రామ నీ సమాన మెవరు

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
త్యాగరాజు కృతులు

అంఅః

ఖరహరప్రియ రాగం - రూపక తాళం


పల్లవి 

రామ ! నీ సమాన మెవరు ? - రఘువంశోద్ధారక !


అనుపల్లవి 

భామా మరువంపు మొలక ! - భక్తియను పంజరపు చిలుక


చరణము 

పలుకు పలుకులకు తేనె - యొలుకమాటలాడు సోద -

రులుగల హరి త్యాగరాజ - కులవిభూష ! మృదు - సుభాష !