పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/కుంతి పుత్రశోకంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-1-142-వ. )[మార్చు]

అని పలికి "రాజర్షియైన పరీక్షిన్మహారాజు జన్మ కర్మ ముక్తులును బాండవుల మహాప్రస్థానంబును గృష్ణకథోదయంబును జెప్పెదం; గౌరవ దృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులైన వారలు స్వర్గంబునకుం జనిన వెనుక భీము గదాఘాతంబున దుర్యోధనుండు తొడలు విఱిగి కూలిన నశ్వత్థామ దుర్యోధనునకుం బ్రియంబు సేయు వాఁడై నిదురవోవు ద్రౌపదీపుత్త్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించె; అది క్రూరకర్మంబని లోకులు నిందింతురు.

(తెభా-1-143-ఉ. )[మార్చు]

బా లుర చావు కర్ణములఁ డ్డఁ గలంగి యలంగి, యోరువం
జా క బాష్పతోయ కణజాలము చెక్కుల రాల నేడ్చి, పాం
చా తనూజ నేలఁబడి జాలిఁ బడం గని యెత్తి, మంజువా
చా తఁ జూపుచుం జికురజాలము దువ్వుచుఁ గ్రీడి యిట్లనున్.

(తెభా-1-144-మ. )[మార్చు]

" ణీశాత్మజ వీవు నీకు వగవన్ ర్మంబెయా ద్రౌణి ని
ష్క రుణుండై విదళించె బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీ
బాణంబుల నేఁడు వానిశిరమున్ ఖండించి నేఁ దెత్తుఁ, ద
చ్ఛి ముం ద్రొక్కి జలంబు లాడు మిచటన్ శీతాంశుబింబాననా!"

(తెభా-1-145-వ. )[మార్చు]

అని యి ట్లొడంబఱచి, తనకు మిత్రుండును సారథియు నైన హరి మేలనుచుండం గవచంబు దొడిగి, గాండీవంబు ధరియించి, కపిధ్వజుండై, గురుసుతుని వెంట రథంబు దోలించిన.

(తెభా-1-146-శా. )[మార్చు]

న్నుం జంపెద నంచు వచ్చు విజయున్ ర్శించి తద్ద్రౌణి యా
న్నుండై శిశుహంత గావున నిజప్రాణేచ్ఛఁ బాఱెన్ వడిన్
ము న్నాబ్రహ్మ మృగాకృతిం దనయకున్ మోహించి క్రీడింప నా
న్నుండౌ హరుఁ జూచి పాఱు పగిదిన్ ర్వేంద్రియభ్రాంతితోన్.

(తెభా-1-147-వ. )[మార్చు]

ఇట్లోపినంతదూరంబు బరువిడి వెనుకఁ జూచి రథతురంగంబు లలయుటఁ దెలిసి నిలిచి ప్రాణరక్షంబునకు నొండుపాయంబు లేమి నిశ్చయించి, జలంబుల వార్చి, ద్రోణనందనుండు సమాహితచిత్తుండైప్రయోగంబ కాని యుపసంహారంబు నేరకయుఁ బ్రాణసంరక్షణార్థంబుపార్థునిమీదఁ బ్రహ్మశిరోనామకాస్త్రంబుం బ్రయోగించిన నది ప్రచండతేజంబున దిగంతరాళంబు నిండి ప్రాణి భయంకరంబై తోఁచినహరికి నర్జునుం డిట్లనియె.

(తెభా-1-148-సీ. )[మార్చు]

"ద్మలోచన! కృష్ణ! క్తాభయప్రద! ;
వినుము, సంసారాగ్నివేఁగుచున్న
నుల సంసారంబు సంహరింపఁగ నీవు;
క్క నన్యులు లేరు లఁచి చూడ
సాక్షాత్కరించిన ర్వేశ్వరుండవు;
ప్రకృతికి నవ్వలి ప్రభుఁడ వాద్య
పురుషుండవగు నీవు బోధముచే మాయ;
డఁతువు నిశ్శ్రేయసాత్మ యందు

(తెభా-1-148.1-ఆ. )[మార్చు]

మాయచేత మునిఁగి నువారలకుఁ గృప
సేసి ధర్మముఖ్యచిహ్నమయిన
శుభము సేయు దీవు సుజనుల నవనిలోఁ
గావఁ బుట్టుదువు, జన్నివాస!

