సప్తమైడ్వర్డు చరిత్రము/అయిదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

. జనుటకు రాణియనుజ్ఞ "వేడిరి. ఆమే వారందజకుఁ దగురీతిని గౌరవములు సలుప వలసిన దని మంత్రులకుఁ గట్టడ మెన ర్చె. వారును ఆ యా రాజులను వారి వారికి నర్హతములైన మార్గములు సత్కరించి, అభూధవులు రాణి సెలవు వొంది. నిజ దేశగమనో ముఖ లై. నూతన రాజదంపతులు ప్రజలకు నను రాగపర్తనులై పెండ్లి యైసయొక సంవత్సర పర్యంతము ప్రతిదినమునను విందులు గుడుచుచు సుఖం బుడిరి,

అయిదవ యధ్యాయము.

ఎడ్వర్డలెగ్జాండ్రాల నూతన దాంపత్యము.


విక్టోరియా భర్తను గోలుపోయినది మొదలు రాజకీయ వ్యవహారములలో, దాను ప్రవేశించక తనకుమారరత్నమును అందుఁ బ్రవేశంష జేయు చుండెను. అందువలన బర దేశ రాజుగాని, రాయబారులు గాని రాణి జూచుటకు వచ్చిసపుడు వారికీ చేయవలసిన గౌరవము లన్నింటిని ఎడ్వర్డుచేయు చుండెడివాడు. అతనికి బరిణియం బై కొన్ని దినములయ్యె. లండను నగరంబును, ఇంగ్లండు లోను, గొప్పగొప్పు పట్టణంబుల యందును, ఉండు శ్రీమంతులు ఈ నూతన రాజదంపతు లైనయెడ్వెర్డలెగ్జాండ్లను తమతమ యునికి పట్టులకుఁ బిలుచు కొనిపోయి వారికి యధాశక్తిని మర్యాదలు సలుపు చుండిరి.

అతఁడు భార్యామణి తోడ నాయా తాపులకు వెళ్లి వార లిచ్చు నాతిద్యంబులు గోని యింటికిఁ జేరు చుండెను.

రాయల్ అకాడమి" (The Royal Academy) అను విద్యాలయాధిపతులు తాము చేసెడి విందుఁ గుడువ రమ్మని ఎడ్వర్డును బిలిచిరి . అతఁడు పరివార సమేతుఁడై వారియాల యమునకు వెళ్లి వారలు తనకుఁ జేసి మర్యాదలకు సంతుష్ట హృదయుం డై వారి యెడఁ దనకుఁ గలయను రాగాంబును, దేట బఱుచుచు సమంజసంబు లైన కొన్ని మాటలు ప్రసంగించి యందఱభిమానంబుల నాకర్షించుకొనెను. అప్పు డాతఁడు. పెద్దలుయెడ భ క్తియును, చిన్నల యెడ బ్రీతి విశ్వాసములును, గనఁబరచుచు నందరుకును హితమతియై ప్రవర్తించె సని “రాయల్ అకాడమి” ఆధిపతి యైన సర్ చార్లస్ ఈస్ట్ లేక్ అను నాతని భార్య వచించి యున్నది.


ఎడ్వర్డు ఆంగ్లేయ భాషా యోషాభిమానుండై పండితకవుల నాదరించుచు నుండువాడు ఆయకాడమి మందిరంబున * తాకరి ? " (Thackery) అనుపండిత కవీశ్వరుడు కూడ ప్రసంగింగిం చెను. అతఁ డావల: గొలదినములంకె స్వర్గస్థుడయ్యె. ఎడ్వర్డాపండిత సింహుని మరణము తన రాజ్యమునకు గొప్పనష్ట మనియును, ఆకవి విద్వాంసు లై యుండి బీదరికముచే శ్రమపడు కవీశ్వరులకు సన్ని విధాలఁ దోడుషడు చుండెడి వాడని యును,తాకరి మేలిగొనంబుల నుతించి పలికెను. ఇంగ్లండులో "ఆక్సుపోర్డు" అనుపట్టణము కలదు. అది సర్వకళాశాలలకుం బేరు వడిసి యుండును. అందుననేకశాస్త్రములు పెక్కుదేశములయందుండి వచ్చినవిద్యార్థులు నేర్చుకొను చుండెడివారు. అచ్చటకళాశాలాధిపతులు ఎడ్వర్డలెగ్జాండ్రులను ఆహ్వాసము చేసిరి. ఆరాజదంపతులు సపరివారులై ఆక్సుపోర్డునకు వెళ్లిరి. ఆచోట నుండివిద్వాంసులు వారిని బహుబంగుల గౌరవించి 'డాక్టరు ఆఫ్ సివిల్ లా" (Doctor of Civil law) అనుబిరుదు నెడ్వర్డునకు నొసంగిరి. ఆరాజదంపతు లాతావు వాసి తమపొందుపట్లకు నేతెంచిరి.

