సప్తమైడ్వర్డు చరిత్రము/పదియవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

వేళ లండనువురిలో నుండు వై ద్యాలయమునకు ధర్మార్థము రూ 17, 25,000 లను ఇచ్చెను. అతఁ డోస్బో రనుభ వనమును తన జనుల యుపయోగార్థము విడిచెను. తదాదిగ నామందిరం బున రణశూరులు నివసించు చుందురు. ఎడ్వర్డు పట్టమును గట్టుకొని తనవశమునఁ దనతల్లి విడిచిన ప్రజలను స్కాకుటకుఁ బ్రారంభించెను.

పదియవ అధ్యాయము.

ఎడ్వర్డు ప్రభుత్వము

.

ఎడ్వర్లు ప్రభుత్వమునకు వచ్చినతోడ్తో బరరాజులతో మైత్రిని మెలఁగఁ గోరెను. అతఁ డందుల కై సదా అన్య దేశం బులయందుఁ గ్రుమ్మరు చుండువాడు.

1908 సం. న ఏప్రెలు నెల నాతఁడు పోర్చుగీసు రాజ్య మునకు రాజధాని యైన లిస్బను, జీబ్రాల్టరు, మాల్టా, 'నీపిల్సు, రోము, పారిసు, మొద లగుపుట భేదనంబులకు వెక్లెను. లిస్బను పురంబున నా రాజు ఎడ్వర్డు, న నేక భంగుల గౌరవించెను. రోము పురి వాసు లాయనకు సంప్రీతిని విందులు సల్పిరి, పారిస్ పురం బున్న ఫ్రెంచివారితో నాతఁడు నిండుమచ్చిక గొంత కాల ముండి రగులు విరోధాగ్ని నాగ్పి తన టెంకీకిఁ జ నెను.

ఫ్రాన్సు దేశమును ముందు రాజులు పాలించు చుండిరి. . రాగి (ఫ్రెంచిజనులు తమదొరలు తముఁ జక్కఁగఁ బాలించుట లే దని వారిమీఁద దాడి వెడలి వారిని రాజ్యచ్యుతులుగఁ జేసి, తా మే తమదేశమును బాలింపు గడంగిరి. వారండఱును ఏటటనో "రెండేండకు నొకతడవనో తమలో ఒక తెలివి కలమెలకను తమకుఁ బాలనలో సాయము సేయుటకు నీయ మించుకొను చుందురు. అతనికి "ప్రెసిడెంటు” అని పేరు. మనము వాని నే అధిపతి అని చెప్ప నొప్పును. ఇతఁడు. తన యావజ్జీవపర్యంతము రాజ్యము నేలఁడు. ఇతని వంతుకాలము ముగిసిన వెంటనే ఇతనిస్థానమునకు నికొకఁడు వచ్చును. ఇతని సంతతివారే రాజ్యమునకు రావలయు నని చట్టము లేదు. ఇతని చేఁ జేయఁబడు ప్రభుత్వము జనుల ప్ర భుత్వ ముని 'చెప్పుబడును. దాని నే ఆంగ్లేయ భాషలో రిపబ్లిక్ ( Republic ) అని చెప్ప దురు. "రాజు" అనునాత డు తనయావజ్జీవము రాజ్యము నేలును. ఇతని వెనుక ఇతనికి బట్టిన వారు రాజ్యమునకు వత్తురు, ఆదేశ ప్రభుత్వ మీతని దై యుండును, దీనికి ఏక రాజ్యా ధీపత్య మని పేరు.

జూలై నెలయందుఁ బారాశు దేశ ప్రజా ప్రభుత్వమునకు మేటి యైన లూ బెట్టు(Louhet)అను నాతఁడింగ్లండునకు నే తేం చెను. ఎడ్వర్డును, ఆతనిముత్రులను, ఆ ఫ్రెంచి దేశాదీశునకు సకలమర్యాదలు సల్పి, సెంజేంసుస్సు నగరంబున విందు లొనర్చిరి. ఇందువలన నాంగ్లేయులకును, ప్రెంచి వాకిని ని, కల మైత్రి వృద్ధి యయ్యెను. నవంబరు నెలలో ఇటలీ దేశాధీశుం డింగ్లండునకు విచ్చేసి ఎడ్వర్డునింట నతిథి యై కొన్ని దినము లుండి తిరిగి తస రాజ్యమునకుఁ జనెను.

