సప్తమైడ్వర్డు చరిత్రము/ఎనిమిదవ అధ్యాయము
ఎనిమిదవ అధ్యాయము.
1876 సం. ము మొదలు 1987 సం. ము కడవఱకు
ఎడ్వర్డు ఇంట నెమ్మదిగ నుండుట.
లండను పురంబున “లైసెన్‌స్డ్ విక్టలర్స్ అసైలమ్” (Licensed Victuallers' Asylum) అను నాశ్రమము కలదు. అది యాపట్టణంబున వెలసి కొన్ని యేండ్లాయెను. ఆయాశ్రమవాసులు జూబ్లీ మహోత్సవము సేయఁ దలఁచి, ఎడ్వర్డును, బిలిచిరి. అతడు ఆచోటికి వచ్చుటకు నియ్యకొనెను. అనేకు లీసంగతి నెఱింగి, ఆచోటికి బోవల దని ఎడ్వర్డును వేడిరి.
కాని అతఁడా తాపునకు వెళ్లుటకుఁ బుట్టు పట్టెను.అయాశ్ర మమున మత్తు పదార్థములు జనులకు నియ్య బడుచుండెను. అతడు తాను త్రాగుబోతులను ఉత్సాహరుప నాచోటికి బోసనియును, ఆయాశ్రమవాసుల ధర్మకార్యమును పఱుప 'నెళ్లెద ననియును, తన్నుఁ బోవల దన్న వారికి సమా ధానము సెప్పి, ఆతాపునకు వెళ్లి, కొన్ని మాటలు ముచ్చటించి యింటికిజను దెంచెను.
• పారిసు " అను నగరము ఫ్రాన్సు రాజ్యమునకు రాజు ధాని. ఆరాజ్యమున నుండు వారా నీట సర్వవస్తు ప్రదర్శన మును గావింష వలయుసని యుద్యయముములు సేసిరి. వారు. ఆయాతోవులలో జేయఁబడు వింత వింత సామానులను దెచ్చి ఆప్రదర్శన శాలలో వెలయింప చేయుచుండిరి. ఇంగ్లండున నొనర్చ: బడిన సామానులను వెలయఁ జేయవలయు నని ఆంగ్లే యులు కోరి, దానికి నొక సంఘమును ఏర్పాటు చేసిరి.. ఆ సంఘమునకు ఎడ్వర్డు అధిపతి. కొత్త ప్రదర్శనములలో నెడ్వర్డు తండ్రి మిక్కిలి యక్కఱతో బాటు పడుచుండెడి వాడు, కొడుసకును ఆదేరీతిని ప్రదర్శనావలోక సొసక్తుడై పారీసు నగరం బుఁకుఁ జని ప్రదర్శన కార్యాధ్యక్షులతో , దానికి సంబంధించిన మాటలాడి, దానికి వలయు నుద్యమములు సేయుచుండెను.
1878 సం. పారినులో ప్రదర్శనము జరుగు నని పత్త్రి కలలోఁ జాటించిరి. ఇంతలో సడ్వర్డునకు గొప్పదుః:ఖము సంప్రా ప్తించెను. అతని తోబుట్టువు " ప్రిన్సస్ అలెసీ" అను నామె జబ్బుపడి, తిరిగి కుదుటఁబడక మిత్తినోటికిఁ బేలపిండి యయ్యె, ఎడ్వర్డు తనసోదరి మరణంబునకై మిగుల పగల బొగులుచు రాచకార్యములలోఁ బ్రవేశింపక దుఃఖముతో నింటిపట్టున నే ఉండెను. “తగిన కాలునకె తగులును. " అను సామెత చొప్పున నెడ్వర్డు తోబుట్టు వొకఁడు దశాఫ్రికాలోనుండు జూలూ లాండు" అనుచోట రణము సలిపి, స్వర్గస్టు డయ్యె సనుశోక వృత్తాంతము ఆయనకుఁ దెలి సెను. అతను దాని కై మిక్కిలి శోకించెను. కాని తను చావు మనుష్యజనము మొందినవా రందరకు నుండుట సహజ మనియును,చచ్చినవాని కై పగచుట పనికిమాలిన పని అనియును తలుచి నిశ్చింతతో నుండెను.
ఎడ్వర్లు, రణమున స్వర్గస్థుఁ డైన రాకోమారుని జ్ఞాపకార్థ మై నెస్టుమినిష్టురు గుడిలో నాతనిరూపు కలపటమును వ్రేలాడ "వేయవలయు నని చెప్పి, దానికి గాను 1,950 రూపాయలను , ఇచ్చె ను, అనేకులు దీనికి సమ్మతించలేదు. అయినను ఎడ్వర్లు తాను పట్టిన పట్టు వదలక 1883 సం. జనవరి నెలలో ఫుల్ విచ్చిలో నాతని గాపకార్థమై అతని యాకారము గల పటమును జనులు కు గోచరమగునటుల: జేయుటకుఁ దన చిన్న కుమారులు "వెం టరా నా చోటికి వెళ్లి , రాకోమారుఁడు, మాతల్లి యైన విక్టోరి యా మహారాణిగాను ప్రాణములు గోలుపోయినాడనియును అతఁడు దైవభక్తి సంపన్ను డనియును, వానిగుణములను బ్రశంసించి,వానిపటము పై గల గుడ్డను తీసి వేసి, లండను పురికి నేతెంచెను.
1881 సం, న లండను పురంబున లాడ్డుమేయరైన సబ్ జార్టీ మాకార్త రనునాతఁడు, “కలోనియల్ ఇని స్టిటూటు" లోని సభ్యులకు విందు చేసెను. దానికి రావలయు నని ఎడ్వ ర్జునకు నాహ్వానము వచ్చెను. అతఃడా సమయమున నాచో టికి వెళ్లి ఆమెరికాలోని కన్నడా జనులు రాజభ క్తి సంపన్నులు యును, తనకు వారి యెడఁ బ్రీతివిశ్యాసము కలవనియును ముదలించి, తన యింటికి వచ్చెను.
ఇంగ్లండున నుండు చెంబబ వాండ్రు సముద్రమున గల చేషలను బట్టి జనులు ఆమత్స్యములను గాంచునటుల నొక పెద్ద ప్రదర్శస శాలలో: బెట్టిరి.. ఆప్రదర్శనమున నానావిధము లైన చేపలుండెను. ఎడ్వర్డు దానిని దెరచి, పలువిధములైన చేషలను జనులు చూచునటులఁ జేసినందులకు చెంబువాండ్రు . మిక్కీలి ప్రశంసనీయులని వారిని కొనియాడెను. చేపల అమ్మక ము వలన 1,95,000,రూ. మహ. నచ్చుబడి. వచ్చెను. ఈ మొత్తము లో మూడుపాళ్లు చెబళ్లలో దల్లిదండ్రులు లేని బాలురను బెంచుటకు నుప యోగింపఁబడెను. ఎడ్వర్డు, ప్రదర్శనమును 1859 సం. ఈ గావింప జేసెను. అసువత్సరముననే, ఎడ్వర్డు తమ్ముడు ప్రాన్సు రాజ్యమున దక్షణ భాగమున గ్రుమ్మరుచుండి స్వర్గస్థు: డాయెను. ఇందువలన నాతనికీ నింకొక తడవ దుఃఖ
సంప్రొప్త మయ్యేను. ఎడ్వర్డు వెంటనే ఫ్రాన్సు దేశమునకు నెళ్లి తమ్మునీశవమును గొనివచ్చి వింజరు భవనంబున సమస్త రాజు చిహ్నములతోఁ బూడ్పించెను.