ఎడ్వర్డు తనగృహణితో మారల్బరో భవనంబున నివసింపసాగెను. ఆతడు తనయింటికి జనుదెంచు డొడ్డవారికి నప్పుడప్పు డు విందులు సేయు చుండెను. అలెగ్జాండ్రా తనభర్తతో నత్యుల్లాసంబునఁ గాలము గడుపు చుండ నాతరుణీమణి కాలక్రమమున గర్భమును ధరించెను. అత్తగారైనవిక్టోరియా తన కోడలి తోలిచూలున మగబిడ్డ పుట్టుఁ గాక అని కోరుచుండెను. ఇంతలో నాయలెగ్జాండ్రా సుదతీమణికి నవమాసములు నిండె.

1865 సం. న జనవరినెలలో నొకనాఁటి సాయింత్రంబునఁ బూర్ణగర్భిణి యైన అలెగ్జాండ్రా వింజరునగరునకుఁ జెంగట వర్జీనియానీటిపై బడవలో సికారి చేయు చుండెను. అప్పడఁతుక సాయంసమయంబున నాపడవలో ఒక మగసిసువును గనెను. విక్టోయామనోరథము సంపూర్తిమాయెను. వెంటనే బాలెంత రాలును, బిడ్డడును, మారల్బరో మందిరబున బ్రవేశించి, అరోగ్యవంతు లై వర్ధిల్లు చుండిరి.

డెన్మార్కు. రాజు తన తనయ మగ బొట్టెను , గనెనని విని మిక్కిలి సంతోషించి బీదలఁ బెక్కు తెరంగుల నాదరించి వారికి నన్న వస్త్రదానంబులు సేసెను. విక్టోరియా కూడ తనకు మను ముఁడు జన్మించెనని మిగుల నానందంబు నొంది బీదలకు దర్మంబుల నాచరించెను. “క్లారెన్సు ప్రభువు" (Duke of Clarence)ఫుట్టినపుడు ను ఆలెగ్జాండ్రకు దాదాపు వయస్సు ఇగువదేళ్లు. ఆమెయు అత్తవారిమాడ్కి చిన్న వయస్సున * బిడ్డను గనిపెంచుటలో మిక్కిలియోర్పుకల దై రాచకార్యంబుల సంత గబాటింపక కొడుకు సుఖంబే తస సుఖంబని తలంచి యుండెను.,

డెన్మార్కు... రాజ్యమునకును, ప్రష్యా రాజ్యమునకును, గొప్పపోరు నడిచెను. ఆనామధేయుఁ డేవడో ఒకడు డెన్మార్కురాజు రణరంగంబునం బరాభవంబు నొందె నని అలెగ్జాం డ్రతో మందలించెను.ఆమె కన్నీరు మున్నీరై పాఱ దుఖింప సాగెను. ఎడ్వర్డు తన రాణియు మ్మలికంబు పాప నుద్యమించి, ఆసమాచార మెంతనఱకు నిజమై ఉండనోపు నో అని విచారింపసాగెను. ఇంతలో నొకానొకడు డెన్నార్కు- ప్రభువు గెలిచె ననుమాటను అలెగ్జాండ్రా చెవిని బడ వేసెను. ఆమె తనమనో వ్యథను తొలగఁ జేసికొని, వికశితకమల వదన యయ్యె,

