తెరతీయగరాదా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

తెరతీయగరాదా లోని-

॥తెర॥

తిరుపతి వేంకటరమణ మచ్చరమను

॥తెర॥


పరమపురుష ధర్మాదిమోక్షముల

పారదోలుచున్నది నాలోని

॥తెర॥


ఇరవొందగ భుజియించు సమయమున

ఈగ తగులురీతి యున్నది

హరిద్యానము సేయువేళ చిత్తము

అంత్యజువాడకు బోయినట్లున్నది

।।తెర॥


మత్స్యము ఆకలిగొని గాలముచే

మగ్నమైన రీతి యున్నది

అచ్చమైన దీపసన్నిధిని మరు

గిడబడి చెఱచినట్లున్నది

॥తెర॥


వాగురయని తెలియక మృగ గణములు

వచ్చి తగులురీతి యున్నది

వేగమే నీ మతము ననుసరించిన

త్యాగరాజనుత మదమత్సరమను

॥తెర॥


చూడండి

  1. త్యాగరాజు
  2. పంచరత్న కృతులు