జగదానంద కారకా

వికీసోర్స్ నుండి


త్యాగరాజు గారి పంచరత్న కృతులు
జగదానంద కారకా | దుడుకు గల | సాధించెనే | కనక రుచిర | ఎందరో మహానుభావులు
త్యాగరాజు కృతులు

అం అః


నాట - ఆది

జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక

గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర

సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల

॥జగ॥

అమర తారక నిచయ కుముదహిత పరిపూర్ణానఘ

సురాసురభూజ దధిపయోధి వాసహరణ

సుందరతరవదన సుధామయ వచోబృంద గోవింద

సానంద మావరాజరాప్త శుభకరానేక

॥జగ॥

నిగమ నిరజామృతజ పోషకానిమషవైరి

వారిది సమీరణ ఖగతురంగ సత్కవి హృదాలయ

అగణిత వానరాధిప నతాంఘ్రియుగ

॥జగ॥

ఇంద్రనీలమణి సన్ని భావఘన

చంద్ర సూర్యనయనా ప్రమేయ వా-

గీంద్ర జనక సకలేశ శుభ్ర నా-

గేంద్ర శయన శమనవైరి సన్నుత


॥జగ॥

పాద విజిత మౌనిశాప సవ పరి-

పాల వరమంత్రగ్రహణలోల

పరమశాంతచిత్త జనకజాధిప

సరోజభవ వరదాఖిల

॥జగ॥

సృష్టిస్థిత్యంతకారక అమిత-

కామితఫలద అసమానగాత్ర

శచీపతి నుతాబ్ధిమదహర

అనురాగ రాగరాజిత కథాసారహిత

॥జగ॥


సజ్జనమానసాబ్ధి సుధాకర

కుసుమ విమాన సురసారిపుకరాబ్జ

లాలిత చరణ అవగుణాసుర-

గణమదహరణ సనాతనాజ నుత

॥జగ।।


ఓంకార పంజరకీర పురహర

సరోజ భవ కేశవవాది రూప

వాసవ రిపు జనకాంతక కలాధర

కలాధరాప్త ఘృణాకర

శరణాగత జనపాలన సుమనోరమణ

నిర్వికార నిగమ సారతర

॥జగ॥

కరధృత శరజాలాసుర మదాపహరణావనీసుర సురావన

కనీన బిలజ మౌనికృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజ సన్నుత

॥జగ॥


పురాణపురుష నృవరాత్మజాశ్రిత-

పరాధీన ఖరవిరాధరావణ

విరావణ అనఘ పరాశర మనో-

హరావికృత త్యాగరాజసన్నుత

॥జగ॥


అగణితగుణ కనకచేల సారవిదళన

అరుణాభ సమాచరణ

అపారమహిమాద్భుత సుకవిజన-

హృత్సదన సురమునిగణిత విహిత

కలశనీరనిధిజారమణ పాపగజనృసింహ

వర త్యాగరాజాదినుత


॥జగ॥


(ఇంగ్లీషు లిపి నుండి వ్రాయబడినది, కనుక తప్పులు ఉన్నచో క్షమించి సరిదిద్దగలరు )

  1. బాలమురళీకృష్ణ

చూడండి:

  1. త్యాగరాజు
  2. పంచరత్న కృతులు
  3. తెలుగు
  4. తెలుగు సాహిత్యము