సప్తమైడ్వర్డు చరిత్రము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to searchThis Life of King Edward, vii.

is respectfully dedicated

To

Rao Bahadoor Govind Doss Chathurbhuja Doss

for the kind sympathy he shows to the

men of Telugu Letters.శ్రీ

రాథాకృష్ణ పరబ్రహ్మణేనమః.

క. ఇలవెలఁది మోమునెల నిడు
   చెలువపుఁ గెంబొ ట్టనంగ సిరులను బేర్మిన్
   వెలిసెడిచెన్నపురంబునఁ
   గల రలఘూర్జరులు వర్తకకళా ప్రౌఢుల్ . 1

తే. వారిలో ఖాను దాసాహ్వయార్యుఁ డమల
    సత్యమార్గమునఁ గలిమిఁ జాలఁ గూర్చి
    దానధర్మైకనిరతుఁ డై దైవభక్తి
    బాల కృష్ణుని సేవించి పడసె ముక్తి. 2

క. అతనికిఁ గుశాలుదాసుఁడు
   వితరణ గుణశాలి సాధువిప్రుల నెలమిన్
   సతతముఁ బ్రోచెడిపుత్త్రుఁడు
   కుతుకంబెదఁ బెనగొనంగఁ గూర్మి జనించెన్. 3

ఉ. వెన్నునినంజతమ్ములను వీ డనిబత్తిని డెందతామరన్
    సన్నుతి సేసి సజ్జనుల సర్వవిధంబుల నాదరించి య
    త్యున్నతగౌరవస్థితుల నొంది చతుర్భుజదాసు పుత్త్రునిన్
    గన్నకుశాలుదాసునకు క్ష్మాతలమం దొరు లెన్న సాటియే? 4

తే. శ్రీచతుర్భుజదాసుండు శ్రీలఁ బెంచి
    కలిమిఁ దనకుద్దిలేఁ డని పలుక జనులు
    బీదసాదల హరిప్రీతి నాదరించి
    కీర్తి కౌముది వెలయంగఁ గృష్ణుఁ జేరె. 5

క. వానికి నిర్వురు తనయులు
   మానధనుల్ పాపభీత మానసులు ధరన్
   సూనృతవాక్య ధురీణలు
   కానక జన్మించి రధిక గౌరవ మెసగన్ . 6

క. గిరిధరగోవిందాహ్వయు
   లరుదార విభూతి మెఱయ సంచితవిద్యల్
   కరమర్థి నేర్చి పెద్దలఁ
   బరితృప్తులఁ జేతు రిలను భవ్యశ్రీలన్. 7

తే. గీ. అన్నగిరిధరు ననిశంబు నధికప్రీతి
        జానకీరాము లక్ష్మణస్వామి గొల్చు
        భంగి సేవించి శ్రీకృష్ణుపాదకమల
        మధువుఁ గ్రోలుగోవిందుఁడు మహితభక్తి. 8

తే. గీ. ఆంధ్రభాషావధూటి ననారతంబు
        గౌరవించుట కెదఁ గోరిఁ గవుల బుధుల
        నాదరించుచు బీదల మోద మెసఁగఁ
        మనుచు గోవిందుఁ బ్రోచెడి మాధవుండు. 9

తే. గీ. నేల నైదవభాగంబు నేలినట్టి
        శ్రీమ దెడ్వర్డుచరితంబు హృద్యసరణి
        నాంధ్రభాషను గూర్చితి నందు మయ్య
        దాని గోవింద నీకీర్తి ధరణి వెలుఁగ. 10


విన్నపము.

ప్రపంచములోఁ బంచమాంశమునకు నధీశ్వరుం డైన యెడ్వర్డుచరితమును నేను తేటతెలుఁగన వ్రాసి, నాచే వ్రాయఁబడు మహాపురుష జీవితములలో ద్వితీయ్య గుచ్ఛముగఁ జేర్చితి. శ్రీ మద్విక్టోరియా యొక్కయు నాయమభర్త అగు నాల్పర్టు ప్రభువుయొక్కయు చరిత్రంబులును, ఇంకఁ గొందఱు ఎడ్వర్డునుగూర్చి వ్రాసినగ్రంథములును సాహయ్యముగఁ గై కొని, నేనీ యెడ్వర్డుచరితంబు వ్రాసితి. కాఁబట్టి నేను ఆచరిత్ర గ్రంథకారులయెడ మిక్కిలి కృతజ్ఞత కలవాడనై యున్నాఁడ. నే నీ గ్రంథమును ముద్రించుటలో జ్యోతిష్మతీ ముద్రాక్షరాధికారులును, సంస్కృతాంధ్రంబులయందు సాహిత్య చక్రవర్తులును, కవిసింహులును, అస్మద్గురువర్యులును, అయిన బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయశాస్త్రులుగారును, శ్రీపచ్చయప్పకళాశాలాంధ్రపండితులైన శ్రీమాన్ పర్ణశాల నృసింహాచార్యులును, నాకుమిక్కిలి తోడుపడిరి. నేను వీరికిఁ గృతజ్ఞతాపూర్వక వందనముల నర్పింపుచు ముద్రణచిత్తుకాగితములను దిద్దిన మ రా రా శ్రీ. ఓ. వై. . దొరసామయ్య గారికి నాదెనరు సూపుచు, విద్వజ్జనులును, విద్యాధికారులును, పాఠశాలలయందు. నాంధ్రపండితులును, సకల మహనీయులును, ఆంధ్రభాషాభిమానులును, నాకుఁ దగినసాయము సేసి, ఇట్టి గ్రంథముల రచించుటకు నన్ని తెఱంగులఁ తోడ్పడుదు రని నమ్ము.

