సప్తమైడ్వర్డు చరిత్రము/తొమ్మిదవ అధ్యాయము
గ్జాండ్రులు డెనార్కునుండి ఏప్రెలు నేల 20 తేదిని ఇంగ్లండు నకు జనుదెంచిరి. ఎడ్వర్డు, తనయెడల జనులకుఁ గల రాజు భక్తిని దెలుపుచు వ్రాసినందుల కై , అతఁడును వారియుందు గల కూర్మిని నెఱుక పఱచు సమాచారంబులం బంపి వారిని సంతోష పఱచెను.
తొమ్మిదవ అధ్యాయము.
ఎడ్వర్డు రాజ్యమునకు వచ్చి పట్టాభిషిక్తుఁ డగుట.
విక్టోరియా మహారాణి ముసలితనంబున మేనువడంక రాజ్యమును లెస్సగం బాలించు చుండెను. ముసలీ పండు. చెట్టునుండి ఊడిపడ సిద్ధముగ నుండెను. ఇంతలో మృత్యు దేవత అను ఫలాభిలాషి. తన గడ ఆనురోగముతో నాపండునుగోయఁ బూనెను, ఆగడ ఆఫలమును తాకితాకక ముందే నేలమీఁదం బడున ట్లుండె. విక్టోరియా మహా రాణి వ్యాధిచే బీడింపబడు చుండినను, మరణావస్థను సహించుకొని 1901 స. జనవరి నెల "తే 22 వ దిని స్వర్గస్థురాలయ్యె. అప్పు డాదేవేరి పుత్రు లును, పుత్తికలును, పుత్రులును, ప్రహేతులును, ఆమె సమీ పంబుస నుండిరి. ఎడ్వర్డు తల్లిచావున కై దుఃఖించు చుండెను. మంత్రు 'లేతెంచి ఆయన శోకము శాంతింపఁ జేసి రాజ్యభారమును వహింప బ్రోత్సాహపరచిరి ఎడ్వర్డు తన యుమ్మిలికంబు నుపశమింపఁ జేసికొని, తల్లి కిఁ బరలోక క్రియలు నిర్వర్తించి రాచ కార్యములు సేయఁ బూ నుకొనెను. మఱుసటి దినంబున నాతఁడు సెంట్ జేమ్సు నగరుస ఇంగ్లండు దేశ రాజ కార్య ధురంధురుల మ్రోల నిట్లు ప్రసంగించెను........
“మాతల్లి గారు చనిన తోడ్తో రాజ్య భారనుంతయును మేము వహింపవల సినవార 'మై యున్నారము. మేము మన దేశ చట్టములకు లోబడి క్రమము తప్పక రాజ్యముఁ బాలింపవలయు ననియు, మా మేన బ్రాణ ముండు పర్యంతము. మాజనులను క్రమమార్గమును బాలించి వారు మంచిదిశకు వచ్చుటకు బాటుపడు చుండు వారము.
మాకుఁ బూర్వము మావంశస్థులలో నార్గురు రాజులకు నెడ్వెర్డని ఉండిన పేరుతో "నేను ఏడవయేడ్వడ్డని వ్యవహరింపవలయు నని నిశ్చయించు కొని ఉన్నాను. సత్యమార్గమున నడిచి, లోకులకు మేలు సేపి, జగద్విఖ్యాత యశులను, కీర్తి శేషులును, అయిన మాతండ్రి పేరును 'ఎడ్వర్డు' అను నామము నకు ముందుఁ జేర్చి, “ఆల్బర్టు ఎడ్వర్డు' అని జనులు నన్నుబిలు చుటకుఁ గోరు చున్నాను,
ఎడ్వర్డు తల్లి మరణమున కై మిగుల దుఃఖతుఁ డయ్యును మంత్రులును, ఆయన రాజ్యముల యందలి జనులు చెప్పిన యూఱట పలుకుల వలనను, హృదయరంగము నా క్రమించు కొనిన చింతను దుడిచి నైచి రాజ్యభారమును వహింపఁ బూ నెను వీక్టోరియా మహారాణికిఁ బరలోక క్రియలు సమ స్తరాజ చిహ్నములతోఁ జక్కగ నడిచెను. ఆయమ చుట్టాలందఱును విచ్చేసి యుండిరి. కాని అదేవేరి మనుమడు జర్మని దేశము
యొక్క. యువరాజు తట్టమ్మవారిచేఁ బీడితుఁడై ఉండినందున అవ్వ మరణ సమయంబున సింగ్లండునకు రాఁజాలక ఉండెను. ఎడ్వర్డు రాజ్యమునకు వచ్చిన రెండవ యేఁట నాయన కుమా రుఁడు ఇంగ్లండు విడిచి తమ్మిది నెలలు బైటఁ దిరిగి యావల దనదేశమునకు నే తెంచెను.
