగరాలదే. ఈ నేపథ్యంలో భాషల మీద పడే ప్రభావం పరిరక్షణ గురించి అంశాలతో ఈ వ్యాసం

నగరాలలో జనాభాలో అధిక శాతం (వారో వారి పూర్వీకులో) వలసలుగా వచ్చినవారే అయివుంటారు తత్ఫలితంగా నగరాలు భిన్న సంస్కృతులు విభిన్న భాషల సమ్మేళనాలు కాలక్రమేణా ప్రతీ నగరానికీ దానికంటూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఏర్పడుతుంది పాలన ఏదో ఒక భాషకి పరిమితమవుతుంది

నగరాలలో మరో వింత పోకడ: ఒకవైపు ఆకాశహర్మ్యాలు మరోవైపు మురికి వాడలు (ఎవరో రచయిత అన్నట్టు అత్యంత ధనికుడూ, అతి పేదవాడూ నగరంలోనే ఉంటాడు.) ఈ విభజన కూడా ఆ నగర భాషాసంస్కృతులపైప్రభావం చూపిస్తుంది.

నగరాలలో దాదాపు చాలా వరకు ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండి తీరిక లేని పరిస్థితే కనిపిస్తుంది. ఉరుకులు పరుగులు నిత్యకృత్య మవుతాయి అందువల్ల భాషాసంస్కృతులపట్ల ఆసక్తి చూపించేవారూ, అందుకు సమయం కేటాయించేవారూ జనాభాలో అతి కొద్దిశాతమే ఉంటారు అధికాదాయ వర్గాలు తగినంత తీరికసమయంతో ఉన్న వారి ప్రాథమ్యాలు వేరుగా ఉంటాయి. సగం పైన జనాభా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ రోజుగడవడమే గగనం అన్న రీతిలో ఉంటారు

అటు నగర / పురపాలక సంస్థలు కూడా వేగంగా పెరుగుతూన్న జనాభాకి తగ్గట్టు కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా విఫల మవుతున్నాయి. స్వచ్ఛమైన గాలీ నీరూ అందేలా చూడడం, పారిశుధ్యం, వీధిదీపాలు, సాఫీయైన రహదారులు వంటి సేవల నిర్వహణే కుంటుతూ నడుస్తుంది కొండొకచో వీటిని ప్రయివేటు నిర్వహణలో కూడా నడిపిస్తున్నారు. ఈ స్థితిలో నగరంలోని ప్రజల భాషలకు, వారి సంస్కృతులకుఃనగరం లోను దాని బడ్జెట్టులోనూఃసముచిత స్థానం కల్పించడం, వాటిని ప్రోత్సహించడం అనేవి ఊహకందని విషయాలుగానే ఉండిపోతున్నాయి ఏదో ఒక భాష (మరో అనుబంధ భాషతోనో) పాలన అంతా నెట్టుకొచ్చేయబడుతుంది జపాన్, చైనా దేశాల నగరాలలో అక్కడి స్థానికభాష చలామణి ఉంటే అదొక్కటే ఉంటుంది. ఇతర / పరాయి భాషలకు ఆదరణ ఉంటుందనుకోలేము. సింగపూర్ వంటి నగరాలు పలు భాషలను ఆదరిస్తూ ఇందుకు మినహాయింపుగా నిలుస్తున్నాయి.

భారతదేశం వంటి అభివృద్ధి చెందిన దేశాల నగరాలలో అధిక శాతం జనాభా అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఉంటారు హైదరాబాద్ నగరాన్నే తీసుకుంటే తెలుగు ఉర్దూల తర్వాత హిందీ, రాజస్థానీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ వంటి భాషల వారే ఇందులో ఉంటారు వీరందరికీ ఆంగ్లం రాదు. అయినా, కార్యాలయాలు పాలనలోనూ ఆంగ్లానిదే భోగం కేవలం ఆంగ్లం, తెలుగు (కొన్నిచోట్ల ఉర్దూ) మాత్రమే కనబడే ఈ నగరంలో మీరందరూ 'సమాచారం అందుబాటు'కి బహుదూరంగానే ఉంటున్నారు. గల్ఫ్ నగరాలలో తెలుగువారి పరిస్థితీ ఇంతే దారుణంగా ఉంటుంది

