పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/ఏకవింశత్యవతారములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-1-63-వ. )[మార్చు]

అది సకలావతారంబులకు మొదలి గని యైన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానం బయిన దివ్యరూపంబు; దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు; అప్పరమేశ్వరు నాభీకమలంబువలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె; నతని యవయవస్థానంబుల యందు లోకవిస్తారంబులు గల్పింపంబడియె; మొదల నద్దేవుండు కౌమారాఖ్య సర్గంబు నాశ్రయించి బ్రహ్మణ్యుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబున చరియించె; రెండవ మాఱు జగజ్జననంబుకొఱకు రసాతలగత యయిన భూమి నెత్తుచు యజ్ఞేశుండయి వరాహదేహంబుఁ దాల్చె; మూడవ తోయంబున నారదుం డను దేవర్షియై కర్మనిర్మోచకంబైన వైష్ణవతంత్రంబు సెప్పె; నాలవ పరి ధర్మభార్యా సర్గంబు నందు నరనారాయణాభిధానుం డై దుష్కరంబైన తపంబు సేసెఁ; బంచమావతారంబునం గపిలుం డను సిద్ధేశుం డయి యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వ గ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె; నాఱవ శరీరంబున ననసూయాదేవి యందు నత్రిమహామునికిం గుమారుండై యలర్కునికిఁ బ్రహ్లాద ముఖ్యులకు నాత్మవిద్యఁ దెలిపె; నేడవ విగ్రహంబున నాకూతి యందు రుచికి జన్మించి,యజ్ఞుం డనఁ ప్రకాశమానుండై యమాది దేవతలం గూడి, స్వాయంభువమన్వంతరంబు రక్షించె; అష్టమ మూర్తిని మేరుదేవి యందు నాభికి జన్మించి యురుక్రముం డనం బ్రసిద్ధుండై విద్వజ్జనులకుఁ బరమహంస మార్గంబుం బ్రకటించె; ఋషులచేతఁ గోరంబడి; తొమ్మిదవ జన్మంబునఁ బృథుచక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్త వస్తువులం బిదికె; చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమం బైన మీనావతారంబు నొంది మహీరూపం బగు నావ నెక్కించి వైవస్వతమనువు నుద్ధరించె; సముద్ర మథన కాలంబునం బదునొకొండవ మాఱు కమఠాకృతిని మందరాచలంబుఁ దన పృష్ఠకర్పరంబున నేర్పరియై నిలిపె; ధన్వంతరి యను పండ్రెండవ తనువున సురాసుర మధ్యమాన క్షీరపాథోధి మధ్య భాగంబున నమృత కలశ హస్తుండై వెడలెఁ; బదమూఁడవది యయిన మోహినీ వేషంబున నసురుల మోహితులం జేసి సురల నమృతాహారులం గావించెఁ; బదునాలుగవది యైన నరసింహరూపంబునం గనకకశిపుని సంహరించెఁ; బదునేనవది యైన కపట వామనావతారంబున బలిని బదత్రయంబు యాచించి మూఁడులోకంబుల నాక్రమించెఁ; బదునాఱువది యైన భార్గవరామాకృతిని గుపితభావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహు లయిన రాజుల నిరువదియొక్క మాఱు వధియించి భూమి నిఃక్షత్త్రంబు గావించె; బదునేడవది యైన వ్యాస గాత్రంబున నల్పమతు లయిన పురుషులం గరుణించి వేదవృక్షంబునకు శాఖ లేర్పఱచెఁ; బదునెనిమిదవ దైన రామాభిధానంబున దేవకార్యార్థంబు రాజత్వంబు నొంది సముద్రనిగ్రహాది పరాక్రమంబు లాచరించె; నేకోనవింశతి వింశతితమంబు లైన రామకృష్ణ రూపంబులచే యదువంశంబు నందు సంభవించి; విశ్వంభరా భారంబు నివారించె; నేకవింశతితమం బైన బుద్ధనామధేయంబునం గలియు గాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబుకొఱకు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి దేజరిల్లు; యుగసంధి యందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప విష్ణుయశుం డను విప్రునికిఁ గల్కి యను పేర నుద్భవింపంగలం" డని; యిట్లనియె.