ఎడ్వర్డ లెగ్జాండ్రాలు అయిర్లెండునకు వెళ్లుట
,
ఎడ్వడ లెగ్జాండ్రాలు అయిర్లండునకు వెళ్లుదు రని పత్రి కలు చాటింపసాగెను. అయిర్లం జనులును, అమెరికా ప్రజలును, తమదొరను దొరసానిని జూచుటకుఁ బ్రముదిత చిత్తులై యుండిరి.
అయిర్లండు జనులలో రెండు తెగ లున్నవి. మొదటి తెగ లో “నాషనలిస్టు, అనువారు చేరి యున్నారు. వీరు బలవం తులు. వీరికీ దేశాభిమానము సంపూర్ణముగను నుండును.. వీరు ఇంగ్లండు దొర తమ్ముఁ బాలించుట సాధారణముగ నొల్లరు. రెండ వ తేగవారు ఇంగ్లండుదొరయే తమ్ము బాలింప వలయు నని కోరుచుండువారు. వీ రెల్లప్పుడును దొరతనము వారి నాశ్రయిం చుచు వారివలనఁ దమ బ్రతుకు తెరువు గనుచు, వారిచ్చు బిరుదు లచే నల కృతు లగుచు, ఉండువారు. ఇట్టివారు 'మొదటి తెగ " వారితో గలియ రనుట నిర్వివాదాంశ మే..
మొదటికక్ష వారి పక్షముస నోక వార్థాపత్రిక ప్రచుర మగు చుండెను.ఎడ్వర్డు ప్రభృతు లైర్లండు నకు వచ్చుటకు సిస్ట పడ మని తమప త్రికలో ప్రచురము సేసిరి. మణికొందఱు వారి రాక విషయమై ఉదాసీనులై యుడిరి. ఇంకఁ గొందఱు ఎడ్వర్లును, అలెగ్జాండ్రోను రావచ్చును, కాని, వారు వచ్చినారని బీదజను లు చెల్లించు పైకమును ఖర్చు చేసి వారికి విందులు మొదలగు "వేడుకలు సేయఁ గూడదని వచించి. ఎంద రెన్ని రీతులం జెప్పినను, ఎడ్వర్డు ప్రభృతులు తమదేశమునకు నచ్చినప్పుడు, అల్లరి చేయఁగూడదని వారు నిశ్చయించుకొనిరి. ఎడ్వర్డు సతీసహితుఁ డై పెద్దకుమారుఁడు వెంట రా నైర్లండునకుఁ జను దెంచెను. నేషనలిస్టు పార్టీ వారు అల్లరి సేయక ఊరక ఉండిరి. కాని, రెండవ పక్షము వారు తమ రాజభ క్తిని మేర లేక చూపినందున మొదటి కక్ష వారు ఆగ్రహచిత్తు లై కొంత రగడ సేయుఁ బూనిరి. ఠాణాదారులు చాల మెలకునతో వారి నాఁపిరి. ఎడ్వర్డ లెగ్జాండ్రాలు అయిర్లండును 'వాసీ తమదేశ మునకు విచ్చేసిరి.
విక్టోరియా మహా రాణికి లోబడిన రాజ్యములలోను, హిందూదేశమునను, జేయఁబడిన చిత్రవిచిత్రము లైన వస్తువులను ప్రదర్శింషనలయునని ఎడ్వర్డు తలంచెను. ఆతఁ డా యూదేశముల యందుండి వచ్చినవస్తుజాలంబుల నందంబుగ రాయల్ ఆల్బర్టు మందిరంబున నుంచి యుండె. దానికి కలోనియల్ అండ్ ఇండియన్ ఎక్షిబిషన్" (Colonial and Indian Exhibi- tion) అని పేరు. విక్టోరియామహా రాణి: అప్రదర్శన భవనంబును దెఱచెను. అప్పుడు ఎడ్వర్డ లెగ్జాండ్రాలు విక్టోరియాను మిక్కిలి గౌవించి. సమస్తవ స్తువులు రమ్యములై కనుపట్టి, అన్ని
ఖర్చులు పోను 525,000 లు. దానివలన నికరము ఆదాయము తేలెను.
విక్టోరియా మహారాణి గోల్డెన్ జూబ్లీ మహోత్సవము
.
1886 సం. న కలోనియల్ అండ్ ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్" (Colonial and Indian Institute) అను పాఠశాలను విక్టోరి చూసుహారాణి గోల్డస్ జూబ్లీ మహోత్సవ సమయంబున నెలకొలుపవలయ నని మేయరు ప్రభువు ఎంచి, తన భావమును ఎడ్వర్డునకుఁ దెలియఁ జేసెను. ఇందులకు గాను గొప్ప వారంద రును చందాలు నేసికొని "పైకమును వసూలు చేసిరి. ఎడ్వర్డిం తకుఁ బూర్వము "కలో నియల్ ఇండియన్ ఎక్జిబిషన్ ” కు గాను మిక్కిలి యక్కరతో పాటు, దానిని నిర్వహించినం దున, ఆయనకుఁ గొన్ని కానుకలిచ్చుటకుఁ గొంత పైకము వసూ లయ్యె. అతఁడు తన కాసొమ్ము అక్కర లేదని చెప్పి, 'దానిని కలోనియల్ ఇండియక్ ఇన్ స్టిట్యూటునకు నిమ్మని వచించెను. రాణిమంత్రు లారొక్క మును ఆ పాఠశాల కై వ్యయము సేసిరి.
ఇంజనీయరు శాస్త్రము నేర్చి, ఆపనిలో నేర్పరులైన వారీ నెడ్వర్డు ఆదరించు చుండెడినారు. కొందరు ఇంజీనియర్లు ““ మర్శీ" అను నదిమీఁద ఒక వం తెసకట్టి, అవంతెన మీద నీటి కాలుపపోవునటులను, వాని క్రింద నేలు ప్రవహించుచుండు లాగున నద్భుత కార్యమును జేసిరి. ఎడ్వర్డు ఆవం తెనపై నెల కొనిన కాలువ తూమును దెఱచి నీటిని పారుదల జేసెను. ఆ సమయమున నాతఁడు వారిని బహుభంగుల మెచ్చుకొని యాచరించెను.