కొత్త ఆశలు

1. న్యూయార్క్ నగరంలో 'లిటిల్ చైనా', మరికొన్ని నగరాల్లో 'చైనాటౌన్‌' వంటివి ఆయా ప్రాంతాలనుండి వలసవచ్చినవారు ఒకే చోట దగ్గరదగ్గరగా స్థిరపడి తమ ప్రత్యేకతతో నివసిస్తూంటే ఏర్పడిన

అక్షరాస్యతలో నెం 1. 100/100 ఫిన్లాండ్

కనెక్టికట్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశాల్లో తొలిస్థానం ఫిన్లాండ్‌ది (100శాతం). చదువుతోపాటు చదువుకున్న వాళ్ల వ్యవహారశైలినీ పరిగణనలోకి తీసుకొని నిర్వహించిన నాగరిక దేశాల సర్వేలోనూ దానికి తొలిస్థానం దక్కింది.

  • తరగతిలోని విద్యార్థుల మధ్య ప్రతిభ విషయంలో అతి తక్కువ వ్యత్యాసం ఉన్న దేశం ఫిన్లాండే. తెలివైన విద్యార్థులకంటే, త్వరగా పాఠాలను అర్థం చేసుకోలేని పిల్లల దగ్గరే టీచర్లు ఎక్కువ సమయం గడపటం, సగటున వదిహేను మంది పిల్లలకు ఒక టీచర్‌ ఉండటం దానికి కారణం ప్రతిభ ఆధారంగా పిల్లల్ని వేర్వేరు సెక్షన్లలో కూర్చోబెట్టే పద్ధతే వాళ్ళకు తెలీదు.
  • ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ బోధనా గంటలూ, స్కూళ్లకు ఎక్కువ సెలవులు ఉన్న దేశం ఫిన్లాండే. అక్కడ స్కూళ్ళు గరిష్టంగా 180 రోజులు మాత్రమే పనిచేస్తాయి. భారత్‌లో దాదాపు 240 రోజులపాటు తెరిచి ఉంటాయి. అక్కడ సగటున ఒక ఉపాధ్యాయుడు ఏడాదికి 600 గంటలపాటు పాఠాలు చెబుతాడు. అదే మన దేశంలో ఆ సంఖ్య దాదాపు 1700 గంటలు. అంటే ఫిన్లాండ్‌ కంటే దాదాపు

మూడు రెట్లు ఎక్కువ.

  • భవిష్యత్తులో విద్యార్థుల వృత్తిగత జీవితంలో పెద్దగా ఉపయోగపడని జాగ్రఫీ, హిస్టరీ లాంటి కొన్ని సబ్జెక్టులను ఫిన్లాండ్‌ హైస్కూళ్లలో తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో ప్రస్తుత తరంలో జోరు మీదున్న రెస్టారెంట్లూ, జిమ్‌లూ, స్టార్టప్‌ల లాంటి సమకాలీన అంశాల గురించి బోధిస్తారు.
  • ఫిన్లాండ్‌లో స్కూల్‌ సిలబస్‌ను తాయారుచేసే బాధ్యత పూర్తిగా టీచర్లదే. వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలసి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పాఠ్యాంశాలను

చేరుస్తూ, పాతవాటిని తొలగిస్తూ ఉంటాయి.

  • ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పిల్లల పుస్తకాల్ని ప్రచురించే దేశం ఫిన్లాండే. ప్రతి సిటీబస్సులో, రైల్లో ఓ పుస్తకాల స్టాండ్‌ కనిపిస్తుంది. విదేశీ కార్యక్రమాలని అనువదించకుందానే అక్కడి టీవీల్లో ప్రసారం చేస్తూ, వాటి కింద సబ్‌ టైటిళ్లు వేస్తారు. టీవీ చూస్తూనే పిల్లలు స్థానిక భాషను చదవడం నేర్చుకునేందుకే ఈ పద్ధతి.
  • పదకొండేళ్లు వచ్చాకే ఫిన్లాండ్‌ పిల్లలకు ఇంగ్లీష్‌ పాఠాలు మొదలవుతాయి. అప్పటిదాకా బోధనంతా ఫిన్నిష్‌, స్వీడిష్‌ భాషల్లో సాగుతుంది. అక్కడ ఒక్కో విద్యార్థి సగటున నాలుగు భాషలు మాట్లాడగలడు.