ఎడ్వడు భార్యాసహితుఁ డై స్కాట్లండు ద్వీపమునకు వెళ్లెను. అచ్చట నాప్రజలు ఆరాజదంపతుల ననేక రీతుల సత్కరించి తమరాజుభ క్తిని దెలియఁ బరిచిరి, అతఁ డాచోటు వాసి జూలై నెలలో నైర్లండు లంకకుఁ జనెను. అతని వెంట నాత ని పత్నియును వెళ్లెను. అయిరిషు జనులా రాజదంపతులకు స్వాగతంబు నొసంగుట లేదని తిరుగఁబడినను, వారిలో రాజ భక్తి సంపన్ను లనేకులు వారియెడ ననురాగము కలవారే పెక్కు తెఱగుల వారిని గౌరవించిరి.. అయిరిషు జనులు క్రైస్త ప మతమున రోమను కాథలిక్కు మతస్థులు, వారికి రోముపురిలో నుండు గురువు మతాచార్యుడు. అతని పేరు పదుమూఁడవ పోపులి యో'. ఆమతాచార్యుఁ డప్పుడే సిద్ధి చెందెను. అయిరిష్ జనులు తమ మతాచార్యుడు స్వర్గస్థుడయ్యె సనికుందు చుం డిరి ఎడ్వర్ణట్టి వారిని అనునయించి, నాకోపాకాగ్నిఁ దన వాక్సు ధావర్షముచే నార్పి, మేనూత్ నగరంబునకు నేతెంచి, అయి రిష్, జనులలో మతగురువులు బాలురు విద్య నభ్యసించు నాలయ మును బరీక్షించి, ఆయిరీషు జనుల యుదార బుద్ధి సంపదలను మెచ్చుకొని, అయిర్లండులో బీదలు నివసించు పల్లెలకు వెళ్లి, అందలి రిక్త జనులం గాంచి పరిస్థితిని జూచి వారి కై దుఃఖంచి వారికిఁ గొంత ద్రవ్యసాహాయ్యము సేసి, అయిరిషుజనుల ప్రీతి వడసి తన రాజ్యమునకు వేంచేసెను.

ఎడ్ర్డ లెగ్జాండ్రులు “విక్టోరియా” అను కుమార్త వెంటఁ జనుదేర నైర్లండులంకకు వెళ్లి.. ఆదీవికి రాజధాని యైస డబ్లీ నను పురంబున నాతఁ డొక కళాశాలకు న స్తిభార మును వేసెను. కిల్కని, లీన్ మోరు, మున్నగు తావులలో నా రాజదంపతులకు సకల మర్యాదలు నడిచెను. వార లాతా వును వదలి తమదేశమునకు మరలిరి.

ఎడ్వర్డ నేక పర్యాయములు ఖండమందలి గొప్పగొప్ప పట్టణబులకు వెళ్లి ఆ రాజుల మైత్రిని అంది వచ్చుచుఁ బోవు చుండెడివాఁడు. కాని అతఁడు జర్మని దేశములో బెర్లినను సగ రంబునకుఁగాని అందలి మఱే పట్టణంబునకుఁగాని నెళ్లి యుండ లేదు. జర్మని రాజ్యమునకును, ఇంగ్లడుకును, గల రాజకీ యవ్యవహారములు శుభ సూచకము లైనవిగ గస్పట్ట లేదు. ఎడ్వర్డు జర్మని దేశములో నుండు కీలను తావునకుఁ జనెను. జర్మని రాజు ఆచోట నాయింగ్లండు నొడయని మిక్కిలి గార వించి ఆయన నభినందించెను. ఎడ్వర్డావల హాంబర్గునకు నే తెంచి, అందలి జను లొసంగు విందుఁ గుడిచి, కీలునకుఁ జను దెంచి, ప్రష్యారా కొమారు కొసంగిన నాతిద్యంబుఁ బొంది, రుష్యా దేశ చక్రవర్తి కుమార్త నామకరణ మహోత్సవమును గన నారాజ్యమునకు వెళ్లి, క్రమ్మఱ దన యిరవునకు నరుదెం

చెను. ఇందు వలన నాంగ్లేయులకును జర్మనివారికిని, గలచుట్ట ఱికము బాగుగ వర్ణిల్ల సాగెను.

1905 సం, న ఎడ్వర్డు విశేషఘన కార్యము లొనర్చిన టులఁ గాన్పింప లేదు. కాని అతఁడు అయిరోపా ఖండ మందలి పర రాజులతోఁ జెలిమిని బలపఱుచు నుండెను.