1887 సం. న విక్టోరియా మహారాణీకి గోల్డెన్ జూబ్లీ మ హోత్సవము నడిచెను. ఎడ్వర్డే అన్ని పనులను నిర్వహింప వలసి యుండెను. అతఁడు అన్ని యేర్పాటులు సేసెను. ఆమ "హోత్సవము వెస్టుమినిస్టరు భవనంబున నాచరింపఁబడెను. అది విశేష వైభవముతోఁ గూడియుండెను. పరరాజు ల నేకు లేతెంచి రాణిని బహు తెఱంగుల గౌరవించి. వారామెకు హితమతిని గానుకలను దెచ్చి యిచ్చిరి. ఎడ్వర్లు రాణికి మారుగ వారిని గౌరవించి వారికి విందులు 'సేసెను. . అతఁ డన్ని సమయంబుల నారాణి ప్రక్క నుండి ఆమహోత్సవము సత్య ద్భుతంబుగ నడిపెను. నౌకాసే నకు నాతం డా సంవత్సర బుస నధిపతి యయ్యె. అతని చిన్న కొడుకుగూడ నౌకాకా సేవలో నుండె. అదే అతని పెద్దకుమారుఁడును ఉండెను. ఎడ్వర్డ లెగ్జాండ్రాల సిల్వకు వెడ్డింగు మహోత్సవము.
ఎడ్వర్డ లెగ్జాడ్రాల శిల్వరు వెడ్డింగు ముహూత్సవము
1888 సం. న. ఎడ్వర్డ లెగ్జాడ్రాల శిల్వరు వెడ్డింగు ముహూ త్సవము జరుపుటకు మంత్రులు గోరిక. అందులకు వారనేక యత్నములు సేసిరి. పురమును శృంగారించిరి. ఆమఘోత్సవ దర్శనాగత రాజన్య నివహుబులు దిగుటకు విడురులు సిద్ధము సేయఁబడెను. అన్ని పనులు పూర్తి యయ్యె.
అప్పుడు జర్మనీ దేశ చక్రవర్తి "మొదటి విల్లియము వార్థ
కమున నవయుచుఁ గాటికి గాలుచాచుకోని యుండెను. అతని మరణ మొక వేళ నామ ఘోత్సమునకు భంగము సేయునో అని రాణి ప్రభృతులు చింతిల్లు చుండిరి. వారు తలంచిన రీతి నా రాజ్య ప్రభువు స్వర్గస్థుఁ డయ్యె, ముహూర్తదినమున నందఱును శోక వేషము వేసికొనక వేడుకలు సల్పిరి. నాఁడు విక్టోరియా మహా రాణీయును మంత్రులును, రాజబంధువులును, “పెక్కు మంది సామంత రాజు ప్రకరంబులును, మారల్బరో భవనంబున నుండిన ఎడ్వర్ణ లెగ్జాండ్రాలను జూడ వెళ్లిరి. ఆయిర్వురును వచ్చిన వారిని మిగుల గౌరవించి, విక్టోరియా నాఁడు తనబిడ్డలతో విందు కుడిచెను.
పెక్కు మంది శ్రీమంతులును, సామంత ప్రభునిచయంబు లును, పర రాజనివహుబులును, ఎడ్వర్డ లెగ్జాండ్రులకు సజరులను దెచ్చి సమర్పించి.. ఎడ్వర్డు తనభార్యామణికి సవరత్న ములు పొదిగిన కంఠాభరణంబు లొసంగె. రుష్యారాజ్యపుఁ జక్రవర్తి యును, చక్రవక్తినియును, అలెగ్జాండ్రాకు నవరత్న ఖచితమైన కంఠాభరణంబును చదివించిరి.. అలెగ్జాం డ్రాయొక్క శిశువు లామెకుఁ దమకుఁ దోచినకానుకలను సమర్పించిరి. వీరుగాక ఎడ్వర్ణ లెగ్జాండ్రాలకు ననేకులు బహుమతులను బంపి తమతమ రాజభక్తిని వెల్లడి సేసిరి..
ఎడ్వర్డు ప్రభృతు లీవిధంబున నింగ్లండున వేడుకలు నేసి కొనుచు నత్యుల్లాసంబున నుండ నాజర్మనీ దేశపు ప్రభువు ఫ్రెడ రిక్కు ఆస్వస్థుఁడయ్యె. అతఁడు కాలక్రమమున రోగముచేఁ బీడిం- పఁ బడి మిక్కిలి బలహీనుఁ డయ్యె. అతఁడు మరణము నందు నే మో అని ఎడ్వర్డు మొదలుగా గలవారలు దిగు లొంచుచుండిరి.. అయినను ఎడ్వర్డు గ్లాస్గోపురంబున సర్వవస్తు ప్రదర్శన శాలను దెరవఁ బోయెను. ఆపురవాసులాయనను మిక్కిలి గౌరవించిరి. 1888 సం. జూను నెల 14 వ తేదిని జర్మని దేశ ప్రభువు తొంబది తొమ్మిది రోజులు దేశమును చాలించి దీర్ఘనిద్ర 'జెందెను.
"లూయి" అను రాచకొమార్త వివాహాము.
1889 సం. ప్రిన్సెస్ లూయి ఫై ఫ్ రాకొమారుని మదిఁ గోరి యుఁండెను. కాని ఎడ్వర్లు ఆరహన్యము నెఱంగఁడు. విక్టో కొయూ మహారాణి ఉన్నట్టుండి ఒక నాడు సాండ్రింగుహాముభవన మునకు నేఁగి చిఱుతల జాడలు కనుగొనెను. అంత నా దేవేరి ఇం టికిఁ జనుదెంచి వారిరువురకుఁ బరిణయం బగు నని పత్రికలలో బ్రకటన సేయించెను. జను లీశుభవార్తను ఏస, ప్రిన్సెస్ : కి మంచివరుఁడు లభించె నని కుతుకంబున నుండిరి. లార్డు ఫైఫ్ (l.ord Fife) ఎడ్వర్డ ల్ర్గ్జాం డ్రాలకు నవీనుఁడు కాఁడు. అతఁడు వారియింటి కప్పుడప్పుడు వచ్చుచుం బోవుచు నుండును. అది యునుగాక అతడు వారియింటనే తఱుచుగా వాసము చేయు చుడెను. కాబట్టి అలెగ్జాండ్రా తనకూఁతు న్నా పైపునకు నిచ్చి వివాహము సేయుటకు సమ్మతించెను.
అయిరోపా దేశములో నుండు రాజకుమారులు ఎడ్వర్డు జ్యేష్ఠ పు తీకను పాణిగ్రహణము సేయఁ గోరిరి. కాని ఎడ్వేర్డు 'పరాయివానికిఁ దనపట్టి నియ్య నొల్లక ఆంగ్లేయ ప్రభువులలో ఒక చిన్న వానికి నొసంగుటలో అధికలాభము కలదని ఆలో చించి వారి ప్రార్థనల నంగీకరిపఁ డయ్యె. ప్రెస్సస్ లూయి అన్యుని వివాహ మాడె నేని, ఆమెకు నోకానొక సమయమున ఇంగ్లండు దొరతనము లభించులాగున దటస్థించిన ఆమెయే రాజ్య మును బాలించుటకు ఆగ్లేయులు సమ్మతింతురు. కాని, ఆమె భర్తగాని ఆమె బిడ్డలుగాని దేశము నేలుటకు ఇష్టపడరు. ఈ కారణము చేతనే ఎడ్వర్డు తనముద్దుపట్టీ నస్య దేశస్థున కియ్య నభిలషింపలేదు.