పోటీ పరీక్షలూ, కాలేజీలకు ప్రవేశ పరీక్షలూ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లూ లేని దేశం ఫిన్లాండ్‌. హైస్కూలు దశలోనే విద్యార్థులు తమ భవిష్యత్తుని నిర్ణయించుకుని దానికి తగ్గ కోర్సులే చేస్తారు. ఆ విద్యార్థుల సంఖ్యకు సరిపడా వృత్తి విద్యా సీట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.

విభాగాలు. ఇలాంటివి పరాయి దేశాల్లోనూ, ప్రాంతాల్లోనూ ఆయా భాషాసంస్కృతుల అచరణకు, పరిరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి. నగరాలలో భిన్న సంస్కృతుల ఎదుగుదలకు ఇలాంటివాటికి ఏదో రకమైన తోడ్పాటుని ప్రభుత్వాలు అందిస్తే బాగుంటుంది.

2. సాంకేతికాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు:

(అ) దుకాణాల పేరుపలకలు మెల్లగా డిజిటల్‌ రూపంలోనికి మారుతున్నాయి. వీటిల్లో ఎల్‌ఈడీ లైట్లతో కూడిన తెర ఉంటుంది, దీనిలో ఏమి కనబడాలి అనేది కంప్యూటర్‌ ద్వారా నియంత్రించ బడుతూంటుంది. వీటిలో కనబడే వాటిని ఎన్ని భాషలలో అయినా, ఒకదాని తర్వాత ఒకటి కూడా, చూపించవచ్చు.

(ఆ) నేటి కాలంలో ప్రభుత్వ, నగరపాలక సంస్థల సేవలు అన్నీ అంతర్జాలం ద్వారానో చేతిఫోనులో యాప్‌ ద్వారానే అందించే వీలుంది. ఆయా సైట్లనూ, యాప్‌లనూ స్టానికీకరించి పలు భాషలలో అందించవచ్చు. పౌరులు తమకు కావలసిన భాషను ఎంచుకుంటారు. కాగితపు ఫారాల వలే ఒకటిరెండు భాషలకు పరిమితమవ్వాల్సిన గత్యంతరం ఉండదు. ఈ స్థానికీకరణ ప్రక్రియను ప్రజల భాగస్వామ్యంతో (క్రౌడ్‌ సోర్సింగ్‌) చేయవచ్చు.

(ఇ) కృత్రిమ మేధ, యంత్రాలు నేర్చుకోవడం వంటిని మెరుగయ్యేకొద్దీ, వివిధ భాషల మధ్య యంత్రానువాదమూ మెరుగవుతుంది. గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ వంటి ఉపకరణాలతో ఇప్పటికే మనం చూస్తున్న అంతర్జాల పేజీలను అప్పటికప్పుడు పలు భాషల్లో చూసే వీలుంది (తక్షణ అనువాదం). ఎదుటనున్న బోర్డు మీది సమాచారాన్ని మన చేతిఫోను కెమేరాతో మన భాషలో చూసుకునే వీలు కూడా అందు బాటులోకి వచ్చింది. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ ద్వారా బయటి ప్రపంచాన్ని అప్పటికప్పుడు మన భాషలో చూడవచ్చు. మనుషుల మాటల్ని అప్పటికప్పుడు మరో భాషలోనికి అనువదించి చెప్పే రోబోట్లు ఉపకరణాలు పరిశోధనల్లోనూ, తయారీ దశల్లోనూ ఉన్నాయి. (తెలుగుకి సంబంధించి ఈ రంగంలో జరగాల్సిన కృషి చాలా ఉంది. మనం పూనుకుని తెలుగుని క్రియాశీలంగా వాడుతుండాలే గానీ, ఇది భవిష్యత్తు సాంకేతిక నిపుణులకు అపార అవకాశాలు కల్పిస్తుంది.)

అందరికీ వారి మాతృభాషలో విద్య వంటి మౌలిక కార్యక్రమాలతో పాటు, ప్రజల భాషలలో సమాచారాన్నీ సేవలనూ అందించడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, విభిన్న భాషాసంస్కృతుల కలివిడి మనుగడకూ, పెంపుదలకూ సరైన సుహృద్భావ వాతావరణం/ పరిస్థితులు కల్పించడం, ప్రజలకు వారి భాషా సంస్కృతుల పట్ట మక్కువను పెంచే చర్యలు చేపట్టడం లాంటి విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు, నగర / పురపాలక సంస్థలూ చేయాల్సిన కృషి చాలా ఉంది.

వాడని భాష వాడిపోతుంది...భాష నశిస్తే జాతి నశిస్తుంది.