సప్తమైడ్వర్డు చరిత్రము/ఏడవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

ఏడవ అధ్యాయము.


ఎడ్వర్డు హిందూదేశమునఁ గ్రుమ్మరుట.

ఆల్బర్టుప్రభువు జీవించి యుండినపుడు, కానింగుప్రభువు ఎడ్వర్డు హిందూదేశమును జూచుటకు నేగుటచే హిందూదేశస్థులకును, తమకును, గలమైత్రి పెరుఁగు నని ఒకానొకప్పు డాదొరతో మందలించెను. రాణి ఈ పలుకును విని మఱువక సమయము వచ్చినపుడు మంత్రులతో నీ విషయమై ఆలోచింపవలయునని తలంచెను. 1875-వ సంవత్సరమున నామె యొకనాఁడు మంత్రులతో నీ సంగతినిగుఱించి ఆలోచించెను. ప్రధానులును రాణీమాట లెస్స అని ఆమోదించిరి. అప్పుడు సాల్సిబరి ప్రభువు హిందూ దేశమునకుఁ గార్యదర్శిగ నుండెను. అతడు 1875-న సంవత్సరము అక్టోబరు నెల 11-వ తేదీన ఎడ్వర్డు హిందూదేశమును గనుటకు నేఁగును. అని ప్రత్రికలలోఁ బ్రకటింపచేసెను.

పార్లమెంటు సభాసభ్యులలో ననేకులు ధనమధికముగ ఖర్చుగు నను భీతిచే నా పయనము మాను కొనుట బాగనిరి. కొందఱు హైడ్ పార్కులో సభచేసి ఎడ్వర్డు హిందూదేశమునకుఁ బోఁగూడదని వాదించిరి, మఱికోందరు "ఎడ్వర్డు రాణిప్రతి నిధిగ బోదలచి యున్నాడా? ఆయన యువరాజ్యపదవిని నా దేశమును గన జనుదేవ - నెంచియున్నాడా ?" అని ప్రశ్నచేసిరి. ఏ పెదాలో నాతడు వెళ్లినేమి ? ఇంగ్లడు నే లిక దేశ బిడ్డడు హిందూ దేశమునకు వచ్చుటచేఁ గొంత పైకము ఖర్చగుటచే నింగ్లీషు వారికి వచ్చిన నష్టమేమో? ఎడ్వర్డు ఆంగ్లేయులకుఁ బ్రభువైన హింరూ దేశస్థులకును ప్రభువేను. అట్టిఁ వాడా దేశమునకు బోవుటకై - ధనమేల వ్యయము సేయగూడదు? అతడాదేశమునకు వెళ్లుటలో మేలు కలుగునని తలచి రాణియు మంత్రులు, నెందరు ఎన్ని యడ్డమాటలు పల్కినను వానినన్ని టిని నిరాకరించి, ఆయనను బసుప నిశ్చయించుకోనిరి . యాంగ్లేయుల యచార వ్యవహారములకును, హిందూదేశస్థుల యాచార వ్యవహారములకును, గొప్ప భేషము కలదు, హిందూ దేశములోని స్వదేశ రాజు లాతనికి ననేక విధములగు కానుకలను సమప్పింతురు. అతడు వారికి బదులు బహుమతులొసుగ వలసి యుండెనెను. అతడందువలకై 6,00,060 రూపొయలు విలువగల వస్తువులను భద్రపరుచుకొనెను.

ఎడ్వర్లు హిందూ దేశములో నడుగిడినది మొదలు తిరిగి ఇంగ్లండునకు నేఁగువరకును అప్పుడు హిందూ దేశమునకు రాణి ప్రతినిధియైన నార్తు బ్రూకు ప్రభువునింట నాతఁ డతిథియైయుండ పలయును నని తీర్పు చేసిరి. ఇందులకు గాను 4,50,000 రూ.సొమ్ము వ్యయము సేయవలసి యుండెను. పోవుటకును, వచ్చుట కును దారి ఖర్చులు 7, 80,000 రూ., రొక్కము "కావలసి యుండెను. అతని సొంత ఖర్చులకు 9,00,000 రూ. ధనము కావలసి యుండెను. పార్ల మంటు: సభా సభ్యులలోఁ గొందఱు మాత్ర మింత ద్రవ్యము ఖర్చు సేయ నొల్లక పోయినను, డిస్రిలి ప్రభువు మొదలుగా గలవారు ఇంత పైకము ఎడ్వర్డు ప్రయాణముసకుఁ బట్టు ఖర్చులకుగా నియ్యవలసిన దని నిష్కర్ష చేసిరి.


