Jump to content

శ్రీరామ పాదమా నీకృప జాలునే

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

అమృతవాహిని రాగం - ఆది తాళం


పల్లవి

శ్రీరామ పాదమా ! నీకృప - జాలునే; చిత్తమునకు రావే


అనుపల్లవి

వారిజభవ సనక సనందన

వాసవాది నారదు లెల్ల పూజించు


చరణము

దారిని శిలయై తాపము తాళక

ధారగ కన్నీరును రాల్చగ,

శూర ! అహల్యను జూచి బ్రోచిన

యారీతి ధన్యు సేయవే, త్యాగరాజుగేయమా!