ఎడ్వర్లు మధ్య ధరాసముద్రమున నుండు లంకలను గాంచి వచ్చుటకుఁ బయనము సేసెను. అతఁడు తనకు ముందుగ వెళ్లిన అలెగ్జాండ్రాను మార్సేల్సులోఁ గలిసికొనెను, అతఁడు ఫ్రాన్సు రాజ్యపు టోడయనిఁ జూచి మధ్యధరా సముద్రముండలి వర్జీనియా మున్నగు లంకలకుఁ జను దెంచి, ఆయా తావులలో నుండు జనులొసంగు సపర్యలను గైకొని భార్యాసహితుఁ డై తన గీమునకు "నేతెంచెను.

జూలై నెలలో సముద్రమునఁ బోరుసలుపు నాంగ్లేయ నౌకావీరులు "ఫ్రెంచి వారి దేశమునకు నేఁగి వారిచే విందులు గొని క్రమ్మఱ నింగ్లండునకు నచ్చిరి. ఆగస్టు నెలలో ప్రెంచి వారి యుద్ధ నావ ఆంగ్లంమునకు వచ్చెను. ఎడ్వర్డు ప్రభృతులు వానిని గని ప్రమోదభఃతాంతరణగు లైరి. ఫ్రెంచి వారి యుద్ధ వీరులకు లండను పట్టణంబు విందులు నడిచెను.పార్లమెంటు సభాసభ్యులు వారిని మిక్కిలి అభినందించిరి.

నవంబరు నెలలో నెడ్వర్డు జన్మదిన మహోత్సవము జరి గెను. ఇంగ్లండు రాజ్యమునకు మేలు చేసిన వారికి బిరుదావ

శులు సేరెను. ఎడ్వర్లు జ్యేష్ఠపుత్రిక " ప్రిన్సస్ రాయల్ (Princess Royal) అనియును, ఆయమబిడ్డలు రాజవంశం బునఁ జేరిన వారనియును, చాటింపఁబడెను..

నార్వే రాజ్యమును, స్వీడను, ఏకమై ఉండెను కాని, ఆరెంటిలో నార్వే రాష్ట్రము వేఱు పోయెను. దానికి డెన్మా ర్కు రాకోమారుఁడు చార్లెస్ అను నాతడును, ఆయస భార్య యును, ఎడ్వర్డుకూఁతును అయిన మాడ్లను రాచ పట్టియును, రాజును, రాణీయును, అయిరి. ఈ రాజదంపతు లిరువురు నార్వే రాజ్యలక్ష్మిని బొరసి దాని పాలింప సాగిరి.

షేఫీల్డులోఁ గట్టిన సర్వ కళాశాలా భననంబులను, మాం చెస్టరునుండి సముద్రము వఱకు ద్రవ్విన కాలువను, లండను నగరంబునఁ గొత్తగ 'నేర్పఱచిన కింగ్సు వే, ఆల్డ్ విచ్ అను రాజవీధులను, ఎడ్వర్డు తెఱిచెను. అతడు రణ శాస్త్రము నభ్యసించెడి బాలురను కొందఱను బరీక్షించి సెంటు మార్టిన్ స్లీ గ్రాండులో (St Martin's - le - Grand) తపాలా శా లకు నస్తీభారమును వేసెను.

1906 సం. న లిబరులును, లేబరు పార్టీ వారలును జయ ప్రదు లై ప్రభుత్వమును వహించి. సర్ హెన్రికాంబల్ బాన ర్ మా నను నాతడు మంత్రిపదంబున నెలకొనెను. ఎడ్వర్డు సమస్త దేశ రాజులలో లేని పోనికలహలములలోఁ బ్రవేశింపక నెమ్మదిగఁ బృద్విని పాలించు వా డని చిర కీర్తి సంపాదించెను.

కాఁబట్టి బానర్మాను మున్నగు ప్రధానులు ఎడ్వర్డుమాట చొప్పున రాజ్యమున రాచకార్యముల నడుపు చుండిరి.

ప్రాన్సు రాజ్యమున అట్లాంటిక్కు మహాసముద్రము నోర నుండు బియారిట్ జ్ అను 'పట్టణమునకు 'నేడ్వెర్డు వెళ్లెను, అతఁ డావీటికి నేలగునపుడును, మరలునపుడును, ఫెంచిరా జ్యూధి కారిని గాంచెను. అతనికి బారిస్సను వీట నా ఫ్రెంచి ప్రభువు విందు సేసెను. దీనిచే నింగ్లండునకును, ఫ్రాన్సు రా జ్యమునకును గల చెలిమి బాగుగ స్థిరపడెను.

