Jump to content

సీతమ్మ మాయమ్మ

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

లలిత రాగం - రూపక తాళం


పల్లవి

సీతమ్మ మాయమ్మ - శ్రీరాము డు మా తండ్రి


అనుపల్లవి

వాతాత్మజ సౌమిత్రి - వైనతేయ రిపు మర్దన

ధాత భరతాదులు సో - దరులు మాకు; ఓ మనస !


చరణము

పరమేశ వసిష్ఠ పరా - శర నారద శౌనక శుక

సురపతి గౌతమ లంబో - దర గుహ సనకాదులు

ధర నిజ భాగవతా గ్రే - సరు లెవరో వారెల్లను

వర త్యాగరాజునికి - పరమ బాంధవులు; మనస !