మా జానకి చెట్ట బట్టగ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

మా జానకి చెట్ట బట్టగ - మహరాజ వైతివి | | మా జానకి | |


రాజ రాజవర ! రాజీవాక్ష ! విను

రావణారి యని రాజిల్లు కీర్తియు | | మా జానకి | |


కాన కేగి యాజ్ఞ మీరక మాయా -

కార మునిచి శిఖి చెంతనే యుండి,

దానవుని వెంటనే చని యశోక - తరు మూలనుండి,

వాని మాటలకు గోపగించి కంట - వధియించకయే యుండి,

శ్రీ నాయక ! యశము నీకే గల్గ -

జేయ లేద ? త్యాగరాజ పరిపాల ! | | మా జానకి | |