అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/పుస్తక సమీక్షలు
పుస్తక సమీక్షలు
2017 డిసెంబరు ప్రపంచ తెలుగు మహాసభల గురించి
సమగ్రంగా తెలిపే రెండు ప్రత్యేక సంచికలు
తెలుగువాణి
ప్రపంచ తెలుగు మహాసభల
ప్రత్యేక వార్తా సంచిక - 2018
ప్రచురణ : పొట్టి శ్రీరాములు
తెలుగు విశ్వవిద్యాలయం
చిరునామా : పొట్టి శ్రీరాములు
తెలుగు విశ్వవిద్యాలయం,
లలిత కళాక్షేత్రం, పబ్లిక్ గార్డెన్స్,
హైదరాబాద్ - 500 004
ఫోన్ : 040-23230435
జయంతి
ప్రపంచ తెలుగు మహాసభల
విద్య, సాహిత్య, సాంస్కృతిక త్రైమాసిక పత్రిక
పుటలు :212,
సంవత్సర చందా : 500/-
ముఖ్య సంపాదకులు:
డా॥వెల్ళాల కొండలరావు,
ప్రచురణ : సిస్టర్ నివేదిత
పబ్లికేషన్స్, 11-4-654/2,
రెడ్ హిల్స్, లక్టీకాపూల్,
హైదరాబాద్ - 500 004
ఫోన్ : 040-23396358
ఐదు రోజులపాటు - డిసెంబరు 15 నుండి 19 వరకు జరిగిన అన్ని కార్యక్రమాలు - ప్రారంభ, ముగింపు సభలు, అన్ని సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ గోష్టులు - అన్నిటి వార్తా విశేషాలనూ సంగ్రహించి ప్రచురించిన 'తెలుగు వాణి' ప్రత్యేక సంచికను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. 264 వుటలు గలిగి ఎప్పటికీ దాచుకోదగిన విధంగా వెలువరించిన ఈ సంచికకు ప్రధాన
సంపాదకులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, గౌరవ సంపాదకులు ఆచార్య అలేఖ్య పుంజాల కాగా - సంపాదకులు : డా॥ ఎం. గీతావాణి, రింగు రామమూర్తి, బి. శ్రీనివాసగౌడ్, డా॥ఎన్. సుధాకర నాయుడు. ప్రపంచ మహాసభల గురించిన సమాచారాన్ని సమగ్రంగా ఇచ్చారు.
"జయంతి” మూడు నెలలకొకసారి వెలువడే విద్య, సాహిత్య, సాంస్కృతిక, బహు భాషాపత్రిక. ముఖ్య సంపాదకులు డా॥ వెలిచాల కొండలరావు. ప్రపంచ మహాసభల్లోని ముఖ్య ప్రసంగాలను, ఆ సందర్భంగా వెలువడిన వ్యాసాలను క్రోడీకరించి ప్రత్యేకంగా 200 పుటల్లో పొందు పరచి ఒక ప్రత్యేక సంచికను, రంగుల ఫోటోలతో, కె.సి.ఆర్ తదితర ప్రముఖుల సందేశాలతో సర్వ సమగ్రంగా వెలువరించారు. చదివి తీరవలసిన రచనలు, ప్రసంగ సారాంశాలూ ఇందులో ఉన్నాయి.
పై రెండు ప్రచురణలూ - ఆసక్తిగల ప్రతివారి స్వంత గ్రంధాలయంలోనూ, ప్రతి కళాశాలలో, పాఠశాలల్లో, ప్రజా గ్రంథాలయాల్లోనూ ఉంచాల్సినవి. ప్రచురణ కర్తలూ, ప్రభుత్వమూ - ఇందుకు చొరవతీసుకోవాలి.
దీపం (స్రీవాద కథలు)
దీపం (ప్రీవాద కథలు)
సంకలనం : సన్నప్రనేని అయ్యన్‌రావు
పుటలు : 181, వెల : రు.100/-
ప్రతులకు : ప్రముఖ పుస్తకవిక్రయ కేంద్రాలు
ప్రచురణ : సన్నప్రనేని పున్నయ్య,
లక్ష్మీనరసమ్మ ట్రస్ట్, ఫ్లాట్‌నెం. 301,
రిషి ఎన్‌క్లేవ్, 2/4 లక్ష్మీపురం,
గుంటూరు - 522 007
సెల్ : 94914 78884
స్రీ పురుషుల మధ్య కొనసాగుతున్న అసమానతలు, మగువల మనోవ్యధలు, సంఘర్షణల గురించిన ఒక కథా సంకలనాన్ని తీసుకుని రావాలనే సన్నపనేని అయ్యన్‌రావు ఆలోచనకు కార్యరూపం ఈ పుస్తకం, ఇందులో 18 కథలున్నాయి.
