సంగీత శాస్త్ర జ్ఞానము

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

సాళగభైరవి రాగం - దేశాది తాళం


పల్లవి

సంగీత శాస్త్ర జ్ఞానము - సారూప్య సౌఖ్యదమే, మనసా !

అనుపల్లవి

శృంగార రసాద్యఖిల సార పూ -

రిత రామ కథానందాది యుత


చరణము

ప్రేమ మీర సుగుణ వాత్సల్యము,

శ్రీమద్రమా వర కటాక్షము,

నేను నిష్ఠ యశో ధనము గల్గునే,

నేర్పు గల్గు త్యాగరాజు నేర్చిన