ఫ్రాన్సు రాజ్యమున నుండు సర్వకళాశాలాధి కారులు లండను పురి సర్వకళాశాలఁ జూడ నేతెంచరి, వారందఱును గొప్ప విద్వాంసులు. వారి నెడ్వర్డ లెగ్జాండ్రులు మిగుల గౌరవించి, అనేక భంగుల నాదరించి. ఆవలఁ గొన్నాళ్లకు జర్మను 'రాజ్య మునుండి సగర పరి పాలకులు (Municipal Bodies) ఇంగ్లండు నకు నే తెంచిరి. ఎడ్వర్డు వారలను మిగులగౌరవించెను జర్మని చక్రవర్తి " క్రో బర్గు, ఫ్రెడ్ రిచ్చుషాపు ” అనుతావులకు నేగెను. ఎడ్వర్డును ఆ నోటులకుఁ జనుదెంచెను. ఆచక్రవర్తు లిద్దఱకు హేసి యొడయుఁడు విందులు చేసి వారిని మిగుల సంభావించెను.

నా ర్వేరాజ్యమును... ఎడ్వర్లు అల్లుఁడును, కొమార్త యును, ఇంగ్లండునకు నేతెంచిరి. లండను నగరంబున గిల్డుహాలు: విందుదు నడిచెను. ఎడ్వర్ణ లెగ్జాండ్రులు వారి రాకకు మిగుల

సంతోషించి, తమ మనుముని నెత్తి ముద్దాడి చిరుతకు చిత్ర విచిత్రము లైన వస్తువుల మెసంగిరి.

ఎడ్వర్డు పెద్దకుమారుఁ డై జార్జి యువ రాజును, ఆతని యేలిక సానియును, హిందూ దేశ ముసకు వెళ్లి, క్రమ్మఱ దమ పురికి విచ్చేసిరి. ఎడ్వర్డు వారలకు సగౌరవంబున స్వాగత మిచ్చెను.

న్యూ కాజు లను పురంబున పైనను నది పై వంతెన కట్ట బడెను. ఎడ్వర్డు దానిని దెఱి చెను. అది నాతని పేర ప్రసిద్ది గాంచెను. అతడు ఆబర్డీ నను సర్వక ళాశాలలో మారీష్ కల్ కాలేజీని తెఱచెను.

1907 సం. న ఎడ్వర్డు తన భార్యామణి వెంటరా మధ్య ధరాసముద్ర యానము సేయ నారంభించెను. త్రోవలో నుండు స్పైను దేశాధీశ్వరుఁడు ఎడ్వర్డు నెదుక్కొని మిక్కిలి గౌర వించెను. ఎడ్వర్ణావల నిటలీ ఱేనిని దర్శించి, ఆయనతోఁ జాల "కాలము సంభాషించి, జర్మని రాజ్యమునకు నేఁగి, ఆచక్రవ ర్తితో గొంతకాలము ప్రొద్దుపుచ్చి తన టెంకికిఁ జను దెంచెను. ఈ సమయమున డెన్మార్కు నొడయఁడును, ఆయ: దొరసాని యును, ఇంగ్లండునకు వచ్చి ఎడ్వర్డునింట నతిదులై ఉండి, తమ రాజ్యమునకు వెళ్లిరి.

ట్రాన్సు హాలు దక్షిణాఫ్రికాలో నొక రాజ్యము. ఆయది. కెంపులు రవలు కల గనులకుఁ 'బేరు వడసి యుండును. అందలి జనులు తమకు 'సెడ్వర్డు నెడ కల రాజభ క్తి విశ్వాసములు నెల కొల్పుచు, అపూర్వ మైన రత్నాభరణమును చేసి ఎడ్వర్డునకుఁ గానుకగా సమర్పించిరి. ఆతఁడు దాని జిగికి మదిని మెచ్చుకొని, దానిని రెండుగం జేసీ, కీరీటంబుల బొందిక పఱిచెను. ఆరత్నము వారి కిరీటంబుల నెలకొని ఎడ్వర్డు లెగ్జాండ్రులలో లేని కాంతిని గల్పించెను.

