పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/నారదునికి దేవుడుదోచుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-1-124-శా. )[మార్చు]

నందాశ్రులు గన్నులన్ వెడల రోమాంచంబుతోఁ దత్పద
ధ్యా నారూఢుఁడ నైన నా తలఁపులో ద్దేవుఁడుం దోఁచె నే
నా నందాబ్ధిగతుండనై యెఱుఁగలేనైతిన్ ననున్నీశ్వరున్
నా నాశోకహమైన యత్తనువు గానన్ లేక యట్లంతటన్.

(తెభా-1-125-వ. )[మార్చు]

లేచి నిలుచుండి క్రమ్మఱ నద్దేవుని దివ్యాకారంబుఁ జూడ నిచ్ఛించుచు హృదయంబున నిలుపుకొని యాతురుండునుంబోలె జూచియుం గానలేక నిర్మనుష్యం బైన వనంబునం జరియించుచున్న నన్ను నుద్దేశించి వాగగోచరుం డైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం బుపశమింపం జేయు చందంబున నిట్లనియె.

(తెభా-1-126-ఉ. )[మార్చు]

కుమారశోషిలఁగ? నీ జననంబున నన్నుఁగానఁగాఁ
జా వు నీవుకామముఖట్కము నిర్దళితంబు సేసి ని
ర్మూ లితకర్ములైన మునిముఖ్యులు గాని కుయోగిఁ గానఁగాఁ
జా లఁడునీదు కోర్కి కొనసాఁగుటకై నిజమూర్తిఁ జూపితిన్.

(తెభా-1-127-క. )[మార్చు]

నా లని కోర్కి యూరక
పో దు విడిపించు దోషపుంజములను మ
త్సే వం బుట్టును వైళమ
భా వింపఁగ నాదు భక్తి బాలకవింటే

(తెభా-1-128-క. )[మార్చు]

నా యందుఁ గలుగు నీ మది
వా దు జన్మాంతరముల బాలకనీ వీ
కా యంబు విడిచి మీఁదట
మా నుమతిఁ బుట్టఁగలవు ద్భక్తుఁడవై.

(తెభా-1-129-మ. )[మార్చు]

వి ను మీ సృష్టిలయంబు నొంది యుగముల్ వేయైన కాలంబు యా
మి నియైపోయెడిఁ బోవఁగాఁ గలుగుఁజూమీఁదం బునఃసృష్టి యం
దు నిరూఢస్మృతితోడఁ బుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్
తం జెందెదు శుద్ధ సాత్త్వికులలో ణ్యుండవై యర్భకా!

(తెభా-1-130-వ. )[మార్చు]

అని యిట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు నిశ్వాసంబునుగా నొప్పి, సర్వనియామకం బైన మహాభూతంబు వలికి యూరకున్న నేను మస్తకంబు వంచి మ్రొక్కి, తత్కరుణకు సంతసించుచు మదంబు దిగనాడి, మచ్చరంబు విడిచి, కామంబు నిర్జించి,క్రోధంబు వర్జించి, లోభమోహంబుల వెడల నడిచి, సిగ్గు విడిచి, యనంత నామంబులు పఠించుచుఁ, బరమ భద్రంబు లయిన తచ్చరిత్రంబులం జింతించుచు, నిరంతర సంతుష్టుండనై కృష్ణుని బుద్ధి నిలిపి నిర్మలాంతఃకరణంబులతోడ విషయవిరక్తుండ నై కాలంబున కెదురు సూచుచు భూమిం దిరుగుచు నుండ; నంతం గొంతకాలంబునకు మెఱుంగు మెఱసిన తెఱంగున మృత్యువు దోఁచినం బంచభూతమయం బయి కర్మస్వరూపం బైన పూర్వ దేహంబు విడిచి హరికృపావశంబున శుద్ధసత్త్వమయం బైన భాగవతదేహంబు సొచ్చితి; నంతం ద్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున శయనించు నారాయణమూర్తి యందు నిదురవోవ నిచ్చగించు బ్రహ్మనిశ్వాసంబు వెంట నతని లోపలం బ్రవేశించితి; నంత సహస్ర యుగ పరిమితంబైన కాలంబు సనిన లేచి లోకంబులు సృజియింప నుద్యోగించు బ్రహ్మనిశ్వాసంబు వలన మరీచి ముఖ్యులగు మునులును నేనును జనియించితిమి; అందు నఖండిత బ్రహ్మచర్యుండనై యేను మూఁడు లోకంబుల బహిరంతరంబు లందు మహావిష్ణుని యనుగ్రహంబున నడ్డంబు లేక యీశ్వరదత్తమై బ్రహ్మాభివ్యంజకంబు లైన సప్తస్వరంబులు దమ యంతన మ్రోయుచున్నయీ వీణాలాపన రతింజేసి నారాయణకథాగానంబు సేయుచుఁ జరియించు చుందు.