వాటిలో 15 కథలు ప్రసిద్ద రచయిత్రులు వ్రాసినవి, ౩ కథలు ముగ్గురు ప్రముఖ రచయితలు వ్రాసినవి! 1948 వ సం॥ నుండి 2017 సం॥ వరకు, అంటే దాదాపు ఏడు దశాబ్దాల కాలంలో వివిధ పత్రికలలో ప్రచురింపబడిన ఈ కథలు విశేషంగా పాఠకులను ఆకట్టుకున్నవే!
స్త్రీలో చైతన్యం కలిగి, స్త్రీలు సమస్యల నుండి విముక్తులు కావాలి అని తెలియచేసేవి త్రీ వాద కథలు. త్రీ వాద మూలాలను తెలియచేస్తూ కొ.కు. వ్రాసిన 'పిన్ని' కథలో ఆర్థిక వ్యవస్థ స్రీలకు అధికారం యిస్తే కుటుంబంలో విలువలుంటాయనే వ్యక్తిగత చైతన్యం కనిపిస్తుంది. భార్య అంటే రాక్షస కామం తీర్చుకునే కీలుబొమ్మ అని భావించే భర్త యొక్క లైంగిక దోపిడీ నుండి విముక్తురాలై, తన లైంగిక హక్కును కాపాడుకోటమే జీవితపు వెలుగుగా భావించిన 'కమల పి. సత్యవతి వ్రాసిన 'మాఘ సూర్యకాంతి" లో కనబడుతుంది. దా॥ ఆరేటి కృష్ణ వ్రాసిన 'సుధీర” కథలో ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్న శివరాం యొక్క యిష్టా యిష్టాలకు అనుగుణంగా మారిపోయి తన ఉనికినే మరచి పోయింది. కాని అతడు స్వార్ధంతో ఆమెను ఉద్యోగం చేయమనృప్రుడు, స్వేచ్చనుపయోగించుకుని గ్రంథాలయం.
రచన: తురగా జయ శ్యామల ప్రతులకు: జయశ్యామల తురగా, 706 ఆరాధన బి” వింగ్, జడి అంబేద్కర్ రోడ్, దాదర్,
పూస్తున్న పూలలో... వీస్తున్న పరిమళం (కవిత్వం) రచన : సీతా సుధాకర్, = ముంబయి-400 014; పుటలు : 106, వెలు రు.50/-, జశసుహ్ర సెల్ :9821003133 ప్రతులకు: సీతా సుధాకర్, బి -602 మనసుపిలిచింది:(రెండు నవలలు) 1 బ్లూ హిల్స్ సొసైటీ, యెరవాడ, పూనె - 411006 న ప్తుటలు:142వెలురు. 50 పుటలు: 76వెల:రు. 100/-. సెల్ : 9765390399
ఆకాశం కోల్పోయిన పక్షి (కవిత్వం)
రచన : కృష్ణుడు, పుటలు: 166, వెల: రు.125/,
ప్రచురణ: ఎమెస్కో బుక్స్, 1-2-7, భానూ కాలనీ, గగన్ మహల్ రోడ్, దోమల్‌గూడ,
హైదరాబాద్ - 500029,
ఖ్రాంచ్ ఆఫీను విజయవాడ
ఫోన్ నెం : 0866-2436643
పెన్న ముచ్చట్లు : (వ్యాసాలు) మట్టి పొరల్లోంచి : (కవిత్వం) న] పుటలు: 240, వెల: రు.150/- రచన : సోమేపల్లి వెంకట సుబ్బయ్య; (= ప్రతులకు: శ్రీమతి కె నత్యవతి పుటలు: 56, వెలు రు.60,
16-4-279, కస్తూరిదేవి నగర్, ప్రతులకు : క్రెసెంట్ పబ్లికేషన్స్, 29-25-23ఎ, ౯ నెల్లూరు-524 001. నవోదయ బుక్ హౌస్, వేమూరివారి వీథి, సూర్యారావుపేట, విజయవాడ- 2
కాచిగూడ, హైదరాబాద్. ప్రచురణ:రత్న ప్రింటింగ్ వర్క్, విజయవాడ -2%,
