పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/శరద్రాత్రి గోపికలు జేరవచ్చుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

(తెభా-10.1-964-చ.)[మార్చు]

లువలమేలికందువలు, కాముని కయ్యపు నేలలున్, విర
క్తు లు దలడించువేళలు, చకోరక పంక్తుల భోగకాలముల్,
చె లువలు సైరణల్ విడిచి చిక్కు తఱుల్, ఘనచంద్ర చంద్రికా
జ్వ లిత దిశల్, శరన్నిశలు, జారక దుర్దశ లయ్యె నయ్యెడన్.

(తెభా-10.1-965-ఆ.)[మార్చు]

కామతంత్రటీక, లువల జోక, కం
ర్పు డాక, విటులతాల్మి పోక,
కిత చక్రవాక, సంప్రీత జనలోక,
రాక వచ్చె మేలురాక యగుచు.

(తెభా-10.1-966-క.)[మార్చు]

తి తన కరముల కుంకుమ
తి మొగమున నలఁదుభంగి ముదయ వేళాం
చి కరరాగమున నిశా
తి రంజించెన్ నరేంద్ర! ప్రాక్సతి మొగమున్.

(తెభా-10.1-967-సీ.)[మార్చు]

విటసేనపై దండువెడలెడు వలఱేని;
గొల్లెనపై హేమకుంభ మనఁగఁ
గాముకధృతి వల్లిలు ద్రెంపనెత్తిన;
శంబరాంతకు చేతి క్ర మనఁగ
మారుండు పాంథుల మానాటవుల గాల్పఁ;
గూర్చిన నిప్పుల కుప్ప యనఁగ
విరహిమృగమ్ముల వేటాడ మదనుండు;
దెచ్చిన మోహన దీమ మనఁగ

(తెభా-10.1-967.1-ఆ.)[మార్చు]

వింతనునుపు గల్గి వృత్తమై యరుణమై
కాంతితోఁ జకోరణము లుబ్బఁ
బొడుపుకొండ చక్కిఁ బొడిచె రాకాచంద్ర
మండలంబు గగనమండలమున.

(తెభా-10.1-968-వ.)[మార్చు]

ఇట్లు పొడమిన నవకుంకుమాంకిత రమా ముఖమండలంబునుం బోలె నఖండంబైన చంద్రమండలంబుం పొడగని పుండరీకనయనుండు యమునాతట వనంబున జగన్మోహనంబుగ నొక్క గీతంబు పాడిన విని, తదాయత్తచిత్తలై తత్తఱంబున వ్రేత లే పనులకుం జేతు లాడకయు, గోవులకుం గ్రేపుల విడువకయు విడిచి విడిచి యీడకయు నీడి యీడియు, నీడినపాలు కాఁపకయుఁ గాఁచి కాఁచియుఁ, గాఁగిన పాలు డింపకయు డించి డించియు, డించినపాలు బాలురకుఁ బోయకయుఁ బోసి పోసియుఁ, బతులకుఁ బరిచర్యలు చేయకయుఁ జేసి చేసియు, నశనంబులు గుడువకయుఁ గుడిచి కుడిచియుఁ, గుసుమంబులు ముడువకయు ముడిచి ముడిచియుఁ, దొడవులు దొడగకయు దొడిగి తొడిగియు, గోష్టంబుల పట్టుల నుండకయుఁ, బాయసంబులు నెఱయ వండకయు, నయ్యైయెడల నిలువం బడకయుఁ, గాటుకలు సూటినిడకయుఁ, గురులు చక్కనొత్తకయుఁ, గుచంబుల గంధంబులు కలయ మెత్తకయుఁ, బయ్యెదలు విప్పి కప్పకయు, సఖులకుం జెప్పకయు, సహోదరులు మగలు మామలు మఱందులు బిడ్డలు నడ్డంబుచని నివారింపం దలారింపక సంచలించి, పంచభల్లుని భల్లంబుల మొల్లంపు జల్లుల పెల్లునం దల్లడిల్లి డిల్లపడి, మొగిళ్ళగమి వెలువడి; యుల్లసిల్లు తటిల్లతల పొందున మందగమన లమందగమనంబుల మంద వెలువడి గోవింద సందర్శనంబునకుం జని; రప్పుడు.

(తెభా-10.1-969-మ.)[మార్చు]

రుణుల్ గొందఱు మూలగేహముల నుద్దండించి రారాక త
ద్వి హాగ్నిం బరితాప మొందుచు మనోవీధిన్ విభున్ మాధవుం
రిరంభంబులు చేసి జారుఁ డనుచున్ భావించియుం జొక్కి పొం
ది రి ముక్తిన్ గుణదేహముల్ విడిచి ప్రీతిన్ బంధనిర్ముక్తలై.

(తెభా-10.1-970-వ.)[మార్చు]

అనిన నరేంద్రుం డిట్లనియె.

(తెభా-10.1-971-క.)[మార్చు]

జా రుఁడని కాని కృష్ణుఁడు
భూ రిపరబ్రహ్మ మనియు బుద్ధిఁ దలంపన్
నే రు; గుణమయదేహము
లే రీతిన్ విడిచి రింతు? లెఱిఁగింపు శుకా!

(తెభా-10.1-972-వ.)[మార్చు]

అనిన శుకుం డిట్లనియె.

(తెభా-10.1-973-మ.)[మార్చు]

ము ను నేఁ జెప్పితిఁ జక్రికిం బగతుఁడై మూఢుండు చైద్యుండు పెం
పు నఁ గైవల్యపదంబు నొందెఁ; బ్రియలై పొందంగ రాకున్నదే?
ఘుం డవ్యయుఁ డప్రమేయుఁ డగుణుం డైనట్టి గోవిందమూ
ర్తి రశ్రేణికి ముక్తిదాయిని సుమీ! తెల్లంబు భూవల్లభా!

(తెభా-10.1-974-ఆ.)[మార్చు]

భాంధవమున నైనఁ గనైన వగనైనఁ
బ్రీతినైనఁ బ్రాణభీతినైన
క్తినైన హరికిఁ రతంత్రులై యుండు
నులు మోక్షమునకుఁ నుదు రధిప!

(తెభా-10.1-975-వ.)[మార్చు]

అటు గావునఁ బరమపురుషుండును, నజుండును, యోగీశ్వరేశ్వరుండును నైన హరిని సోకిఁన స్థావరం బైన ముక్తం బగు; వెఱఁగుపడ వలవ, ది వ్విధంబున.

21-05-2016: :
గణనాధ్యాయి 10:32, 11 డిసెంబరు 2016 (UTC)