హిందూ దేశములో నింతకుఁ బూర్వమున నుండిన సర్బార్టన్ ప్రీరు (Sir Bartle Frere) అను నాతఁడును, సదర్లెండు భూస్వామియును, ఎడ్వర్డు నెచ్చెలు జైన ఆయిలేస్ ఫోర్డు ప్రభువును (Lord Aylesford) "కారిన్ గ్టన్ దొరయును,(Lord Carrington)కర్నల్ ఓవన్ విల్లేయమ్సు (ColonelOven Willia119) మున్నగు వారాయస వెంటఁ జనుదేర నియు మితులై ఉండిరి. కాని అలెగ్జాం డ్రామాత్రము ఇంటిపట్టున నుండునటులు నిశ్చయింపఁబడెను. వీరుగాక ఇంక ననేకు లాతని సాహాయ్యము సేయ నియమితులై యుండిరి. వారిలో నొకఁడు వైద్యుడును, వేరొకడు హిందూదేశమున నెవరి కెవరికి ఏయే బహుమతు లియ్యనలయునో వారి వారికి నాయాబహుమతు లిచ్చుటకును, వారి వలనం దిరిగి "కానుకలను బొందుటకును, ఒండొకడు ఎడ్వర్డు గుఱ్ఱములు దామానులు మున్నగు వానిని సురక్షితముగఁ గాపాడి అతనికి సందఁ జేయుటకును, నిర్నీతులై యండిరి... వీరు పనివాండ్రలలో జేరిన వారు. రాజు బంధువులు


కొంద ఎడ్వర్డు వెంటఁ జననలయు నని విక్టోరియాకోరి, వారిని బంప నిశ్చయించుకొనెను.

ఎడ్వర్డును ఆయన పరిజనులును, ముందు నిర్ణయించిన దినముననే ఇంగ్లండు వదలి హిందూ దేశమునకు దర్లిరి. ఆలె గ్జాండ్రా రాణి మాత్రము ప్రొన్సు దేశములో "కలె" వరకు నే తెంచి క్రమ్మఱ నింటికి వెళ్లెను. ఆవల నెడ్వర్డు ప్రభృతులు బ్రిండిజ మార్గముననే వెనుకు 'నేతెంచిరి. హేదూ దేశమున, నాయాచోటులందు నాతనితో విన్న వించుకొను వార్తలును, వానికి నాతఁ డీయ్యవలసిన ప్రత్యుత్తరములును, ఆయనకు నాతని ప్రైవేటు సెక్రీ టెరీలు వ్రాసి యిచ్చి నేర్పుచుండిరి.. అతను బొంబాయికిఁ జేరక ముందే బాబాయి మునిసిపాలిటి వారు విన్న మించుకొను వార్తలు ఆయన, చెవినిఁ బడి యుండెను.


హిందూ దేశ మునకు నెడ్వెర్డు రాబోవునని గొప్పగా పట్టణములందలి రాజులును, భాజప్రతినిధులును, మునిసిపాలిటీ వారును, ఇంకను అనేకులు అయన హోదాకు దగిన రీతిని బహుభంగుల గౌర వింప నుద్యమములు సేయు చుండిరి..పట్టణ ములలోను, పాళెముల యందును, చిన్న చిన్నగుడిసె లయం దును, అడవులలోను, నుండు సమస్త జనులును, ఎడ్వర్డు తమ దేశమునకు నేతెంచుట శుభోదయమునకుఁ గారణ మనితలంచి, ఆయనను వీక్షింప నేయేచోటుల నేయేసమముంబుల నాతడు వచ్చునని తెలిసియుండెనో ఆయాచోటులకు నాయాసమయం బుల జనులు వచ్చియుండిరి

హిందూ దేశము నేలు వైసురాయి నార్తు బ్రూకుకు ప్రభువు బొంబాయికి వెళ్లి :ఎడ్వర్ణునకు స్వాగతమిచ్చుటకు సిద్ధుడై యుండెను. బొంబాయి గవర్నరును, అతని పరి జన సమూహము లును, అయనను బరివేష్టించి ఎడ్వర్డు రాకకై ఎదురు సూచు చుండిరి.. బొంబాయి రాజ్యభాగములోని స్వదేశ రాజులు ఆ పురమునకు నేతెంచి ఎడ్వర్డును గాంచి ఆయనను తమదేశము లకుఁ బిలుచుకొని పోవుటకు సిద్ధులై యుండిరి. వేయేల? సర్వ జనులును బొంబాయి హార్బరుస ఎడ్వర్లును వీక్షింప గౌతూ హలులై కాచుకొని యుండిరి ...