ఎడ్వర్డింతకు మున్ను జర్మని దేశమునకు వెళ్లి ఆ రాజ్యపు టోడయనిఁ గాంచి తన దేశమునకు మర లెను. జర్మని రాష్ట్రపు రాజు అమాత్య సహితు డై పరిజనులు తన్నుఁ బరి వేష్టించికొ లువ నింగ్లండునకు విచ్చేసెను. ఆయనకును, ఆయన ధర్మపత్ని కిని, అతని వెంటఁ జనుదెంచిన పరిజనములకును, వింజరు భవనం బున నెడ్వర్డు వింద్లు సలిపెను. ఆక్సు ఫోర్డు సర్వకళాశాలాధి కారులు జర్మని ప్రభువునకును డి. సి. యల్. (D.C. L.) అనుపట్ట మొసంగి. ఆ రాజును, ఆతని పరివారమును, ఇంగ్లం డునఁ గర్నల్ స్టూవర్టువోరెట్లి (Colonel Stuart Wortley) అను నాతని యునికి పట్టయిన హైక్లీఫ్ కాజులునఁ (High Cliff Castle) 'బెక్కురోజు లుండి తన దేశ ముసకుఁ జనెను. ఈతని రాక చే నాంగ్లేయులకును, జర్మని వారికిని, అంతరంగమున నుం డువిరోధము పరిసమాప్తి నొంచెను.

ఇంగ్లండునకు లోబడి యస్య రాజ్యము అనేకము లున్నవి. ఎడ్వర్డునకు మాఱుగ నాయన ప్రతినిధు లారాజ్య బులఁ బాలించు చుందురు. వార లింగ్లండున నొక సభ గావించిరి. ఎడ్వర్డు వారిని సగౌరవమున నాహ్వానము సేసి, వారిని మిగుల గొండా డెను. నేరస్థులను విచారించుటకు న్యాయస్థాన మొకటి ఏర్పడెను. ఎడ్వర్డు దాన్ని దెఱచి అందున్యాయాధికారులు న్యాయాన్యాయములఁ జక్కఁగఁ బరిశీలించి అనత్య విరోధు లై ఉండవలయునని వక్కాణించెను.కార్డిఫ్ అను పురంబున నోడలు నిర్మించుటకు దొరురు వంటి దొకటి త్రవ్వ బడెను. దానికి " అలెగ్జాండ్రా డాక్ " అని పేరు పెట్టబడెను.ఎడ్వడు దానితూము దెఱచిన పుడు గనులలోఁ బని 'సేయు కూలివాండ్ర ప్రాణములు: గాపాడు వారికిఁ దన పేర నొక పతకమిచ్చునటుల మాట చెప్పెను.

1908 సం. న ఎక్వర్ణ లెగ్జాండ్రులు, తమ రాజ్యమునువదలి డెనార్కునకును, స్వీడను, నార్వే, మున్నగు రాజ్యములకును వెళ్లి, ఆయా రాజుల గని వారు సేయు సపర్యలను బొరసి తమనీటికిఁ జనుదెంచిరి. ఈయేఁటఁ బోర్చుగలు దేశాధీశ్వరుని నాతని రాణి నాదేశమున నుండు నేక రాజ్యాధిపత్యము నొల్లనివారు మృత్యువువాతఁ బెట్టిరి. అ నేక బ్రభువు లాతుంటరుల చెడు చెయ్దం బులం దలచి తమ ప్రాణముల నర చేతుల యందిడు కోని భయా క్రాంత స్వాంతులై ఉండిరి. అయిన ఎడ్వెర్డును అతని రాణియును, ఆయనకుమారుఁ డైనయువ రాజును, కోడ లును, "సెంటు జేమ్సుస్పానిషు దేవాలయమునను, " సెంటుపాలు

గుడియుచునను దేవతారాధనల నడపించి, పోర్చుగలు రాజు నాత్త సదయహృదయుఁ డైన దేవునిలో లీన మగుఁ గాక అని భగవన్నామ స్మరణ సల్పిరి.

జూను నెలలో ఎడ్వర్డు ధర్తపత్నీ సహితుడై రీనాలు' నగరంబున విడిపి యున్న ముహ్య చక్రవర్తి కుటుంబమును జూడ వెళ్లెను. ఆనేకు లాయనను రుష్యా చక్రవ క్తిని జూచుట దూల నాడిరి. కాని ఎడ్వర్డు వారినుడువుల నొప్పరికించి తనయిచ్చమై నచ్చట వానిరేనితోఁ కొంతముచ్చటలాడి తన పురంబునకు విచ్చేసెను. అతఁడు తనయింట దొడ్డ సర్దారులకు విందు నొన ర్చెను. ప్రజల సభామందిరంబున నుండు సభ్యులలో రాజదూ షణ గావించిన వారికీ నాతఁ డాహ్వానపత్రికను బనుప లేదు. లీడ్సులో గట్టిన సశ్వకళాశాల భవరంబును ఎడ్వర్డు దెఱచి- ఇట్టి సర్వకశాలలు తన రాజ్యములలో నెల్ల చోటులం దల్లు కొనవలయు నని మందలిం చెను.

