పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/వ్యాసచింత

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-1-82-వ. )[మార్చు]

అని యడిగిన, శౌనకాది మునిశ్రేష్ఠులకు సూతుం డిట్లనియెఁ "దృతీయం బైన ద్వాపరయుగంబు దీఱు సమయంబున నుపరిచరవసువు వీర్యంబున జన్మించి, వాసవి నాఁ దగు సత్యవతి యందుఁ బరాశరునికి హరికళం జేసి, విజ్ఞాని యయిన వేదవ్యాసుండు జన్మించి యొక్కనాఁడు బదరికాశ్రమంబున సరస్వతీనదీ జలంబుల స్నానాది కర్మంబులం దీర్చి శుచియై, పరులు లేని చోట నొంటిఁ గూర్చుండి సూర్యోదయవేళ నతీతానాగతవర్తమానజ్ఞుం డయిన యా ఋషి వ్యక్తంబు గాని వేగంబుగల కాలంబునం జేసి యుగధర్మంబులకు భువి సాంకర్యంబు వొందు; యుగయుగంబుల భౌతిక శరీరంబు లకు శక్తి సన్నంబగుఁ బురుషులు నిస్సత్త్వులు ధైర్యశూన్యులు మందప్రజ్ఞు లల్పాయువులు దుర్బలులు నయ్యెద రని, తన దివ్యదృష్టిం జూచి, సర్వవర్ణాశ్రమంబులకు హితంబు సేయం దలంచి, నలుగురు హోతలచేత ననుష్ఠింపందగి ప్రజలకు శుద్ధికరంబు లైన వైదిక కర్మంబు లగు, యజ్ఞంబు లెడతెగకుండుకొఱకు నేకం బయిన వేదంబు, ఋగ్యజుస్సామాధర్వణంబులను నాలుఁగు నామంబుల విభాగించి యితిహాస పురాణంబు లన్నియుఁ బంచమవేదం బని పల్కె నందు.

(తెభా-1-83-సీ. )[మార్చు]

పైలుండు ఋగ్వేద ఠనంబు దొరఁకొనె;
సామంబు జైమిని దువుచుండె
జువు వైశంపాయనాఖ్యుండు గైకొనెఁ;
దుది నధర్వము సుమంతుఁడు పఠించె
ఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి;
రోమహర్షణుఁడు నిరూఢిఁ దాల్చెఁ
మతమ వేద మా పసులు భాగించి;
శిష్యసంఘములకుఁ జెప్పి రంత

(తెభా-1-83.1-తే. )[మార్చు]

శిష్యు లెల్లను నాత్మీయశిష్యజనుల
కంత బహుమార్గములు సెప్పి నుమతింపఁ
బెక్కుశాఖలు గలిగి యీ పృథివిలోన
నిగమ మొప్పారె భూసుర నివహమందు.

(తెభా-1-84-వ. )[మార్చు]

ఇట్లు మేధావిహీను లయిన పురుషులచేత నట్టి వేదంబులు ధరియింపబడు చున్నవి; మఱియు దీనవత్సలుం డయిన వ్యాసుండు స్త్రీ శూద్రులకుం ద్రైవర్ణికాధములకు వేదంబులు విన నర్హంబులుగావు గావున మూఢుల కెల్ల మేలగు నని భారతాఖ్యానంబు చేసియు నమ్ముని భూతహితంబు నందుఁ దన హృదయంబు సంతసింపకున్న సరస్వతీతటంబున నొంటి యుండి, హేతువు వితర్కించుచుఁ దనలో నిట్లనియె.

(తెభా-1-85-సీ. )[మార్చు]

"వ్రతధారినై వేదహ్ని గురుశ్రేణి;
న్నింతు విహితకర్మములఁ గొఱఁత
డకుండ నడుపుదు భారతమిషమునఁ;
లికితి వేదార్థభావ మెల్ల
మునుకొని స్త్రీశూద్రముఖ్యధర్మము లందుఁ;
దెలిపితి నేఁజెల్ల దీనఁ జేసి
యాత్మ సంతస మంద దాత్మలో నీశుండు;
సంతసింపక యున్న జాడ దోఁచె

(తెభా-1-85.1-ఆ. )[మార్చు]

రికి యోగివరుల భిలషితంబైన
భాగవత విధంబుఁ లుకనైతి
మోసమయ్యెఁ దెలివి మొనయదు మఱచితి"
నుచు వగచుచున్న వసరమున.

21-05-2016: :