ఎడ్వర్డు బొంబాయిని దిగుదినము ముందే తెలియఁ బరచి యుండెను. నాడు అతడు ఆచోట సడుగిడిన వెంటనే గొప్ప గొప్ప పట్టణములయందలి కోట బురుజులనుండి పిరంగి వేటు లాతని రాకను హిందూ దేశస్థులకు నేఱుక పరుప నేర్పాటు చేయబడియుండెను. నవంబరు నెలారంభమున నెడ్వెర్డు బొం బాయి హార్బరులో దిగెను.

ఎడ్వర్డు వచ్చిన యోడ బొంబాయి రేవు జేరెను. కోట బురుజులనుండి పిరంగులు "ఎడ్వర్డు వచ్చెను. ఎడ్వర్డు వచ్చెను. ” అని జనుల చెవులు తూట్లు పొడుచు చుండెనను రీతిని మ్రోగెను. నార్తు బ్రూకు ప్రభువు ఎడ్వర్డునకు నెదురేగి, ఆయనను బిలుచు కొని వచ్చి, ఆయనకై ఏర్పరిచిన యుంతాసనంబుస గూర్చుండ జేసెను. బొంబాయి మునిసిపాలిటి వారు బొంబా యిపు పుర వాసుల పక్షమున నెడ్వర్డునకు స్వాగత మిచ్చి పలు విధంబుల గౌరవము సేసి, తమపురికి రమ్మని ఆయనను వేడిరి. అతడు వారి ఇష్ట ప్రకారమా పురంబున గవర్నరు నింట నతిది యై ఉండెను.

ఎడ్వర్డుబొ బాంబాయి పురమును జేరిన మూడవదినమున నాతని పుట్టిస దినమహోత్సవము సతివైభనమున సడిచెను. ఉత్తర హిందూ స్థానంబునను, దక్షిణ హిందూస్థానమునను, ఆయ సపుట్టిన రోజున జనులు పండుగలు చేసికొని ప్రమోదభరితులై ఉండిరి. ఆతడా దినమున రాజులకుఁ దగిన-చిహ్నము లన్నింటిని ధరించి తన్నుఁ జూడనచ్చిన మా దొడ్డవారిని గౌరవించు చుండెను, ఆతఁ డప్పుడు రజతమయ మైన యున్నత సింహాసనంబు పై అధిష్టించి యుండెను. అన్ని వేడుకలును అతి వైభనముతో నడిచెను.

స్వదేశ సంస్థానాధిపతు లనేకులు బొంబాయి పురంబుసకు "నేతెంచి ఎడ్వర్డును దర్శించి, తమతమ రాజ్యంబులకు రమ్మని వేడిరి. వారిలో గొలాపుర సంస్థానాధిపతి మిక్కిలి పసివాడు అతఁ ఉప్పుడు పండ్రెండేండ్ల వయస్సు కలహాఁ డై యుండి, ఎడ్వర్డును జూడఁబోయినపుడు, వినయ గాంభీర్యంబులు సూపె ను. ఎడ్వర్డా చిన్న రేని గాంచి హర్షంబు నొందెను. ఎడ్వర్లు బొంబాయి పట్టణంబున నావలఁ గొన్ని దినములు - మాత్ర ముండెను. తన్ను ముందుగఁ జూడవచ్చిన రాజుల బసకు నాతడాదిసములలోఁ బోవుచుండెను. అప్పుడు అతను అయా రాజుల యాచార వ్యవహారములను అతి శీఘ్ర కాలములో గ్రహించెను. ఎడ్వర్డు ఆ రాజుల పూర్వీకులైన శూరులచరిత్రం బును, వారి పరాక్రమబులను, మిక్కిలి కొనియాడి వారిని సంతోష పరచెచెను. ఆ రోజులును ఎడ్వర్లు నడవడిక "మేలైననదని యును అందరకుఁ బ్రీతికర మైన దనియును తలంచి, ఆయనను మి గుల గారవించి. బొంబాయిలో నుండు నాంగ్లేయులు ఎడ్వర్డును దీసికొని వచ్చిన యోడలోని నావికులకు విందు చేసిరి. వారావిం దు గుడువ రమ్మని ఎడ్వర్డును వేఁడిరి. ఆతఁడును ఆచోటికి వెళ్లి సొమాన్యజనుని కైవడి వారితో పాటు భోజనము సేసి, వారిని దృప్తి పరచి తన బసకు వేంచేసెను. అప్పుడె ఎలిఫెంట్ స్టనుడాక్సు పూర్తియాయెను. ఎడ్వర్డు వాని దెరుచుటకు నియమితుఁడై ఉం డెను. హిందువులను, తురకలును, పారసీలును, ఆచోటికి వచ్చి యుండిరి, వారందఱును చేతులు కట్టి తమ మోదమును తెలుపు చుండ నాయింగ్లండు రాణీకుమారుఁడు డాక్సును తెంచి, తన బసకు వచ్చేసెను.

