శాంతము లేక సౌఖ్యము లేదు

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

సామ రాగం - ఆది


పల్లవి

శాంతము లేక సౌఖ్యము లేదు - సారస దళ ననయ ! | | శాంతము లేక | |

అనుపల్లవి

దాంతునికైన వే - దాంతునికైన | | శాంతము లేక | |


చరణం 1

దార సుతులు ధన ధాన్యము లుండిన

సారెకు జప తప సంపద గల్గిన | | శాంతము లేక | |


చరణం 2

ఆగమ శాస్త్రము లన్నియు జదివిన

బాగుగ సకల హృద్భావము దెలిసిన | | శాంతము లేక | |


చరణం 3

యాగాది కర్మము లన్నియు జేసిన

భాగవతు లనుచు బాగుగ బేరైన | | శాంతము లేక | |


చరణం 4

రాజాధిరాజ ! శ్రీరాఘవ ! త్యాగ -

రాజ వినుత ! సాధు రక్షక ! తన కుప | | శాంతము లేక | |