సెల్ : 9247564044 సెల్: 9080663666
కవేరా కలం - కాలం : (వ్యాసాలు)
రచన : కణుగుల వేంకటరావు
పుటలు: 206, వెల: రు.150/-
ప్రతులకు: ఎం.ఐ.జి-100, హౌసింగ్ బోర్డు కాలనీ, జిల్లా పరిషత్ ఎదురుగా, శ్రీకాకుళం - 532001 సెల్: 99892 6544
ఓ మహిళా నీకు మతమెందుకమ్మా (వ్యాసాలు)
రచనడి. పేరలింగం, పుటలు: 48, వెల : రు.20/,
ప్రతులకు: డి. పేరలింగం, హేతువాది,
(సైన్స్ గ్రంథాలయం), ఎ. వి. అప్పారావు రోడ్, బాలాజీ వీథి, రాజమండ్రి - 533103, సెల్ : 95026 54774
కోోలణస్థోగ . ప్రాచీన కుల సంస్కృతి-సామాజిక ప్రగతి (వ్యాసాలు) కులం, మతం అనే అడ్డుగోడలను నిర్మూలించి, సమాజ పురోగతికి, సమసమాజ నిర్మాణానికి, హితోధికంగా. కృషి చేస్తూ హేతువాద రచనలను జనసామాన్యానికి అందించే నంకల్పంతో వెలువడిన వృన్త్నకం 'ప్రతులకు:డి. పేరలింగం, సెల్ : 95026 54774
అతని నుండి విడిపోతుంది.
పితృస్వామ్యం నిర్మించిన గోడలు, అత్త - కోడళ్లను శత్రువులుగా మారిస్తే ఆ గోడలను బద్దలు కొట్టి వారిద్దరు మిత్ర సంబంధాలతో ఉండాలనుకోవటం, పితృ స్వామ్యానికి ఒక చెంపదెబ్బ అని వోల్లా వ్రాసిన “గోడలు" కథలో అర్ధం అవుతుంది. స్రీకి యింటి చాకిరీ ఒక పీడనగా తయారయ్యే సరికి దాని నుండి విముక్తికై 'ఇటైర్‌మెంట్ ను కోరుకోవటం ఇంద్రగంటి జానకీబాల కథలో అర్ధం అవుతుంది.
మిగిలిన కథలు స్త్రీల సమస్యలను స్పృశించినా, ప్రపంచీకరణ సందర్భంలో బలహీనపడుతున్న మానవ సంబంధాలను తెలిపే కథలు.
తాను బ్వలిస్తూ, కరిగిపోతూ వెలుగుని ప్రసరింపచేసే స్రీ మూర్తిని దీపాకృతిలో చిత్రించిన ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య ముఖచిత్రంతో పాటుగ, మరికొన్ని రేఖా, వర్ణ చిత్రాలు లోపలి పేజీలలో ఆకర్షణీయంగా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని కార్టూన్లు, ఛాయా చిత్రాలు కనిపిస్తాయి.
సంకలన కర్త చేసిన 'ఆలోకనము” చాల దీర్ధంగా సాగిందని చెప్పవచ్చు. అయితే స్త్రీలు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, వారిలో చైతన్యం కలిగి సమాజంలో లింగ వివక్ష పోవాలని తపనపడే అంతరంగాన్ని అర్ధం చేసుకోగలుగుతాం. ఒక స్త్రీవాద రచయిత్రి లేదా సాహితీవేత్త చేత 'ముందుమాట' వ్రాయించి ఉంటే పుస్తకానికి సమగ్రత వచ్చి ఉందేది. మొత్తం మీద విడివిడిగా పూసిన 18 పుష్పాలను ఒక చోటికి తెచ్చి ఒక సుమహారంగా తెలుగు భారతికి అందించటం అభినందనీయం!
| ఎం.వి.శాస్తి