Jump to content

సప్తమైడ్వర్డు చరిత్రము/ఆఱవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

దొల్త ఫ్రెంచి రాజ్యమునకు వెళ్లి పాస్సునగరంబునఁ గొన్నిరోజు లుండిరి. ఫ్రెంచి దేశ పుటడవులలో నాదేశపు రాజును, ఎడ్వర్డును, ఇంకను పెక్కు మంది వెంటరా వన్యమృగంబుల "వేటాడ బోయిరి. ఏడ్వర్డొక వైపున మెకంబుల గురి వెట్టి కాల్చుచు.. నాయన పైకి నొకకూర మృగంబురికెను. కాని అతఁడు దానివలనఁ గీడెంత మాత్రమును బొందడయ్యె' లక్ష్మీకళత్రాంశసంభూతులైన మహావీరులకు నెప్పు డైన దొసగు పొసఁగు నె? ఆవల నారాజదంపతులు డెన్మార్కు రాజ్యముసకుఁజను దెంచిరి. అచ్చట నలెగ్జాండ్రా పుట్టిన దినమహో త్సనమును డెనార్కు, ప్రభువతి వైభనమున నడిపించెను. ఎడ్వర్డలెగ్జాండ్రా లారాజ్యమును వదలి జర్మ ని రాజ్యంబునకు నేఁగిరి. జ ర్మని దేశ యువరాజు ఎడ్వర్డు బావ. అతనితం డ్రి వీరల మిగుల గౌరమిం చెను. వారాచోటు వాసి, ఆస్ట్రియా రాష్ట్రము సకుఁ బోయి, ఆ దేశపు జక్రవర్తి సేసిన సపర్యలు వొంది, వా రొసంగు విందులు గుడిచి, తమదేశమునకు విచ్చేసిరి

ఆఱవ యధ్యాయము.

ఆన్యదేశాటనము.

అమెరికాలో గన్న డారాజ్యంబున నుండు ప్రజలు క్రిమి యాలో నడిచిన యుద్ధమునకు వలయు శూరులను తమరాజ్యము నుండి పంపి, ఇంగ్లీషు రాజు నెడఁ దముకుఁ గల రాజ భ క్తిని వెల్లడి పఱచి యుండిరి. అప్పుడు వారు ఆ దేవేరిని స్వయముగ వచ్చి తమ దేశమును జూచి వెళ్లవలయు నని వేఁడిరి. కాని ఆయన దూర ప్రయాణము తన దేహమునకు సెబ్బర సేయునని యెంచి వచ్చుటకు వీలు లేదని వారికి తెలియఁ జేసెను. వారంతట రాణి వచ్చుటకు వీలు లేకుండినను పోఁగాక రాణి కుమారులలో నొక్కని దమరాజ్యమును బాలింప బంపు మని ఫ్రార్దించిరి. అందుల కాయిల్లా లియ్య కొన నొల్లక, ప్రిన్సు ఆఫ్ వేల్సును బం పెద నని వారికిఁ జెప్పి వారిని సమాధాన పజిచెను.

రాణీ తనమాటను మరువక తన కుమారుడైన ఎడ్వర్డును కన్నడా రాజ్యమునకుఁ బంప నిశ్చయించు కొనెను. సంయుక్త రాష్ట్ర ము ప్రసిడెంటు రాణీకుమారుఁడు కన్నడా రాజ్యమునకు రాఁబోపు సని విని ఇంగ్ల డు దీవి రాణి తన యుందుతనరాజ్యమునకు వచ్చి తానిచ్చు నాతిథ్యంబు గొని పోవుటకురాణి సెలవు గోరెను. 'రాణి అందులకు సమ్మతించి కొడుకు ఆ రాజ్యమునకుఁ గూడ పోపలయు నని ఏర్పాటు చేసెను.

ఆల్బర్టు తన కొడుకు పసి వాడనియును, రాజ్యతంత్రం బులయందుఁ జక్కగ మెదిగిన వాడు కాఁ డనియును, కన్నడా రాజ్యమునందలి. ప్రజ లచ్చటఁ దనతనయుని ఆనేకే విషయం బులు ప్రశ్న వేయుదు రనియును, వానికి నాకోండిక వారి మనస్సు

తృప్తి పడురీతిని బదులు చెప్పు వలసి యుండు ననియును, వారడుగు సంగతుల స్వభావములఁ గొన్నింటి. నూహించి వాని బ్రత్యుత్తరములను వ్రాసి యిచ్చుటకును, వాని నాతనికి నేర్పు టకును, దగిన వారలాతని వెంట నేఁగుటకుఁ గొందఱు నియ మించెను.

ఎడ్వర్డును, అతని వెంటఁ బోవ నియమించిన రాజ్యతంత్ర నిపుణులును, సేనలును, ఇంక 'ననేకులును, ఆరాజ్యమునకు దరలిరి. ఓడ సముద్రము పై బిర బిర నడిచెను. వారలకు ననుకూలము గాలి వీచెను. ప్రయాణము నడుపుచుండి నపుడు ఎడ్వర్డు చిన్న వాడయ్యును, నావయాత్ర దీర్ఘ కాలము సేసిన చిరు కానందున. సముద్రమున నివసించెడి జలపక్షులను జూచు చు, సముద్ర తరంగంబుల ధ్వని విని యానందించుచు, ఇంతకుఁ బూర్వము సముద్రమునఁ బయనము సేసి యందుఁ బర్వతంబులఁ దాకి మునిగిన యోడలో నిజనంబుల దుర్మరణంబుల నాలకించి వారలయెడ దనకు గలిగిన పశ్చాంబు గనబరచుచుప్రయాణము సలిపెను. 1860 సం, న జూలై నెల 24 వ తేదిని ఎడ్వెర్డు ప్రభృతులు న్యూ ఫౌండ్లెండు దీవికి రాజధాని యైన సెంట్ జాన్" అను నగరమున నుదయమున నోడ దిగిరి. నాడాచోట వర్షము వర్షింక్షించు చుండెను. రాకుమారుడు రాఁగానే ఇంగ్లండుకు వచ్చినాడని యెం చి, సూర్యుఁడు మేఘములఁ బోఁ ద్రోచి తూర్పు మెట్ట మనోహరంబుగ వెలుంగసాగెను. సెంటు జాను లోని ప్రజలు గుంపులు గూడి ఎడ్వర్డును గనుటకు విచ్చేసి యుండిరి.. వా రాతనిఁ గాంచి, చేతులు కట్టి, అ నేక భంగుల నా తనిఁ జూచి నందునఁ దమకుఁ గలిగిన యానందంబును దెలియఁ బరచిరి.

