మనవిని వినుమా
Appearance
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
జయనారాయణి రాగం - ఆది తాళం
- పల్లవి
మనవిని వినుమా, మఱవ సమయమా ?
- అనుపల్లవి
కనుగొన గోరిదుష్కల్పన మానితి
కనికరమున నిను బాడుచున్న నా
- చరణము
పరులకు హితమగు భావన గాని
చెరచు మార్గముల జింతింపలేను;
పరమ దయాకర ! భక్తమనోహర !
ధరాధిప కరార్చిత ! త్యాగరాజు