(తెభా-1-149-క. )[మార్చు]

ది యొక తేజము భూమియుఁ
లును దిక్కులును నిండి ర్వంకషమై
యె దురై వచ్చుచు నున్నది
వి దితముగా నెఱుగఁ జెప్పవే దేవేశా!"

(తెభా-1-150-వ. )[మార్చు]

అనిన హరి యిట్లనియె.

(తెభా-1-151-శా. )[మార్చు]

"జి హ్మత్వంబునఁ బాఱి ద్రోణజుఁడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛమై
బ్ర హ్మాస్త్రం బదె యేసె; వచ్చెనిదె తద్బాణాగ్నిబీభత్స; నీ
బ్ర హ్మాస్త్రంబునఁ గాని దీని మరలింపన్ రాదు, సంహార మీ
బ్ర హ్మాపత్య మెఱుంగఁ, డేయుము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై."

(తెభా-1-152-వ. )[మార్చు]

అనిన నర్జునుండు జలంబుల వార్చి, హరికిం బ్రదక్షిణంబు వచ్చి, ద్రోణనందనుం డేసిన బ్రహ్మాస్త్రంబు మీదఁ దన బ్రహ్మాస్త్రంబుఁ బ్రయోగించిన.

(తెభా-1-153-మ. )[మార్చు]

నివ్యోమము లందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్
వివహ్నిద్యుతిఁ బోరుచుం ద్రిభువనత్రాసంబుఁ గావింపగా
వి శభ్రాంతి యుగాంతమో యని ప్రజల్ వీక్షింప నా వేళ మా
వు నాజ్ఞన్ విజయుండు సేసె విశిఖద్వంద్వోపసంహారమున్.

(తెభా-1-154-వ. )[మార్చు]

ఇట్లస్త్రద్వయంబు నుపసంహరించి, ధనంజయుండు ద్రోణనందనుం గూడ నరిగి తఱిమి పట్టుకొని, రోషారుణితలోచనుండై యాజ్ఞికుండు రజ్జువునం బశువు గట్టినఁ చందంబున బంధించి శిబిరంబు కడకుం గొనిచని హింసింతు నని తిగిచినం జూచి హరి యిట్లనియె.

(తెభా-1-155-ఉ. )[మార్చు]

"మా ఱుపడంగలేని యసర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దే ని పిన్న పాఁపల వధించె నిశీథము నందుఁ గ్రూరుఁడై
పా ఱుఁడె వీఁడుపాతకుఁడు, ప్రాణభయంబున వెచ్చనూర్చుచుం
బా ఱెడి వీని గావుము కృపామతి నర్జున! పాపవర్జనా!

(తెభా-1-156-చ. )[మార్చు]

వె చినవాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై
చినవాని, సౌఖ్యమున ద్యము ద్రావినవాని, భగ్నుడై
చినవాని, సాధు జడభావమువానిని, గావు మంచు వా
చినవానిఁ, గామినులఁ జంపుట ధర్మము గాదు, ఫల్గునా!

(తెభా-1-157-శా. )[మార్చు]

స్వ ప్రాణంబుల నెవ్వఁడేనిఁ, గరుణాసంగంబు సాలించి య
న్య ప్రాణంబులచేత రక్షణము సేయన్ వాఁ, డధోలోక దుః
ప్రాప్తుండగురాజదండమున సత్కల్యాణుఁ డౌ, నైన నీ
వి ప్రున్ దండితుఁ జేయ నేటికి మహావిభ్రాంతిచే నుండఁగన్?"

(తెభా-1-158-వ. )[మార్చు]

అని యివ్విధంబునఁ గృష్ణుఁ డానతిచ్చిన బ్రాహ్మణుండు కృతాపరాధుండయ్యు వధ్యుండు గాఁడను ధర్మంబుఁ దలఁచి చంపక ద్రుపదరాజపుత్త్రికిం దన చేసిన ప్రతిజ్ఞం దలంచి బద్ధుండైన గురునందనుందోడ్కొని కృష్ణుండు సారథ్యంబు సేయ శిబిరంబుకడకు వచ్చి.

21-05-2016: :