లుడను పురమున వైద్యాశాల ఒకటి నిర్మింపఁబడి యుండెను. కాని దాని పడమటి చాయ నొక నూతన భవనము కట్టవలసి యుండెను. ఎడ్వర్డు దానికి నస్తిభారమును వేసెను. అలెగ్జాండ్రా ఆయన వెంబడి వెళ్లి ఆ కార్యము ముగియు వఱకు నేచ్చోట నుండెను. ఆవైద్యాలయంబున, యూధులకు ప్రత్యేకముగఁ గొట్టులు ఏర్పడి యుండెను, ఆ రాజదంపతు లాయేర్పాటునకు మనంబునఁ బ్రహర్షంబు సెందిరి. ఒకనాఁడు వారిద్దరును, హైలండు భూములఁ జూడ వెళ్ళిరి.. వా తావులుగొన్నినాండ్లుండి తమపురికి మఱళి వచ్చిరి.

1865 సం. న ఎడ్వర్డు, ఆయిర్లండు లంకకు వెళ్లెను. అచ్చట నాయువ రాజు డబ్లిను నగరంబునఁ బ్రదర్శన శాలను దెఱిచెను. ఆసంవత్సరమున అలెగ్జాండ్రా చూలా లై యుండి మే నెలలో ఇప్పటి మన ప్రభు వై న జార్జిని గనెను.

వివాహ మైన పిమ్మట ఎడ్వర్డును, ఆయన భార్యయును,ఒక తావున నే నివసించు చుంట లేదు. వారు కొన్ని వేళలయందు నూరల్బరో ముదిరంబున నుండి. మరి కొన్ని సమయంబుల సాండ్రింగ్ హాము భవనంబున నుడిరి. ఒక నాటి రేయి సాండ్రింగుహాముగృహంబున దాదు లుండినగదికి నిప్పంటు కొ"నెను. ఆగదికి నగ్గి తాగుటకుఁ గొన్ని నిముసములకు ముందు, అలెగ్జా తనయిదర బిడ్డలను రెండు చంకల నిడుకొని వేరొక యరలోఁ బరుండఁ బోయెను. ఎడ్వర్లు మంటను జూచి


దాని నార్పుటకు వెంటనే ప్రయత్నించెను. అతడా జ్వాలను అర్సు నపుడు, మంట అతని జుట్టుకొనెను.అతను దానిని దాటి యావలికి వచ్చినపు డాతనికిఁ గొంత చెఱుపు కలిగెను. కాని ఆయ్యది ప్రాణాపద్రవ మైనది కాదు. అచ్చట నిప్పురగులు కొనుటకు: గారణము మిద మిత్త మని ఎవ్వరును ఊహిం పలే రైరి. భగవత్కృపాకటాక్ష మహిమచే నామంట ఆరెను. ఎవరని దానివలనం జేటు కలుగ లేదు. తదాదిగ నెర్డ్వెర్డులండను నగరమున నాతావునకు నిప్పుమంటఁ జూచె నేని,అతఁడు రహస్యవర్తనంబున నాతావుకు వెళ్లి దాని నార్పు చుండెవాఁడు.

షీర్నెప్సను తావునకు నెదుట బెద్ద పొగ యోగ సూతసముగ నిర్మింతమై యుండెను. ఎడ్వర్డు దానిఁ జూచివచ్చుటకు వెళ్లెను. ఆట నుండిన యింజునియర్లు అతనిని మిక్కిలి గౌరవించి పొగయోడను నిర్మించు పద్దతిని, ఆయనకు జెప్పిరి. ఆతడాయోడ సొబగును, దానిదిట్ టతనమును, జూచి యూనందభరిత చిత్తుఁడై వచ్చెను.


విక్టోరియా తనభర్త పరలోక గతుఁ డైనది మొదలు రాచకార్యములు సేయక చింతాక్రాంతయై ఉండెను. ఎడ్వర్డును దనతండ్రి చావుచే దనకును, దనతల్లిని, కలదుఃఖమును పలు తెఱంగులఁ బలుచోటుల సమయము వచ్చినపు డంతయును వాక్రుచ్చి, అతని సద్గుణ జాలంబుల బ్రశంసించు చుండెడివాఁడు.

అతడు తనతండ్రి జ్ఞాపకార్థ మై ఫ్రాగిమోరను చోటఁ గట్టినభవనమునకు రూ 1,5,0000 లను ఇచ్చెను.

