రార సీతారమణీ మనోహర
స్వరూపం
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
హిందోళవసంత రాగం - రూపక తాళం
- పల్లవి
రార, సీతారమణీ మనోహర !
- అనుపల్లవి
నీరజ నయన ! ఒక ము - ద్దీర, ధీర ! ముంగల
- చరణము 1
బంగారు వల్వల నే బాగుగ గట్టెద, మఱి
శృంగారించి సేవజేసి కౌగిట జేర్చెద;
- చరణము 2
సారె నుదుటకు గస్తూరి తిలకము బెట్టెద;
సారమైన ముక్తాహారములను దిద్దెద;
- చరణము 3
యోగము నీపై యనురాగము బాడెద; వే
రే గతియెవరు ? శ్రీత్యాగరాజ వినుత !