1901స. న. విక్టోరియా స్వర్గస్థురాలయ్యెను. ఆప్రికా ఖండంబున బోయర్ల తో డీ యుద్ధము పరిసమాప్తి "కాక యుం డెను. అందు ననేకులు రాజునకై ప్రాణములను గోలు పోవు చుండిరి. ఆగస్టు నెలలో నెడ్వెర్డుతో బుట్టువు వ్యాధిచేఁ బీడితు రాలై కాలధర్మము మొదెను. అతఁడు ఆయమ చావు కాల మునఁ జెంగట నుండుటకు వీలు లేక పోయెను గానీ, ఆయు మకుఁ బరలోక క్రియలు జరుగునపుడు భార్యాసహితుఁ డై వచ్చి, ఆచోటఁ గొన్ని దినము లుండి, పిదప డెనార్కు రాజ్యమునకు నేఁగి, అట నేతెంచిన రుప్యా చక్రవర్తులు మున్నగు వారికి దర్శనం బొసంగి, ఇంగ్లండునకుఁ బుత్తెంచెను.
1912సం. స ఎడ్వర్డునకుఁ బట్టాభిషేక మహోత్సవము నడుచుటకు మంత్రు లుద్యమములు సేయసాగిరి. ఎడ్వర్డు పార్ల మెంటును రాజై తెఱగెను. అతఁడు గొప్పవారికి విందు చేసెను. ఎడ్వర్డ లెగ్జాండ్రుల పట్టాభి షేకమహోత్సవ మతి వై భవంబున జరుగు నని జనులు అనేక దేశములుముడి లండను పురికీ 'రావలయు నని కోరు చుండిరి. మంత్రులు ఆపురవరము
నన్ని విధముల నలంక రించికి. పరరాజ సమూహంబులకును, సామంత ప్రభు ప్రకరంబులకును, ఎడ్వర్డు పట్టాభి షేకమహోత్స వమును వీక్షించుటకు రావలయు నని కమ్మలు వోయెను. ప్రతి మనుష్యుడును, ఎడ్వర్డు పట్టాభి సేకవు సంబరమును గుఱించి యే వేళఁ బలుకుచుండెను.
దక్షిణాఫ్రికా ఖండంబున బోయరులతోడి, కలహవై శ్వానరుఁడు చల్లారెను. ఎడ్వర్డు చింత కొంతవఱకు నుపశమించె. జూను నెలలో బట్టాభి షేకము నడుచుటకుఁ బ్రయత్నములు అత్యుత్సాహమునఁ గొన సాగు చుండెను. ఆల్టెరుషా టను చోట నాంగ్లేయుల సేనాసమూహముల సొంపు నెడ్వెర్డు వీక్షింప బోవు నని తెలియఁ జేయఁ బడెను. కాని అతఁడు రోగపీడితుఁ డైనందున నచ్చోటి కిఁ బోలేఁ డయ్యె.
అతడట్లున్నను, భార్యాసహితుడై వింజరునకు నేతెంచి, ఆచోట రెండుమూఁడురోజు లుండి. లండను పురికి నే తెంచెను. ఆతని నాశ్రయించిన వ్యాధి యెంతమాత్రము తగ్గిన టులు గాన్పింప లేదు. అది రానురాను పెరుఁగుచునే ఉండెను. అయినను బట్టాభిషేకము గాంచుటకు నువ్విళ్లూరు చుండు జనుల యభిలాష, సిద్ధింప దేమో అని ఎడ్వర్డు చింతించు చుం డెను.. రానున్న రాక పోవు నా ? ప్రభవు లైనను తమకుఁ గలుగు నాపదలు రానీక తొలగింప జేసికొనక గలరా? ఇదేమిమాట! ఎడ్వర్డును రోగపీకతుఁ డైనందున జూను నెలలో
నడువ వలసిన పట్టాభిషేకము ఆగస్టు నెలలో జరుగు నని ముత్రులు తెలియఁ జేసిరి.