నవంబరు నెలనడుము నెడ్వర్డు పునహాపురికి జను దెంచి, బరోడాసంస్థానాధిపతి కొలువుకూటంబు విలోకించెను. ఎడ్వ ర్డు ఏనుఁగుపై నడనిలో వేఁటాడుటకు నిర్ణీతుడై యుండెను. ఏనుఁగు భాగుగ నలంకరింపబడెను. దాని మీద నంబారి నాలు గులక్షల పైకము వెలకలదై యుండె. ఎడ్వర్డు దానిమీద నెక్కి, అవి వినడుమ నుండు వ్యాఘ్రాది క్రూర సత్వంబులను జక్కాడెను. అతఁ దీంతకుముం దెచ్చటను ఇట్టి మృగంబులను జంపినవాడు కాడు. అతని దేశమున నీమృగములు లేవు. ఆది మిక్కిలి చలి చేశము, అందుస మృగంబులు వసింప జాలపు, ఆతఁడు "వేఁటాడుటచే సంతృప్తహృదయుండై తన విడిదికి నరు దెంచెను. ఎడ్వర్లు పుసహా పట్టణమును బాసి, బొంబాయికి నేతెంచి, అచ్చటనుండి పోర్చుగీసు వారి పురంబు లైన గోనా మొదలగు స్థల ములను జూచి, సింహళ ద్వీపంబునకు నేగి ఆచోటం దేయాకు పంటను పరిశీలించి, చెన్న పురికీఁ జను దెంచెను. ఆపురంబున బ్రజులు ఆయనను మిగుల గౌరవించిరి. అతఁను తనతండ్రి శ్రాద్ధ మును డిసంబరు నెలలో చెన్న పురి గవర్నరుండు గిండీ పార్కులో జేసి కొని, కలకత్తాకు వెళ్లను.

ఆతడు కలకత్తానగర రాజంబునఁ గ్రిస్ మస్ పండుగలు నడువుకొనెను, అతఁడాచోటఁ బెక్కు రాజ కార్యములు సేసెను. అనేక రాజులు ఆయనను జూడవచ్చిరి. అతడు వారిని దగిస రీతిని గౌరవింపవలసి యుండెను; వారి బసలకు నాతఁడు నెళ్ల వలసి యుండెను. అతఁడు దొరతనమునారి దివ్యమైన భవనంబునఁ గొలువు చేసెను. హిందువులును, తురకలును, వెండియు ననే కులును, ఆయన కొలువు తీరియుండుటను జూచి విస్మయ చిత్తు లైరి ఆతడు క్రైస్తవుల కోవెలలో భగవంతుని స్మరించి, గొప్ప వారికి విందు నొనర్చెను. అనేకులా భోజనస మయంబున నా తని చిరంజీవిగ నునుండ వలయనని ఆశ్వీరదించిరి.

