పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/శుకుడు భాగవతంబు జెప్పుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-1-73-సీ. )[మార్చు]

పుణ్యకీర్తనుఁడైన భువనేశు చరితంబు;
బ్రహ్మతుల్యంబైన భాగవతము
కలపురాణరాము దొల్లి లోకభ;
ద్రముగ ధన్యముగ మోముగఁ బ్రీతి
గవంతుఁడగు వ్యాసట్టారకుఁ డొనర్చి;
శుకుఁ డనియెడుఁ తన సుతునిచేతఁ
దివించె నింతయు కలవేదేతిహా;
ములలోపల నెల్ల సారమైన

(తెభా-1-73.1-ఆ. )[మార్చు]

యీ పురాణమెల్ల నెలమి నా శుకయోగి
గంగ నడుమ నిల్చి న విరక్తి
యొదవి మునులతోడ నుపవిష్టుఁ డగు పరీ
క్షిన్నరేంద్రుఁ డడుగఁ జెప్పె వినుఁడు.

(తెభా-1-74-వ. )[మార్చు]

కృష్ణుండు ధర్మజ్ఞానాదులతోడం దన లోకంబునకుం జనిన పిమ్మట గలికాల దోషాంధకారంబున నష్టదర్శను లైన జనులకు నిప్పు డిప్పురాణంబు కమలబంధుని భంగి నున్నది; నాఁ డందు భూరి తేజుండయి కీర్తించుచున్న విప్రర్షివలన నేఁ బఠించిన క్రమంబున నామదికి గోచరించి నంతయ వినిపించెద" ననిన సూతునకు ముని వరుండయిన శౌనకుం డిట్లనియె.

(తెభా-1-75-శా. )[మార్చు]

'సూ తా! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్ మునిశ్రేష్ఠు నే
శ్రో తల్ గోరిరి? యేమి హేతువునకై, శోధించి లోకైక వి
ఖ్యా తిన్ వ్యాసుడుఁ మున్ను భాగవతముం ల్పించెఁ? దత్పుత్త్రుఁడే
ప్రీ తిన్' రాజునకీ పురాణకథఁ జెప్పెం'''''? జెప్పవే యంతయున్.

(తెభా-1-76-వ. )[మార్చు]

బుధేంద్రా! వ్యాసపుత్త్రుండైన శుకుండను మహాయోగి సమదర్శనుం, డేకాంతమతి, మాయాశయనంబువలనం దెలిసిన వాఁడు, గూఢుండు మూఢునిక్రియ నుండు నిరస్తఖేదుం డదియునుంగాక.

(తెభా-1-77-త. )[మార్చు]

శు కుఁడు గోచియు లేక పైఁ జనఁ జూచి తోయములందు ల
జ్జ కుఁ జలింపక చీర లొల్లక ల్లులాడెడి దేవక
న్య లు హా! శుక! యంచు వెన్క జనంగ వ్యాసునిఁ జూచి యం
శు ములన్ ధరియించి సిగ్గున స్రుక్కి రందఱు ధీనిధీ!

(తెభా-1-78-వ. )[మార్చు]

మఱియు నగ్నుండుఁ దరుణుండునై చను తన కొడుకుం గని వస్త్రపరిధానం బొనరింపక వస్త్రధారియు వృద్ధుండును నైన తనుం జూచి చేలంబులు ధరియించు దేవరమణులం గని వ్యాసుండు కారణం బడిగిన వారలు, నీ పుత్రుండు "స్త్రీ పురుషు లనెడు భేదదృష్టి లేక యుండు; మఱియు నతండు నిర్వికల్పుండు గాన నీకు నతనికి మహాంతరంబు గల" దని రట్టి శుకుండు కురుజాంగల దేశంబుల సొచ్చి హస్తినాపురంబునఁ బౌరజనంబులచే నెట్లు జ్ఞాతుండయ్యె? మఱియు నున్మత్తుని క్రియ మూగ తెఱంగున జడుని భంగి నుండు నమ్మహాయోగికి రాజర్షి యైన పరీక్షిన్మహారాజు తోడ సంవాదం బెట్లుసిద్ధించె? బహుకాలకథనీయం బయిన శ్రీభాగవతనిగమ వ్యాఖ్యానం బేరీతి సాగె? నయ్యోగిముఖ్యుండు గృహస్థుల గృహంబుల గోవును బిదికిన యంత దడవు గాని నిలువంబడం; డతండు గోదోహనమాత్ర కాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబు లగు నండ్రు; పెద్దకాలం బేక ప్రదేశంబున నెట్లుండె? భాగవతోత్తముం డైన జనపాలుని జన్మ కర్మంబు లే ప్రకారంబు? వివరింపుము.

(తెభా-1-79-సీ. )[మార్చు]

పాండవ వంశంబు లము మానంబును;
ర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ;
రిపంథిరాజులు ర్మాది ధనముల;
ర్చింతు రెవ్వని యంఘ్రియుగముఁ;
గుంభజ కర్ణాది కురు భట వ్యూహంబు;
సొచ్చి చెండాడెనే శూరు తండ్రి;
గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు;
విడిపించి తెచ్చె నే వీరుతాత;

(తెభా-1-79.1-ఆ. )[మార్చు]

ట్టి గాఢకీర్తి గు పరీక్షిన్మహా
రాజు విడువరాని రాజ్యలక్ష్మిఁ
రిహరించి గంగఁ బ్రాయోపవిష్టుఁడై
సువు లుండ, నేల డఁగి యుండె?

(తెభా-1-80-ఉ. )[మార్చు]

త్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్నడుం
జి త్తములందుఁ గోరరు హసించియు, లోకుల కెల్ల నర్థ సం
త్తియు భూతియున్ సుఖము ద్రముఁ గోరుదు రన్యరక్షణా
త్యు త్తమమైన మేను విభుఁ డూరక యేల విరక్తిఁ బాసెనో?

(తెభా-1-81-క. )[మార్చు]

సా ముల నెల్ల నెఱుగుదు
పా గుఁడవు భాషలందు హువిధ కథనో
దా రుఁడవు మాకు సర్వముఁ
బా ము ముట్టంగఁ దెలియఁలుకు మహాత్మా!"