(తెభా-1-64-మ. )[మార్చు]

సిం బాసిన వేయు కాలువల యోజన్ విష్ణునం దైన శ్రీ
నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సు లున్ బ్రాహ్మణసంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్
రి కృష్ణుండు బలానుజన్ముఁ డెడ లే; దా విష్ణుఁడౌ నేర్పడన్.

(తెభా-1-65-క. )[మార్చు]

వంతుం డగు విష్ణుఁడు
ముల కెవ్వేళ రాక్షవ్యధ గలుగుం
నవ్వేళలఁ దడయక
యు యుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.

(తెభా-1-66-ఆ. )[మార్చు]

'తిరహస్యమైన రిజన్మ కథనంబు
నుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ
జాల భక్తితోడఁ దివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు.

(తెభా-1-67-వ. )[మార్చు]

వినుం డరూపుం డయి చిదాత్మకుం డయి పరఁగు జీవునికిం బరమేశ్వరు మాయాగుణంబు లైన మహదాది రూపంబులచేత నాత్మస్థానంబుగా స్థూలశరీరంబు విరచితం బైన, గగనంబు నందుఁ బవనాశ్రిత మేఘ సమూహంబును, గాలి యందుఁ బార్థివధూళిధూసరత్వంబును నేరీతి నారీతి ద్రష్ట యగు నాత్మ యందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు గానివారిచేత నారోపింపంబడు నీ స్థూలరూపంబుకంటె నదృష్టగుణం బయి యశ్రుతం బైన వస్తు వగుటం జేసి వ్యక్తంబు గాక సూక్ష్మం బై కరచరణాదులు లేక జీవునికి నొండొక రూపంబు విరచితంబై యుండు; సూక్ష్ముఁ డయిన జీవునివలన నుత్క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు; నెప్పు డీ స్థూల సూక్ష్మ రూపంబులు రెండు స్వరూప సమ్యగ్జ్ఞానంబునఁ బ్రతిషేధింపఁ బడు; నపుడ నవిద్యం జేసి యాత్మను గల్పింపంబడు ననియుం దెలియు నప్పుడు జీవుండు బ్రహ్మ దర్శనంబున కధికారి యగు; దర్శనం బన జ్ఞానైక స్వరూపంబు; విశారదుం డైన యీశ్వరునిదై క్రీడించుచు నవిద్య యనంబడుచున్న మాయ యుపరతయై యెప్పుడు దాన విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు జీవోపాధి యయిన స్థూలసూక్ష్మరూపంబు దహించి జీవుడు కాష్ఠంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునం దాన యుపరతుం డయి బ్రహ్మస్వరూపంబునం బొంది పరమానందంబున విరాజమానుం డగు; ఇట్లు తత్త్వజ్ఞులు సెప్పుదు" రని సూతుం డిట్లనియె.

(తెభా-1-68-చ. )[మార్చు]

నము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ
ర్త నుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్
వి నుతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందుఁ జూ
చి మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్.

(తెభా-1-69-మ. )[మార్చు]

భు నశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం
విధింజేయు మునుంగఁడందు; బహుభూవ్రాతమం దాత్మతం
త్ర విహారస్థితుడై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్
ది విభంగిం గొనుఁ జిక్కఁ డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్.

(తెభా-1-70-చ. )[మార్చు]

దధినాథుఁడైన హరిసంతతలీలలు నామరూపముల్
గిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్
మి గిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే?
ణిత నర్తనక్రమము జ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే?

(తెభా-1-71-ఉ. )[మార్చు]

ఇం చుక మాయలేక మది నెప్పుడు బాయని భక్తితోడ వ
ర్తిం చుచు నెవ్వఁడేని హరిదివ్యపదాంబుజ గంధరాశి సే
విం చు , నతం డెఱుంగు నరవింద భవాదులకైన దుర్లభో
దం చితమైన, యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్.

(తెభా-1-72-మ. )[మార్చు]

రిపాదద్వయభక్తి మీ వలన నిట్లారూఢమై యుండునే
తి రుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీలోపలన్
ణీదేవతలార! మీరలు మహాన్యుల్ సమస్తజ్ఞులున్
రిచింతన్ మిముఁ జెంద వెన్నడును జన్మాంతర్వ్యధాయోగముల్