తిమ్మరుసు మంత్రి
తిమ్మరుసుమంత్రి
(కృష్ణదేవరాయల ప్రధానమంత్రి)
గ్రంథకర్తః
చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు
ఆంధ్రులచరిత్రము, స్వయంసహాయము, జీర్ణకర్ణాటక రాజ్యచరిత్రము మొదలగు గ్రంథములకు కర్తలు
ప్రకాశకులుః
ఆర్యపుస్తకాలయము
రాజమహేంద్రవరము
ప్రధమ ముద్రణము 1937
ద్వితీయ ముద్రణము 1950
శ్రీనాథకవి
(జీవితము)
చిలుకూరి వీరభద్రరావుగారు
ఇందు వీరేశలింగము. లక్ష్మణరావు. ప్రభాకరశాస్త్రి మొదలగువారు చర్చించి వ్రాసిన యనేక విషయములను విమర్శించి యనేక నూతనాంశములను జేర్చి ప్రకటింపఁబడిన జీవిత విమర్శగ్రంథము. శ్రీనాథకవినిగూర్చి తెలిసికోఁదగిన ప్రత్యంశము నీ గ్రంథముం జదివినఁ దెలిసికొనఁగలరు. ఇంతవరకుఁ ట్రకటింపఁ బడిన గ్రంథములలో నుత్తమ విమర్శనలతో విరాజిల్లుచున్న యుత్తమ గ్రంథము, వెల 2-8--0 కర్ణసామ్రాజ్యము 1-4-0 తిమ్మరుసుమంత్రి 1-8-0
అళియరామరాయలు
ఇది కృష్ణరాయని అల్లుడును, తాళికోటయుద్ధమున అపారపరాక్రమము ప్రదర్శించిన మహాయోధుడునగు రామరాయని చరిత్రము. హేరాసుబండితుడు వ్రాసిన చరిత్రమునందలి పొరపాటులన్నియు ఇందు సోదాహరణముగ విమర్శింపఁబడినవి. ఇది విఖ్యాతాంధ్రచరిత్రకారులును, చరిత్ర చతురానన బిరుదాంకితులునగు చిలుకూరి వీరభద్రరావు పంతులుగారిచే ఆతిపరిశ్రమతో మనోహరముగ రచింపబడినది. వెల1-12-0
తిక్కనసోమయాజి
తిక్కనసోమయాజి ఆంధ్రభారత, గ్రంథకర్తయగు కవి తిక్కన చరిత్రము ప్రతివారికిని పఠనీయము. వెల 2-6-0 మొఁదటికూర్పు పీఠిక.
ఈ గ్రంథమును బల్లారిలో జరిగిన పరిషత్సభలోఁ జదువుట కై ఆంధ్రసాహిత్యపరిషత్కార్యనిర్వాహకసభాధ్యక్షు లైన శ్రీయుత జయంతి రామయ్యపంతులవారిచేఁ బ్రేరేపితుఁడనై మొదట వ్యాసరూపమున సంగ్రహముగ వ్రాసితిని. కారణాంతరమువలన నేతత్సభకు నేను బోవుటకుఁగాని దీనిని చదివించుటకుఁ గాని సాధ్యపడలేదు. మహాపురుష జీవితములు మానవుల కాదర్శప్రాయములై వారి యుత్సాహశక్తులను వికసింపఁ జేయును. ధైర్యసాహసములను బురికొల్పును. సత్కార్యముల కున్ముఖులను జేయును. దుష్కార్యములకు విముఖులను గావించును, ప్రాపంచికానుభవమును వెల్లడించును. దేశభక్తిని ప్రోత్సహించును. పరమార్థమునుబోధించును. ఇట్టిమహాపురుషజీవితములు సారస్వతమునకు ముఖ్యాంగములని చెప్పనొప్పును. ఉద్బోధకములైన మహాపురుష జీవచరిత్రములతో నలంకరింపఁబడని సారస్వత మొకసారస్వత మనిపించుకొనదు. ఆంధ్రసారస్వతమున నిట్టి జీవచరిత్రములు బహుస్వల్పసంఖ్యకలవిగా నున్నవి. ఇట్టిలోపమును నివారించవలయు నను తలంపుతో నేనీ గ్రంథ రచనకు బూనుకొన సాహసించి పదునేనవ శతాబ్దిలో జనించిన మహాపురుషులలో నగ్రగణ్యుఁడును. మహారాజ్య తంత్రజ్ఞుఁడు నై ప్రపంచమున విఖ్యాతిఁగాంచిన తిమ్మరుసుమంత్రి చరిత్రమును మొదట ప్రారంభించినవాఁడను. జీవితచరిత్రము చిత్రించుటకుఁ గావలసిన పరికరణములు లేవు. అయినను తరతరములనుండి దేశమున జెప్పుకొనఁబడుచున్న కథలను, దేశీయులు వ్రాసిన చరిత్రములను, పూర్వకవి ప్రణీత ప్రబంధములను. శాసనములను బరిశోధించి యొకమాదిరి చరిత్రముము వ్రాసి ప్రకటింపఁ గలిగితిని. అప్పాజినిగూర్చిన కథలనేకములు గలవు. అందలి కథ లనేకములు విశ్వాసపాత్రములు కానందునను. గ్రంథవిస్తరభీతి చేతను వానిని విడిచిపెట్టినాఁడను, ఈ తిమ్మరుసు జీవితమును జదువువారు కృష్ణరాయనికింగల గౌరవమునంతయుఁ దిమ్మరుసునకు ముడిబెట్టితి నని దురభిప్రాయము పడవచ్చును. కాని నేను వ్రాసినదానిలో నతిశయోక్తులంతగా లేదని చెప్పఁగలను. కృష్ణదేవరాయనికిఁ గలిగినకీర్తి కంతకు మూలము తిమ్మరుసని యీగ్రంథముఁ జదివినవారికి బోధపడఁగలదు. తిమ్మరుసు ప్రతిభను పేర్కొనుట రాయని ప్రతిభకు భంగము కలిగించుట కాఁ జాలదు. తిమ్మరుసునకు లేని యాధిక్యముమ నేను గల్పించినవాఁడను గాను. శ్రీకృష్ణ దేవరాయనికి సమకాలికుఁడైన డామంగో పేయస్సను పోర్చుగీసు చరిత్రకారుఁడు తిమ్మరుసును గూర్చి యిట్లు దెలిపియున్నాఁడు.