సన్ హేన్రికాంబెల్ బానర్మా నను ప్రధాన శ్రేష్ఠుఁడు తన పదవిని విడిచి విశ్రాంతిని జెందెను, అప్పుడు ఎడ్వర్డు ఫ్రాన్సు రాజ్యమున నుండు బియారిట్ జ్ అనుపురంబున నుండి, తన కడకు ఆస్ క్విత్తును రమ్మని ఆజ్ఞ సేసెను. అనేకు లెడ్వర్డు నాక్షే పించిరి. అతఁడు మాటల నాలకింపక ఆప్ క్విత్తును మంత్రి పదంబునఁ దాను ఫ్రాన్సున నుండినపుడే నియమిం చెను.

ఇగ్లండు రాజును, రాణియును, స్వీడను రాజును, అత

నిరాణియును, ఇంగ్లండును జూడ నేతెంచిరి. వారి వెంట నార్వే దేశాధీశ్వరుఁడు పల్నీ సహితుడై" ఇంగ్లండునకు విచ్చేసి తమరాజ్యమునకు ముఱలెను.

1909 సం. న ఇంగ్లండు పృథ్వీరమణండు పరిజన పరి వృతుండై సమస్తరాజచిహ్నముల , జర్మని దేశమునకు నేఁ గెను. ఈతని రాకవలన సంతకు ముందున్న రాజు పగ అనునగ్గి చల్లారెను. జర్మని ప్రభువు ఇంగ్లండు నేలికకు సకల మర్యాదలు సల్పెను. బెర్లిను పురవాసులు ఎడ్వర్డు రాజమార్గంబున నూ రేఁగునపు డాతని పైఁ బూలవానలు కురియించి, అనేకు లనేక భంగులఁ దమకు నింగ్లండు నెడ కల ప్రీతి విశ్వాసములను దెల్పిరి.

ఎడ్వర్డు జర్మని వదలి ఇంటికి నే తెంచిన పిదప నప్పు డప్పుడు రోగ పీడితుఁ డగుచుండు వాఁడు. అతడు ఫ్రాన్సులో నుందు బియాకిట్టునకు నారోగ్య ప్రాప్తి కై వెళ్లు చుడును, ఆతఁ డీయేఁట నాపురికి వెళ్లెను. బియారిటునకుఁ జేరువ నుండు "పా " అనునూరిలో విల్బరు రైటను పండితుడు భూమ్యంత రిక్షముల నడుమ నడుచు నాకాశ యానమును నిర్మించి పరిషరి విధముల దాని నడుపు చుండెను. ఎడ్వర్డా చోటికి వెళ్లి ఆపం డితుఁ డాయా కొత్త విమానంబునఁ గూర్చుండి బుర్రున 'నేలనుండి పైకి నెగురు నపుడు గని విస్మాయానంద చేతస్కుండై . ఆవిద్వాం సునివలన నావిమానము నిర్మించు రహస్యంబులను గ్రహించి తనవీటికిఁ బు తెంచెను.

రుష్యాదేశ చక్రవర్తి జయాస హితుండై కౌసులో నుండు నెడ్వర్డు కడకు విచ్చేసెను, ఎడ్వర్డాయనను మిక్కిలి గౌరవిం చెను. కాని పార్ల మెంటు సభ్యులలోఁ గొందఱు మన యెడ్వర్డు రుష్యా చక్రవర్తిని గౌరవించుట నానావిధంబుల 'నా క్షేపించిరి. అతఁడు వారిమాటల నాలకించిన వాడు కాడు. ఇందువలన నింతకు ముందు రుష్యాలో నడిచిన వివాదాన్ని మొదలంట నారిపోయెను,