1876 - వ సంవత్సరము జగవరి. నెల 1 వ తేది యుగాది పండుగ నాతడు కలకత్తాలో గడిపెను. ఈ సమయంబున నాతఁడు నిండు పేరోలగంబు నుండెను. స్వదేశీ సంస్థానాధిపతు లాచో టికి విచ్చేసరి. అతను నారందఱకు నైట్ కమాండర్ (Knights Granti Commander. వైట్స్ గ్రాండు కమాండర్ (knights Grand Cross) మొద లగుబిరుదముల నొసంగెను. వారా హోదలను గైకొని వివమిత గాత్రులై ఆయనకుఁ తమ తమ కృత తను బహు భంగుల వెలి: బుచ్చిరి. తమ దేశములకు నాయనను రమ్మని ప్రార్ధించి తమతమ రాజ్యములకు వెళ్లి రి,

ఎడ్వర్డు కలకత్తాను వదలి కాశీపురికి నేతెంచి, అచ్చట శ్రీవిశ్వేశు నాలయమును, గంగానది యౌవన గర్వంబును జూచి యానంద పరవశుడయ్యె. ఆచ్చోటును ఆతని నావలో రామనగరున నుండు ప్రాతకోట సొబగును గాంచెను. అచ్చట మహారాజా ప్రభృతు లాయనను మిక్కిలి గౌరవించి విందులు సేసిరి. అతను వారివలన రత్న ఖచితమైనదియును, బంగారు మయమైనదియును, అయిన చేతికర్రను బహుమానంబు నొందెను.

ఎడ్వర్డు అయోధ్య రాజ్యమునకు వెళ్లెను. దానికి లక్ష్మణ పురి రాజధాని, దానిచే ఇచ్చటి వారు లక్నో అని చెప్పు చున్నారు. అతఁ డచ్చోట సీపాయి కలహంబునఁ జనినవారి గ్నావ కార్దమై కట్టు మందిరంబునకు నస్తి భారమును 'వేసెను. అత డాసమయంబు స్వదేశి సిపాయీల పరాక్రమముల నుగ్గడించి నేవిధంబుల గొనియాడి పలికెను. ఆ పెద్ద కలహములో బాగు గ బోరిన మేలిబుటులను ఆయనజూచి, వారితో కొంత కాల ము సంభాషించి వారి ననునయించి పంపెను.

ఎడ్వర్డాచోటు విడిచి కాన్పూరుసకు నేఁగెను. సిపా యీల కలహము నీపురముననే తొలుదొల్త బుట్టెను. అనేకు లాంగ్లేయు లాచోట సమసిరి. వారు చచ్చిన చోటనే గోరి కట్టియున్నది. అతఁడు దానిని జూడ వెళ్లి నపుడు, కాలినడక బోయి మౌనముద్రాలంకృతు డై కొన్ని నిమిషములుండి, ఇంత మందీ నిరపరాధులైన ఆంగ్లేయ స్త్రీలును బిడ్డలును, ఈపాడు బావిలో మృతి చెందిరి కదా ? అయ్యో పాపము. నా భగ వంతుడు కాపాడును గాక! అని అన్న యెలుంగున జపించి, తన యిడువున కరుమంచెను.

ఎడ్వర్డు ఆ గ్రాపురికి నేతెంచెను. 'మొగలాలు పట్చక్ర వర్తులలో నైదవ చక్రవర్తి షాజహానుఁడు తన భార్యకై కట్టిన గోరి కలదు. దాని పేరు టాజిమహలు, అది అయిదువందలసంన త్సరములకుముందు నిర్మితమయ్యేను. నిన్ననో మొన్ననో కట్టిన యట్టుల ఉండును, ఎడ్వర్డా భవనంబుఁ జూచి, దాని యందంబు సకు డెందంబున నమందానంద బునొంది, అచ్చటనుండిన స్వల్ప .

కాలములో దాని సొబగును రెండు మూఁడుతడవలు చూచి, ఆ మహల్" ఏదేశంబునకు లేదని నిశ్చయించి తన విడిదికిఁ జనెను.


ఎడ్వర్డునకు వేటపై సధిక ప్రీతికలదు. అతఁడి ఫిబ్రసకి నెల 5.వ తేదిని జయపూరునకు నేఁగినవు డాతఁడు దాని కెలంకుల నుండు నడవులలో నొక పులిసి బీచమడంచెను. అతడీ తావు విడిచి నేపాలు రాజ్యమునకు వెళ్లి అచ్చట నుండు దట్టమైన నిపీ నంబులలో సర్ జంగ్ బహదూరు సాయంబున నై దాఱుపులుల నొక వేటునఁ గాల్చి చంపెను. అతఁడు హిమవత్పర్వత ప్రాంతం బుల నుండు నడవులను, పర్వత శిఖరంబుల యౌన్నత్యం బును, సదులసొంపును, మొదలగు చక్కని ప్రదేశంబులఁ జూచి మఱలెను.