1866 సం. న జర్మని దేశ మునకును, ఆస్ట్రియా రాజ్యమునకును, జగడము నడిచెను. ఎ్వడ్వర్డు ఏదేశము 'గెలుపు చెందునో ఆని మిక్కిలి తమకంబున మాగల్బరో భపనంబు నుండి అ రణభూమి వృత్తాంతంబున నారయు చుండెను. ఫ్రెంచి వాకిరిని, ప్రష్యా రాజ్యము వారికిని, జరిగిన రణంబుసను, రష్యా దేశస్థులకును, టర్కి వారికిని సడచిన యుద్ధమునను, ఆయా యుద్ధ ములయందలి వృత్తాంతంబులను ఎడ్వర్లు విచారించు చుండెను.


బైబిలును బోధించు సంఘమువారు, లండను నగరంబున నొక మేడను గట్టిరి . ఎడ్వర్డు దానికి నస్తి భారపురాతిని నాటెను. అప్పు డాతఁడు, ఆసంఘము వారు, స్వసౌఖ్యలాభములను దిగ నాడి అన్యుల దుఃఖములం దొలగించి నన్య దేశ ములలో బాటుపడు వానియును, తన తాత - కెంటు ప్రభు 'వెల్ల కాలంబుల నా సంఘము వారిని బ్రశసించు చుండె ననియును, ము న్నగు వాక్యంబులు సెప్పి, తాను ఏసు నాథుఁడు నడిచిన మార్గబు నే వర్తింతు నని మందలించెను.

ఎడ్వర్డును, అలెగ్జాండ్రయును తమ కుమారులను వెంట: బెట్టుకొని, డన్: రోబినులో నుండిస నెదర్లేండుజమీం దారుని జూడ వెళ్లిరి. “అదొడ్గే" అను స్థలము వరకె రైలు మార్గ ముం డెను, ఆరాజదంపతులు బండ్ల పై డన్.రోబినుకు వెళ్లిరి త్రోవ


లోప్ర జలు రాజుదంపతులను జూచి మోదమును జెందిరి.డన్ రోబిను జేరగానే అచ్చటి జమీందారుడు ఎడ్వర్డ లెగ్జాండ్రాలకు సకల మర్యాదలు సలిపెను. నా తావునం గొన్ని నాళ్లుండి, జమీందారుని అనుమతిని ఇంటికీ జను దెంచిరి .

డెన్మార్కు. రాణీ తనబిడ్డలను వెంట నిడుకొని ఇంగ్లండు నకు నేతెంచెను, ఎడ్వర్డును, ఆ లెగ్జాండ్రాయును,ఆయనను మిగుల గౌరవించి, చిఱుతలను ముద్దాడి నారికి విందు నొనర్చిరి. ఆరాణి తన తనయుడ:కడ గొన్నాళ్లుండి ఆవల దసరాజ్యమునకు నేగెను. ఎడ్వర్డు రుష్యా ప్రభువునకు జరిగిన పెండ్లి వేడుకల జూచి వచ్చుటకు వెళ్లి, ఆ రాజ్యమున: కొన్ని దినము లుండి తన దేశమునకు మరలెను. తదాదిగ నాతడు ఆదేశము నెడ సదయు:డైనర్తిల్లు చుండెను.

1866 స వత్సరా-ంతమున అలెగ్జాండ్ర గ్రమ్మఱ గర్భమును ధరి:ంచెను. ఈ తూరి ఫిబ్రవ నెల 20 వ తేదీని ఆయమకు ఒక యాడు బిడ్డ పుట్టెను. అప్పుడారాణి దేహము మొక్కిలి జబ్బు పడెను. అంత నామె తల్లిదండ్రులు తమ గారాబుఁబట్టిని జూడవచ్చి ఇంగ్లాండున గొన్ని దినము లుండిరి. ఎడ్వర్డు, రాచకార్యము లెన్ని చేయవలసి యుండినను, భార్య దేహము కుదు రుటఁ బడువరకు నాయమను విడిచి వేరొండు చోటికి వెళ్లిననాడుకాడు. ఇంతలో దేవుని కృపా మహీమాతిశయము వలన నాయమ రోగము కుదిరెను. కాని ఆమె ఆసంవత్సరము జూలై

నెలయంతమువకు కదలమెదల నేరక ఇంటిపట్టున నుండెను. ఆ సంవత్సరాంతము వరకును ఏ చోటికి వెళ్లక ఉండిరి.