ఎడ్వర్డు ఆగస్టు నెలలో నాస్ట్రియాకు వెళ్లి బొహిమియా నగరమునకు సమీపంబున నుండు “మెరైన్ బాడు” అనుపల్లెకు వెళ్లెను. ఆ గ్రామ మనారోగ్యదశ చేఁ బీడింపఁ బడు వారికి సంజీవి వంటిది. ఆతఁ డాచోటఁ గొన్నాళ్లుండి డానిని గొప్ప పట్టణ ముగఁ జేసెను. ఆస్ట్రియా దేశ వైద్యుఁ డైన డాక్టర్ ఆట్టను వాడు ఏడ్వర్ణునకు దివ్యౌషధముల నిచ్చు చుండెను. ఎడ్వర్గా వైద్యుని మందులవలన మంచి యారోగ్యదశకు వచ్చిన పిమ్మట నింగ్లండునకుఁ జను దెంచెను. నవంబరు నెలలో పోర్చుగలు'రా కొమాడు డింగ్లండు నకు నృతెంచెను. అతని తల్లి దండ్రులు క్రూరులచే నక్రమముగ న కాలమరణము సెందియుండిరి. ఆరాచ పసివాఁడు ఎడ్వర్డుకూఁతు స్వరియింప నే తెంచె నసి ఒక మాట పుట్టి యుండెను, కాని ఆమాట ఎంత మాత్రము సత్యము కాదు. ఎడ్వర్డా పసివానిని గౌరవించెను.

1910 సం. న పచ్చు వచ్చుబడి సెలవుల లెక్క తయారు సేయవలయునని ఎడ్వర్డుమంత్రులు పార్లమెంటులో జర్చించిరి. ఎడ్వర్డు కోరికకు విరోధముగ నా లెక్కల పట్టి తయారగు నటులఁ గన్పట్టెను. అందుచే ఎడ్వర్లు వారికి విరోధముగఁ బ్రవ ర్తింప వలసియుండెను. కాని ముత్రులలో నేక్కువవారు ఎడ్వ ర్డుపక్షమున నుండి ఎడ్వర్డు కోరిక ప్రకారమున నాపట్టిని తయారు చేయించిరి.

1910 సం. వ ఫ్రిబవరి నెలలో నెడ్వడ్లు పార్లమెంటు సభ లను దెరచెను. అతఁడు మార్చి నెలాఖకురు వఱకు నూపిరి విడు చుటకుఁ గూడ విడమర లేక రాచ కార్యములు నిర్వంచు చుండెను. బీదల కష్టముల సంత మొందఁ జేయుటకు యొకసభ యేర్పడి యుండెను. ఆసభా సభ్యులు బీదల కై మిక్కి-లీ కష్ట పడిరి, ఎడ్వర్డు వారిని బహుబంగులఁ బ్రశంసించెను,


మార్చి నెల 5 వ తేదిని ఎడ్వర్డు కడపటతడవ గొలువు తీరెను. మంత్రులును, పార్ల మెంటు సభాసభ్యులును, వెండియు ననేక రాజులును, కొలువు కూటంబున నాయా తావులలో సమరి యుండిరి. ఎడ్వర్డు 'రాజకీయ వ్యవహారంబుల విచా రించి నాఁటి సాయంకాలంబున సందరకు విందు నెనర్చెను. అప్పు డ నేకులు వచ్చి సంప్రీతిమై నావిందుఁ గుడిచి తమతమ పొందుపట్లకు నేగిరి. మఱునాఁ డాది వారము. నాడు ఎడ్వర్డు, ప్రభువు భగ

వంతుని స్మరించి, స్వపుత్రబుధు వర్గములతో భోజనము "సేసి వారితోఁ గొంత కాలము ప్రొద్దు పుచ్చిడోవ నుతావు నకు వెళ్లెను. ఎడ్వర్డు ఇంగ్లండు వడలి పర రాష్ట్రములకు 'నేఁగు సపుమంత్రి వెంటఁ జను దెంచి వారి సాగనంపు చుండువా డుక. ఆవాడుక మేరకు ప్రధానమంత్రి యైన అస్ క్విత్తు వచ్చు టకు వీలు లేనందున నెవ్వ ర్జాతని క్షమించెను.

ఎడ్వర్డు ఫ్రాన్సు రాజ్యమునకు వెళ్లి, అచ్చటఁ బారిస్సు సగరంబున నా దేశాధిపతితో కొన్ని ముచ్చట లాడి బియా రెట్జ్" అను పురికిఁ బయనము సేసెను. దారిలో నాతనికి పడి సెము పుట్టెను. కాని అతఁడు దాని సంతగ గమనింపక బియా రిట్జు లో నావ్యాధి ఉపశమించుసని నమ్మి యుండెను. మను ష్యలలో లెల్ల కాలంబుల జయప్రదము లగు చుండునే? ఇప్పు డాతనికి సః ప్రాప్త మైనరోగము బలమైనది. అతఁడు తల్లిమాడ్కి బడకపై బండి యుండువాఁడు కాడు. ఆతడు తన్ను రోగము మూలముగ బీడించు చుండినను, మోటారు బండిలో సికారి పోవు చుండును. అందువలన జను లాతని రోగ మంతబల మైనది కాదని తలంచి యుండిరి.

