మారుబల్క కున్నా వేమిర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

శ్రీరంజని రాగం - ఆది తాళం


పల్లవి

మారుబల్క కున్నా వేమిర ? - మా మనోరమణ !

అనుపల్లవి

జారచోర భజన జేసితినా ? సాకేతసదన !


చరణము

దూరభారమందు, నా హృద - యారవిందమందు, నెలకొన్న

దారి నెఱిగి సంతసిల్లి నట్టి - త్యాగరజనుత !