లార్డు పై పునకుఁ బెండ్లి రోజున -- "డూక్ ఆఫ్ పైపు"(Dake -of Fife) అను బిరుదు ఒసంగఁబడెను. ఒకింగుహాము అంతః పురమునకుఁ జేరిని కోవెలలో నా పెండ్లి వి శేష వైభనముగ నడిచెను. అప్పుడు విక్టోరియా మహా రాణీయును, ఎడ్వర్డ్ లెగ్జాం డ్రాలు ను వారి కొడుకులును, కడపటికూఁతును హేలనీసు రాజును, (King of The Hellenes) డెన్మార్కు యువరాజును "హెస్సిప్రభువును సచ్చి వధూవరుల నాశీర్వదించిరి..
బాకార్టు వ్యాజ్యమున ఎడ్వర్డు సాక్ష్యము సెప్పుట.
1890 సం. న హేమంతఋతువున ఎడ్వర్టు న్యాయ స్థానమున నాయధిపతుల మ్రోల నిలుచుండి సాక్ష్య మియ్య బోవు నని పుకారు పుట్టెను. జనులు కొంద ఱాగాలి మాటను
నమ్మక ఉండిరి. సర్ విల్లియమ్ గార్డన్ కమ్మింగ్ (Sir William Gordon Cumming) అనునాతడు ఎడ్వర్డునకుఁ బ్రాణమిత్త్ర ము. కమ్మింగు తన్నుఁ గారణము లేక ఆర్తర్ విల్ప నను వాని భార్యయును, లిసెట్ గ్రీనును, వాని ప్రాణమిత్త్రము ను, బైక్లి లెవెట్టను నాతఁడును, తిట్టినా రని వారి పై మాననష్టపు దావా తెచ్చెను. “కాల రెడ్డు" అనునాతఁడు న్యాయాధిపతి. ఎడ్వర్డు సాక్ష్యమియ్య వలయు సని గార్డను కోరెను. ఆయ నకు న్యాయాధీపతి పిలుపు (Summons) పోయెను. ఎడ్వర్డు న్యాయాధికారి యాసతి చొప్పున న్యాయస్థానమున హాజరయ్యే. న్యాయాధిపతి ఆయనకుఁ గూర్చుండుటకు నాసన మిచ్చెను, వ్యాజ్యము విచారణ చేయఁబడెను. ఎడ్వర్లు సాక్ష్య మిచ్చు వారు నిలుచుతావున వచ్చి నిలిచెను.ఉభయకక్షులవారి న్యాయవాదు లాయనను లేనిపోని ప్రశ్నలు వేసి తప్పుదారులకు లాఁగఁ జూచిరి. కాని ఆయన వారికుట్రలకు బేలుపోక నిజము సెప్పెను. ఆవల విచారణ ఏడుదినములు సాగెను. కడపట ప్రతివా దులు దోషు లని పంచాయతీలు చెప్పిరి. వేల్సుయువ రాజు లింతకుముం దనేకు లుండిరి. వారిలో నే ప్రభువును ఇంతదనుక ఈ సాక్ష్య మెచ్చటను జెప్పినట్టు లగపడదు. మన యెడ్వర్దే సాక్ష్యము " సెప్పిన వారలలో మొదటివాడను.
1891 సం. న మే నెల 17 వ తేదీని "పెప్ రాణియందు " పైపు డ్యూకు” అను ప్రభువునకు నొక యాడుబిడ్డ పుట్టెను.
ఎడ్వర్డలెగ్జాండ్రాలకు మనుమరాలు జన్మించె నని అందురు సంతసించిరి. ఆచిన్న పిల్లకు అలెగ్జాండ్రా డఫ్ . అని పెద్దలు పేరిడిరి.
డిసంబరు నెల మన యెడ్వర్డు కుటుంబమునకు నేదో ఒక కీడు వాటిల్లునట్టి చిహ్నములు కాన్నించెను. 1891 సం. న డిసం బరు నెల వృథాగా ఊరక పోవునే. ఎడ్వర్డు చిన్న కొడుకు జార్జి కొమారుఁడు రోగ పీడితుడయ్యె. ఈ సమాచారము లివిడియాకు వెళ్లిన ఎడ్వర్ణ లెగ్జాండ్రాలకుఁ జేరెను. వారు ఎకాయెకిని లండనుపురికిఁ జనుదెంచిరి. ఇంతలో నాతని దేహ ము కుదుటఁబడెను.
.ఎడ్వర్ది [పెద్ద కొడుకు మృతుడగుట
జార్జ్ యన్న క్లౌరెన్సు ప్రభువు : "టెక్కు" యొక్క రాజు కొమార్తను వరించె నని పత్రి కలు వెల్లడి చేసెను. వారిద్ద జకు వివాహ ప్రయత్నములు నడుచు చుండెను. క్లారెన్సు ప్ర భువు చిఱుత యైనను, బుద్ధిలో సందఱకన్న మిన్న యని నన్ను తిగని యుండెను. అతఁడు అడకువయును, పెద్దల యెడభ క్తి యును, చిన్న లయందు ననురాగంబును, బీదలయెడఁ గరుణ యును, కార్యములు చేయుటలో బట్టుడలయును, నీ మొద లగు సద్గుణవుం జంబులకు నిర వై అందరకు నల్లారుముద్దుగ నొప్పారు చుండెను. ఎట్టిఁ దైనను మృత్యు దేవలకు ముద్దా ?
1892 సం. న జనవరి నెల ఎడ్వర్డలెగ్జాండ్రాల గారాబు పట్టి యైన క్లారెన్సు ప్రభువు రోగ పీడితుఁ డయ్యె, తల్లిదండ్రులు అతని సమీపంబుననే ఉండి, రాచ కార్యముల నన్నింటిని గమనింపక తమబిడ్డ సేమమే కోరుచు వైద్యులవలన దీవ్యౌ షధముల నిప్పించు చుండిరి. ఆయువు పరిమితి ముగియు కాలము సమీపించి నపుడు, మందులు పనిచేయునే? అతనికి రోగము ముదిరెను. వైద్యులు ఆపసి కూన బ్రతుకఁ డని నిశ్చ యించుకొనిరి. అట్లే ఆతఁ డా నెల 14 వ తేదీని పరలోకగతుఁ డయ్యెను. అతని దేహము సమస్త రాజు చిహ్నములతో సమాధి చేయఁబడెను.
ఎడ్వర్డ లెగ్జాండ్రాల పుత్ర శోకము నార్ప నెవరితరము? దాని యురవడి. "మొదట మొదట దీర్ఘముగను, వాడిగాను, ఉండును. క్రమముగ దాని వాడి మొన, నేలలోని పల్లము క్రమ ముగఁ బూడిపోవు రీతిని మొద్దగు చుండును. ఇంతలో నామరణ వార్త సమస్తరాజ్యములకును వాయు వేగ మనో వేగములు జేరెను. ఆయాచోటుల నుకు గొప్ప వారు. విక్టోరియాకును, ఎక్వర్ణ లెగ్జాండ్రా లకును, ఉపచార వార్తలను బంపిరి. ఎడ్వర్డలె గ్జాండ్రాలు తమ రాజ్యము లయందలి జనులు తమకు పంపిన యూరట పలుకులవలనఁ దమ యుమ్మలికంబు నుపశమనము సేసికొని ఊఱడిల్లిరి..