లండనులో వెలువడు దినపత్రి క ఎడ్వర్డు వ్యాధి బలమైన దని • చాటెను. అతనికి చర్యలు సలుపు నమ్మకమైన దాది సచోటికి బనుపవలయు నని. మత్రు లాలోచించి, పూర్వ మాయనకు రోగము వచ్చినపుడు శుశ్రూష, సలిపిన దాదిని

బియారిట్జనుతావునకుఁ బంపిరి. ఎడ్వర్డు ఎప్పటి రీతిని వ్యాధి లేని వానిపగిది నుదయము సాయంకాలుబుల సికారి పోవుచు, వారి వారికి వ్రాసిన జూబులఁ జదివి నానికి దస్కతు చేయుచు, తన్ను జూడ నేతెంచిన వారిని గౌరవించుచు, విడుమరదినముల యందును రాచపనులఁ గావించుచు, మిత్రులతో నరససల్లాప ములు సేయుచు, నియమిత కాలంబుల భగవదారాధనల నొన ర్చుచు, రోగ మని శయ్య పై బరుండుక సర్వదా ఏదో ఒక పని సేయు చుండువాడు.

ఎడ్వర్డు తనపురికి విచ్చేయు త్రోవలోఁ బారిస్సు నగరం బుస బడిపిల్ల కాయలకు విందు నడిచెను. ఎడ్వర్డా చోటికి వెళ్లిన కాలంబున నాతనికి ఒక దొడ్డవాడు వ్రాసినకమ్మ జారి క్రింద బడెను. కాని అతఁడు దాని గమనింప లేదు. ఆవల నాతఁడు దానిపోకను గని దానిఁ గైకొన్న వారి నారయు చుండెను బడి పిల్లలకు నధిపతులలో నొకతె తనకు నాజాబు దొరికినదనియుఁ, దాను దానిని విప్పి చదివితి ననియు, వచించెను. అంత దాని యధి కారులు గొప్ప రాజు నుత్తరము నాయనయనుమతి లేక చదివి నందులకు నాగ్రహచిత్తు లై దానిఁ బనినుండి "తొలగింపు నుద్యమించు చుండిరి. ఈ వార్త ఎడ్వర్డు చెవినిఁ బడెను. వెంట నే అతఁ జాబడి విచారాణాధ్యక్షులకు " ఆ ముసలిది తెలియక అజ్ఞానము చే నాజాబుఁ దీసికొనినందుల కై దానిని జీవనాధారము నుండి తొలగింపకుఁడు. ఇదియ నామనవి." అని వ్రాయగా,

వారు దానిని క్షమించిరి. పిమ్మట నెడ్వర్డు తనయిరవునకు నరు దెంచెను.

ఎడ్వర్డు లండనుపురికిఁ జనుదెంచినతోడ్తోన నేకులు ఆయ నను జూడ వచ్చిరి. ఆయన వారి నందఱను గౌరవించెను. ఆయన పెద్దకూతును, ఆయమబిడ్డలును, ఇంకన నేక పర రాజు నికరంబులును, అతనిఁ జూడ నేతెంచి యుండిరి. ఎడ్వర్డు రోగ ముచే నెంత మాత్రము ప్రాలుమాలక తాను సేయవలసిన కార్యం బుల నెల్ల మంత్రుల యధీనంబున విడువక వానిఁ దానే చేయుచు, వచ్చిన ప్రభువుల సంభావించుచు నుండెను.

ఎడ్వర్డు సాండ్రింగుహాము భవనంబునకు వెళ్లెను. అతఁ డీచోట ననేక కాలంబుల నుండి ప్రొద్దుఁ గడుపు చుం డెడివాడు. అభవనమునకు నలుగడల నాయనభూము లుండును. ఆతఁ డా భూముల వ్యససాయము సేయుటకుఁ గాపులకు విడుచు చుండును. అతడాచోట నుండునపుడు వారి సౌఖ్యములకు నావంతయేనియు భంగము లేకుండ నుపాయంబుల వెదకి వారికి నెల్లసుఖంబు గలుగఁ జేయు చుండెడివాడు.. అతఁడు వారికి నిండ్లను గట్టించి యిచ్చెను. వారికిఁ గృషికి వలయు పరి కరము గొని యిచ్చెను. అతను సేద్యమునకు పలయు సౌ ఖ్యంబుల నన్నంటిని వారికిఁ గూర్చి వారి నెనరు వడయుటకుఁ బాత్రుడయ్యె.