పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/అశ్వత్థామ గర్వ పరిహారంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-1-173-శా. )[మార్చు]

వి శ్వస్తుత్యుఁడు శక్రసూనుఁడు మహావీరుండు ఘోరాసిచే
శ్వత్థామ శిరోజముల్దఱిఁగి చూడాంతర్మహారత్నమున్
శ్వత్కీర్తి వెలుంగఁ బుచ్చుకొని పావ్రాతబంధంబులన్
వి శ్వాసంబున నూడ్చి త్రోచె శిబిరోర్వీభాగముం బాసిపోన్.

(తెభా-1-174-క. )[మార్చు]

ని బ్బరపు బాలహంతయు
గొ బ్బునఁ దేజంబు మణియుఁ గోల్పడి నతుఁడై
ప్ర బ్బిన వగచే విప్రుఁడు
సి బ్బితితో నొడలి గబ్బుసెడి వడిఁ జనియెన్.

(తెభా-1-175-ఆ. )[మార్చు]

'నముఁ గొనుట యొండె, లఁ గొఱుగుట యొండె,
నాలయంబు వెడల డచు టొండె,
గాని చంపఁ దగిన ర్మంబు సేసినఁ
జంపఁ దగదు విప్రజాతిఁ బతికి.

(తెభా-1-176-వ. )[మార్చు]

ఇ ట్లశ్వత్థామం బ్రాణావశిష్టుం జేసి వెడలనడచి, పాండవులు పాంచాలీ సహితులై పుత్త్రులకు శోకించి, మృతులైన బంధువుల కెల్ల దహనాది కృత్యంబులు సేసి యుదక ప్రదానంబు సేయు కొఱకు స్త్రీల ముందట నిడుకొని గోవిందుండునుం దారును గంగకుం జని తిలోదకంబులు సేసి క్రమ్మఱ విలపించి హరి పాదపద్మజాత పవిత్రంబు లయిన భాగీరథీ జలంబుల స్నాతులయి యున్న యెడం బుత్త్రశోకాతురు లయిన గాంధారీ ధృతరాష్ట్రులను గుంతీ ద్రౌపదులను జూచి మాధవుండు మునీంద్రులుం దానును బంధుమరణశోకాతురు లయిన వారల వగపు మానిచి మన్నించె నివ్విధంబున.

(తెభా-1-177-శా. )[మార్చు]

పాం చాలీ కబరీవికర్షణమహాపాపక్షతాయుష్కులం
జం ద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి
ప్పిం చెన్ రాజ్యము ధర్మపుత్త్రునకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁ జే
యిం చెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్రప్రభావంబునన్.

(తెభా-1-178-వ. )[మార్చు]

అంత వాసుదేవుండు వ్యాసప్రముఖ భూసుర పూజితుం డయి,యుద్ధవ సాత్యకులు గొలువ ద్వారకాగమన ప్రయత్నంబునం బాండవుల వీడ్కొని రథారోహణంబు సేయు సమయంబునం, దత్తఱపడుచు నుత్తర సనుదెంచి కల్యాణగుణోత్తరుం డైన హరి కిట్లనియె.

(తెభా-1-179-మ. )[మార్చు]

" దె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ! నేఁ
డు రాంతర్గత గర్భ దాహమునకై యుగ్రప్రభన్ వచ్చుచు
న్న ది దుర్లోక్యము మానుపన్ శరణ మన్యం బేమియున్ లేదు నీ
పద్మంబులె కాని యొండెఱుఁగ నీ బాణాగ్ని వారింపవే.

(తెభా-1-180-క. )[మార్చు]

దు ర్భరబాణానలమున
ర్భములో నున్న శిశువు నసంతాపా
వి ర్భావంబునుఁ బొందెడి
ని ర్భరకృపఁ గావుమయ్య, నిఖిలస్తుత్యా!

(తెభా-1-181-క. )[మార్చు]

చె ల్లెలికోడల, నీ మే
ల్లుఁడు శత్రువులచేత తుఁడయ్యెను సం
ఫు ల్లారవిందలోచన!
ల్లాగ్ని నడంచి శిశువు బ్రతికింపఁగదే.

(తెభా-1-182-ఆ. )[మార్చు]

ర్భ మందుఁ గమలర్భాండశతములు
నిముడుకొన వహించు నీశ్వరేశ!
నీకు నొక్క మానినీగర్భరక్షణ
మెంత బరువు నిర్వహింతు గాక."

(తెభా-1-183-వ. )[మార్చు]

అనిన నాశ్రితవత్సలుం డగు నప్పరమేశ్వరుండు సుభద్ర కోడలి దీనాలాపంబు లాలించి, యిది ద్రోణనందనుండు లోక మంతయు నపాండవం బయ్యెడు మని యేసిన దివ్యాస్త్రం బని యెఱింగె; నంతఁ బాండవుల కభిముఖం బయి ద్రోణనందను దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గణంబులు డగ్గఱిన బెగ్గడిలక వారును బ్రత్యస్త్రంబు లందికొని పెనంగు సమయంబున.

(తెభా-1-184-మ. )[మార్చు]

సేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స
జ్జ నులం బాండుతనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణనం
ను బ్రహ్మాస్త్రము నడ్డుపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా
నిర్వక్రము రక్షితాఖిల సుధాంశ్చక్రముం జక్రమున్.

(తెభా-1-185-మ. )[మార్చు]

లప్రాణిహృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ
క్ష్మ ళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా ర్భంబుఁ దాఁ జక్రహ
స్త కుఁడై వైష్ణవమాయఁ గప్పి కురు సంతానార్థియై యడ్డమై
ప్ర టస్ఫూర్తి నడంచె ద్రోణతనయబ్రహ్మాస్త్రమున్ లీలతోన్.

(తెభా-1-186-వ. )[మార్చు]

ఇట్లు ద్రోణతనయుం డేసిన ప్రతిక్రియారహితం బయిన బ్రహ్మశిరం బనియెడి దివ్యాస్త్రంబు వైష్ణవతేజంబున నిరర్థకం బయ్యె; నిజ మాయావిలసనమున సకలలోక సర్గస్థితి సంహారంబు లాచరించు నట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబు గాదు; తత్సమయంబున సంతసించి, పాండవ పాంచాలీ సహితయై గొంతి గమనోన్ముఖుం డైన హరిం జేర వచ్చి యిట్లనియె.

21-05-2016: :