ఎడ్వెర్డు కన్నడారాజ్యముఁ బ్రవేశించెను. అందలి జనులాతనిరాకకై చాతక పక్షి మేఘముల రాకకై వేచి యుండు విధంబున నిరీక్షించు చుండిరి. అతడారాష్ట్రమునఁ బయనము సేసిన చోటులం దతట నెచ్చటం గాంచినను, వేన వేల జనులు క్రిక్కి రిసి ఆయన ముఖ కమలమునుఁ జూడ బై పయింబడు చుండిరి. పట్టణంబులలో రాజమార్గంబులు పచ్చని తోరణంబు లచే లకరింప బడుట సహజము. ఒక యూరినుండి ఇంకొక యూరికి నాతఁడు వెళ్లిన దారులకు ఇరువంకలం బూల వృక్షులతా గృహంబులును, పచ్చని ఆకు తోరణంబులును, అమరి ఉండుట అబ్బురంబు గాదే? అవి దారి నడుచు బాటసారుల యుల్లంబుల రంజింపఁ జేయు చుండెను. అతడా దేశంబున గ్రుమ్మరు చుండి నప్పుడు రేలు పవళ్లై ద్వాదశా దిత్యులే వేళం బ్రకాశించు చురో అనుభంగిఁ గంపట్టె.

అమెరికా రాజ్యంబున నయగారాలను కొండశిఖరంబుల పై ప్రదేశంబులనుండి గంగ భూమి మీదికి మిక్కిలి లావుగాఁ బడు చుండును. అది చూడ నింపుగ నుండును. ఎడ్వర్డు దానిని జూడవలయు నని కోరెను. కన్నడ దొరతనమువారు ఆతఁ

డచ్చోటికి నెళ్లుటకు గుఱ్ఱముల నేర్పాటు సేసిరి. అతఁ డా గుఱ్ఱంబు లమీఁద నెక్కి యాతావుం జేరి, నయగారా యాకాశ గంగను జూచి విస్మయ ప్రమోదభరిత చేతస్కుం డై "ఇట్టిది ప్రపంచమున ఎక్కడనైన నుండు నే?” అని అచ్చెరు వొందు చుండెను. ఆమ సటి దినమున "బ్లోండిన్ " అను పైరుమా నొకఁడు నయగా రా నదికి నడ్డముగ గట్టి యుండిన మోకు పై నిర్భయముగ నెడ్వ ర్డు మ్రోల నడిచెను. ఎడ్వర్డ్లు వానిని గాంచి వాడు నీటఁ బడి మృతి సెందునేమో అని వెరగందు చుండెను. కాని వాడు దాని దాటి యెడ్వర్డును సమీపించెను. రాచబిడ్డ కు వానిని జూచి, “అబ్బీ ప్రాణముతో వచ్చితి వే? నీవు త్రాటి పై నడుచు చునపుడు నా మేనఁ బ్రాణములు నిలువవయ్యె, నీవెట్లుం టివో? నీ వొక వేళ నిటీలో బడి మునిగి నదీనాం సాగరోగతి?" అగుదువేమో అని శంకించితి. దేవుని కృపచే బ్రతికితివే? అం తియ చాలు.” అని వాని ధైర్యమును బ్రశంసించెను. వాడా రా కోమురుని గాంచి, అంజలిబద్దుడై “దేవ రా! ఇది యొక లక్ష్య మా? మీరు నాని వీపు నెక్కుడు, ఎంత శీఘ్ర కాలములో మిమ్ముల నావలివైపునకు మోసికొనిపోదునో కనుడు. నయగారా నది పైఁ ద్రాటిమీద నడుచుట ఎంత పాటి, మీదయ ఉండవ లెం గాక! ఇట్టియద్భుతము లైన పను లెన్న యో చేయఁగలను.” అని నుడివెను. ఎడ్వర్డు బ్లోండను పలుకులకు నలరి తన యిరవున కరుదెంచె.

అమెరికా సంయుక్త రాష్ట్ర జనులు ఇంగ్లండు రాజ్యమునకు నెడయఁ డగు ప్రభువు తమ దేశముఁ జూడ రాఁబోవు చున్నాఁడని యతని గౌరవింప ననేకభం గుల నుద్యమములు సేసిరి. కన్నడా రాజ్యము నంతయు నెడ్వెర్డు గ్రుమ్మరి యందలిజనుల యూచార వ్యవహారములను, వారసుఖదుఃఖములను, వారి వృతులను, వారి పూర్వుల చరిత్రములను, మొద లగువానిని గ్రహించి, ఈ రాజ్యమున హామిట్ట ననుపురంబున 1860 సం. న సెప్టెంబరు నెల 21 న తేది రాత్రి నివసించి, మరుసటియుదయాన లేచి దేవున 'కెరఁగి, అల్పాహామును భుజించి, సబంధుమిత్ర పరివారుండై సంయుక్త రాష్ట్రపు మాగాణు లలో జేరిన డెట్రా యి టనుపురి బ్రవేశించెను.

డెట్రాయిట్టు పురపౌరులు ఇంగ్లండు రాణిపుత్రు డేతెంచెనని వీదుల సలంక రించిరి. . పచ్చనితోరణంబులు గట్టి వీధుల తుద జడాలులు వ్రేలాడ వై చిరి. రేల నన్ని చోటుల దీపములు వెలిగించిరి. రేయిం బగలు ఒక తీరుగ గాంపించెను. ఎడ్వర్డు ఎక్కిన బండి 'వీదుల నేగు నపుడు దారికి నడ్డముగ బ్రజలు బలసి యాతని విలోకింప గుంపులు గూడి నిలిచియుడిరి. "మేడ లపై వెలందులు తమలో ఇంగ్లండు నేలికక ఇతడే " అని గుసగుసలు వో వుచుండిరి. నాడాపట్టణము మునుపటి జార్జి వాసిన్గ్టన్ పునర్జీవితుఁ డై వచ్చిసభంగి గంపట్టెను.

ఎడ్వర్లు డెట్రాయిట్టు ను వదలి చికాగోకు వెళ్లెను. అప్పు

డాపురమున రాజమార్గములు విశాలములై ఇప్పుడుండు రీతిని నారోగ్యములై ఉండినవి కావు. కాఁబట్టి ఎడ్వ ర్ణా నగరమున రాజమారంబులఁ జనిసప్పుడు మిగుల మెలఁకువతోఁ బోవలసి యుడెను. ఏబది వేలజనులు ఆయన వదన కమలమును గాంచి సంతోషించిరి. దారి ప్రయాణముచే నెడ్వర్డు కొంత యలసట జెందెను. అతని వెంటఁ జను దెంచిన న్యూ కాజల్ ప్రభువు ఎడ్వర్డు సేదదీర్చుకోనుట కై చికాగోనుండి " సెంటు లూయి" అను పట్టణమునకు వెళ్లు మార్గమున ఒక పల్లీయలో విశ్రమించి, దాని కెలంకుల నుండు నడవి మెకంబుల వేటాడ వలయు నవి కోరెను, ఎడ్వర్డు న్యూ కాజలు, ప్రభువు కోరిన రీతిని ఆ గ్రామం బునఁ గొంత కాలము విశ్రమించి దాని సమీపంబున నుండిన యరణ్య మధ్యంబున వేఁట కై చని, నాలుగుకు: కుంవేళ్లను, ఇరువ దేనిమిది పూరేడు పిట్టలను గాల్చి వేటలో సమర్థుండని పొగ డ గాంచెను.

