పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/కథా సూచనంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-1-54-వ. )[మార్చు]

అని యిట్లు మహనీయగుణగరిష్ఠు లయిన శౌనకాది మునిశ్రేష్ఠు లడిగిన రోమహర్షణపుత్త్రుం డయి యుగ్రశ్రవసుం డను పేర నొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుం డైన సూతుండు.

(తెభా-1-55-మ. )[మార్చు]

" ముఁడై యెవ్వఁడు ముక్తకర్మచయుఁడై న్న్యాసియై యొంటిఁ బో
హాభీతి నొహోకుమార! యనుచున్ వ్యాసుండు చీరంగ వృ
క్ష ములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కం జేసె మున్నట్టి భూ
యున్ మ్రొక్కెద బాదరాయణిఁ దపోన్యాగ్రణిన్ ధీమణిన్.

(తెభా-1-56-సీ. )[మార్చు]

కార్యవర్గంబును గారణ సంఘంబు;
ధికరించి చరించు నాత్మతత్త్వ
ధ్యాత్మ మనఁబడు ట్టి యధ్యాత్మముఁ;
దెలియఁ జేఁయఁగఁ జాలు దీప మగుచు
కలవేదములకు సారాంశమై యేక;
మై యసాధారణగు ప్రభావ
రాజకంబైన పురాణ మర్మంబును;
గాఢ సంసారాంధకార పటలి

(తెభా-1-56.1-తే. )[మార్చు]

దాఁటఁ గోరెడివారికి య దలిర్ప
నే తపోనిధి వివరించె నేర్పడంగ
ట్టి శుకనామధేయు మహాత్మగేయు
విమల విజ్ఞాన రమణీయు వేడ్కఁ గొలుతు.

(తెభా-1-57-క. )[మార్చు]

నా రాయణునకు నరునకు
భా తికిని మ్రొక్కి, వ్యాసు దములకు నమ
స్కా ము సేసి వచింతు ను
దా గ్రంథంబు, దళిత ను బంధంబున్."

(తెభా-1-58-వ. )[మార్చు]

అని యిట్లు దేవతాగురు నమస్కారంబుసేసి యిట్లనియె "మునీంద్రులారా! నన్ను మీరు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనం బడిగితిరి; ఏమిటం కృష్ణ సంప్రశ్నంబు సేయంబడు? నెవ్వింధంబున నాత్మ ప్రసన్నంబగు? నిర్విఘ్నయు నిర్హేతుకయునై హరిభక్తి యే రూపంబునం గలుగు? నది పురుషులకుఁ బరమ ధర్మం బగు, వాసుదేవుని యందుఁ బ్రయోగింపఁ బడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు; నారాయణ కథలవలన నెయ్యే ధర్మంబులు దగులువడ వవి నిరర్థకంబులు; అపవర్గపర్యంతం బయిన పరధర్మంబునకు దృష్ట శ్రుత ప్రపంచార్థంబు ఫలంబు గాదు; ధర్మంబు నందవ్యభిచారి యైన యర్థంబునకుఁ గామంబు ఫలంబు గాదు; విషయభోగంబైన కామంబున కింద్రియప్రీతి ఫలంబు గాదు; ఎంత తడవు జీవించు నంతియ కామంబునకు ఫలంబు; తత్త్వజిజ్ఞాస గల జీవునకుఁ గర్మంబులచేత నెయ్యది సుప్రసిద్ధం బదియు నర్థంబు గాదు; తత్త్వజిజ్ఞాస యనునది ధర్మజిజ్ఞాస యగుటఁ గొందఱు ధర్మంబె తత్త్వం బని పలుకుదురు. తత్త్వవిదులు జ్ఞానం బనుపేర నద్వయం బైన యది తత్త్వ మని యెఱుంగుదురు; ఆ తత్త్వంబు నౌపనిషదులచేత బ్రహ్మ మనియు, హైరణ్యగర్భులచేతం బరమాత్మ యనియు, సాత్వతులచేత భగవంతుం డనియును బలుకంబడు; వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి జ్ఞాన వైరాగ్యంబులతోడం గూడిన భక్తిచేతఁ దత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మ యందుఁ బరమాత్మం బొడగందురు; ధర్మంబునకు భక్తి ఫలంబు; పురుషులు వర్ణాశ్రమధర్మ భేదంబులం జేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయె సిద్ధి; ఏక చిత్తంబున నిత్యంబును గోవిందు నాకర్ణింపనుం వర్ణింపనుం దగుఁ; జక్రాయుధ ధ్యానం బను ఖడ్గంబున వివేకవంతు లహంకార నిబద్ధంబైన కర్మంబు ద్రుంచివైతురు; భగవంతుని యందలి శ్రద్ధయు నపవర్గదం బగు తత్కథాశ్రవణాదుల యం దత్యంతాసక్తియుఁ బుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించు కర్మనిర్మూలన హేతువు లైన కమలలోచను కథలం దెవ్వండు రతిసేయు విననిచ్చగించు, వాని కితరంబు లెవ్వియు రుచి పుట్టింపనేరవు; పుణ్యశ్రవణకీర్తనుం డైన కృష్ణుండు తనకథలు వినువారి హృదయంబు లందు నిలిచి, శుభంబు లాచరించు నశుభంబులు పరిహరించు; నశుభంబులు నష్టంబు లయిన భాగవతశాస్త్రసేవా విశేషంబున నిశ్చలభక్తి యుదయించు; భక్తి కలుగ రజస్తమోగుణ ప్రభూతంబు లైన కామ లోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్త్వగుణంబునఁ బ్రసన్నం బగుఁ; ప్రసన్నమనస్కుం డైన ముక్తసంగుం డగు; ముక్తసంగుం డైన నీశ్వరతత్త్వజ్ఞానంబు సిద్ధించు; నీశ్వరుండు గానంబడినఁ జిజ్జడగ్రథనరూపం బైన యహంకారంబు భిన్నం బగు; నహంకారంబు భిన్నంబైన నసంభావనాది రూపంబు లగు సంశయంబులు విచ్ఛిన్నంబు లగు; సంశయవిచ్ఛేదం బైన ననారబ్దఫలంబు లైన కర్మంబులు నిశ్శేషంబులై నశించుం గావున.