కాంటెర్బెరి ఆర్చిబిషప్, ఎడ్వర్ణునకు నూఱట వార్త పంపెను. ఆమహా రాజకుమారుఁడు ఆమత గురువునకు నీరీతిని బదులు జాబు వ్రాసెను.
“చావు అందఱుకు వచ్చుట సహజము. మా చిన్న వాఁడు మాకొకరికే గాక, లండసుపురిలో సందరకును మంచివాడై పేరు పొందెను. అట్టివానికి మృత్యువు వచ్చుట ఆశ్చర్యముగ నున్నది. చిన్న వారుండి పెద్దలు పోవుట సహజము, నిపరీతము కాదు. ఆయినను దైవ కార్యము నాఁప నెవరితరము ? ఆనిచావు వలన మాకుఁ గలిగిన దఃఖము మమ్ముల విడిచి యెన్నటీకిని బోజా లదు. ఆది మమ్ముల సెప్పుడు పీడించు చుండును. వానికి నిప్పుడె ఇరువ డేండ్లు నిండినది. ఈ నెలలో నొకా నొక దినంబున మేము ఆచిన్న వానికి బెండ్లి సేయవలయు నని తలంచి యుంటిమి. ఆయ్యో మాకోరిక లన్నియు నిష్ఫలము లయ్యెను. ఎంత విపరీత కాలము ! ఎంతదుర దృష్టులము వానిని బెండ్లి యాడఁ గోరిన చిన్నది. వానికి బెండ్లము కాకముందే వైధవ్యమును జెందె. పసికూనే. ఎంత దుఃఖము !
భగవంతుని మాయఁ గన్న వారెవ్వరు? అన్ని కార్యములు భగవదధీన ములు, దుఃఖించి ప్రయోజవ మేమి? మా ముద్దు బిడ్డఁడు చచ్చి స్వర్గలోక మున సమస్త సౌఖ్యముల అనుభవించు చున్నాఁడు. అతడిహలోకమున నుండి దుఃఖములకుఁ బొల్పడుటకంటె, పరలోకముననుండి సుభములు గనుట మేలు కాదే! మిగిలిన వారిని జూచి దుఃఖమును కొంత శాంతిపఱుచుకొని ఉన్నారము.
ఎడ్వర్డ లెగ్జాండ్రులు దుఃఖముపశమించు వఱకు నేవ్యవ హారములు సేయక ఇంటిపట్టుననే ఉండి కాలము:ను గడపు చుండిరి. రాజ కార్యములలో నెంతమాత్రము ప్రవేశింపక ఉండెను. నివసించుటకు ఇండ్లను ఏర్పాటు సేయుటకు నొక కమిషను ఏర్పడెను.
“కమిషన్ " అనఁగా సభ. ఇందు నలుగు రైదుగురుందురు, అయిదు మందికి వాటిలో "నొకఁడు అధ్యక్షుడుగ నుండును. వానికి "ప్రసి డెంటు" అని పేరు. “ప్రసిడెంటు" అను నింగ్లీషు పదమునకు "అధ్యక్షుడు" "ఆధికారి" యజమానుఁడు" "నేత" “ అధిపతి " మున్నగునవి సమూస పదములు,
ఆ సభకు నెడ్వర్డు సభాధ్యక్షుడు. అతఁడు బీదలకు మేలు సేయవలయు ననువార్తను విన్న వెటనే ఆయనచిత్తం బు నాక్రమించుకొనిన శోకము పరారి చిత్తగించెను. దైర్యలక్ష్మి ఆయన యందుఁ జొరబడెను.అతడా బీదలకై మిక్కిలి ప్రీతితో బాటు పడెను. అయినను రాజమంత్రులు ఎడ్వర్డు బీదల యెడ నధి కు ప్రీతినిఁగన బరచుట నొల్లక ఉండిరి. అతఁడు వారిమాటబెడ చెవినిడి తన యిష్టాను సారముగ న్యాయధర్మముల మేర సతిక్ర మింపక బీదలకు సౌఖ్య మొదవఁ జేయుటలో సక్కఱతో గష్ట పడి పనిచేసెను. ఆతడు కూలీల సంఘమునకును, వారు చదు వు బడికిని ఏటేట ద్రవ్య సాహాయ్యము సేయుచుండినాఁడు. అతఁడు తాను ఇంపీరియల్ ఇన్ స్టిట్యూట్" అను విద్యా లయమును స్థాపించి, తనతల్లి సాయంబున దానిని బెంచి,వృద్ధికి దీసికొని వచ్చెను.
ప్రిన్సు జార్జి పెండ్లి
ఎడ్వర్లు పెద్దకొమారుఁడు "పెండ్లీ గాక స్వర్గస్థుఁ డయ్యే: రెండవ కుమారుఁ డాతని వెనుక రాజ్యమునకు రాఁదగినవాడు. ఎడ్వర్డు జార్జికిఁ బెండ్లి సేయఁగోరెను. జార్జి చెక్కు రాజ్యపు రాజపుత్రిక యగు మేరిని వరియింప నెంచెను. ఎడ్వర్డీరహ స్యంబు గ్రహించి వారి రువురకును వివాహము సేయవలయు నని పత్రి కలలో బ్రచురము సేయించెను. అతఁడు తల్లి యగు విక్టోయాతో నాలోచించి 1894 సం. న జూలై నెల 6న తారీ ఖున పెండ్లిమూరుతం బిడెను. వివాహము "సెయింట్ జేమ్సు చేపలున నడిచెను. ఆసమయంబున రుష్యాచక్రవర్తియును, డెన్మా ర్కు రాజును, రాణీయును, ఇంకను పెక్కుమంది. శ్రీమంతు లును, సొమంత ప్రభువులును వచ్చి వధూవరులకుఁ గానుకుల నొసంగిరి. జను లావిహమువలనఁ దమకు దొడ్డ మేలు కలుగు సని కోరిరి.. ఎడ్వర్డు తనకుమారురత్నమునకు విసోహము సేసి, ఆయనను రాచపనులలోఁ బ్రవేశంపఁ జేయఁ బ్రయత్నిం చుండెను.
1894 సం . న ఏప్రిలు నెలలో స్వర్గస్టురాలైన ప్రిన్సస్ అలీ సు యొక్క కుమారునకు ఎడ్వర్థుతండ్రి వంశస్థులలోఁ జేరిన “విక్టో యామెలిటా " అను రాకొమార్తను ఇచ్చి కోబర్గున నడుచు వివాహమునకు ఎడ్వర్లు వెళ్లెను. అవివాహమ సూత్సవ తరుణం బున విక్టోరియా మహారాణి, జర్మనీ చక్రవర్తి మున్నగు గొప్ప ప్రభువులు వచ్చియుండిరి. వధూవరుల నాశీర్వ దించి తమతమ రాష్ట్రములకు నేగిరి. ఎడ్వర్ణావల భార్యాసహితుడై. ఆగస్టు నెలలో రుష్యా రాజధాని యగు సెంటుపీటర్సు బర్గులో రుష్యా దేశ చక్రవర్తికిని, గ్రాండ్ డచెస్ క్రీశ్చియానాకును, జరిగిన పెండ్లి వేడుకులను గాంచుటకు వెళ్లి తన దేశమునకు మరల విచ్చే'సెను.