ఎడ్వర్డు తన పరి జనులతో నర్మదానదీ తీరంబు పై వెలయు జబ్బలపురముఁ బ్రవేశించి ఆ పురజనులు సంప్రీతిమై నిచ్చిన యూతిథ్యంబులును గొని, అచ్చట కారాగృహంబున నవయువారు ను, పూర్వమున దారులలోఁ బ్రయాణము సేసిన బాటసారులను హతము నొనర్చి వారి యమూల్యాభరణంబులను గైకొన్న వారును, అయిన 'తగ్సు' ఆనునారిలో నేడ్గీరిని జూచి వారితో గొంతకాలము సంభాషించెను. అట్టి సమయంబున వారిలో నొకుడు తా నఱువదిమందిని తన చేతులారఁ జంపితి నని ఎడ్వర్డుతో మం దలించి బడాయి కోట్టెను. అట్టి వారు విచారణలో దొరతనము వారికి దోడుపడి సాక్ష్యము నిచ్చి నందు ప్రభుత్వము నారి మన్నన లను బడసి ప్రాణములను గోల్పోక చెఱసాలలో ననయు చుండిరి.

మార్చినెలలో నేడ్వర్డు, ఆయన పరివారముతో, బొం బాయి పురంబునకు నేతెంచి, ఆనెల 14 వ తేదీని స్వదేశగము నోన్ముఖుఁ డయ్యెను. అతఁడు హిందూ దేశమున నాల్గు నెలలుం డెను.:స్వల్ప కాలములో ననేకులతోఁ జెలిమి సేసి కొని, ఆ దేశస్థుల యాచార వ్యహారములను జక్కం గ్రహించి భూమి మీఁద 800 మైళ్లు నడిచి, సముద్రము పై 2500 మైళ్లు ప్రయాణము సేసి హిందూ దేశస్థులకును, ఆంగ్లేయులకును, గల మచ్చికను హెచ్చు చేసి తన వీటికి నేఁగెను. అతఁడు బొంబాయి లోనుండినపుడు: ఆయనతల్లి విక్టోరియ మహారాణీ హిందూ రాజ్య చక్రవక్తిని" అను హెూదాను. బొందఁబోవు ననునార్త అతనికి తెలిసెను. ఆతడింగ్లం:సునకు 'నేఁగు బాటలో నార్తు బూకు ప్రభువుకు నెనుక , హిందూదేశమును 'బాలించుటకు నిర్ణయింపఁబడిన లిట్టను ప్రభువు వేఱొక ఓడలో హీదూ దేశ మునకు వచ్చుచుండెను.

ఎడ్వర్లు హిందూ దేశములో నుండిన స్వల్ప కాలములో స్వదేశ సంస్థానపు ప్రభువులును, శ్రీమంతులైన వర్తక సమూ హంబులును, జనులును, ఆయనకు కానుకలను సమర్పించి యుం డిరి. అతఁడు వానిని బొంది. సంతోష చిత్తుడై ఇంగ్లండు చేరెను, స్వదేశీ సంస్థానపు రాజులు ఎవ్వర్ణునకు బహుమతులను ఇచ్చుటకై ఇంగ్లండులో 37,50,000 రూ. విలునగల వస్తువులు కొనినారట. ఎడ్వర్డు లండనుపురి చేరెను. రైలుస్టేషనులో నాయన తల్లియును, మఱియు ననేకు లాతని నెదుర్కొనుటకు వచ్చియుండిరి. అతఁడు జను లభినందించుచుండ లండనుపుర వీథుల నూరేగుచు, తన వియోగబాధచే శ్రమచెందు నలెగ్జాండ్రా మహాసాధ్వికి దర్శనం బొసంగి, తన యిల్లు చేరెను.

ఎడ్వర్డిల్లు చేరఁగానే రాజబంధువు లందఱును విచ్చేసి ఆయనను దర్శించిరి. అతఁడు భార్యాసమేతుడై కానాటు ప్రభువు, ఎడింబరో ప్రభువు, మున్నగువారు వెంట జనుదేర, వెస్టుమినిస్టరు గుడిలో భగవంతుని చరణారవిందంబుల దన హృదయ పీఠంబునఁ జేర్చి, ప్రముదితచిత్తుడై పొందుపట్లకు నేతెంచెను.