అక్టోబరు నెల 30 వ తేదీని సంయుక్త రాష్ట్రమునకు రాజధాని యైన వాషింగటన్ ఆనుపురవరమును, నేడ్వర్డు ప్రవే శించెను. ఆ గ్లేయుల తరఫున నుండి. నలియా స్సను ప్రభువు ఎడ్వర్డు నకు స్వాగత మిచ్చి, సంయు క్త రాష్ట్రమున కథ్యక్షుడగు జేమ్సు బూచానునకుఁ (James Buchanan) బరిచియము సేసెను. జేమ్సు బూచానను మిగులజాగరూకుఁడై తన వైపు వా రిని ఆతృప్తిపక వారిని మెప్పించి, ఎడ్వర్డు రాక వారికి నా

మోద 'మొదవునటుల ,వర్తించెను. అతఁడు ఇంగ్లంరాకుమారుని అనేక రీతుల గౌరవించి, ఆయనగౌరనమునకుఁ బాత్రుఁడయ్యెను. చేమ్సుబూచాను ఎడ్వర్డునకు వాషింగ్టన్ సమా దిని జూ పెను. అచ్చట నెడ్వర్డు దాని యొద్దకుఁ బాదచారియైశిరస్సునఁ గుళ్లాయిని వేసికొనక వెళ్లి, దానికడ మాటాడక కొంత కాలము నిలిచెను. అతని వెంటవచ్చిన వారలును మౌన మును ధరించియుండిరి. పూర్వమున నా గ్లేయులకును, సంయురాష్ట్ర జనులకును గల మనస్పర్ధ నాటితో నంత మొందిన దని 'యోజించుచుండి నట్టల నెడ్వర్లు కాంపించెను.

ఎడ్వ ర్డాచోటు వాసి తనబసకు నే తెంచి విశ్రమించెను. మఱునాడు కొందఱు ఎడ్వర్డు సంయు క్త రాష్ట్రవు దక్షిణ మాగాణములలో బానిస వ్యాపారము నడిచిన తావులకు వచ్చి బానిసలను జూడవలయుననికోరిరి. బానిస వ్యాపారము ఇంగ్లండులో నాలనవిల్లియము ప్రభువు కాలమున నిలిచెను. ఎడ్వర్డు బానిస లను గాంచి వారి బాధలను గని సహించుసంత కఠిన చిత్తుఁడు కాఁడు. అతఁ డొరులు శ్రమపకులను గాంచి, వారి కష్టముల: దీర్పక పోయిన వాడుకాడు. ఎడ్వర్డు తనకు బంధము లేని రాజ్యములో నావ్యాపారము నిలుపుదల చేయుటకు నాతనికి నెంతమాత్రమును స్వాతంత్రము లేదు. అంతఁ బంధము లేని వారి నోదార్చి వారి శ్రమల నివారింపక ఆస్థలమునకు బోగూడదని నియమము సేసి కొన్న వాఁడు. అట్టి పురుష, శ్రేష్ఠుఁ

డీ బానిస గుంపులను జూడ బోవునా? అయినను న్యూ కాజల్ ప్రభువు, ఈవిషయమై దీర్ఘము నాలోచించి సంయుక్త రాష్ట్రపు దక్షిణమాగాణములను జూచి వచ్చుటకు రమ్మని ఎడ్వర్డును పిలి చెను. అతడు తన క్షేమము కోరిన: అతని ప్రార్థనకు విరోధముగఁ బోనొల్లక ఆమాగాణములఁ జూచి వచ్చుటకుఁ దర్లి బానిసలు లేని తావు లన్నింటిని జూచి వాషింగ్టనుకు వచ్చెను.

ఎడ్వర్డు వాషషింగ్టను నుండి ఫీలవాలియా అనుషట్టణముసకు నేతెంచెను. అచ్చట నుండు ఇండి పెండెన్సుహాలు నాతడు గాంచి, 'పుర్వము తన తాతకు లోబడిస జనులు స్వాతంత్య్ర మును పొందిన తావదే అని కొంతకాల మచ్చట సూరకుండి ..తసభావము నెరులకు దెలియనియ్యక యాతావు వాసి న్యూయార్కునకుఁ జనుదెంచెను. అచ్చట నాతఁడు సేరగానే, ఆ పుర వాసులు అతనిఁ గాంచి మిక్కిలి సంతోషపడిరి. ఫాదర్నికర్ బాకర్ (Father Knickerbocher) అనునాతండు ఎడ్వర్డునకు సగౌరవ స్వాగత మిచ్చి, ఆతని హోదాకుఁ దగిన విడిది సూపి, ఆయనకు విందొనర్చెను. ఆందు ననేకులు వచ్చిరి. పెక్కుమంది తావు లేనందుచే రాలేక పోయిరి.. అపురమున నెడ్వెర్డైదురోజులుండెను. ఆతఁడా తావును విడిచి ఆల్బని, బోస్టను, అనుపురం బుల జూచి, లాంగ్ ఫెలో, ఆలివర్ వెండల్ హోమ్సు, ఎమర్సను, ము న్నగు గొప్పకవీశ్వరులు గాంచి, వారితో గొంత కాలము విద్వత్స సంగములు సేసి, హార్వర్డుకళాశాలను బొడగాంచి, కడపట బంకర్సుకొండనుజేరెను.

ఎడ్వర్డు అమెరికా దేశమును విడిచి, నావలో బయసము "నేసి, ఇంగ్లడును: జేరి పెద్ద కాలము తన్ను నెడబాసిన వ్యధచే సనయు తల్లిదండ్రుల సంతోపరిచి సుఖంబున నుండె.

ఎడ్వర్డు తూర్పు రాజ్యములఁ జూచుటకు వేఁగుట,

1861 సం. న ఎడ్వర్థుతండ్రి పరలోకగతుఁ డయ్యె. ఆతడు తండ్రి చావున కై మిగుల దుఃఖంచి, రాచ కార్యములు

సేయక ఏవేళఁ దన నాయననే తలంచు చుండెను. మంత్రులు ఎడ్వర్డ న్య దేశములలోఁ ద్రిమ్మరు నేని శోకముపశమించునని ఆలోచించి అతనిని తూర్పు రాజ్యంబులకు ననుపుట మేలని విక్టోరి యాతో జెప్పిరి. ఆమెయును దానికి సంగీకరించెను. ఎడ్వర్డు నాకోరిక మేరకు నాదేశములఁ గని వచ్చుటకు నియ్యకొనెను.