రుష్యా చక్రవర్తి వివాహ సమయంబున నారోగ్యదశ నుండ లేదు. ఎడ్య ర్జీలు సేరినతోడ్తో నాతఁడు మిగులరోగ పీడితుఁడయ్యె. ఈయశుభ వార్త ఎడ్వర్ణ లెగ్జాండ్రలకుఁ జేరెను. వారు అక్టోబరు నెలలో బయనమై ఆస్ట్రియాకుఁ జేరునప్పటికీ నారుష్యాజారు స్వర్గస్థుఁ డయ్యె ననువార్త వారి చెవిని బడెను. వా రంతట సెంటుపీటర్సు బర్గునకు వెల్లి .. రుష్యా దేశ చక్ర వర్తిపరలోక క్రియలు సమస్త రాజచిహ్న ములతో జరుగు చుం డెను. ఇంగ్లండునుంచీ జార్జిరాకుమారుఁడు 'సెంటుపీటర్పు బర్గు న నుండిన తల్లిదండ్రులఁ జేరెను. అవల: గొన్నాళ్లలోనే రు ష్యా దేశ చక్రవర్తి చిన్న కుమారునకును, “హిస్సీ' అనుచిన్న రా జుకూఁతు రైన అలెగ్జాండ్రాకును వివాహము జరిగెను. ఆ పెం డ్డి ముగిసిన వెంటనే ఎడ్వర్ణలగ్జాండ్రాలు తనయుఁడు వెంటఁ జనుదేర నింగ్లండు జేరిరి. ఎడ్వర్డీ రీతి నాయారాజ్యములకుఁ . బలుమాఱు వచ్చుచుఁ బోవుచునుండుటచే నాయా రాష్ట్రముల కును, ఇంగ్లండునకును, గల మైత్రీ చెలంగ కలహము లేనై న నుండిన నవి రూపుమాయు చుండెను.
ఎడ్వర్డ లెగ్జాండ్రులు వేల్సు రాజ్యమునకు వెళ్లిరి. అచ్చట
నుండు వెల్షు జనులు ఆ రాజదంపతులను మిగుల గౌరవించిరి. అప్పుడు ఎడ్వర్డు వేల్సు రాజ్యము యొక్క రాజ కు మారు డను బిరుదు “వేల్సు" అను రాజ్యమువలన వచ్చిన దని తలంచి అందు సర్వకళా శాలను స్థాపించుటకు నుద్యమించి సఫలీకృతయత్నుడయ్యె, అచ్చట సర్వకళాశాల యొకటి స్థాపి పబడెను. "ఆబిరిస్ట్ విత్ ” (Abery stwith) అను పట్టణంబున అతఁడు దానికి అధ్యక్షుడై 1896 సం. జూను నెలలో ఆ హోదాను వహించి, గ్లాడ్ స్టను మున్నగు దొడ్డ వారి సమ క్షమునఁ దనయిల్లాలికి నొక బిరుదు నొసంగెను. డెనార్కు రా కొమారునకు ప్రిన్సెస్ మాదును ఇచ్చి అతఁడు జూలై నెలలో బకింగు హాముభవనంబునఁ బెండ్లి చేసెను. విక్టోరియా మహారాణి ప్రభృతు లాపరిణయమును జూచి సంతోషించిరి,
విక్టోరియా డైమెండు జూబిలి మహోత్సవము. విక్టోరియా మహారాణి ఇగ్లండు సింహాసనము నలంక రించి పెక్కేండ్లయిన దని మంత్రు లా దేవేరికి డై మెండు జూబిలి 'మహోత్సవము సేయవలయు నని నిశ్చయించుకొనిరి. ఎడ్వ డ్డు ప్రభృతు లీయాలోచన సమంజసంబై ఉన్నదని అంగీకరించి, 1897 సం.న విక్టోరియా జూబిలి మఘోత్సవమును అత్యద్భుతం బుగ కావించిరి . పెక్కు మంది పర దేశ రాజులు విచ్చేసి, రాణికి బహునుతులను సమర్పించిరి. ఎడ్వర్లు, మహెూత్సవమును
వీక్షింప నేతెంచిన ప్రభు ప్రకరంబుల ననేక భంగులఁ దృప్తి పఱచి, వారిని వారివారి రాజ్యంబులకు బంపెను.
ఇంగ్లండు దీవినుండు “స్పిట్టు హెడ్డు" అను రేవుపట్టణం బున నాంగ్లేయుల యుద్ధ నావలు సముద్రంబునఁ గూడెను. అవి చూపరుల కనులపండువై యొప్పారు చుండెను. ఎడ్వర్డు రాణికి మాఱుగ నాతావుకు వెళ్లి, ఆయోడల యందలి సైనిక నికాయంబులు గాంచి మహాసంతోషముంబు నొందెను. అన్య దేశ రాజులును తమ తమ యుద్ధ నావలను ఇంగ్లండునకును తమకును గల మైత్రిని వృద్ధిపుచు నిమిత్తము పంపిరి. ఆంగ్లే యుల యుద్ధనావలం గాంచి పరరాజుల గుండెలు బ్రద్దలగు చుండెను.
విక్టోరియా డైమెండు:జూబ్లిను మహోత్సవ సమయంబున నారాణి అనేకులకుఁ బెక్కు బిరుదుల నొసంగెను. అప్పుడా రాణి వేల్సుయువరాజునకు " గ్రేట్ మాస్టర్ అండ్ప్రింసిపల్ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ మోస్ట్ ఆనర బిల్ ఆర్డర్ ఆఫ్ ది బాత్ ” ” { (Great Master and Principal Knight Grand Cross of the Most Honourable order of the Bath) అను బిరుదు నలంకరింపఁ జేసెను, లండను పురంబుననుకు “రాయల్ కాలేజి ఆఫ్ ఫిజీషన్స్" (Royal College of Physicians) అధికారులు అవైద్యాలయసభలో నొక సభ్యునిగ నాయెడ్వర్డును గైకొనిరి. అతఁడు తనకీపదవి అబ్బినందులకు మిక్కిలి సంతసించి, ఆవైద్యా
లయమును మేలైన స్థితికిఁ దెచ్చుటకు సర్వకాలంబుల నుద్య మించు చుండెను.
1897 సం. అక్టోబరు నెల 27 వ తేదీని ప్రిన్సుజార్జి అత్త గారును, టెక్కు రాజ్యము నేలిక సానియును, అయిన ముసలియి ల్లాలు కాలధర్మము నొందెను. దానివలన నారాజకుటంబమును కంతయు దుఃఖ మావహిల్లెను. కాని అది దీర్ఘ కాల ముండక కడువడిగ సమసి పోయెను.
