పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/అశ్వత్థామని తెచ్చుట
(తెభా-1-159-క. )[మార్చు]
సు రరాజసుతుఁడు చూపెను
దు రవధి సుతశోకయుతకు ద్రుపదుని సుతకుం
బ రిచలితాంగశ్రేణిం
బ రుష మహాపాశ బద్ధపాణిన్ ద్రౌణిన్.
(తెభా-1-160-వ. )[మార్చు]
ఇట్లర్జునుండు దెచ్చి చూపిన బాలవధ జనిత లజ్జా పరాఙ్ముఖుం డైన కృపి కొడుకుం జూచి మ్రొక్కి సుస్వభావ యగు ద్రౌపది యిట్లనియె.
(తెభా-1-161-మ. )[మార్చు]
"ప రఁగన్ మా మగవార లందఱును మున్ బాణప్రయోగోపసం
హ రణాద్యాయుధవిద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చి రి ; పుత్త్రాకృతి నున్న ద్రోణుడవు; నీ చిత్తంబులో లేశముం
గ రుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే?
(తెభా-1-162-క. )[మార్చు]
భూ సురుఁడవు, బుద్ధిదయా
భా సురుఁడవు, శుద్ధవీరభటసందోహా
గ్రే సరుఁడవు, శిశుమారణ,
మా సురకృత్యంబు ధర్మ మగునే? తండ్రీ!
(తెభా-1-163-శా. )[మార్చు]
ఉ ద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చి ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భ ద్రాకారులఁ బిన్నపాఁపల రణప్రౌఢక్రియాహీనులన్
ని ద్రాసక్తుల సంహరింప నకటానీ చేతు లెట్లాడెనో?
(తెభా-1-164-ఉ. )[మార్చు]
అ క్కట! పుత్త్ర శోక జనితాకులభార విషణ్ణచిత్తనై
పొ క్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ
డి క్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత, నేఁ
డె క్కడ నిట్టి శోకమున నేక్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో?"
(తెభా-1-165-వ. )[మార్చు]
అని కృష్ణార్జునులం జూచి యిట్లనియె.
(తెభా-1-166-ఉ. )[మార్చు]
"ద్రో ణునితో శిఖింబడక ద్రోణకుటుంబిని యున్న దింట, న
క్షీ ణతనూజ శోకవివశీకృతనై విలపించుభంగి నీ
ద్రౌ ణిఁ దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో?
ప్రా ణవియుక్తుఁడైన నతిపాపము బ్రాహ్మణహింస మానరే.
(తెభా-1-167-క. )[మార్చు]
భూ పాలకులకు విప్రుల
గో పింపం జేయఁ దగదు కోపించినఁ ద
త్కో పానలంబు మొదలికి
భూ పాలాటవులఁ గాల్చు భూకంపముగన్."
(తెభా-1-168-వ. )[మార్చు]
అని యిట్లు ధర్మ్యంబును, సకరుణంబును, నిర్వ్యళీకంబును, సమంజసమును, శ్లాఘ్యంబునుంగాఁ బలుకు ద్రౌపది పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లె; నకుల, సహదేవ, సాత్యకి, ధనంజయ, కృష్ణులు, సమ్మతించిరి; సమ్మతింపక భీముం డిట్లనియె.
(తెభా-1-169-చ. )[మార్చు]
"కొ డుకులఁ బట్టి చంపె నని కోపము నొందదు; బాలఘాతుకున్
వి డువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది వీఁడు విప్రుఁడే?
వి డువఁగ నేల? చంపుఁ డిటు వీనిని మీరలు సంపరేని నా
పి డికిటిపోటునన్ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱున్."
(తెభా-1-170-వ. )[మార్చు]
అని పలికిన నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె; భీముని సంరంభంబు సూచి హరి చతుర్భుజుం డయి రెండు చేతుల భీముని వారించి కడమ రెంటను ద్రుపద పుత్రికను దలంగించి నగుచు భీముని కిట్లనియె
(తెభా-1-171-ఉ. )[మార్చు]
"అ వ్యుఁడు గాఁడు వీఁడు శిశుహంత దురాత్మకుఁ డాతతాయి హం
త వ్యుఁడు బ్రహ్మబంధుఁ డగుఁ దప్పదు నిక్కము "బ్రాహ్మణో నహ
న్త వ్య" యటంచు వేదవిదితం బగుఁ గావున ధర్మ దృష్టిఁ గ
ర్త వ్యము వీనిఁ గాచుట; యథాస్థితిఁ జూడుము, పాండవోత్తమా!"
(తెభా-1-172-వ. )[మార్చు]
అని సరసాలాపంబులాడి, పవన నందను నొడంబఱచి యర్జునుం జూచి "ద్రౌపదికి నాకు భీమసేనునకు సమ్మతంబుగ మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు నా పంపు సేయు" మని నారాయణుం డానతిచ్చిన నర్జునుండు నారాయణానుమతంబున.
21-05-2016: :