"Salvatinica, who is the principal person that enters the building, supervises the whole, for he brought up the king and made him the king, and so the king looks on him like father. Whenever the king calls to him he addresses him as “Lord (senhor) Salvatinica" and all the captains and nobles of the realm make salam to him.
తిమ్మరుసును శిక్షించుకాలమునందు సయితము కృష్ణదేవరాయలీ క్రింద వాక్యమును తిమ్మరుసు నుద్దేశించి పలికినట్లు సమకాలికుఁ డైన సన్నీజను పోర్చుగీసు చరిత్రకారుఁడు వ్రాసియున్నాఁడు.
"I held thee always as my great friend, and now for these forty years thou hast been governor in this kingdom, which thou gavest me."
ఈ గ్రంథమునందు తిమ్మరుసునకు రాజనీతి విద్యోపదేశకుఁడు నాదిండ్ల చిట్టిగంగనామాత్యుఁడని నేను వ్రాసినది పరంపరగా దేశములో వాఁడుకొనెడి కథలను బట్టిగాని మఱి యన్యము కాదు. నాదిండ్ల చిట్టి గంగనామాత్యుఁడు సామాన్యుఁడు గాఁడనియు, మహామంత్రిశేఖరుఁడనియు మాచయగారి మల్లనకవిప్రణీత మగురాజశేఖర చరిత్రములోని
"ఉ. సాళువనారసింహమనుజ ప్రభుకార్యకాళాధురంధరుం
డై లవణాబ్దివేష్టిత ధరాదిపదుర్మత మంత్రమంత్రిశుం
డాలవితానకేసరి యనంగననంగసమానరూపరే
ఖాలలితాంగుఁ డట్టి చిటిగంగన యొప్పుగుణానుషంగుఁడై."
అనుపద్యమువలన వేద్యము గాఁగలదు.
నాయల్పజ్ఞత్వమువలన నిం దేవేని దోషములు దొరలినవానిని దెలిపినచో రెండవకూర్పున సవరించుకొందును. నేను పరస్థలమునం దుండుటచేత నిందచ్చుతప్పులు కుప్పలుగఁ బడినవి. వానిని మన్నించి శుద్దపత్రముంజూచి చదువుకొనవలయు నని చదువరుల వేఁడుకొనుచున్నాఁడను.
చిలుకూరి వీరభద్రరావు.
చెన్నపురి.
10 - 5 - 17.
విషయసూచిక
[మార్చు]విషయసూచిక.
1 |
తిమ్మరుసు వంశము
బాల్యదశ
దారిద్ర్యము
విద్యాభ్యసనము
చిట్టిగంగనామాత్యుడు
రాజకీయపరిస్థితులు
అర్థశాస్త్రపఠనము
17 |
తుళువవంశము
మహావిప్లవము
సమయాకర్షణము
తుళువనరసింహుని దండయాత్ర
సాళ్వనరసింహుని పట్టాభిషేకము
తిమ్మరుసు హితబోధ
32 |
ఇమ్మడి నరసింహరాయడు
తురుష్కుల జయించుట
కోనేరినాధుని దుండగము
బహమనీరాజ్య విభాగములు
ఆదిల్ షా పరివేదనము
44 |
రాజకుటుంబ రక్షణభారము
తిప్పాంబ కౌటిల్యము
కృష్ణరాయని విద్యాభ్యాసము
నరసరాయని మృతి
వీరనరసింహుని పట్టాభిషేకము
వీరనరసింహుని దిగ్విజయయాత్ర
కృష్ణరాయని విజయము
వీరనరసింహరాయని తీర్థయాత్రలు
వీరనరసింహరాయని పరిపాలనము
వీరనరసింహరాయని దుష్టబుద్ధి
తిమ్మరుసు పరివేదనము
68 |
రాజ్యపట్టాభిషేకము
75 |
తిమ్మరుసు కారుణ్యము
తిమ్మరుసు కార్యనిపుణత్వము
తిమ్మరుసు చారపద్ధతి
కృష్ణరాయని ప్రార్థనము
తిమ్మరుసు హితబోధ
ప్రథమ సంస్కరణము
ఇతర సంస్కరణములు
విద్యాగోష్ఠి
97 |
దక్షిణ దిగ్విజయము
తిమ్మరుసు పూర్వదిగ్విజయ యాత్రకు బ్రోత్సహించుట
నగరాధ్యక్షుని నిర్ణయించుట
సేనాధిపత్య పట్టబంధనము
109 |
దండయాత్ర వెడలుట
ఉదయగిరి ముట్టడి
కొండవీడును ముట్టడించుట
శ్రీకృష్ణరాయని సాహసము
రాజమహేంద్రపురమును గైకొనుట
పాత్రసామంతుల యుద్ధము
పాత్రసామంతుల మోసపుచ్చుట
124 |
తిమ్మరుసు తురుష్కులను జయించుట
తిమ్మరుసు మేనల్లుండ్రు
రాచూరి దండయాత్ర
129 |
తిమ్మరుసు పరిపాలనము
అంత్యదశ
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.