సరససామదానభేదదండ చతుర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

సరససామదానభేదదండ చతుర (రాగం: కాపీనారయణ-) (తాళం : దేశాది)

మూస:త్యాగరాజ కృతులు


పల్లవి

సరససామదానభేదదండ చతుర

సాటిదైవమెవరె బ్రోవవె \సరస

చరణం

పరమ శాంభవాగ్రేసరుండనుచు

బల్కు రావణుండు తెలియలేకపోయె \సరస

హితవుమాటలెంతో బాగ బల్కితివి

సతముగా నయోధ్య నిచ్చే నంటివి

నత సహోదరుని రాజుచేసి రాక

హతము జేసితివి త్యాగరాజనుత \సరస