(తెభా-1-131-ఆ. )[మార్చు]

'తీర్థపాదుఁడయిన దేవుండు విష్ణుండు
న చరిత్ర మేను విలి పాడఁ
జీరఁబడ్డవాని చెలువున నేతెంచి
నుఁడు నామనమునఁ గానవచ్చు.

(తెభా-1-132-క. )[మార్చు]

వి ను మీ సంసారంబను
నిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే
నఁ బొందెడువానికి వి
ష్ణు ని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా.

(తెభా-1-133-చ. )[మార్చు]

నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ గామరో
ములఁ బ్రచోదితంబ యగు శాంతి వహింపదు విష్ణుసేవచేఁ
గ్ర మున శాంతిఁ గైకొనిన కైవడి నాదు శరీర జన్మ క
ర్మ ముల రహస్య మెల్ల మునిమండనచెప్పితి నీవు గోరినన్."

(తెభా-1-134-వ. )[మార్చు]

అని యిట్లు భగవంతుం డగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని వీణ వాయించుచు, యదృచ్ఛామార్గంబునం జనియె" నని,సూతుం డిట్లనియె.

(తెభా-1-135-క. )[మార్చు]

వా యించు వీణ నెప్పుడు
మ్రో యించు ముకుందగీతములు జగములకుం
జే యించుఁ జెవుల పండువు
మా యించు నఘాళి నిట్టి తి మఱి గలఁడే

(తెభా-1-136-వ. )[మార్చు]

అని నారదుం గొనియాడిన సూతునిం జూచి "నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాదరాయణుం డేమి సేసె" నని శౌనకుం డడిగిన సూతుం డిట్లనియె "బ్రహ్మదైవత్య యైన సరస్వతి పడమటితీరంబున ఋషులకు సత్రకర్మవర్ధనంబై బదరీ తరుషండ మండితం బయి "శమ్యాప్రాసం" బనం బ్రసిద్ధంబగు నాశ్రమంబు గలదు; అందు జలంబుల వార్చి కూర్చుండి, వ్యాసుండు తన మది దిరంబు సేసికొని భక్తియుక్తం బయిన చిత్తంబునం బరిపూర్ణుం డయిన యీశ్వరుం గాంచి, యీశ్వరాధీన మాయావృతం బైన జీవుని సంసారంబుఁ గని, జీవుండు మాయచేత మోహితుం డయి గుణవ్యతిరిక్తుండయ్యు మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుం డని యభిమానించుచుఁ ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు; ననియు నయ్యనర్థంబునకు నారాయణభక్తియోగంబు గాని యుపశమనంబు వేఱొకటి లేదనియు నిశ్చయించి.

(తెభా-1-137-మ. )[మార్చు]

నీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయమున్ విన్న మా
వుపై లోకశరణ్యుపై భవములం ప్పింపఁగాఁ జాలు భ
క్తి విశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా
తామ్నాయము బాదరాయణుఁడు దాఁ ల్పించె నేర్పొప్పగన్.

(తెభా-1-138-వ. )[మార్చు]

ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థియైన శుకునిచేఁ జదివించె" నని చెప్పిన విని శౌనకుండు "నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండును నైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె?" ననవుడు; సూతుం డిట్లనియె.

(తెభా-1-139-క. )[మార్చు]

"ధీ రులు నిరపేక్షులు నా
త్మా రాములునైన మునులు రిభజనము ని
ష్కా ణమ చేయుచుందురు
నా రాయణుఁ డట్టి వాఁ, డవ్యచరిత్రా!

(తెభా-1-140-క. )[మార్చు]

రిగుణవర్ణన రతుఁడై
రితత్పరుఁడైన బాదరాయణి శుభత
త్ప తంబఠించెఁ ద్రిజగ
ద్వ మంగళమైన భాగత నిగమంబున్.

(తెభా-1-141-క. )[మార్చు]

ని మములు వేయుఁ జదివిన
సు మంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సు మంబు భాగవత మను
ని మంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!"

21-05-2016: :