Jump to content

వికీసోర్స్ చర్చ:శైలి మార్గదర్శిని

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

శైలి

[మార్చు]

ప్రాచీనమైన కొన్ని తెలుగు పదాలకు బదులు సమానార్ధాలైన వాటిని వాడవచ్చునా. ఱ మాదిరిగానే వాడుకలో లేని ఌ, ౡ వాటికి సమానమైనవి ఏవి. గ్రాంధికంగా ఉన్న భాషను వ్యవహారికంగా మార్చాలా లేదా. వీటి గురించి కూడా తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 11:33, 7 జూలై 2012 (UTC)Reply

అర్థాలు మార్చవద్దు. ప్రస్తుతభాషలో వాడనటువంటి అక్షరాలను వాటికి చాలా దగ్గరైన వుచ్ఛారణ గల వాటితో మార్చటమే మంచిదని నా అభిప్రాయం. అలావుంటే ఎక్కువ మంది చదవటానికి సౌకర్యంగా వుంటుంది. ఌ, ౡ కు బదులుగా లు,లూ, ళు,ళూ లాంటివి వాడవచ్చు. పాతది యధావిధంగా రాసి, ఇంకొక ప్రోగ్రామ్ ద్వారా అటువుంటి మార్పులు చేయటం ఇంకొక పద్ధతి. అయితే అటువంటిది ఇంకా తయారు కాలేదు.--Arjunaraoc (చర్చ) 02:07, 8 జూలై 2012 (UTC)Reply
పాత అక్షరాలను యథావిధిగా ఉంచాలన్నది నా అభిప్రాయమూ, సూచన కూడా. అర సున్నా రాతలో వాడుకలో లేకపోయినా మనం పలుకులో రోజూ వాడుతాం. అందువలన రాతలో అవి వాడట మొదలెడితే, నష్టరహిత(loss less) మార్పులు చేయవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 06:48, 9 జూలై 2012 (UTC)Reply
మీ స్పందనకు ధన్యవాదాలు. కాలక్రమంలో జరిగే మార్పులను వికీద్వారా అడ్డుకోవడం మన వికీ సంప్రదాయం కాదు. ఉదా:తెలుగు అంకెలు. వికీ చదువరుల సౌలభ్యం చూసి మనం నియమాలు కచ్ఛితపరచితే మంచిది. బొమ్మ రూపం వుంది కాబట్టి, ఎవరికైనా మూలం రూపం ఇష్టమైతే వారు బొమ్మ రూపంలో చదువుకుంటారు. సాంప్రదాయక ప్రచురణ సంస్థలు పాత పుస్తకాలను పునర్ముద్రించేటప్పుడు, కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా పరిష్కరించి చేస్తున్నారు. --Arjunaraoc (చర్చ) 14:51, 9 జూలై 2012 (UTC)Reply

శైలి గురించి రచ్చబండలో 2014-12-09T07:07:12 నాడు ప్రారంభించిన చర్చ నకలు

[మార్చు]

టైపించడంలో మన విధానం - మూలంలోని తప్పులను సవరించాలా లేక అలాగే ఉంచెయ్యాలా?

[మార్చు]

పుస్తకాలను టైపించడంలో మన విధానం ఏమిటో నాకు స్పష్టత లేదు. దాని గురించే నా ప్రశ్న. దీని గురించి గతంలో చర్చ ఏమైనా జరిగిందేమోనని చూసాను, కనబళ్ళేదు. అందుకే రాస్తున్నాను.

అచ్చు ప్రతిలో ఉన్నదున్నట్లుగా, అరసున్నలను కూడా వదలకుండా, అచ్చులో దొర్లిన తప్పులు, అచ్చుతప్పులతో సహా, టైపించాలా లేక తప్పులను సరిదిద్దుతూ, అరసున్నలను పరిహరిస్తూ టైపించాలా? నేను ప్రస్తుతం SuprasiddulaJeevithaVisheshalu.djvu అనే పుస్తకపు టైపు ప్రతిని ప్రూఫు దిద్దుతున్నాను. పుస్తకంలో తప్పులు కనబడుతున్నాయి. అచ్చుతప్పులే కాదు, వ్యాకరణంలోను, వాక్యనిర్మాణంలోనూ కూడా తప్పులున్నాయి. ఆయా తప్పులను చాలావరకూ ఉన్నవి ఉన్నట్లుగా టైపించారు. నేనూ అలాగే ప్రూఫు దిద్దుతున్నాను. నేను మరికొన్ని టైపు ప్రతులను చూసాను. వాటిలో మూలాన్ని ఉన్నదున్నట్టుగా కాక అరసున్నల వంటివాటిని వదిలేసి, తప్పులను సరిచేసీ టైపించారు.