(తెభా-1-59-క. )[మార్చు]

గు రుమతులు తపసు లంతః
ణంబుల శుద్ధి సేయ నతరభక్తిన్
రియందు సమర్పింతురు
మానందమున భిన్నవబంధనులై.

(తెభా-1-60-త. )[మార్చు]

మపూరుషుఁ డొక్కఁ డాఢ్యుఁడు పాలనోద్భవ నాశముల్
సొ రిదిఁ జేయు ముకుంద పద్మజ శూలి సంజ్ఞలఁ బ్రాకృత
స్ఫు రిత సత్త్వ రజస్తమంబులఁ బొందు నందు శుభస్థితుల్
రి చరాచరకోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై.

(తెభా-1-61-వ. )[మార్చు]

మఱియు నొక్క విశేషంబు గలదు; కాష్ఠంబుకంటె ధూమంబు, ధూమంబుకంటెఁ ద్రయీమయం బయిన వహ్ని యెట్లు విశేషంబగు నట్లు తమోగుణంబుకంటె రజోగుణంబు, రజోగుణంబుకంటె బ్రహ్మప్రకాశకం బగు సత్త్వగుణంబు విశిష్టం బగు; తొల్లి మునులు సత్త్వమయుం డని భగవంతు హరి నధోక్షజుం గొలిచిరి; కొందఱు సంసార మందలి మేలుకొఱకు నన్యుల సేవింతురు; మోక్షార్థు లయిన వారలు ఘోరరూపు లైన భూతపతుల విడిచి దేవతాంతర నిందసేయక శాంతులయి నారాయణ కథల యందే ప్రవర్తింతురు; కొందఱు రాజస తామసులయి సిరియు నైశ్వర్యంబును బ్రజలనుం గోరి పితృభూత ప్రజేశాదుల నారాధింతురు; మోక్ష మిచ్చుటం జేసి నారాయణుండు సేవ్యుండు; వేద యాగ యోగక్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు; నిర్గుణుం డయిన పరమేశ్వరుండు గలుగుచు, లేకుండుచు త్రిగుణంబుల తోడం గూడిన తన మాయచేత నింతయు సృజియించి, గుణవంతుని చందంబున నిజమాయా విలసింతంబు లయిన గుణంబులలోఁ బ్రవేశించి విజ్ఞానవిజృంభితుండై వెలుఁగు; నగ్ని యొక్కరుం డయ్యుఁ బెక్కు మ్రాఁకు లందుఁ దేజరిల్లుచుఁ బెక్కండ్రై తోఁచు తెఱంగున విశ్వాత్మకుం డైన పురుషుం డొక్కండ తనవలనం గలిగిన నిఖిల భూతంబు లందు నంతర్యామి రూపంబున దీపించు; మహాభూత సూక్ష్మేంద్రియంబులతోడం గూడి, గుణమయంబు లయిన భావంబులం దనచేత నిర్మితంబు లైన భూతంబు లందుఁ దగులు వడక తద్గుణంబు లనుభవంబు సేయుచు, లోకకర్త యైన యతండు దేవ తిర్యఙ్మనుష్యాది జాతు లందు లీల నవతరించి లోకంబుల రక్షించు" నని, మఱియు సూతుఁ డిట్లనియె.

(తెభా-1-62-సీ. )[మార్చు]

'హదహంకార తన్మాత్ర సంయుక్తుఁడై;
చారు షోడశ కళాహితుఁ డగుచుఁ
బంచమహాభూత భాసితుండై శుద్ధ;
త్త్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ
రణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శి;
ములు నానాసహస్రములు వెలుఁగ
నంబర కేయూర హార కుండల కిరీ;
టాదులు పెక్కువేమరుచుండఁ

(తెభా-1-62.1-తే. )[మార్చు]

బురుషరూపంబు ధరియించి పరుఁ డనంతుఁ
ఖిల భువనైకవర్తన త్నమమర
మానితోదార జలరాశి ధ్యమునను
యోగ నిద్రా విలాసియై యొప్పుచుండు."