1862 సం. ఫిబ్రవరి నెల 28 న తేది ఎడ్వర్డు పరిజనులనేకులు తన వెంటఁ జను దేరఁ దూర్పు రాష్ట్రములకు నేఁగఁబయన మయ్యె. జనరల్ బ్రూసు, (General Bruce) మేజర్ టీస్ వేల్' (General Teesitate) కాష్టన్ కెప్పల్ (Captain-Keppet) స్టాన్లీ (Dr.Stanley) ఎడ్వర్లు వెంట నంటినడిచి, ప్రయాణీకులు ఈజిప్టు రాజ్యమునకు ముఖ్య పట్టణ మైనకై రోకు బోవుటకుఁ దర్లిరి.

ఎడ్వర్డు ప్రభృతులు కైరో పురంబుఁ బ్రవేశించి అందలి వింతలను బొడఁగాంచి విస్మితులై నైలు నదిలో బయనము సేయుచుండిరి.... ఎడ్వర్డు దైవభ క్తిసంపన్ను దైనందున ఆదివారమగుటచేఁ బక్షులను జంప నొల్లఁడయ్యె. ఏటికి నిరువైపుల నుండుగట్టులపై శకుంతలసంతానముల కిలకిలారవములు చెవులకు విందొనర్చు చుండె. నదిలో నొక చాయఁ దామరలు వికసింప. నాతావులను బుడుత తెమ్మెరలు ఇంగ్లండు రాణి కొడుకు పైఁజల్లు చుండెను. తెల్లని బాతులు నీటిమీఁద నెడ్వర్డు నెదురుకొనుట కై వచ్చుచుండె నను విదంబున నీఁదు చుండె. రాణి తనయండు వానిలో నొక దాని నైనను చుంపక దేవుని స్మరియిం చుచు నదిలో బయనము సేసె. అతని మొసలిని వేటాడివలయునని ఎంతఁగోరినను, ఒక మొసలి యైనను నీటిమీదం గనుపడ దయ్యె.

ఎడ్వర్డుర్టును, ఆయన. పరిజనులును, డాక్ట రు స్టాన్లి మొదలగు పండిత సమూహబులును, నైలుముఖ ద్వారంబున నుండు అలెగ్జాండ్రి" అను రేవు పట్టణమును ", అచ్చటనుండి మధ్య ధరాసముద్రము పై నావ యాత్రసలిపి, క్రైస్తవ మతోద్ద్రారకుడైన జీసస్ క్రైస్టు జన్మభూమి యగు పొలెస్టైన్ బ్రవేశించిరి.

మొదటి ఎడ్వర్డును, ఎలినారును పూర్వ మాచోటికి వెళ్లి యుండిరి. కాని వెనుక నింగ్లండు 'నేలిన ప్రభువర్గములో నేరును ఆ తావును మొట్టి యుండ లేదు. "మొదటి ఎడ్వర్డు రాజ్య మేలి దాదాపు. ఏడువందల యేండ్లయ్యె. మార్చి నెల 31న తారీకునఁ డర్కీలో మధ్యధరాసముద్రము, దరి నుండు "జఫా" అను రేవు పట్టణమున ఎడ్వర్డు ఓడదిగెను టర్కీ రాజ్యమందలి యుద్ధ వీరులు సాయుధు లై ఎడ్వర్డునకు దారి చూప సాయపడిరి. ఆల్బర్టు బిడ్డఁడు జెరూసులమును, దానికి నలుగడల నుండు రమ్యప్రదేశంబులను, కొండచరియలలోఁ బ్రవహించు సెలయేళ్ల మొత్తంబులను, గాంచి ప్రమోద బరితొంతుండయ్యె. అతను జూడియా మలలమీఁదుగ " బెతలు” మను పట్టణమును జూచి, " జెరీకో" (Jerichoy అను నడవులలోఁ గొంత కాలము గుమ్మరి, బతని" కి వెళ్లి, అచ్చట నుండు నందంపు, దాపులఁ గని, మాక్పెలా (Machepela) అను గుహలోని వింతల బోడగాంచి ఆచ్చెరువొంది, ఆదేశమును వదలి తన రాజ్యమునకుఁ గ్రమ్మఱ నేతెంచెను. డాక్టరు స్టాన్లీ తానింతకుఁ బూర్వ మాపాలెస్టెను 'రాజ్యమునకువెళ్ళి యుండుపుడు చూడ లేనట్టి తావుల నన్నింటిని ఎడ్వడుర్డు వెంటఁ బయనము సేయుటచే జూడఁ గలిగినందులకు మిక్కిలి సంతోషించి, ఎడ్వర్డును బరి విధంబులఁ బ్రశంసించెను.

ఎడ్వర్డు ఇల్లు సేరగానే, “హీన్" అను రాజ్యము యొక్క "రాజపుత్రుడైన 'లూయి” కి నాయన చెల్లెలైన ప్రిన్సు అలిస్పను నామెను ఇచ్చి వివాహము నడిచెను. ఎడ్వర్డు తాను తూర్పు దేశంబునుండి తీసికొని వచ్చిన వింత వింత సామానులను,అపూర్వ పుష్పవర్గంబులను, తనతో బుట్టువునకు సజరుగ నిచ్చి ఆమెప్రీతీకిఁ బాత్రు డాయెను.

ఎడ్వెర్డ లెగ్జాండ్రులు, ఈజిప్టు రాజ్యమును జూడఁబోవుట.

ఎడ్వెర్డు తన పెండ్లికి ముందు, అమెరికాలోని కన్నడా మొదలగు రాజ్యములను జూచి వచ్చెను. వివాహ మైన పిదప నాలి తోడ నాతడు ఈజిప్టు రాజ్యమును జూచి రావలయు నని తన తల్లితో నాలో చించెను. వుత్త్రులకోరిక నెఱవేర్చుట తల్లులకుఁ బ్రియము కదా ! రాణి "ఏడ్వర్డు ఈజిప్టు: జూడవలయు సని కోరి యున్నాడు. చిన్న వానికిఁ గావలసిన ప్రయాణ సన్నాహములఁ గావింపుఁడు." అని మంత్రులకు నాజ్ఞ సలుప వారలు ఎడ్వెర్డాజ్యముల: జూచి నచ్చుటకు సమ్మతించి సర్వయత్నములు సలిపిరి,

ఎడ్వర్లును, ఆతనిపత్ని యైన అలెగ్జాండ్రాయును, పరివారమును, 1869 సం. జనవరి నెల 15 వ తేనిని ఈజిప్టు దేశమునకు బ్రయాణ మైరి. వారి వెంట బాటన్బరు రాకొమారుఁ డైన "లూ యి" అనునాతడును, (Prince Louis of Battenberg.) సదెర్లాండు భూస్వామియును, (The Duke of Sutherland) డాక్టరు డబ్లీయు రస్సలును, (Dr. K. H. Russel.) వారిపరి జనంబులును, ఎడ్వర్డ్ లెగ్జాండ్రుల వెంటఁ జనుందెంచిరి.