ఎడ్వర్డు మోకాలు బెణుకుట
1898సం. స ఎడ్వర్డు ఫ్రాన్సు రాజ్యమున మధ్యధరా సముద్రతీరంబున నుండు కాన్సు (Cannes) అను పురంబునకు వెళ్లెను. అతడా నెల 10వ తారీఖున ఒక భననంబు నిర్మించుటకు న స్తిభారమును వేసి వారిచ్చిన నాతిథ్యంబు వడసి తన రాజ్యము నకు నేతెంచునపుడు బాటలో నుండు పారిసువీటఁ గొంత కాలము విశ్రమించి, అచ్చట ప్రజాపరిపాలనాధికారిని (President of the French Republic) దర్శించి తన వీటికిఁ బుత్తెంచెను.
ఫ్రాన్సు రాజ్యమునకు రాజధాని యైన పారిసునగరంబున నొక ప్రదర్శనము 1900సం. న జరుగునటుల నిశ్చయింపఁబడెను, ఇంగ్లండులోని వస్తుశాలా ప్రదర్శనమునఁ జక్కఁగఁ గనఁబఱప పలయు నని రాణిమంత్రు లాలోచించి “రాయల్ కమిషన్" అను ఒక సభను ఏర్పాటు చేసి దానికి ఎడ్వర్డును ఒడయనిగ నియమించిరి. ఎడ్వర్లు తన ధర్మమును న్యాయముగ నొనర్చి మంచి పేరు వడసెను.
మే నెలలో గ్లాడ్ స్టనను దొడ్డమంత్రి పరలోకగతుఁ డయ్యె. రాణికిఁ గుడిభుజ మని చెప్పఁ దగునాతఁడు పోవుట ఆంగ్లేయుల రాజ్యమునకు గొప్ప నష్టమని వేఱుగఁ జెప్ప నక్క ఱలేదు. ఎడ్వర్డును ఆయన చావునకు మిగులఁ గుంది, అతని పెండ్లమును ఊఱడించెను.
జూలై నెల 18వ తేదీని ఎడ్వర్లు "వాడ్ న్ డెస్" అను చోట నుండు “ బారన్ ఫర్డినాండ్ డిరోత్ స్ చైల్డ్ " (Baron Ferdinand de Roths child) అను నాతనిఁ జూడ వెళ్లి మిద్దె క్రిందికి దిగునప్పుడు కాలు జారి పడెను. మోకాలిచిప్ప ఊడెను. నుండి అందుచే బైటికి రాక ఉండెను. అతడా నొప్పిని సహించు కొని నాటి మధ్యాహ్నంబున మారల్బరో భవనంబునకు నేతెం చెను, గాయము వలని బాధ రాను రాను వృద్ధియాయెను.అనేకు లెడ్వర్డు కుంటివాడగు నని భీతిల్లిరి. మఱికొండఱు కోయ్య నూతగాఁ గైకొని దాని సాయంబున నడుచునేమో కాని, ఇక నడువడని గొణుగు చుండిరి. దైవాజ్ఞ ఎటు లున్నదో ఎవ రెఱుంగుదురు.
లండను నగరంబున నుండు గొప్పగొప్ప శస్త్రవైద్యు లెల్లరును వచ్చిరి. వారి వలన నాగాయము కుదురునటులఁ గనఁ బడ లేదు. టెక్కు దొరసానికి ప్రాణమును పోనీక చాల కాలము వఱకు నాపిన సర్ థామస్ స్మిత్తు (Sir Thomas Smith) అను నతనిని రాణి మంత్రులు పిలిపించిరి. అతఁడు వచ్చి ఎడ్వర్డు
మోకాలు పరీక్షించి శ్రీఘ్రముననే కుదిర్చెద నని చెప్పెను. రాణి ప్రభృతులకుఁ గొంత ధైర్యము వచ్చెను.
ఇంతలో 21వ తేదీని లార్డులిస్టరను నాతఁడు. ఎడ్వర్డు గాయమును పరిశీలించెను. ఎడ్వర్డు అతనితోఁ దనకు గాలు బెణి కిన విధము సంతయును బూసగ్రుచ్చిసరీతిని చేప్పెను. వైద్యు లందఱును చేరి, సముద్రయానము చేసి, ఆస్బోరున నుండిన రోగము శీఘ్రముగఁ గుదురు సని తీర్పు చేసిరి. ఎడ్వర్డు వారి యిష్టము చొప్పున నాస్బోరులో నుంచుటకు సమ్మతించెను. విక్టోరియా కూడ నాచోటనే ఉండెను. ఆమె తనకుమారుని రోగము కుదుటఁ బడువఱకు నతనియొద్ద నుండుటకు మిక్కిలి సంతోషించెను. ఎడ్వర్డు తనతల్లి కడ కేగుటకు ముందు, మేడ మెట్ల పైఁ బడినపుడు తన చెంగట నుండి శస్త్రము సేసి మందు మాకు లిచ్చిన డాక్టర్ షా అను వైద్యునకుఁ బచ్చలు తాపిన బుగారు పతకంబును బహుమతి నిచ్చెను. ఆనైద్యుడు దానిని గైకొని రాకోమారు నెడఁ గృతజ్ఞత కలవాఁడై ప్రముదితహృద యుండయ్యె. జూలై నెల 30 వ తేదిన నే అలెగ్జాండ్రను, 'ప్రిన్సస్ విక్టోరియాను, గ్రీసుదేశపు రాజును, ఎడ్వర్డు వెంట నా స్బోరుసకు వెళ్లిరి. . ఎడ్వర్డు రోగము అభిముఖమునకు వచ్చు చుండెను. అందరును కొంత ధైర్యము వహింప సాగిరి. ఎడ్వర్డు ప్రభృతులు నావపై సముద్రయానము సేయఁ గడంగిరి. వారాయా రేవులలో నిలుచుచు, భూమి మీఁదఁ గొన్ని గడియల కాలము బండ్లపై సికారి సేయుచుఁ దిరిగి ఓడ నెక్కి కడలి పై దారి సాగఁ జేయు చుఁ బరిపరివిధముల నెడ్వర్డు మనస్సున కెక్కురీతిని తిన్నగఁ బయ నము సేయుచుండిరి. ఫ్రీప్పనునాతఁడు ఎడ్వర్డు సమీపంబున నుండి ఆరుచుండు గాయమునకు మందులు వేయుచుండెను. ఎడ్వర్డీ రీతిని గాయమునలన బాధపడు చుండినను, కేపు టౌనున నుండు జనులు ఓకుమ్రాని స్తంభ మొకటి కావలయు నని కోరి యుండిరి. ఎడ్వర్డు వారి కోరిక చెల్లించుటకుఁ దాను వ్యా ధిగ్రస్థుఁ డయ్యును, ఎంతమాత్రమును ప్రొలుమాలక దానిని సంపాదించి, వారికి పంపి, వాఱికృతజ్ఞతకుఁ బాత్రుఁ డయ్యె'. ఎడ్వర్డోరులకు నుపకారము సేయుటలో స్వసౌఖ్య లాభ ముల సంతగ బాటింపడు. కేపు టౌనున నుండు జను లాతని యెడఁ దనుకుఁ గల రాజభ క్తి విశ్వాసముల ననేక భంగులఁ దెలి యఁ బడిచిరి.
