పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వరుణునినుండి తండ్రి దెచ్చుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

(తెభా-10.1-954-సీ.)[మార్చు]

నందుఁ డేకాదశినాఁ డుపవాసంబు;
చేసి శ్రీహరిఁబూజ చేసి దనుజ
వేళ యెఱుంగక వేగక ముందర;
ద్వాదశీస్నానంబుఁ గ నొనర్ప
మునాజలము చొర నందొక్క దైత్యుండు;
నందుని వరుణుని గరమునకుఁ
గొనిపోవఁ దక్కిన గోపకు లందఱు;
నందగోపకునిఁ గాక కలంగి

(తెభా-10.1-954.1-తే.)[మార్చు]

రామకృష్ణులఁ బేర్కొని వము జేయఁ
గృష్ణుఁ డీశుండు తమ తండ్రిఁ గికురుపెట్టి
రుణభృత్యుండు గొనిపోయి రుణుఁ జేర్చు
టెఱిఁగి రయమున నచ్చోటి కేఁగె నధిప!

(తెభా-10.1-955-వ.)[మార్చు]

అప్పుడు.

(తెభా-10.1-956-క.)[మార్చు]

చ్చిన మాధవుఁ గనుఁగొని
చె చ్చెర వరుణుండు పూజ చేసి వినతుఁడై
చ్చుగ నిట్లని పలికెను
వి చ్చేసితి దేవ! నా నివేశంబునకున్,

(తెభా-10.1-957-ఉ.)[మార్చు]

విభు పాదపద్మరతు లెన్నఁడు నెవ్వరుఁ బొందలేని పెం
ద్రో వఁ జరింతు రట్టి బుధతోషక! నీ వరుదెంచుటం బ్రమో
దా వృత మయ్యెఁ జిత్తము కృతార్థత నొందె మనోరథంబు నీ
సే వఁ బవిత్రభావమును జెందె శరీరము నేఁడు మాధవా!

(తెభా-10.1-958-ఉ.)[మార్చు]

రమేశ్వరున్ జగములిన్నిటిఁ గప్పిన మాయ గప్పఁగా
నో క పారతంత్ర్యమున నుండు మహాత్మక! యట్టి నీకు ను
ద్దీ పిత భద్రమూర్తికి సుధీజన రక్షణవర్తికిం దనూ
తా ము వాయ మ్రొక్కెద నుదారత పోధన చక్రవర్తికిన్.

(తెభా-10.1-959-చ.)[మార్చు]

ఱుఁగఁడు వీఁడు నా భటుఁ డొకించుక యైన మనంబులోపలం
దె ఱుకువ లేక నీ జనకుఁదెచ్చె; దయం గొనిపొమ్ము ద్రోహమున్
వుము నన్ను నీ భటుని న్నన చేయుము నీదు సైరణన్
లుదుఁ గాదె యో! జనకత్సల! నిర్మల! భక్తవత్సలా!

(తెభా-10.1-960-వ.)[మార్చు]

అని ఇట్లు పలుకుచున్న వరుణునిం గరుణించి, తండ్రిం దోడ్కొని హరి తిరిగివచ్చె; నంత నందుండు తన్ను వెన్నుండు వరుణ నగరంబున నుండి విడిపించి తెచ్చిన వృత్తాంత బంతయు బంధువుల కెఱింగించిన వారలు కృష్ణుం డీశ్వరుండని తలంచి; రఖిలదర్శనుం డయిన యీశ్వరుండును వారల తలంపెఱింగి వారి కోరిక సఫలంబు చేయుదునని వారి నందఱ బ్రహ్మహ్రదంబున ముంచి యెత్తి.

(తెభా-10.1-961-ఆ.)[మార్చు]

ప్రకృతిఁ గామకర్మ రవశమై యుచ్చ
నీచగతులఁ బొంది నెఱయ భ్రమసి
తిరుగుచున్న జనము తెలియనేరదు నిజ
తివిశేష మీ జగంబు నందు.

(తెభా-10.1-962-మ.)[మార్చు]

ని చింతించి దయాళుఁడైన హరి మాయాదూరమై, జ్యోతియై,
నిరూప్యంబయి, సత్యమై, యెఱుకయై, యానందమై, బ్రహ్మమై,
ఘాత్ముల్ గుణనాశమందుఁ గను నిత్యాత్మీయ లోకంబు గ్ర
క్కు నఁ జూపెం గరుణార్ద్రచిత్తుఁ డగుచున్ గోపాలకశ్రేణికిన్.

(తెభా-10.1-963-వ.)[మార్చు]

ఇట్లు హరి ము న్నక్రూరుండు పొందిన లోకమంతయుం జూపి, బ్రహ్మలోకంబునుం జూపినం జూచి, నందాదులు పరమానందంబునుం బొంది వెఱఁగుపడి హంసస్వరూపకుండైన, కృష్ణునిం బొడగని పొగడి పూజించి; రంత.

21-05-2016: :
గణనాధ్యాయి 10:30, 11 డిసెంబరు 2016 (UTC)