Jump to content

శివశివ శివయనరాదా

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

శివ శివ శివయనరాదా...ఓరీ (రాగం: పంతువరాళి) (తాళం : ఆది)


పల్లవి: శివ శివ శివయనరాదా...ఓరీ ! శివశివ శివయనరాదా?

అనుపల్లవి: భవభయ బాధలనణచుకోరాదా?

చ:కామాదుల తెగ కోసి

పరభామల పరుల ధనముల రోసి

పామరత్వమునెడబాసి అతి

నీమముతో బిల్వార్చన జేసి.. శివ

చ:సజ్జన గణములగాంచి ఓరీ

ముజ్జగదీశ్వరుల మతినెంచి

లజ్జాదుల దొలగించి తన

హ్రుజ్జాలమున తా పూజించి.. శివ

చ:ఆగమముల నుతియించి

బహు బాగులేని భాషలు చాలించి

భాగవతులతో పొషించి ఓరీ

త్యాగరాజ సన్నుతుడని యెంచి..శివశివ శివయనరాదా? https://www.youtube.com/watch?v=zQ05vleQZOQరంజని గాయత్రి పాడిన ఈ కీర్తన వినండి