Jump to content

రమారమణ భారమా

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

వసంత భైరవి రాగం - ఆది తాళం


పల్లవి

రమారమణ ! భారమా ? నన్ను బ్రోవుమా, శ్రీకర !


అనుపల్లవి

పుమానుడని గాదని నాతో దె -

ల్పుమా, నరోత్తమా ! సమానరహిత !


చరణము 1

సరి నీకెవ్వరు దొరకరని గర్వము,

అదియుగాక ధరలో జనులు మర్మ -

మెఱిగి నమ్ముకోలేరంటి, ధర్మాది

మోక్ష వరము లొసంగి భక్త -

వరుల గా చిన కీర్తి వింటి, మఱిమఱి

నన్నిందరిలో జెయిబట్టి బ్రోవ -

శరణు జొచ్చితినయ్య, దరి నీవను

కొన్నాను, చరణమే గతియంటి


చరణము 2

స్మరణ దెలిసి యేలు పరమామాతు డు

నీవే యన్నాను, పామరులతో

సరియోయినటుల నీ గోచరములనే

బల్కుకొన్నాను, నా మాటలెల్ల -

కరుణతో నిజము జేయ, వరదా !

దండము లిడినాను, శ్రీరామరామ !

పరమపావననామ ! శరజలోచన ! నన్నా -

దరణ జేయుటకింత కరువైన వితమేమి !