మోసబోకు వినవే
Appearance
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
గౌళిపంతు రాగం - ఆది తాళం
- పల్లవి
మోసబోకు వినవే, సత్సహ - వాసము విడువకే
- అనుపల్లవి
దాస జనార్తి హరుని, శ్రీరాముని,
వాసవ హృదయ నివాసుని, తెలియక
- చరణము 1
అల్పాశ్రమమున గల్గు, వెసనములు
కల్పాంతరమైన బోదు; శేష -
తల్ప శయనుని నెఱనమ్మిన సం -
కల్ప మెల్ల నీడేరును; మనసా !
- చరణము 2
ధన తరుణుల కాశించునదెల్ల -
వెనక తనువు కలసటే గాని
మనసు చేత సేవ్యుని దలచిన సు -
మనసత్వము నొసగునే, మనసా !
- చరణము 3
గౌరవ హీన ధనుకుల గాచుటయు -
నేరములకెడ మౌను గాని,
గారవించు త్యాగరాజ హృదయా -
గారుని, లోకాధారుని, దలచక