ముద్దుమోము యేలాగు చెలంగెనో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

సూర్యకాంతము రాగం - ఆది తాళం


పల్లవి

ముద్దుమోము యేలాగు చెలంగెనో ?

మునులెట్ల గని మోహించిరో ?


అనుపల్లవి

కద్దనుచును చిరకాలము హృదయము

కరగికరగి నిల్చు వారికెదుట రాముని


చరణము

మనసు నిర్మలమగు భూసుర కృతమౌ,

మంచి పూజా ఫలమౌ, తొలుతటి తపమౌ,

ఘననిభ దేహుని జనన స్వభావమౌ,

ధనపతి సఖుడైన త్యాగరాజార్చితుని