ఎడ్వెర్డు మొదలుగాఁ గలవారు ఫిబ్రవరి నెల 8 వతాలున నైలు ముఖ ద్వారంబుననుండు న లెగ్జాండ్రా పట్టణమున నోడదిగిరి. ఆపురంబున నుండు నాంగ్లేయులు తమ ప్రభువునకును, ఏలిక సానికిని, సుస్వాగత మిచ్చి, వారి మెడలోఁ బూలడండలు వైచి, మిక్కిలి సంభావించిరి. ఎడ్వర్డును, ఆ లెగ్జాండ్రాయును, మున్నగువారు, అలెగ్జాండ్రా పురిని విడిచి కై రోపట్టణమునకు వెళ్లిరి.

అచ్చట నాంగ్లేయ రాజప్రతినిధి యెల్లప్పుడును ఉండును. అతఁడును, అతని పరివారమును, ఇంకను ఆచోట నుండు దొడ్డ వారును, ఎడ్వర్ణ లెగ్జాండ్రులను సందర్శించి వారి రాక చేదమదేశమును, దమజనులును, ధన్యులై రని మనంబున నూహించి, ఆ 'రాజదంపతులకు సకల మర్యాదలను సలిపిరి. ఎడ్వర్డ లెగ్జాండ్రులు విడియుటకు దిన్య మైన యొక సగరు విడిచి యు డెను. అది సర్వభంగుల నలంకృతమై చూపరుల కనుల పండువు సేయు చుండెను. దానిలోని గదులు విశాలము లై రమణీయము లై యొప్పారుచుండెను. దానిలో నవరత్న ఖచిత ములైన హేమపాత్రంబులు ఆయాచోటులందు నమరిసొంపు పెంపు పెరుఁగు చుండెను. ఆంగ్లేయుల ప్రభువులకువలయు సుపకరణము లాతావున సమృద్ధిగా విరాజల్లుచుండెను.

ఈజిప్టు వైసురాయితల్లి పిబ్రవరి నెల 5వ తేదీ అలె గ్రౌండ్రామహారాని, ఆమె చెలికత్తియలకును, గొప్పవిందుఁ జేసెను, విశాలములైన బల్ల లమీఁద నవరత్న ఖచితము లైనవియును, స్వర్ణ రజిత మయములైనవియును, అగు గిన్నెలలోను, తట్టలలోను, చిన్న చిన్న పాత్రములలోను, నానా విధములైన భోజ్య వస్తువులు నిండియుండెను. ఇంగ్లండులో నెప్పుడును లభిం . పని ఫలసముదాయంబులును, పరిమళో పేతంబు లైన పుష్పప్రకరంబులును, పఱిచి యుండెను. వైసురాయితల్లి ఆలెగ్జాండ్రా ప్రభృతులను గౌరవించి, పైనఁ జెప్పిన భోజ్య వస్తువుల గుడువ వేడెను. ఆ యేడ్వర్డు గృహిణి, మున్నగువారు బల్లల ముందర గూర్చుండి ఆహారమును భుజింప నారంభించిరి. వెలయాండ్రు నృత్యము సలిపిరి, పాటకులు గానము సేసిరి . గారడి విద్య వాడ్రు గారడిని ఒనర్చిరి. భోజన సమయమున నిట్లు జరుగుట నా యింగ్లండు రాణీ కోడలుగాంచి, ప్రమోదాశ్చర్యంబుల నందెను.

ఎడ్వర్డును, ఆ లెగ్జాండ్రాను, వారి నెంట నింగ్లండునుండి ఏతెంచిన వారలును, నైలునదిలోనే దానిజన్మ స్థలము వరకుఁ బయనము సేయఁ గోరిరి. తురక లనేకులు మెక్కాలో మహమ్మ దుగోరి మీఁదఁ గప్పుటకై చిత్రపుఁ గంబళ్లను రెంటిని దీసికొని నెళ్లుటను, ఆరాచబాటసారులు గాంచి, ఫిబ్రవరి నెల 6 వ తేదిని నైలు నదిలో వారలఁ గొనిపోవు నోడ ఆయతంబై యుండ దాని నారోహించి దారి సాగ జనుచుండిరి.

ఎడ్వర్డును, అలెగ్జాండ్రాయును, ఒక యోడ లో నుండి, అందు వారికి స్నానార్ధమై ఒక గదియును, నిదుర పోవుటకు వేరొక అరయును, ఉడుపులు ధరించుకొనుటకు కొండొక కొట్టును, కచ్చేరి సేయుటకు నింకొక గదియును ఉండెను. ఈ యోడలో నారు భోజనము సేయుట లేదు. రెండన నావ, మొదటి దానివెంట వచ్చుచుండెను. అందు నల్గు ఫ్రెంచి దేశస్థులైన వంటవాండ్రును, ఒక తురక వంటవాఁడును, వంట సేయుటకు సిద్ధులై ఉండిరి. ఆయోడలో భోజన వస్తువులన్నియు నిండియుం డెను. కోడి పుంజులు, బాతులు, కోడి పెట్టలు, నాని గ్రుడ్లును, లెక్కకు మిక్కిలియై ఉండెను. మూఢవ యోడ కైరోల నుండు బ్రిటిషు కస్సలును, ఈజిప్టు దేశస్థు లిర్వురును, ఫ్రెంచి దేశపు డోబీలును, వచ్చుచుండిరి. దానిలో గుఱ్ఱములును, కం చరగాడిదెలును, జనుదెంచుచుండెను.

ఎడ్యంర్డు వేటలో నధికాసక్తి కలవాడు. అతడు నది కెలంకుల నుండు పక్షి సనూహంబుల నప్పుడప్పుడు కాల్చుచుఁబయనము నొసర్చు చుండె. నైలు నదిలో మొసళ్లు పెక్కులుం డు సను ఖ్యాతిని ఎడ్వర్డింతకుముందనేక పర్యాయములు విని యున్న వాఁ డగుటచే నామొసళ్లలో ఒక దానినైనను జంపి, ఇంగ్లండుసకుఁ గొనిపోవలయునని సర్వవిధములఁ బ్రయత్నం చెను. కాని అతని దృష్టి పదంబున ఒక టి యైనఁ గోచరము కాదయ్యె.

