శరణు శరణనుచు మొరలనిడిన
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
మధ్యమావతి రాగం - ఆది తాళం
- పల్లవి
శరణు శరణనుచు మొరలనిడిన నా -
గిరములన్ని పరియాచకమౌనా ? | | శరణు | |
- అనుపల్లవి
శరజనయన ! పరమపురుష ! ని న్నను -
సరణతో గరుణతో మఱిమఱి | | శరణు | |
- చరణము 1
శరము తరుమ తరము గాక కాకా -
సురుడు సురుల నరయ వేడగాను ద -
శరథవర కుమరుని బాణమనుచును
వెఱచి జరగ మరల తాను గనిగా -
బరబడి సరగున శరణను మాత్రము
నిరవుగను రజితగిరి నాథాదులు
వరమగు బిరుదున సరసత మెచ్చను
కరుణను స్థిరముగ వరమిచ్చిన నిను | | శరణు | |
- చరణము 2
మునుపు మనసున నసూయలను తపో -
ధనుడు వినయమునను ద్రౌపదిని శో -
ధనము ఘనముగ నిజమున సేయ దృఢ -
మునను తన మదిని శరణనగానే
కనికరమున వేగన నీ వెంతో చను -
వున మునులు సుజనులు సురాసుర
గణము లవనిపాల నరులు బొగడను,
వనజనయన ! లఘువున బ్రోచిన నిను | | శరణు | |
- చరణము 3
మదిని బెదరు సుదతిని గని నీదు
పదములు దయను ధరలోను బ్రోచె
గదర ? మదజనదళ నాపఘన ! జిత -
మదన ! బుధజనధన ! త్యాగరాజ -
హృదయకుముద జలజధర సంహరణా !
రిదమన ! నదమలరదన ! ముని మనో -
సదన ! శుభద ! నను ముదమున బ్రోవుము,
సదయుడ ! కొదవల నదలింపుము; నిను | | శరణు | |