Jump to content

భువిని దాసుడను పేరాసచే

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

శ్రీరంజని - దేశాది


పల్లవి

భువిని దాసుఁడను పేరాసచే

బొంకులాడితినా ? బుధమనోహర !


అనుపల్లవి

అవివేక మానవులఁ గోరికోరి -

అడ్డత్రోవఁ ద్రొక్కితినా ? బ్రోవవే


చరణము

చాల సౌఖ్యమౌ కష్టమో నేను

జాలిఁ జెందితినా ? సరివారిలో,

పాలముంచిన నీటముంచిన

పదములేగతి; త్యాగరాజనుత !