ఒక నాఁటి రాత్రి నా రాజ దంపతు లుండిన యోడలో నలెగ్జాండ్రాకు సమీపంబున నిప్పు రగులుకొనెను. ఎడ్వర్డు మంట పెద్దదగుటకు ముందే మేలుకొని దాని నార్పెను. పగలంతయు నాఫ్రికా దేశపు సూర్యరశ్మికిఁ జక్కగా నెండిన మ్రాని యోడలు నిష్పమంటకుఁ బేలపిండియేకదా ! భగవంతుని కృపాతిశయముచే నొయగ్గిమంట చల్లా రెను. ప్రాచీన కాలపు నాగఱికతకుఁ బేరువడసిన రాజ్యములలో నీజిప్టు సుప్రసిద్ధ మైనది. ఆదేశములో ప్రాచీన కాలవు వాస్తుశాస్త్ర ప్రకారము కట్టి శిథిలమైన దేవాలయములును, గోపురములును, ఆ నేకములుండును.ఎడ్వర్ణ లెగ్జాండ్రలు దానిం గాంచుటకు నవి యుండు చోటులయందు:దిగి, వానిని జూచి వాని సొబగునకు మిక్కిలి యాశ్చర్యంబు నొంది అట్టివాని నాదరించిన వారి దాసశౌర్యాది సద్గుణంబుల సభివర్ణించుచు, అట్టివి పలము కాక వానిం గాంచుటకు వచ్చిన బాటసారులకు నానందదాయకములై ఉన్నందులకు మనంబున సంతసము "సెందుచు, తాముండిన యోడకుఁ దిరిగి వచ్చిరి . పిబ్రవరి నెల 20 న తేదీని ఓడలు ఏటి యడుసున దిగబడెను. అవి మరల నీటి పై దేలుటకు సందలి. సామానులు గట్టు పైకి దింపలసియుండెను. ఎడ్వర్డు లెగ్జాండ్రులుసదర్లెండు ప్రభువు నోడ మీదికి వెళ్లి అచ్చట నాహారమును భుజించిరి. ఇంతలో దిగఁబడిన యోడలు నీటీ పై నెప్పటి రీతిని దేలసాగెను, అందఱును బయనము సేయుటకు గడంగిరి,

ఫిబ్రవరి నెలాఖరు వరకు నారాజదంవతులు: సది లోనే ప్రయాణము సేసి, ఆయా చోటల యందుండు వింత ప్రదేశములు జూచి, ఆహ్లాదము: బొరసి, నదీ ముఖ ద్వారము చాయఁ బయ- సము చేయసాగిరి. అప్పు డెడ్వర్లు నష్ట మైన పెన్నిధిని గన్న చందంబున మొక్క. మకరంటు నీటి పైనఁ దేలుచుండుటను జూచి. వెంటనే దానిని గాల్చెను. మొసళ్లు బైటికి రావు. అవి తమ్ము జనులు చంపుదురను భీతిచే నెల్ల కాలంబుల నీటియడుగు భాగమున నుండును. కాబట్టి మనుష్యులు వానిని వేఁటాడుట అరిది. ఎడ్వర్డు చంపిన మొసలి మిక్కిలి గొప్పది. అతఁడు దాని నింగ్లండునకుఁ గొనిపోవఁ బెట్టెలో దాఁచి యుంచెను.

ఎడ్వర్డును, ఆ లెగ్జాండ్రా మున్నగువారును మార్చి నెలకడవఱకు నైలులోఁ బయన మొనర్చుచు, వచ్చుచుండిరి. ఈ రాజదంపతుల వివాహమహోత్సవ దిసము పండుగు నైలు నదిలోనే నడిచెను. గొప్పవారు. ఆ సమయంబున నెడ్వర్డ లెగ్జాడ్రులకు బహుమతుల సమర్పించిరి. ఈజిప్టు రాజ్యమును గల వెలయాండ్రు వారి మ్రోల నాట్యము సలిపి వారి నానందపఱిచిరి. వారలు కొన్నాళ్లు నదిలోఁ బయనము సేసి, మిని హేకు నేతెంచి, అచ్చట ధూమశకటంబు మీఁదఁ గైరో పురికి వచ్చిరి.

విక్టోరియా కొడుకును, కోడలును, వారి వెంటఁ జనుదెంచిస పరిజనులును, కెరో నగరంబున వారమురోజు లుండి మార్గాయాసమును బోఁగొట్టుకొని, అందు విచిత్రము లైనవి యును, రమ్యము 'లైనవియును, అయిన ప్రదేశములను గాంచి,టర్కీ దేశ గమనోన్ముఖులైరి .

వేల్సు రాజ్యము యొక్క యువ రాజు ధర్మపత్నీ సమేతుఁడై సూయజు కాలువ సమీపించి వచ్చెను. సూయజుభూ సంధిని కాలువను త్రవ్వు చుండిరి. ఎడ్వర్డు మధ్యధరా సముద్రమునకును, “బిట్టరు లేక్సు" అను నుప్పు చెరువులకును, నడుమ గట్టిన తూములను దెఱచెను. అతఁడు ఆతూములను దెఱచుటచేమధ్యధరా సముద్రమందలి నీరు సూయజు కాలువలోనికి రాసాగెను. కానీ, కాలువ పని పూరి కానందున ఆతూములు మరల మూసికొనెను. . ఎడ్వర్డు ప్రభృతులు పోర్టు సెయిడ్డు రేపు పట్టణముఁ జేరి, కాన్ స్టాంటినోపిలు పట్టణమునకుఁ బోవ నోడ నెక్కి, అలెగ్జాండ్రాపురికి నచ్చి అందలి పాంపె జయ స్తంభమును జూచి, కాన్ స్టాంటినోపిలునకు నేఁగ నోడ నెక్కి... పయనము బాగుగ నడిచెను. కాన్ స్టాంటినోపిలు పురికి మూడుమైళ్ల దూరమున నే వ చ్చిన టర్కీ సుల్తానుని పడవలోనికి నారాజదంపతులు దిగి, తుర క రేనివీటఁ బ్రవేశించిరి

