రామభక్తి సామ్రాజ్య మే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

శుద్ధబంగాళ రాగం - ఆది తాళం


పల్లవి

రామభక్తి సామ్రాజ్య - మే మానవుల కబ్బెనో ? మనసా !

అనుపల్లవి

ఆ మానవుల సందర్శన - మత్యంత బ్రహ్మానందమే;


చరణము

ఈలాగని వివరింప లేను;

చాలా స్వానుభవ వేద్యమే;

లీలా స్పష్ట జగత్రయములో

కోలాహల త్యాగరాజ నుతుడగు