ఎడ్వర్డు గాయము కుదిరెను. అందఱనుకొన్న విధంబున నాతఁడు కుంటివాఁడు కాడయ్యె. జనులందరును తమరేని ప్రబల మైన వ్యాధి కుదిరి నెమ్మదిగ నుండుటకు సంతోషించిరి. ఎడ్వర్లు స్కాట్లండనకుఁ జనుదెంచి, ఆచోట నుండి లండను పురికి నే తెం చెను. అచ్చట "టీగ్ ఆఫ్ మర్సి” (League of Mercy) నాతఁడు ప్రసగించి, ఆనగరంబున సమరిన వైద్యశాలకు ద్రన్య మియ్య వలయు నని నొక్కి వక్కాణించెను. 1899 సం. స. జర్మని దేశము యొక్క రాజును, రాణీయును, లండను పురికి నేతెంచి. ప్రజలు వారి రాకను గురించి పరి పరి విధంబుల డెందంబులలోఁ దలపోసికొనిరి. అప్పుడాఫ్రి కాలో బోయరులకును, ఆంగ్లేయులకును గొప్ప యుద్ధము నడు చు ఉండెను. అందుఁ దొలుదొల్త నాగ్లేయులు పరాభవ మొందు చుండిరి. జర్మనిచక్రవర్తి ఆయుద్ధ విషయమై ఇంగ్లండు ప్రభుత్వము వారితో మాటలాడి పోవుటకు వచ్చె నని కొందఱు తలంచిరి. కాని అతఁ డా సంగతీలోఁ దా నెంతమాత్రమును ప్రవేశింపక తన యవ్వ విక్టోరియా మహారాణిని గాంచి తనరా జ్యమునకు వెళ్లెను.
ఆసోమదేయుఁ డొకఁడు ఎడ్వర్డును దుపాకితోఁ గాల్ప నుద్యమించి విఫల ప్రయుత్నుఁ డగుట.
1900 సం. ఏప్రిలు నెలలో నెడ్వర్డ లెగ్జాండ్రులు డెన్మా ర్కు రాజధాని యగుకోపను హేగనుకు వెళ్లి వలయునని లండను వదలి రైలు మార్గమునఁ బయసము సేయు చుండిరి. వారు బ్రసల్సు పురంబున “నార్డు" అను రైలు స్టేషనులో బండి నెక్కిరి. అప్పుడు “ స్వీడో» అను వాడు కేల దుపాకీ గొని ఎక్కు పెట్టి ఎడ్వర్డు పయిని కాల్చెను. "కొని భగవత్కృపాకటాక్ష మహిమచే నాదెబ్బ నెడ్వర్డు తప్పించు కొని ప్రాణమును కాపాడు కొనెను. అతఁడు ధీర సత్వుడై.. దన తల్లికి నా సమాచారమును బంపి, ప్రయాణమును సాగించెను. " స్వీడో " అను వానిని రాణా దారులు పట్టుకోని ఖైది చేసిరి. వాడు బోయరు యుద్ధమున న నేకులు అన్యాయముగ ప్రాణములనుగోల్పోవు చున్నారు. ఇది న్యాయ యుద్ధము కాదు. ఎడ్వర్డిట్టి యుద్ధము సలుపుటకు సమ్మతిం చెను, ఈ రాజు రణమునకు సమ్మతింపకున్న యుద్ధ మే పొసఁగి యుండదు. ఇప్పు డాయుద్ధమున సెందఱు మడియు చున్నారు. వారి ప్రాణము ఇతనివంటి ప్రాణము కాదా? విక్టోరియూ ఆతనిని గన్న రీతిని వారి తల్లులువారిని గన లేదా ? ఇతనివలె వారు మనుష్యులు 'కారా ?వారి నెత్తురు ఇంగ్లండున కై సమర్పింపఁ గోరిన యీ యెడ్వర్డు తన నెత్తు రీదేశమున కై ఇచ్చుటకు నియ్య కొన్నాడా ? నేనొకఁడును, మీరు పదుగురు. పదుగు రన్యాయము చెప్పి నను.న్యాయమే అగును. ఒక డు న్యాయము చెప్పినను అన్యాయ మగును.' అని మందలించెను, అయిరోపాఖండములో వార్తాపత్తికలు ఈ యుద్ధవిషయ మై పెక్కు వ్రాతలు వ్రాసియుండినవి. ఈ స్వీడో వానిని జూచి కలతఁ బారిన హృదయము కలవాఁడై రాజద్రోహులతోఁ జెలిమి సేసి ఎడ్వర్డు ప్రాణము గొననుద్యమించి విఫలప్రయత్నుఁ డయ్యె.
ఎడ్వర్ణ లెగ్జాండ్రులు దైవాధీనమున మృత్యువువాత నుండి బైటికి ప్రాణముతో వచ్చి నందునఁ బునర్జీవితు లైరని ఇంగ్లండులోని ప్రజలును, అయిరోపా లోని పర రాజనికరంబులును, తమ యానందంబును పెక్కు తెరగులఁ దెల్పి. ఎడ్వర్డ లె
గ్జాండ్రులు డెనార్కునుండి ఏప్రెలు నేల 20 తేదిని ఇంగ్లండు నకు జనుదెంచిరి. ఎడ్వర్డు, తనయెడల జనులకుఁ గల రాజు భక్తిని దెలుపుచు వ్రాసినందుల కై , అతఁడును వారియుందు గల కూర్మిని నెఱుక పఱచు సమాచారంబులం బంపి వారిని సంతోష పఱచెను.
తొమ్మిదవ అధ్యాయము.
ఎడ్వర్డు రాజ్యమునకు వచ్చి పట్టాభిషిక్తుఁ డగుట.
విక్టోరియా మహారాణి ముసలితనంబున మేనువడంక రాజ్యమును లెస్సగం బాలించు చుండెను. ముసలీ పండు. చెట్టునుండి ఊడిపడ సిద్ధముగ నుండెను. ఇంతలో మృత్యు దేవత అను ఫలాభిలాషి. తన గడ ఆనురోగముతో నాపండునుగోయఁ బూనెను, ఆగడ ఆఫలమును తాకితాకక ముందే నేలమీఁదం బడున ట్లుండె. విక్టోరియా మహా రాణి వ్యాధిచే బీడింపబడు చుండినను, మరణావస్థను సహించుకొని 1901 స. జనవరి నెల "తే 22 వ దిని స్వర్గస్థురాలయ్యె. అప్పు డాదేవేరి పుత్రు లును, పుత్తికలును, పుత్రులును, ప్రహేతులును, ఆమె సమీ పంబుస నుండిరి. ఎడ్వర్డు తల్లిచావున కై దుఃఖించు చుండెను. మంత్రు 'లేతెంచి ఆయన శోకము శాంతింపఁ జేసి రాజ్యభారమును వహింప బ్రోత్సాహపరచిరి