ఎడ్వర్డు భార్యాసమేతుడై , అయిర్లండునకు వెళ్లెను. అచ్చట బ్రజలు తమరాజ భక్తి పెక్కు తెరంగుల గనఁబరచుచు, వారిని మిక్కిలి గౌరవించిరి. ఎడ్వర్డాలంకలో నొక తావుననే ఉండలేదు.ఆ రాజ్యమున దొడ్డవారు ఆయసను బిలిచి విందులు సేసిరి. అతఁ డొకచోట నాగలసి యుండెను; వేరొక స్థలమున ప్రజ లోసంగు నాతిద్యమును గొనవలసి యుం డెను; ఇంకొక తావున బుస్తక భండాగారంబులను , సర్వకళాశాలలను, పాఠశాలలను, బరీక్షింప పవలసి యుండెను. జనులుతమ కొఱతల నివారింపుడని వేడిన వేడికోలునకు సహేతుక ము లైన ప్రత్యుత్తరము లియ్యవలసి యుం డెను. అతఁడీ రీతులుదనయిల్లాలితో అయిర్లండున నుండి, తన దేశమునకు విచ్చేయునపుడుత్తర వేల్సుభూమికి వెళ్లెను. అచ్చట జను లారాజు దంపతులం గాంచి హర్ంబు నొంది, వారికి నాతిద్యం బొసంగిరి. ఎడ్వర్డు ఆజనుల మిక్కిలి సంతోష పరచి భార్య వెంటరా నింటికీ గ్రమ్మర నేతెంచెను.

1868 సంవత్సము జూలై నెల 6 వ తేదీని అలెగ్జాండ్రాచూలా లై యుండి, రెండవకూతు బ్రిన్సన్ విక్టోరియానుగనెను. కొన్ని నెలల వరకు రాజదంపతు లిగ్లండున నుండి యావల నైరోపాఖండ మంతయు: దిరగి వెళ్లిరి . వారు తొలు

దొల్త ఫ్రెంచి రాజ్యమునకు వెళ్లి పాస్సునగరంబునఁ గొన్నిరోజు లుండిరి. ఫ్రెంచి దేశ పుటడవులలో నాదేశపు రాజును, ఎడ్వర్డును, ఇంకను పెక్కు మంది వెంటరా వన్యమృగంబుల "వేటాడ బోయిరి. ఏడ్వర్డొక వైపున మెకంబుల గురి వెట్టి కాల్చుచు.. నాయన పైకి నొకకూర మృగంబురికెను. కాని అతఁడు దానివలనఁ గీడెంత మాత్రమును బొందడయ్యె' లక్ష్మీకళత్రాంశసంభూతులైన మహావీరులకు నెప్పు డైన దొసగు పొసఁగు నె? ఆవల నారాజదంపతులు డెన్మార్కు రాజ్యముసకుఁజను దెంచిరి. అచ్చట నలెగ్జాండ్రా పుట్టిన దినమహో త్సనమును డెనార్కు, ప్రభువతి వైభనమున నడిపించెను. ఎడ్వర్డలెగ్జాండ్రా లారాజ్యమును వదలి జర్మ ని రాజ్యంబునకు నేఁగిరి. జ ర్మని దేశ యువరాజు ఎడ్వర్డు బావ. అతనితం డ్రి వీరల మిగుల గౌరమిం చెను. వారాచోటు వాసి, ఆస్ట్రియా రాష్ట్రము సకుఁ బోయి, ఆ దేశపు జక్రవర్తి సేసిన సపర్యలు వొంది, వా రొసంగు విందులు గుడిచి, తమదేశమునకు విచ్చేసిరి

ఆఱవ యధ్యాయము.

ఆన్యదేశాటనము.

అమెరికాలో గన్న డారాజ్యంబున నుండు ప్రజలు క్రిమి యాలో నడిచిన యుద్ధమునకు వలయు శూరులను తమరాజ్యము