భజన పరుల కేల దండ
Appearance
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
సురటి రాగం - రూపక తాళం
- పల్లవి
భజన పరుల కేల దండ - పాణి భయము ? మనసా ! రామ
- అనుపల్లవి
అజ రుద్ర సురేశులకా - యాస్థాన మొసంగు రామ
- చరణము
అండకోట్ల నిండిన కో - దండపాణి ముఖమును హృ -
త్పుండరీకమున జూడి - పూజ సల్పుచు,
నిండు ప్రేమతో గరంగు - నిష్కాములకు వర వే -
దండపాల దాసుడైన - త్యాగరాజు సేయు రామ