ఇలా వివిధ పద్ధతుల వలన సోర్సులోని వివిధ ఈ-ప్రతుల్లో సారూప్యత లోపిస్తోంది. టైపరులందరికీ మార్గదర్శకంగా ఉండేలా మనం ఒక విధానాన్ని తయారు చేసుకోవాలి. ఏ పద్ధతిని అవలంబించాలనే విషయమై మీ ఆలోచనలు చెప్పండి. --Chaduvari (చర్చ) 08:33, 17 డిసెంబరు 2014 (UTC)Reply

మూల ప్రతిలో వ్యాకరణ దోషాలు, అక్షరదోషాలు ఉంటే మనం టైపు చేసేటపుడు వాటిని సరిదిద్దడమే మేలని నా అభిప్రాయం. ఇక అరసున్నలు, బండి ర విషయంలో వెసులుబాటు ఇస్తే బాగుంటుందనుకుంటున్నాను.--రవిచంద్ర (చర్చ) 14:56, 17 డిసెంబరు 2014 (UTC)Reply


చదువరి గారూ, మంచి చర్చను లేవనెత్తినందుకు కృతజ్ఞతలు.
ఆంగ్ల వికీసోర్సులో ప్రూఫురీడింగు గురించి చూసాను. సాధ్యమైనంత వరకూ మూలాన్నే అనుసరించమని ఉంది. పుస్తకాలకు పరిమితమైన కాలమ్స్, పంక్తి విరుపులు వంటివి పట్టించుకోనవసరం లేదు కానీ పాఠ్య ఫార్మాటింగుని కూడా సాధ్యమైనంత మేర మూలాన్ని అనుసరించమని చెప్తున్నారు. కానీ ఎక్కడా తేల్చి చెప్పేయలేదు. డిజిటైజేషను మీదే పనిచేస్తున్న ప్రాజెక్టు గూటెన్‌బర్గ్ వారి మార్గదర్శకాలను కూడా చదివాను. వాళ్ళు మొహమాటం లేకుండా రచయిత రాసిందాన్ని మార్చొద్దు అని తేల్చేసారు. వికీసోర్సు ప్రధాన ఉద్దేశం మూలపాఠ్యాలను అందుబాటులో ఉంచడం కాబట్టి, మనం మూలం లోని తప్పులనూ, అక్షరాలనూ అలానే ఉంచేయడం మేలని నేననుకుంటున్నాను.
రచయిత రాసినదాన్ని అలానే ఉంచాలన్న నా మొగ్గుకి ప్రధాన కారణం ఏమిటంటే, ఈ మూలపాఠ్యాలను భవిష్యత్తులో రకరకాలుగా వాడుకుంటారు. నేను ఊహిస్తున్న రెండు ప్రధాన ఉపయోగాలు: (1) ఓసీఆర్ (2) తెలుగు కార్పస్ (పదనిధి). ఈ రెంటికీ మూలపాఠ్యం యథాతథంగా డిజిటైజైతేనే మేలు. వికీసోర్సులోని మూలపాఠ్యాన్ని వాడి కార్పస్ తయారుచేస్తే దాని ద్వారా మాటల/అక్షరాల వాడుకను విశ్లేషించవచ్చు. ఈ విశ్లేషణ జవాబిచ్చే ప్రశ్నలు ఇలాంటివి: ఏ శతాబ్దం/దశాబ్దం నుండి అరసున్న వాడకం తగ్గుముఖం పట్టింది? ఏయే ప్రాంతాలలో ఫలానా మాటని ఫలానా పద్ధతిలో వ్రాసేవారు?
నా మొగ్గుకి మరో కారణం, చాలా విషయాల్లో ఏది ఒప్పో తప్పో మనం ఇప్పుడు నిర్ణయించలేము కూడా. వాఁడు అన్నది రచనా కాలంలో సరైన వాడుక అయివుండొచ్చు, కానీ ఇప్పుడు కాదు. ఇక మనవైన మాండలికాలు ఉండనే ఉన్నాయి. రచననూ, రచనాశైలినీ, రచయితనూ, ఆయన ప్రాంతాన్నీ, కాలాన్నీ బట్టీ ఏ వాడుక ఏ పుస్తకానికి సరైనదో మనం తేల్చలేము కదా.
అందువల్ల, సరిదిద్దే విషయం లోనికి మనం దూరకపోవడమే మేలని నా అభిప్రాయం. — వీవెన్ (చర్చ) 15:30, 30 డిసెంబరు 2014 (UTC)Reply
మూలంలో ఉన్నది ఉన్నట్టుగానే ఉంచాలన్నది వికీమూలాల ఉద్దేశం. అచ్చుతప్పులతో భాష, శైలి, వాక్యనిర్మాణం ఎలా ఉన్నదో, అలాగే ఉంచాలి --వైజాసత్య (చర్చ) 22:00, 1 మార్చి 2015 (UTC)Reply