Jump to content

సొగసుగా మృదంగ తాళము

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

శ్రీరంజని రాగం - రూపక తాళం


పల్లవి

సొగసుగా మృదంగ తాళము జతజూర్చి నిను

సొక్క జేయు ధీరు డెవ్వడో ?

అనుపల్లవి

నిగమశిరోర్థము గల్గిన -

నిజ వాక్కులతో, స్వర శుద్ధముతో


చరణము

యతి విశ్రమ సద్భక్తివిరతి ద్రాక్షరస ననరస్ యుత -

కృతిచే భజియించు యుక్తి త్యాగరాజుని తరమా ? శ్రీరామ !