ఆశీయాలోనుండు, టర్కీ కిని, అయిరోపొలోనుండు టర్కీ-కిని, ప్రభు వొకఁ డేను. అతనికి కాన్ స్టాంటినోపిలు రాజధాని, అతను నిరంకుశాధికారమును చెల్లించు చుండువాడు. అతని మాటకు నెట్టి ప్రజ్ఞావంతుఁడును, ఎదు రాడ భీతిల్లు చుండును.అతని యంతఃపుర స్త్రీలు తమ నాథునితప్ప అన్యపురుషుల మోముల నెన్నడును జూచి యెఱుగరు. అట్టిచోట ఎడ్వర్డలెగ్జాం డ్రులు కొన్ని నాళ్లుండిరి. సుల్తాను ఆంగ్లేయుల యాచార వ్యవహారుబులు నెరింగిన వాడు. అతడు రాజదంపతులతో నధికమైత్రిని బ్రవ ర్తించి, వారికి సకల సౌఖ్యంబులు కలుగఁ జేయు చుండెను. ఎడ్వెర్డ లెగ్జాండ్రాలు గొప్ప మేడలో నివసింపసాగిరి. ఆది చక్కఁగ నలంకృతంబై యుండెను..దానిలోని మందిరంబులు నానా విధములచేఁ బొదుగబడి చూపరుల నయనంబులకు విందు సేయు చుండెను. ఒక నాడామేడ లో టర్కి రాజ్యపు సుల్తాను,ఎడ్వర్డు భృతులకు విందు సేసెను. ఇతఁడు అందుఱతో భోజనము సేసెను. అతని మంత్రులును వానితో గూడ విందు నార గించిరి. ఎడ్వర్డ్ను, అలెగ్జాండ్రాయును, వారి తో సరససల్లాంబులు సలుపుచుఁ దమకు వలసిన భోజనమును సాపడిరి. ఏప్రెలు 5 వ తేదిని ఉదయమున ఎడ్వర్డును, ఆయన రాణియును, "కాన్ స్టాంటినోపిలు అంగడి ఏథులలో సికారి వెళ్లిరి .. ఒక నాఁటిరాత్రి నాపురబున నొక చోట నొకనాటకము ప్రదర్శిషఁబడెను. మన రాజదంపతు లాయాటను జూచు నేడ్క నాచోటికి వెళ్లిరి. సుల్తానును, ఆతావున కేఁగి, స్త్రీల చెంగిటఁ గూర్చుండెను. ఇంతకు ముందెన్నడును తురక రాజు, నారీమణుల ప్రక్కన గూర్చుండి నది లేదు. ఈరీతి నాపురంబున నారాజదంపతులుండి క్రిమీయా రాజ్యమునకుఁ బోవఁ బయనము కట్టిరి.

ఇంగ్లడు రాణి కుమారుడు, కోడలును టర్కీ దేశపు టోడయని సెలవు పొంది క్రిమియాకుఁ జనుదేర నావ నెక్కిరి. దారిచక్కఁగ సాగెను. వారు సిబాస్ట పూలు 'రేపు పురిని జేరిరి. . కొద్ది దినములకుఁ బూర్వమే నడిచిన ఘోరరణమునలన నాపురి పాడు పడి యుండెను. అంచు జను లెవ్వరు నివ యము. సించుట లేదు. ఎడ్వర్డు మొదలుగా గలవారు క్రీమియాను బ్రవేశించి, అంచు రణము జరిగిన తావులను జూచిరి. రుష్యా దేశచక్రవర్తి ప్రతినిధి ఎడ్వర్ణ లెగ్జాడ్రాలకు సగౌరవంబుగా స్వా గతం బొసంగి, వారికి బహుభంగుల మర్యాదలు సలిపెను. ఆరాజదంపతులు క్రిమియాలో రణభూముల నన్నింటిని వేఱు వేఱుగ బరీక్షించి, ఉభయ సైనిక నికాయంబు లుండిన తోవులను గాంచి, యుద్ధ కాలంబున శిధిల మైన ఆల్మానది పై నుండు వంతెనను గని, క్రిమియా రాజ్యము నంతయు: గ్రుమ్మరి. రుష్యాదేశస్థులు ఎవరు వచ్చి నను రొట్టె ముక్కను, కొంచెముప్పును, ఇచ్చి ఆతిది పూజలు సలుపు చుండుదురు. వారు తుమవాడుకప్రకారము మన రాజుదంపతులకుఁ దమశక్తివంచన లేక ఆతిథి పూజులు సలీపిరి. ఎడ్వర్డలెగ్జాం డ్రాలు 14 వ తేదికి బాక్లావా యుద్ధ భూమిని గాంచి, లివిడియాలో నారాత్రి విశ్రమించి, మఱునాఁ డయంబున లేచి, కాల్యకరణీయుబులు దీర్చుకొని రష్యా దేశస్థుల సెలవు పొంది స్వదేశ గమునోన్ముఖులైరి.


ఎడ్వెర్డలెగ్జాండ్రాలు ఇంటికి మరలి వచ్చు. నపుడు ప్రెంచి దేశమునకుఁ జనుదెంచి, పారీస్ పురి పౌరులొసంగు నాతిథ్యంబు గొని, లండనుపురికి విచ్చేసిరి.

ఎడ్వర్డు రోగ పీడితుఁ డై ఆరోగ్యవంతుఁ డగుట

.

ఎడ్వెర్డలెగ్జాం డ్రాలు పలు దేశములు తిరిగి వచ్చిన పిమ్మట సాండ్రింగుహాము భవనంబున నుండీ , ఎడ్వర్డుతోబుట్టువు ప్రిన్సస్ అరిస్సు వారిని జూడవచ్చి వారి దగ్గఱనే ఉండెను. వారందఱును మిక్కిలి సుఖంబుగా నుండిరి.

ఎడ్వర్లు నౌకరి యగు బెగ్గను వాడును, చెస్టరు ఫీల్డును జ్వర దేవతకు మంచి ఫలాహార మైరి. ఎడ్వర్డు మాత్రము దానికిలో బడని వాడయ్యును, దానిచే మిక్కిలి పీడింపబడుచుండెను, ఎడ్వర్డు మిక్కిలి. చేవకలవాఁ డగుటచే నాజ్వఱ మాతనిదొలుదొల్త బాధ పెట్టదయ్యే. అతఁడు క్రమముగ దానికి సధీనుడై లేవలేక పడకమీదనే ఉండెను. కొన్ని వేళలయందు నాతనికి మాటలు కూడ నిలిచి నిలిచి, తడఁబడుచు నోటనుండి మిక్కిలి కష్టమున వచ్చు చుండెను.

ఇట్టి జబ్బుస్థితిలో నాతనికి నలెగ్జాండ్రాయును, ఆయనతో బుట్టువు ప్రిన్సన్ అలిస్సును, దాపున నుండి ఉపచారములు సేయు చుండిరి. జెన్నరు, గల్, క్లేటన్, లోనగు వైద్య శిఖామణులు నిమిష నిమిషమునకు సర్వకాలంబుల నాయన సమీపంబునందుండి ముందు లిచ్చు చుండిరి. అలెగ్జాండ్రా ఎడ్వర్లు ప్రాణము నుండిన చాలు నని, " సర్వేశా ! మాభర్తను రక్షింపుము. మృత్యు దేవతకు నొసఁగకుఁడు. నా యైదువ తనము గాపాడుడుడు.” అని వేల్పును స్తుతించుచు ధైర్యలక్ష్మిని గోల్పోక ఆయన దగ్గఱనే ఉండెను.