ఎడ్వర్డు వ్యాధి క్రమముగఁ గుదుటఁ బడఁ జొచ్చెను. సర్ ఫ్రెడరిక్ ట్రీవ్సు(Sir Fredrick Treyes) అను వైద్యుఁడు ఆయనకుఁ జికిత్స సేయుచుండెను. ఆయువు బటువుగ నుండె నేని, ఏమం దైనను రోగమును కుదుర్చును. కొన్ని వేళలలో బీదల రోగములు మందులు లేక కుదిరి పోవు చుండును. ఎడ్వర్లు రాజాధిరాజు. అతనికి రోగము వచ్చినప్పుడు అనేకు లావ్యాధిని మాన్పుటకు వచ్చి రనుటలో నాశ్చర్య మేమి ? ఎడ్వర్డు వ్యాధి నెమ్మది పడెను. జూను నెలలోఁ బట్టా భి షేకము నడువక పోయినను, రాజ్యము సభివృద్ధిఁ దీసికొని రావలయు సని పాటుపడిన వారికి నాప్రభువు ప్రాలుమాలక బిరుదుల నం పించెను. సౌలి స్బెరీ ప్రభువు తన మంత్రి పదమునుండి తొలఁగి విశ్రాంతి జందెను. అతని పదమునకు బాల్ఫరు ప్రభువు వచ్చను.
ఎడ్వర్డు వ్యాధి బాగుగ నుపశమించెను. ఆగస్టు నెల 9 వ తేది శనివారమునాఁడు ఆతనిపట్టాభి సేకము వెస్టుమినిస్టరు భననంబున నడిచెను. పర రాజులును, సామంత ప్రభువులును, శ్రీమంతు లైన వర్తకులును లెక్కకు మిక్కిలి యై వచ్చిరి. పట్టాభి పేకపు సంబరములు గాంచి సంతృప్తులై ఆయనకుఁ గాను కలను సమర్పించి, ఆయనవలన మన్ననలువడసి, తమతమ దేశములకు "నేఁగిరి.. ఎడ్వర్డు తన పట్టాభి సేక మహోత్సవ వేళ లండనువురిలో నుండు వై ద్యాలయమునకు ధర్మార్థము రూ 17, 25,000 లను ఇచ్చెను. అతఁ డోస్బో రనుభ వనమును తన జనుల యుపయోగార్థము విడిచెను. తదాదిగ నామందిరం బున రణశూరులు నివసించు చుందురు. ఎడ్వర్డు పట్టమును గట్టుకొని తనవశమునఁ దనతల్లి విడిచిన ప్రజలను స్కాకుటకుఁ బ్రారంభించెను.
పదియవ అధ్యాయము.
ఎడ్వర్డు ప్రభుత్వము
ఎడ్వర్లు ప్రభుత్వమునకు వచ్చినతోడ్తో బరరాజులతో మైత్రిని మెలఁగఁ గోరెను. అతఁ డందుల కై సదా అన్య దేశం బులయందుఁ గ్రుమ్మరు చుండువాడు.
1908 సం. న ఏప్రెలు నెల నాతఁడు పోర్చుగీసు రాజ్య మునకు రాజధాని యైన లిస్బను, జీబ్రాల్టరు, మాల్టా, 'నీపిల్సు, రోము, పారిసు, మొద లగుపుట భేదనంబులకు వెక్లెను. లిస్బను పురంబున నా రాజు ఎడ్వర్డు, న నేక భంగుల గౌరవించెను. రోము పురి వాసు లాయనకు సంప్రీతిని విందులు సల్పిరి, పారిస్ పురం బున్న ఫ్రెంచివారితో నాతఁడు నిండుమచ్చిక గొంత కాల ముండి రగులు విరోధాగ్ని నాగ్పి తన టెంకీకిఁ జ నెను.
ఫ్రాన్సు దేశమును ముందు రాజులు పాలించు చుండిరి.