చెన్నపురి.

సాధారణనామ సం. ము.

ఫాల్గుణశుద్ధ 3 శుక్రవారము.

3 - 3 - 11.

సర్వజనుల విధేయుఁడు.

యస్. వి. రంగాచార్యులు.

CONTENTS

CH.

P.

1. A Short History of king Edward's Ancestry. 1
II. (1) Edward's Birth.7
(2) His Education. 39
III, The death of the King's Father. 41
IV. Edward's Wedding with Queen Alex. andra. 45
V. Early Married Life of King Edwardand Queen Alexandra.64
VI. 1. Edward's Visit to Foreign countries. 73
2. The King's Illness.93
3. The King's Quiet Life at Home 1873-1875. 97
VII. The king's Tour in India. 98
VIII. 1. Quiet Years of Public Work1876-1887. 110
2. Queen Victoria's Golden Jubilee. 116
3. Silver Weddling of King Edward.and Queen Alexandr.117
4. Marriage of Princess Louise119
5. The Baccart Case.120
6. Death of the Duke of Clarence. 122
7.Marriage of Prince George.125115
8. Queen Victoria's Diamond Jubilee. 128
9. A Serious Accident.130
10. The Attempt on King Edwarl's Life. 134
IX. The Accession and Coronation. 136
King Edward's Reign. 141
King Edward's Last Days and Death 158

.

విషయసూచిక. .వంశచరిత్రము.


1. ఎడ్వర్డు పుట్టుక, 7
2. ఎడ్వర్డు " ప్రిన్సు ఆఫ్ వేలు" అను బిరుదు నొందుట. 17
3. శ్రీయెడ్వర్డు నకు జ్ఞానస్నానము జరుగుట, 17
4. ఎడ్వర్డును లేడిలిటల్టను పెంచుట, 21
5. ఎశ్వర్లు విద్య నేర్వప్రారంభించుట. 26
6. ఎడ్వర్డు అయిర్లండు దీవికి వెళ్లుట, 38
7. ఎడ్యర్డు విద్యాభ్యాసము. 36


ఎడ్వర్డు తండ్రి మరణము. 40


ఎడ్వర్డు పెండ్లి 45


ఎడ్వవలెగ్జాండ్రాల నూతన దాంపత్యము. 64


1. అన్యదేశాటనము. 73
2. ఎడ్వర్టు వ్యాధిగ్రస్తుఁ డగుట, 93
3. ఎడ్వర్డు ఇంట నెమ్మదిగా నుండుట. 1978.1875. 97

ఎడ్వర్డు హిందూ దేశమునం గ్రుమ్మరుట, 98


1. 1876-1987 ఎడ్వర్డు ఇంట నెనుదిన నుండుట, • 114
2. ఎడ్వర్డ లేగ్జాండ్రాలు అయిర్లెండునకు వెళ్లుట. 110
3. విక్టోరియా మహా రాణీ గోల్డెన్ జూబిలి మహోత్సవము. 116
4. ఎడ్వర్డ లెగ్జాండ్రాల సిల్వరు ఇడ్లింగ మహోత్సవము . 117
5. “లూయి" అను రాకుమార్త వివాహము, 119
6. బాకర్టు వ్యాజ్యమున ఎడ్వర్డు సాక్ష్యము సెప్పుట, 120
7. ఎడ్వర్డు పెద్ద కొడుకు మృతుఁ డగుట, 122
8. జార్జి రాకొమారుని పెండ్లి 125
9. విక్టోరియా డైమెండు జూలి మహోత్సవము. 128
10. ఎడ్వర్డు మోకాలు బెను కుట, 130
11. ఆ నామ ధేయుఁ డొక్కడు ఎడ్వర్డును దుపాకితోఁ గాల్ప నుద్య
      మించి విఫలప్రయత్ను డగుట, 134


ఎడ్వర్డు రాజ్యమునకు వచ్చి పట్టాభిషిక్తు డగుట, 136ఎడ్వర్లు ప్రభుత్వము. 141


ఎడ్వర్డు నవసానదశ. మరణము 158.పుట. ..............తప్పు................ ....................ఒప్పు ....................
125. నివసించుటకు ఏర్పడెను............. బీదలు నివసించుటకు ఏర్పడెను.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2023, prior to 1 January 1963) after the death of the author.