విక్టోరియా ఎడ్వర్డు రోగ పీడితుఁడై ఉంఫుటను విన్నదై ఎకాయెకీని సాండ్రిం గుహాము భవనంబునకు సరుదెంచెను. ఎడ్వర్డు బ్రతుకుట దుర్లభ మనుమాట పుట్టెను. విక్టోరియా, ఆలెగ్జాండ్రా, మున్నగువారు మిన్ను విరిగి పైపైన బడ్డట్టుల నివ్వెర పడియుండిరి. వారికి దైర్యము వచ్చు మాటలుకూడ చెప్పనా రుండియును, అందఱును బ్రతుకడని నిశ్చియించుకొని యుండిరి. అ నేక రాజ్యముల యందలి జనులును, రాజులును, చక్ర వర్తులును, ఎడ్వర్డు దేహస్థితిని దెలియలియఁ జేయ వలయు నని రాణి మంత్రులకు జాబులు వ్రాయుచు....ఇంగ్లండున, నుండు జనులు సాండ్రింగు హాముభవనమునకు నేతెంచి, ఆయనను జూడ గుంపులు గూడియుండిరి.

ఇంగ్లండు, స్కాట్లుండు, అయిర్లండు..., కన్నడా, ఆస్ట్రేలియా, కేపు కాలని, హిందూ దేశము, మున్నగు రాజ్యములలో నుండు దేవాలయములలో సన్ని మతస్థులును, ఎడ్వర్డు జీవింప వలయు నని తమ తమ దేవతలకు మొక్కులు సలుప వలయు నని రాణి ప్రభృతులు అందఱకుఁ దంత్రీ వార్తను బంపిరి. అన్నిచోటులలో నాయా గుడుల యందు నన్ని మతస్థులు దేవతా ప్రార్థనలను గావించిరి. ఇందఱ మతస్థుల ప్రార్థనలు నిష్ఫలములగునే ? ఇందఱలో కొక్కఁ డైను సదాచార సంపన్నుడుండక ఉండునే.

ఎడ్వర్డునకు జ్వరము కొంచెము తగ్గెను. బాధ కొంత,వరకు నిలువసాగెను. అతనికి నిదుర పట్టెను. ఈసన్నలు శుభసూచకములైన వని అలెగ్జాండ్రా - తెలిసికొని , దేవుని సదా స్మరించు చుండెను. రాణీ మంత్రులు, లోకులకు నీశుభవార్తను తెలియఁ బఱచి. అందరును సంతోషాంబుధి మునిఁగిరి. క్రమముగ నెడ్వెర్డు ఆరోగ్యవంతుఁ డయ్యె.

ఎడ్వర్డు దేవుని దయవలన బ్రతికె నని తలచి రాణి భగవంతునకు మ్రొక్కు బడులు చెల్లింపవలయు నని మంత్రులతో మందలించెను. ప్రధాన పుంగపులు ఆదేవేరి మనోరథము పూర్తి కాగలందులకు నుద్యమములు సేసిరి. విక్టోరియాయును, ఎడ్వ డ్డలెగ్జాండ్రులును, శుచిగా నాల్గు గుర్రంబులు పూనిన శకటంబుల నారోహించి సెంటు పాలు గుడికిఁ జేరఁ దర్లిరి. పున ర్జన్మము నొందిన ఎడ్వర్డును జూచుటకు నీథులలో 'వేన వేలజనులు గుంపులుగూడి యుండిరి. అందఱును తిన్నగ నాదేవాలయము సేరిరి.

కోవెలలో నున్న తాసనంబున నిలిచి కాంటెర్బరి ఆర్చిబిషపు బైబిలులోని కొన్ని వాక్యములు చదివి "ఎడ్వర్డు దీర్ఘాయువు కలవాడై మనుచు జనులను బాలించుఁగాత! " అని కీర్తనము పాడెను. గుడిలో మొక్కుబడి చెల్లెను విక్టోరియామొదలగువారు వేరు తెరువుల నింటికి వచ్చిరి. ఒకానొక కవి,

" మృత్యువాతఁ బడియు మేన జీవముతోడ
జనులు మోద జలధి మునుఁగి వెలికి
వచ్చినాఁ డితుడు హెచ్చుగ నెడ్వర్డు
బ్రోవుమయ్య దేవ జీవ మిచ్చి.” అని కీర్తించెను.

1873.__1875.

ఎడ్వర్డు రెండేండ్లు ఇంట నెమ్మదిగా నుండుట.

1874 సం.. న జనవరి నెల రుష్యా దేశపు రాజవుత్రికయగు "గ్రాండు డచెను మేరియి" (Grand Duchess Marie of Russia) అను నామెకును, ఎడింబరో ప్రభువునకును, వివా హము నడిచెను. ఎడ్వర్డు లెగ్జాండ్రులు విక్టోరియా ప్రతినిధులు నుఁడి ఆపెండ్లిని జరిపిరి. డీనుస్టాన్లీ (Dean Stanley) అను నాతఁడు దేవాలయంబు. మంత్రములు పఠించెను. పరిణయము ముగిసిన వెంటనే వివాహమునకు వచ్చిన వారికి విందులు చేయఁబడెను. అప్పుడు వేల్సు యువ రాజును, ప్రష్యా రాజ్యము యొక్క రాజపుత్రుడును సహపంక్తిని విందు భుజించిరి . ఆవల నంద రును తమతమ బసలకు నేగిరి.

1874 సం. న మిడిల్ టెంపిలు హాలులో నెడ్వర్డు సకు విందు జరిగెను. న్యాయశాస్త్రము : నభ్యసించు వారాహాలులో నాశాస్త్రమును జదువుచుందురు. అతఁడు తన్ను గౌరవిం చిన వారి యెడఁ గూరిమి కలవాఁడై కొంత కాల మచ్చటి వారితో సరససల్లాపంబులు సేయుచుండి తనయింటికి వచ్చెను.

ఆసంవత్సరంబున నాతడును, ఆయన భార్యామణియును, ఒర్మింగుహాము జిల్లాకు వెళ్లిరి, ఆజిల్లా అధికారి జోసఫ్ చాంబర్లేనను నాతఁడు, (Mr. Joseph Chamberlain) ఈ రాజదం పతులను మిగుల గౌరవించెను. ఆవల వా రా తావును విడిచి తమ గృహంబు సేరిరి.