పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/పూర్ణి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-1-528-క. )[మార్చు]

రా జీవపత్రలోచన!
రా జేంద్ర కిరీట ఘటిత త్న మరీచి
బ్రా జితపాదాంభోరుహ!
భూ నమందార! నిత్యపుణ్యవిచారా!

(తెభా-1-529-మాలి. )[మార్చు]

నుపమగుణహారా! న్యమా నారివీరా!
వినుతవిహారా! జానకీ చిత్త చోరా!
నుజ ఘన సమీరా! దానవశ్రీ విదారా!
కలుష కఠోరా! కంధి గర్వాపహారా!

(తెభా-1-530-గ. )[మార్చు]

ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందు నైమిశారణ్య వర్ణనంబును, శౌనకాదుల ప్రశ్నంబును, సూతుండు నారాయణకథా సూచనంబు సేయుటయు, వ్యాస చింతయు, నారదాగమనంబును, నారదుని పూర్వకల్ప వృ త్తాంతంబును, బుత్రశోకాతురయైన ద్రుపదరాజనందన కర్జునుం డశ్వత్థామం దెచ్చి యొప్పగించి గర్వపరిహారంబు సేయించి విడిపించుటయు, భీష్మనిర్యాణంబును, ధర్మనందను రాజ్యాభిషేకంబును, గోవిందుని ద్వారకాగమనంబును, విరాటకన్యకాగర్భ విద్యమానుండైన యర్భకు నశ్వత్థామ బాణానలంబు వలనం బాపి విష్ణుండు రక్షించుటయుఁ, బరీక్షిజ్జన్మంబును, గాంధారీ ధృతరాష్ట్ర విదురుల నిర్గమంబును, నారదుండు ధర్మజునకు గాలసూచనంబు సేయుటయుఁ, గృష్ణ నిర్యాణంబు విని పాండవులు మహాపథంబునం జనుటయు, నభిమన్యుపుత్రుండు దిగ్విజయంబు సేయుచు శూద్రరాజలక్షణ లక్షితుండగు కలిగర్వంబు సర్వంబు మాపి గోవృషాకారంబుల నున్న ధరణీ ధర్మదేవతల నుద్ధరించుటయు, శృంగిశాపభీతుం డై యుత్తరానందనుండు గంగాతీరంబునం బ్రాయోపవేశంబున నుండి శుకసందర్శనంబు సేసి మోక్షోపాయం బడుగటయు నను కథలు గల ప్రథమ స్కంధము సంపూర్ణము.
21-05-2016: :